ragini
-
చెడు వ్యసనాలకు బానిసై కెరీర్ నాశనం చేసుకున్న స్టార్ హీరో
సినిమాల్లో బోలెడన్ని ట్విస్టులు ఉంటాయి. కొన్నిసార్లు రియల్ లైఫ్‌లో అంతకన్నా ఎక్కువ ట్విస్టులే ఉంటాయి. ఊహించని మలుపులతో జీవితమే ఒక కథగా మారుతుంది. సీనియర్ హీరో కార్తీక్ జీవితం కూడా ఇందుకు అతీతం కాదు. సౌత్‌లో 100కు పైగా సినిమాలు చేసిన ఆయన భార్య చెల్లెలినే పెళ్లి చేసుకున్నాడు. అందుకు గల కారణాలేంటి? తన కెరీర్లో చోటు చేసుకున్న ఊహించని పరిణామాలపై ప్రత్యేక కథనం.. తండ్రి నుంచి వారసత్వం.. మురళి కార్తికేయన్ ముత్తురామన్.. 1960 సెప్టెంబర్ 13న జన్మించాడు. తండ్రి ఆర్ ముత్తురామన్ గొప్ప నటుడు, మచ్చలేని మనిషి. ఆయన నుంచే నటనను పుణికి పుచ్చుకున్నాడు కార్తీక్. అలైగళ్ ఒవతిల్లై(1981) అనే తమిళ చిత్రంతో కార్తీక్ నట ప్రస్థానం మొదలైంది. తన లుక్స్, నటన చూసి డైరెక్టర్స్ తమతో సినిమాలు చేయమని వెంటపడ్డారు. తక్కువకాలంలోనే కోలీవుడ్‌లో స్టార్ హీరోగా మారాడు. సీతాకోక చిలుక సినిమాతో టాలీవుడ్‌లోనూ అడుగుపెట్టాడు. కోలీవుడ్‌లో స్టార్ హీరోగా బిజీబిజీ అన్వేషణ, అభినందన, గోపాలరావు గారి అబ్బాయి, ఓమ్ 3D సినిమాలతో తెలుగువారికీ దగ్గరయ్యాడు. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరో కార్తీక్/మురళిగా బాగా ఫేమస్ అయ్యాడు. అభినందన సినిమాకు నంది స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్నాడు. తమిళంలో ఏడాదికి 8-10 సినిమాలు చేస్తూ బిజీగా ఉండటంతో తెలుగులో ఎక్కువగా చిత్రాలు చేయలేకపోయాడు కార్తీక్. అప్పుడప్పుడూ తన గాత్రానికి పని చెప్తూ పాటలు సైతం ఆలపించాడు. స్టార్ హీరోగా క్రేజ్ తెచ్చుకున్న కార్తీక్ ఎప్పుడూ ఏదో ఒక హీరోయిన్‌తో ఎఫైర్ నడుపుతున్నట్లు వార్తలు వచ్చేవి. హీరోయిన్‌తో ప్రేమ.. పెళ్లి ఈ క్రమంలో హీరోయిన్ రాగిణిని ప్రేమించిన అతడు 1988లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వీరికి గౌతమ్ కార్తీక్, జ్ఞాన్ కార్తీక్ అని ఇద్దరు పిల్లలు సంతానం. అయితే రాగిణి సోదరి రతిపైనా మనసు పారేసుకున్నాడు కార్తీక్. ఆమె కూడా అక్కతో పాటు అతడి ఇంట్లోనే ఉండటంతో.. తనతో ఎఫైర్ పెట్టుకున్నాడని.. దీంతో ఆమె గర్భం దాల్చిందని అప్పట్లో రూమర్స్ వినిపించాయి. ఇంతలో 1992లో రాగిణి సోదరి రతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి తిరన్ కార్తీక్ అనే కుమారుడు జన్మించాడు. అయితే భార్య ఉండగా ఆమె చెల్లెలిని పెళ్లి చేసుకున్నందుకు నటుడిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. 2000వ దశకం నుంచి కార్తీక్ సినిమాల సంఖ్య తగ్గుతూ వచ్చింది. హీరో కాస్తా విలన్‌గా మారాడు. తనకున్న చెడు వ్యసనాల వల్లే కెరీర్ నాశనమైందని స్వయంగా అతడే గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. రాజకీయ ప్రస్థానం.. 2006లో రాజకీయాల్లోనూ అడుగుపెట్టాడు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరిన అతడు తర్వాతి కాలంలో సొంతంగా పార్టీ స్థాపించాడు. అఖిల ఇండియా నాదలమ్ మక్కల్ కచ్చి అని దీనికి పేరు పెట్టాడు. తన పార్టీ నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన అతడు దారుణంగా ఓడిపోయాడు. కార్తీక్‌కు కేవలం 15వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో అతడు 2018లో మనిత ఉరిమైగల్ కాక్కమ్ కచ్చి అనే మరో పార్టీని స్థాపించాడు. అయితే ఏఐఏడీఎమ్‌కే కూటమికి తన మద్దతును ప్రకటించాడు. తను చేసిన తప్పిదాల వల్లే కార్తీక్ కెరీర్ అతలాకుతలమైందని తమిళ ప్రజలు ఇప్పటికీ చెప్పుంటూ ఉంటారు. చదవండి: గుండెపోటుతో నటి మృతి అంటూ ట్వీట్.. వెంటనే డిలీట్.. కానీ అప్పటికే.. 'అమ్మాయితో చాటింగ్ చేయడం వల్లే అంతా'.. నెట్టింట వైరల్! -
తన భార్య సొంత చెల్లిని పెళ్లాడిన స్టార్ హీరో.. కష్టాలతో జీవితం
Actor Karthik Married His Wife Younger Sister: సీనియర్ హీరో కార్తిక్ అంటే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కోలీవుడ్ హీరో అయిన కార్తిక్ సీతాకోక చిలుక వంటి క్లాసిక్ మూవీతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తర్వాత అనుబంధం, అన్వేషణ, పుణ్యస్త్రీ, అభినందన, గోపాల్ రావు గారి అబ్బాయి, మగ రాయుడుతోపాటు కల్యాణ్ రామ్ ఓమ్ 3డి సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు. కొద్ది రోజులు సినిమాలకు గ్యాప్ తీసుకున్న కార్తీక్ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో విలన్‌గా రాణిస్తున్నాడు. అయితే కార్తీక తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు. తెలుగు, తమిళ భాషల్లో కలిపి సుమారు 125కిపైగా చిత్రాల్లో నటించిన కార్తీక్ 1988లో సహనటి రాగిణిని వివాహం చేసుకున్నాడు. కార్తీక్, రాగిణి ఇద్దరూ సోలైకుయిల్ సిమాలో కలిసి నటించారు. వీరికి గౌతమ్ కార్తీక్, ఘైన్ కార్తీక్ కుమారులు ఉన్నారు. గౌతమ్ కార్తీక్ 'కడలి' మూవీతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అనంతరం రాగిణి సోదరి రథిని 1992లో రెండో వివాహం చేసుకున్నాడు కార్తీక్. వీరిద్దరికి తిరన్ కార్తీక్ కొడుకు ఉన్నాడు. చదవండి: నా వల్లే భారతీయ రైల్వేస్‌కు ఆదాయం పెరిగింది: కరీనా కపూర్ అప్పటివరకు ఉజ్వలంగా సాగిన కార్తీక్ కెరీర్ 2000 సంవత్సరం తర్వాత ఒడిదొడుకులు ఎదుర్కొంది. 2005లో వచ్చిన నటుడు సత్యరాజ్ 'శివలింగం ఐపీఎస్' సినిమాలో తొలిసారి విలన్‌గా నటించాడు కార్తీక్. అయితే పలు అనివార్య కారణాల వల్ల ఆ చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. తనకున్న చెడు అలవాట్ల వల్లే తన కెరీర్ నాశనం అయిందని ఒక సందర్భంలో స్వయంగా కార్తీక్ తెలిపాడు. చదవండి: ప్రభాస్ అంటే చాలా ఇష్టం, మేము ఫ్రెండ్స్ కూడా: పీవీ సింధు -
శాండల్‌వుడ్‌లో డ్రగ్స్ కలకలం
సాక్షి బెంగళూరు: డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు కన్నడ సినీ పరిశ్రమను కుదిపేస్తున్నాయి. పోలీసుల విచారణలో శాండల్‌వుడ్ నటీనటులు, దర్శకులు, నిర్మాతల పేర్లు ఒక్కటొక్కటిగా బయటకు వస్తుండటంతో సినీ వర్గాలు బిక్కుబిక్కుమంటున్నాయి. ఈ కేసులో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల (సీసీబీ) శుక్రవారం ఒక అడుగు ముందుకు వేసింది. యలహంకలో ఉన్న హీరోయిన్ రాగిణి ద్వివేది ఇంటిపై శుక్రవారం తెల్లవారుజామున దాడి చేసింది. రెండు రోజుల క్రితమే నటి రాగిణి సన్నిహితుడు రవిశంకర్‌ను సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. రవి శంకర్ ఇచ్చిన సమాచారంతో రాగిణిని గురువారం విచారణకు రావాలని నోటీసులిచ్చారు. తనకు ఆరోగ్యం సరిగా లేదని, సోమవారం విచారణకు వస్తానని లాయర్ ద్వారా రాగిణి సమాధానం పంపారు. ఈ నేపథ్యంలో కోర్టు ద్వారా సెర్చ్వారంట్తో పోలీసులు శుక్రవారం ఉదయం 6.30 గంటలకు ఆమె ఇంటిపై దాడి చేసి, సోదాలు జరిపారు. అనంతరం రాగిణిని విచారణ నిమిత్తం సీసీబీ కార్యాలయానికి తీసుకెళ్లారు. కాగా, శుక్రవారం సాయంత్రం రాగిణిని అరెస్టు చేసినట్లు సీసీబీ ప్రకటించింది. రాగిణి పెట్టుకున్న ముందస్తు బెయిల్‌పై విచారణను 7వ తేదీకి ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది. మరోవైపు ఇటీవల ముగ్గురు డ్రగ్స్ పెడ్లర్స్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అరెస్టు చేసింది. వీరు వెల్లడించిన సమాచారంతో దర్శకుడు ఇంద్రజిత్ లంకేశ్‌ను సీసీబీ పోలీసులు విచారించగా ఈ డ్రగ్స్ వ్యవహారంలో సుమారు 15 మంది సినీ ప్రముఖులు ఉన్నట్లు తెలిసింది. -
అనుమానంతో అమానుషం
గొంతుకోసి భార్యను చంపిన సైకో ఉప్పల్, న్యూస్‌లైన్: భార్యపై అనుమానంతో సైకోగా మారిన భర్త పట్టపగలు ఆమెను అతికిరాతకంగా గొంతుకోసి చంపేశాడు. ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం ఈ దారుణం జరిగింది. పోలీసులు, బంధువు శంకర్ కథనం ప్రకారం... కరీంనగర్ జిల్లా ఇరుకుల్లా గ్రామానికి చెందిన తంగల్లపల్లి వాసు(33)కు మేనమామ కూతురు శ్రీలత (26)తో పదేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి కుమారుడు సాయి పార్దు(7), కుతూరు సింధూ (5) సంతానం. వాసు కుటుంబం మూడేళ్లుగా రామంతాపూర్ కామాక్షిపురంలో నివాసముంటోంది. భర్త వాక్యూం క్లీనర్ల రిపేరర్ కాగా... శ్రీలత చిక్కడపల్లిలో బ్యూటీషియన్‌గా పని చేస్తోంది. గత కొంతకాలంగా వాసు భార్యపై అనుమానం పెంచుకొని రోజూ గొడవపడేవాడు. మతిస్థిమితం లేనట్టు ప్రవర్తించేవాడు. ఈ క్రమంలో ఆసుపత్రుల్లో కూడా చూపించుకున్నాడు. ఇదిలా ఉండగా... భార్య శ్రీలతను హత్య చేయాలని నిర్ణయించుకున్న వాసు కూతురిని తన తల్లి వద్దకు పంపాడు. బుధవారం మధ్యాహ్నం ఇంటికి వచ్చిన వాసు.. కొడుకుకు రూ. 10 ఇచ్చి చాక్లెట్లు కొనుక్కోమని బయటకు పంపాడు. తర్వాత భార్య కళ్లల్లో కారం కొట్టి.. కూరగాయల కత్తితో గొంతుకోసి చంపేశాడు. తర్వాత ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు నమ్మించడానికి యత్నించాడు. వీలు కాకపోవడంతో హత్యకు ఉపయోగించిన కత్తి, కారం ప్యాకెట్‌ను చేత్తో పట్టుకొని బయటకు వచ్చాడు. అతడిని చూసిన స్థానికులు తీవ్రభయాందోళనకు గురయ్యారు. స్థానికులు అతడిని పట్టుకొని నిలదీయగా.. అసలు విషయం బయట పెట్టాడు. స్థానికుల సమాచారం మేరకు ఉప్పల్ సీఐ బాలకృష్ణారెడ్డి, ఎస్ఐలు కిరణ్, ప్రవీణ్‌లు ఘటనా స్థలాన్ని పరిశీలించి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. -
'మిస్సమ్మ'ను కోల్పోయిన ప్రియమణి
తాను చేసిన సినిమాల్లో కొన్ని బాక్సాఫిస్ దగ్గర విజయం సాధించేసి, కాస్తంత పాపులారిటీ వచ్చేస్తే చాలు నిర్మాతల దగ్గర చాంతాడంత గొంతెమ్మ కోరికల చిట్టా విప్పే నటీనటులకు ప్రస్తుత కాలంలో కొదవేలేదు. ఇలాంటివారి జాబితాలో నటి ప్రియమణి మినహాయింపేమీ కాదండోయ్. అయితే నిర్మాత బడ్జెట్‌ను తెలుసుకోకుండా ఖరీదూన తన కోరికల చిట్టాను డిమాండ్ చేసినందుకు ప్రియమణి ఓ సినిమానే వదులుకోవాల్సి వచ్చింది. ఇందుకు సబంధించిన వివరాలపూ ఓ లుక్ వేస్తే...శివాజీ, లయ, భూమిక ప్రధాన పాత్రధారులుగా నీలకంఠ దర్శకత్వంలో తెలుగులో తెరకెక్కిన 'మిస్సమ్మ' చిత్రాన్ని కన్నడలో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు 'నమస్తే మేడమ్' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో శివాజీ పాత్రలో శ్రీనగర కిట్టి, లయ పాత్రలో నిఖీషా పటేల్ (పులి ఫేమ్), భూమిక పాత్రలో ప్రియమణిలను మొదటగా ఎంపిక చేశారు. అయితే తన సినిమాలో ధరించబోయే యాక్ససరీస్‌తో పాటు నగలను కూడా తాను చెప్పిన డిజైనర్ దగ్గరే డిజైన్ చేయించాలని, తాను వాడబోయే ప్రతి వస్తువు తనకు నచ్చినట్లుగానే ఉండాలని ప్రియమణి షరతులు విధించడం మొదలుపెట్టిందట. ఇందుకు సదరు ఆ సినిమా నిర్మాత దుస్తుల వరకు అయితే ఓకేగానీ నగల కోసం కూడా ప్రత్యేకంగా డిజైనర్లను ఆశ్రయించాలంటే బడ్జెట్ ఎక్కువైపోతుందని ప్రియమణికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారట. కానీ ప్రియమణి వింటేనా, దీంతో ఆ సినిమా నుండే ప్రియమణిని నిర్మాత తప్పించినట్లు శాండల్ వుడ్ వర్గాల సమాచారం. ఇక ప్రియమణి స్థానంలో శాండల్‌వుడ్‌లో ప్రముఖ నటి రాగిణి ద్వివేదిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయంపై ప్రియమణిని ప్రశ్నిస్తే మాత్రం...'నిర్మాత నన్ను సినిమా నుంచి తప్పించడం ఏంటి, కథ, కథలోని కొన్ని అంశాలు నచ్చక నేనే సినిమాను వదులుకున్నాను' అని చెప్పుకోవటం విశేషం.