Actor Karthik Married His Wife Younger Sister - Sakshi
Sakshi News home page

Karthik: భార్య సొంత చెల్లిని పెళ్లాడి, వ్యసనాలకు బానిసైన స్టార్‌ హీరో..

Published Sat, Aug 20 2022 7:32 PM | Last Updated on Sat, Aug 20 2022 8:27 PM

Actor Karthik Married His Wife Younger Sister - Sakshi

Actor Karthik Married His Wife Younger Sister: సీనియర్‌ హీరో కార్తిక్‌ అంటే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కోలీవుడ్‌ హీరో అయిన కార్తిక్‌ సీతాకోక చిలుక వంటి క్లాసిక్ మూవీతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తర్వాత అనుబంధం, అన్వేషణ, పుణ్యస్త్రీ, అభినందన, గోపాల్ రావు గారి అబ్బాయి, మగ రాయుడుతోపాటు కల్యాణ్ రామ్ ఓమ్‌ 3డి సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు. కొద్ది రోజులు సినిమాలకు గ్యాప్‌ తీసుకున్న కార్తీక్‌ ప్రస్తుతం సెకండ్‌ ఇన్నింగ్స్‌లో విలన్‌గా రాణిస్తున్నాడు. అయితే కార్తీక తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు. 

తెలుగు, తమిళ భాషల్లో కలిపి సుమారు 125కిపైగా చిత్రాల్లో నటించిన కార్తీక్ 1988లో సహనటి రాగిణిని వివాహం చేసుకున్నాడు. కార్తీక్, రాగిణి ఇద్దరూ సోలైకుయిల్‌ సిమాలో కలిసి నటించారు. వీరికి గౌతమ్‌ కార్తీక్, ఘైన్‌ కార్తీక్‌ కుమారులు ఉన్నారు. గౌతమ్‌ కార్తీక్‌ 'కడలి' మూవీతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అనంతరం రాగిణి సోదరి రథిని 1992లో రెండో వివాహం చేసుకున్నాడు కార్తీక్. వీరిద్దరికి తిరన్‌ కార్తీక్‌ కొడుకు ఉన్నాడు. 

చదవండి: నా వల్లే భారతీయ రైల్వేస్‌కు ఆదాయం పెరిగింది: కరీనా కపూర్
 

అప్పటివరకు ఉజ్వలంగా సాగిన కార్తీక్‌ కెరీర్‌ 2000 సంవత్సరం తర్వాత ఒడిదొడుకులు ఎదుర్కొంది. 2005లో వచ్చిన నటుడు సత్యరాజ్‌ 'శివలింగం ఐపీఎస్‌' సినిమాలో తొలిసారి విలన్‌గా నటించాడు కార్తీక్. అయితే పలు అనివార్య కారణాల వల్ల ఆ చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. తనకున్న చెడు అలవాట్ల వల్లే తన కెరీర్‌ నాశనం అయిందని ఒక సందర్భంలో స్వయంగా కార్తీక్‌ తెలిపాడు. 

చదవండి: ప్రభాస్‌ అంటే చాలా ఇష్టం, మేము ఫ్రెండ్స్ కూడా: పీవీ సింధు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement