bad habits
-
వ్యసనంపై పోరాడటానికి మనం మాట్లాడుకోవాల్సిందే
ఆల్కహాల్, స్మోకింగ్, డ్రగ్స్‌లాంటి దురలవాట్లకు బానిసలై చీకటి నింపుకుంటున్న కుటుంబాలు ఎన్నో. వీటినుంచి బయట పడాలంటే ఏం చేయాలి?! ఈ వ్యసనం కుటుంబాలలో రేపుతున్న చిచ్చును ఆర్పేదెలా?!పరువు పోతుందనే భయంతో సమాజంలో దాక్కుంటున్న మనుషుల్లో ధైర్యం నింపేదెలా?!సమస్యను దాచిపెడితే పెంచి ‘పోషించినట్టే. అందుకే, మనం మాట్లాడుకోవాల్సిందే వ్యసనంపై పోరాడటానికి..! సమస్యను ఎదుర్కొంటున్న ఒక కుటుంబ కథనం,,, ‘బాబూ.. ఏమీ అనుకోకుండా ఈ బ్రాండ్ లిక్కర్ తెచ్చిపెట్టగలవా?!’ అ΄ార్ట్‌మెంట్ పైఫ్లోర్ నుంచి దిగుతున్న ఓ అపరిచిత అబ్బాయిని పిలిచి అడిగింది శారద (పేరుమార్చడమైనది). ఆ అబ్బాయి ఆమెను ఎగాదిగా చూశాడు. పక్క΄ోర్షన్ వాళ్లు చూస్తే ఏమనుకుంటారో అనే భయంతో.. ‘మా వారికి డ్రింక్ చేసే అలవాటుంది. ఎంతకీ మార్చుకోవడం లేదు. ఆయన్ని బయటకు వెళ్లనివ్వడం లేదు. నేనుగా ఆ వైన్ షాప్‌కి వెళ్లలేను. అందుకే అడుగుతున్నాను’ అంది బతిమాలుతున్నట్టుగా. ‘ఓ.. అలాగే తెచ్చిస్తాను’ అని డబ్బులు తీసుకొని వెళ్లి΄ోయాడు. అతను తెచ్చిన బాటిల్‌ను ఎవరూ గమనించట్లేదని నిర్ధారించుకుని, థాంక్స్ చెప్పి లోపలికి తీసుకెళ్లింది. కొన్నాళ్లుగా ఈ సమస్య కారణంగా నరకం చూస్తోంది శారద. ∙∙ శారద ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్. భర్తది కాలేజీలో లెక్చరర్‌గా ఉద్యోగం. ఇద్దరు పిల్లలు. చుట్టుపక్కల వారిలో గౌరవ మర్యాదలకు లోటు లేని కుటుంబం. ‘వాళ్లకేం.. ఇద్దరూ సం΄ాదిస్తున్నారు. చిన్న కుటుంబం చింతల్లేవు’ అంటుంటారు. నలుగురిలో ఎంతో గొప్పగా ఉండే తమ కుటుంబం నేడు దిగజారి΄ోయిన పరిస్థితి చూస్తూ కొన్నాళ్లుగా కంటిమీద కునుకు లేకుండా గడిపేస్తోంది. మొదట్లో పార్టీలకు వెళ్లినప్పుడు కొద్దికొద్దిగా డ్రింక్ చేసేవాడు శారద భర్త. వద్దని వారిస్తే ‘డ్రింక్ అనేది ఒక ΄ార్టీ కల్చర్, నలుగురిలో కలుపుగోలుగా ఉండాలంటే ఇలాంటివి పట్టించుకోవద్ద’ని చెప్పేవాడు. ‘నిజమే, కదా! దాదాపుగా చుట్టూ అందరూ అలాగే ఉన్నారు’ అనుకుంది శారద. పిల్లల చిన్నప్పుడు తక్కువగానే ఉన్న ఈ డ్రింక్ అలవాటు, ఇప్పుడు వారికీ అన్నీ తెలిసే వయసు వచ్చేసరికి పెరిగింది. ΄ార్టీల నుంచి అలవాటు రోజూ రాత్రిపూట తీసుకోవడం, ఆ తర్వాత పగటికి కూడా మారింది. అదేమంటే, ఆరోగ్యంగా ఉండాలంటే ఆ మాత్రం తప్పదని కొన్నాళ్లు, బాధగా ఉందని, ఆనందంగా ఉందని, ఈ మాత్రమైనా ఉంటున్నాను కదా!’ అంటూ ఏదో ఒక వంకన తాగడం పెరిగింది. పగటిపూట తాగి కాలేజీకి వెళితే, యాజమాన్యం డిస్మిస్ చేసింది. దీంతో జాబ్ ΄ోయిందనే ఆలోచన, డిప్రెషన్‌తో ఇంకా తాగడం పెరిగింది. తాగి బయటకు వెళ్లినా, ఆ మత్తులో ఎవరితోనైనా గొడవ పెట్టుకున్నా నలుగురిలో పరువు ΄ోతుందని, తనే మందుబాటిళ్లు ఇంటికి తెచ్చిస్తాను, ఎక్కడకూ వెళ్లద్దు అని బతిమాలడం మొదలుపెట్టింది. ∙∙ ఇద్దరిలో ఒకరి స్పందన ఎలాగూ పోయింది. తన ఒక్కదాని సం΄ాదనతో ఇల్లు, పిల్లల ఫీజులు నెట్టుకొస్తోంది. దానికితోడు మందుకు కూడా డబ్బులు ఖర్చు పెట్టాలంటే కష్టంగా ఉంటుంది. కానీ, తప్పడం లేదు. పైగా, రోజు రోజూ భర్త ఆరోగ్య పరిస్థితి ఏమౌతుందో అని ఆందోళన పెరుగుతోంది. ∙∙ కొన్నాళ్లుగా బంధుమిత్రుల వేడుకలు, ΄ార్టీలకు వెళ్లడం బాగా తగ్గించేసింది. అదేమని అడిగితే ముఖ్యమైన పని ఉందని తప్పించుకుని తిరుగుతుంది. ఒక విధంగా స్వీయ సామాజిక బహిష్కరణకు గురైంది. ∙∙ ΄పార్టీ ఉందని చెప్పి వెళ్లిన పెద్దబ్బాయి ఇంకా ఇంటికి రాక΄ోవడంతో ఆందోళన పడి΄ోయింది శారద. వచ్చాక వాడిని గమనిస్తే మందు వాసన వస్తోంది. అదేమని నిలదీస్తే.. ‘డాడీని ఏమీ అనవు. పైగా నువ్వే మందు తెప్పించి ఇస్తావు. నన్ను మాత్రం ఎందుకు తిడుతున్నావు!’ అని ఎదురు తిరిగాడు. ఆ మాటలతో తల తిరిగి΄ోయింది శారదకు. ఇంట్లో అందరివైపు బిక్కుబిక్కుమని చిన్నకొడుకు చూసే చూపులు ఆమెను పూర్తి అగాథంలోకి తోసేసినట్టుగా అనిపించాయి. ఇలాంటి బయటికి చెప్పుకోలేని గాధలు మన చుట్టూ ఉన్నవారిలో ఎన్నో ఉన్నాయి. – నిర్మలారెడ్డి కుటుంబమంతా కలిసి... బయట మద్యం అందుబాటులో ఉంటుంది కాబట్టి, వీళ్లు తాగుతున్నారు అని చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు. ఉదయం లేచిన దగ్గర నుంచి మన చుట్టూ మంచీ–చెడు అంశాలు ప్రతి దానిలోనూ చూస్తుంటాం. దేనిని మనం ఏ విధంగా తీసుకోవాలో మన మెదడు చేసే పనితీరును బట్టి ఉంటుంది. లోపం ఎక్కడ ఉందో గుర్తించి, దానికి విరుగుడు ఏంటా.. అని ఆలోచించడం మన ముందున్న అసలు కర్తవ్యం. ∙కుటుంబం అంతా వ్యసనంపై ΄ోరాటానికి సిద్ధం అన్నట్టుగా ఉండాలి. ∙చుట్టుపక్కల వాళ్లు ఏమనుకుంటారో, బంధుమిత్రుల్లో పరువు ΄ోతుందేమో అనే ఆలోచనకు తావివ్వకుండా ఈ సమస్య గురించి నలుగురితో చర్చించాలి. ∙అపార్ట్మెంట్, కాలనీ, సొసైటీ మీటింగ్స్ సమయాల్లో ‘మద్యం అలవాటు’ తప్పనిసరి టాపిక్ అయి ఉండాలి. సమస్య పరిష్కారానికి ఏం చేయాలి అనే ఆలోచనలు పంచుకోవాలి. ∙మద్యం తాగినప్పుడు బాగుంటుందనే ఆలోచన రావడమే సరైనది కాదు. ఇలాంటప్పుడు తమ ఆలోచనల్లోనే తేడాలు వస్తున్నట్టు గుర్తించి, ఇంట్లో వారికి చెప్పి, నిపుణుల సలహా తీసుకోవడం, కంట్రోలింగ్ పవర్‌ని పెంచుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ∙‘కుటుంబంలో ఉన్న అందరూ (పిల్లలు – పెద్దలు) క్రమశిక్షణ ΄ాటించాలి..’ అనే కఠిన నిర్ణయాన్ని అమలు చేయాల్సిందే. ∙ఇంట్లో ఎవరైనా మద్యం తాగుతున్నారు అంటే మొదట్లోనే అలెర్ట్ చేయాలి. కొన్నిసార్లు మాత్రమే కదా, వాళ్లే మారుతారులే అనే ఆలోచనా ధోరణిని దరి చేరనీయకూడదు. సమస్య పెరిగాక తగ్గిద్దామనుకుంటే ‘అలవాటు’ కుటుంబంలోని మిగతా వ్యక్తులపై దాడి చేయడానికి వెనకాడనీయదు. మద్యం తెచ్చుకోవడానికి డబ్బు లేక΄ోతే ఇంట్లో దొంగతనాలు చేయడం, వస్తువులను అమ్మడం, చావడం, చంపడం .. వంటి నేరాలకు దారులు తెరుస్తుంది. అందుకే, సమస్యను పెంచనీయకూడదు. ∙సమస్య గుర్తించిన వెంటనే ఫ్యామిలీ కౌన్సెలింగ్ తీసుకోవడం, నిపుణుల సలహాలు ΄ాటించడం అత్యవసరం. ఇది ఒక జబ్బు అని గుర్తించాలి నియంత్రణ కోల్పోవడం వ్యసనం ప్రధాన లక్షణం. నూటికి నూరు΄ాళ్లు నయం అవడం ఉండదు కానీ, నియంత్రణ కోల్పోకుండా చికిత్స చేయవచ్చు. మన మెదడు గుర్తించడం, గుర్తుపెట్టుకోవడం, గుర్తుచేయడం అనే మూడు విధాలుగా పనిచేస్తుంది. బ్రెయిన్లో డోపమైన్ కెమికల్ ఉంటుంది. మిగతా సమయాల్లో కంటే తాగినప్పుడు డోపమైన్ రసాయనాలు ఎక్కువ రిలీజ్ అవడంతో ఆనందం అధికంగా ఉంటుంది అనుకుంటారు. మత్తు దిగాక మళ్లీ మామూలే అవుతుంది. అందుకే, ఆ మందు మళ్లీ మళ్లీ తీసుకోవాలని, మోతాదు ఇంకా పెంచమనే బ్రెయిన్ సూచనల ప్రకారం మనిషి నడుచుకుంటాడు. అందుకే, మొదట్లో తక్కువ తాగే వారు కొన్నాళ్లకు డోసు పెంచుతూ ఉంటారు. తాగడానికి ఏవో కారణాలు చెబుతున్నారంటే సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. నిపుణుల సూచనలు తీసుకోవాలి. – డాక్టర్ గిడియన్, డి–అడిక్షన్ థెరపిస్ట్, లివింగ్ సోబర్, హైదరాబాద్ పార్టీ ఉందని చెప్పి వెళ్లిన పెద్దబ్బాయి ఇంకా ఇంటికి రాక΄ోవడంతో ఆందోళన పడి΄ోయింది శారద. వచ్చాక వాడిని గమనిస్తే మందు వాసన వస్తోంది. అదేమని నిలదీస్తే.. ‘డాడీని ఏమీ అనవు. పైగా నువ్వే మందు తెప్పించి ఇస్తావు. నన్ను మాత్రం ఎందుకు తిడుతున్నావు!’ అని ఎదురు తిరిగాడు. ఆ మాటలతో తల తిరిగిపోయింది శారదకు. ఇంట్లో అందరివైపు బిక్కుబిక్కుమని చిన్నకొడుకు చూసే చూపులు ఆమెను పూర్తి అగాథంలోకి తోసేసినట్టుగా అనిపించాయి. ఇలాంటి బయటికి చెప్పుకోలేని గాధలు మన చుట్టూ ఉన్నవారిలో ఎన్నో ఉన్నాయి. – నిర్మలారెడ్డి ఆశలు పెంచుతోంది.. చదువు ఉండి, నలుగురిలో ఎలా మెలగాలో తెలిసిన మేమే ఇలాంటి సమస్యతో బాధపడుతుంటే దీని తీవ్రత సమాజంలో ఎంత ఉందో అర్థమవుతుంది. ఒక తల్లిగా నా పిల్లలకు చెప్పలేక, టీచర్‌గా స్కూల్లో పిల్లలకు ఏ మంచీ బోధించలేక జీవితం శూన్యంగా అనిపించేది. ఓ రోజు నా ఫ్రెండ్‌తో చె΄్పాక సమస్యకు పరిష్కారం దొరికింది. థెరపిస్ట్‌లను కలిసి, అడిక్షన్ నుంచి నా కుటుంబాన్ని కా΄ాడుకోవాలని కృషి చేస్తున్నాను. ఇప్పుడు నా కుటుంబంలో వచ్చిన మార్పు భవిష్యత్తుపైన ఆశలు పెంచుతోంది. – శారద, బాధితురాలు -
ఆమె ప్రేమే నన్ను మార్చింది!
సూపర్ స్టార్ రజనీకాంత్ ఏ వేడుకలో పాల్గొన్నా సినిమాల గురించే ఎక్కువగా మాట్లాడతారు. వ్యక్తిగత విషయాలు మాట్లాడిన దాఖలాలు దాదాపు లేవు. అలాంటిది ఇటీవల తన వ్యక్తిగత అలవాట్ల గురించి, తన భార్య లత కారణంగా తాను మారిన విషయం గురించి చెప్పి ఆశ్చర్యపరిచారు. రజనీకాంత్ మాట్లాడుతూ – ‘‘నేను బస్ కండక్టర్‌గా ఉద్యోగం చేస్తున్న సమయంలో మద్యం సేవించేవాడిని. ధూమపానం బాగా అలవాటు. మాంసాహారం కూడా కాస్త ఎక్కువగానే తీసుకునేవాడిని. మద్యం–మాంసాహారం–సిగరెట్.. ఈ మూడూ మంచి కాంబినేషన్. అయితే ఈ చెడు అలవాట్లు ఉంటే 60 ఏళ్లకు పైన బతకరు. ఈ అలవాట్లు ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదని, కొంతకాలం తర్వాత ఇవి మన అనారోగ్యానికి కారణమవుతాయని అనిపించింది. నా భార్య లత వల్లే నా చెడు అలవాట్లకు నేను దూరం కాగలిగాను. ఆమె తన ప్రేమతో నన్ను మార్చింది. లత ప్రేమ వల్లే ఇప్పుడు వీటికి దూరంగా ఉంటూ, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతున్నాను. 73ఏళ్లలోనూ నేనింత ఆరోగ్యంగా ఉండటానికి కారణం తనే. అందుకే నా భార్య లతకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. అలాగే లతను నాకు పరిచయం చేసిన మహేంద్రన్ (లత బావ, నటుడు, రచయిత వైజీ మహేంద్రన్‌ని ఉద్దేశించి)కూ రుణపడి ఉంటాను’’ అని చెప్పుకొచ్చారు రజనీకాంత్. వైజీ మహేంద్రన్ రూ΄÷ందించిన ‘చారుకేశి’ నాటికకు సంబంధించిన వేడుకలో పాల్గొన్న రజనీ తన అలవాట్ల గురించి ఈ విధంగా చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. -
తన భార్య సొంత చెల్లిని పెళ్లాడిన స్టార్ హీరో.. కష్టాలతో జీవితం
Actor Karthik Married His Wife Younger Sister: సీనియర్ హీరో కార్తిక్ అంటే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కోలీవుడ్ హీరో అయిన కార్తిక్ సీతాకోక చిలుక వంటి క్లాసిక్ మూవీతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తర్వాత అనుబంధం, అన్వేషణ, పుణ్యస్త్రీ, అభినందన, గోపాల్ రావు గారి అబ్బాయి, మగ రాయుడుతోపాటు కల్యాణ్ రామ్ ఓమ్ 3డి సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు. కొద్ది రోజులు సినిమాలకు గ్యాప్ తీసుకున్న కార్తీక్ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో విలన్‌గా రాణిస్తున్నాడు. అయితే కార్తీక తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు. తెలుగు, తమిళ భాషల్లో కలిపి సుమారు 125కిపైగా చిత్రాల్లో నటించిన కార్తీక్ 1988లో సహనటి రాగిణిని వివాహం చేసుకున్నాడు. కార్తీక్, రాగిణి ఇద్దరూ సోలైకుయిల్ సిమాలో కలిసి నటించారు. వీరికి గౌతమ్ కార్తీక్, ఘైన్ కార్తీక్ కుమారులు ఉన్నారు. గౌతమ్ కార్తీక్ 'కడలి' మూవీతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అనంతరం రాగిణి సోదరి రథిని 1992లో రెండో వివాహం చేసుకున్నాడు కార్తీక్. వీరిద్దరికి తిరన్ కార్తీక్ కొడుకు ఉన్నాడు. చదవండి: నా వల్లే భారతీయ రైల్వేస్‌కు ఆదాయం పెరిగింది: కరీనా కపూర్ అప్పటివరకు ఉజ్వలంగా సాగిన కార్తీక్ కెరీర్ 2000 సంవత్సరం తర్వాత ఒడిదొడుకులు ఎదుర్కొంది. 2005లో వచ్చిన నటుడు సత్యరాజ్ 'శివలింగం ఐపీఎస్' సినిమాలో తొలిసారి విలన్‌గా నటించాడు కార్తీక్. అయితే పలు అనివార్య కారణాల వల్ల ఆ చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. తనకున్న చెడు అలవాట్ల వల్లే తన కెరీర్ నాశనం అయిందని ఒక సందర్భంలో స్వయంగా కార్తీక్ తెలిపాడు. చదవండి: ప్రభాస్ అంటే చాలా ఇష్టం, మేము ఫ్రెండ్స్ కూడా: పీవీ సింధు -
దురలవాట్లకు బానిసలుగా చేసే యాంగ్జైటీ.. తేలికగా అధిగమించండిలా..!
యాంగ్జైటీ అందరిలోనూ ఉంటుంది. ఆఫీస్‌లో అధికారులు నిర్ణయించిన లక్ష్యాలు సాధించలేమేమో అని, చేపట్టిన ఫలానా పని విజయవంతమవుతుందో లేదో అని, ఏదైనా కొత్త ప్రదేశంలో నెగ్గుకువస్తామా అని... ఇలా ప్రతి విషయంలోనూ అందరిలోనూ ఈ యాంగై్జటీ కలుగుతుంది. అయితే అందరిలోనూ కలిగే ఈ భావోద్వేగాలనూ, ఉద్విగ్నతలను కొంతమంది తేలిగ్గా అదుపు చేసుకుంటారుగానీ... మరికొందరు అంత తేలిగ్గా అధిగమించలేరు. దాంతో యాంగై్జటీ వల్ల కలుగుతున్న ఉద్విగ్న స్థితిని ఎలా అదుపు చేయాలో తెలియక కొందరు ఆ స్థితిని అధిగమించడం కోసం తొలుత సిగరెట్‌ను ఆశ్రయిస్తారు. ఆ తర్వాత మరొక దురలవాటైన మద్యం. ఇంకొందరు ఎప్పుడూ పొగాకు నములుతూ ఉండే జర్దా, ఖైనీ, పాన్‌మసాలా వంటివాటికి అలవాటు పడి నోటి క్యాన్సర్లు, గొంతు క్యాన్సర్లకు గురవుతుంటారు. కొందరు పాత అలవాట్లు వదులుకునేందుకు కొత్త అలవాట్ల బాట పడుతుంటారు. ఇది మరీ ప్రమాదం. ఇది డ్రగ్స్ వంటి ప్రమాదకరమైన అలవాట్లకు దారి తీస్తుంది. అలా పొగాకు నమలడం, పొగతాగడం, మద్యంతో పాటు మరికొద్దిమందిలో మాదకద్రవ్యాల వంటి దురలవాట్లకు బానిసలై తమ కాలేయాలూ, మూత్రపిండాలను పాడుచేసుకుంటారు. యాంగ్జైటీని అధిగమించలేకపోగా... చివరకు లివరూ, కిడ్నీలు దెబ్బతింటాయి. ఆరోగ్యమంతా పాడైపోతుంది. అందుకే యాంగై్జటీకి లోనయ్యేవారు, దాన్ని అధిగమించడానికి అన్నిటికంటే మంచిదీ, తేలికైన మార్గం పుస్తకాలతో పరిచయం. పుస్తకాలు ఎక్కువగా చదవడం వల్ల... అనేక పరిస్థితులతో మానసికంగా పరిచయం కావడం వల్ల తాము ఎదుర్కొన్న పరిస్థితి పెద్దగా కొత్తగా అనిపించదు. దాంతో యాంగై్జటీ తగ్గడానికి అవకాశాలు ఎక్కువ. అదేగాక... యోగా, ధాన్యం, మంచి మంచి హాబీల వంటి తేలిక మార్గాలతోనూ అధిగమించవచ్చు. -
వాష్‌రూమ్ వాడి సరిగ్గా నీళ్లు కొట్టరు.. ఎలా చెప్తే మారతారు మగాళ్లు?
హైదరాబాద్ మూసాపేటలో రెండు రోజుల క్రితం గృహిణి ఆత్మహత్య చేసుకుంది. కారణం? వాష్‌రూమ్‌ను వాడిన భర్త నీళ్లు కొట్టకపోవడంపై ఆమె విసుక్కుంది. భర్త వాదనకు దిగాడు. అంతే. స్త్రీలకు మగవారి దురలవాట్లు కొన్ని ససేమిరా నచ్చవు. వారు ఆ సంగతి చెప్పినప్పుడు వాటిని మానుకోవడం మగవాళ్ల కనీస సంస్కారం. ఎన్ని విధాలుగా చెప్తే మారుతారు మగవారు? నాన్నకు అమ్మ చెప్పలేదు. భర్తకు భార్య చెప్పలేదు. తండ్రికి కూతురు చెప్పలేదు. ఒకసారి చెప్పి ఉంటారు. విని ఉండరు. మరోసారి చెప్పి ఉంటారు. లెక్క చేసి ఉండరు. ఇంకోసారి చెప్పడం మానుకుని ఉంటారు. మానుకున్నారు కదా అని అలవాటు కొనసాగిస్తూ ఉంటారు. ఇప్పుడు దీనిని తిరగేద్దాం. నాన్నకు స్కూటర్ ఉదయాన్నే శుభ్రంగా తుడిచి కనపడకపోతే కోపం వస్తుందనుకుందాం. అప్పుడు అమ్మ ఏం చేస్తుంది. ఆయనకు కోపం వస్తుందని తనో పిల్లల చేతో ఆ పని చేయిస్తుంది. నాన్న ఆఫీసుకు వెళ్లే ముందు ఇస్త్రీ చేసిన బట్టలు లేకపోతే విసుగొస్తుందనుకుందాం. అమ్మ ఎంత అలెర్ట్‌గా ఉంటుంది. నాన్నకు ఫలానా సామ్రాణికడ్డి వాసన పడదనుకుందాం. అప్పుడు అమ్మ ఆ సామ్రాణి కడ్డీలను బయట పారేస్తుంది. నాన్నకు ఇష్టం లేనివి ఇంట్లో ఉండవు. కాని అమ్మకు ఇష్టం లేనివి? బాల్యం నుంచి ప్రభావాలు అమ్మ ఒక ఇంటి నుంచి వస్తుంది. నాన్న ఒక ఇంటి నుంచి వస్తాడు. ఇద్దరూ కలిసి ఒక చోట చేరి జీవితం మొదలెడతారు. నాన్నకు ఎలాగైతే బాల్యం నుంచి కొన్ని అలవాట్లు, అభిరుచులు ఉంటాయో అమ్మకు కూడా అలాగే ఉంటాయి. కొన్ని తీవ్రమైన ఇష్టాలు అయిష్టాలు ఏర్పడి ఉంటాయి. కాని వాటికి నాన్న విషయంలో చెల్లుబాటయినట్టుగా అమ్మ విషయంలో కాదు. ఆ... ఏముందిలే.. అనే భావన. ఈ భావన ఇంకా ఎంత కాలం. అసలు అమ్మకు, భార్యకు, కుమార్తెకు ఇష్టం లేని అలవాట్లను మగవాళ్లు ఎందుకు కొనసాగించాలి. చదవండి: వాష్‌రూమ్ వాడి సరిగా నీళ్లు కొట్టరు.. విడిచిన బట్టలు హ్యాంగర్‌కు తగిలించరు. పైగా! చిన్న చిన్నవే అన్నీ... మనుషులు వైముఖ్యం కావడానికి ఎదుటి వారి మీద తీవ్రమైన అసహనం పెంచుకోవడానికి యుద్ధాలు రానక్కర్లేదు. చిన్న చిన్న దురలవాట్లు చాలు. ఉదాహరణకు స్త్రీలు ఇష్టపడని ఈ దిగువ విషయాలు ఎంత మంది పురుషులు ఇళ్ళల్లో కొనసాగిస్తారో గమనించండి. ►బయట నుంచి రాగానే చెప్పులు కుదురుగ్గా విడవరు. ►విడిచిన బట్టలు హ్యాంగర్‌కు తగిలించరు. లేదా వాష్ ఏరియాలో పడేయరు. లోదుస్తులు బాత్రూమ్లోనే వదిలేస్తారు. తడి టవల్ కుర్చీ మీద ఆరేస్తారు. ►సిగరెట్ డ్రాయింగ్‌రూమ్‌లో తాగి యాష్‌ట్రే క్లీన్ చేయకుండా వదిలేస్తారు. ►ఇయర్ బడ్స్ వాడి ఇంట్లో ఏదో ఒక మూలకు పడేస్తారు. ►వాష్‌రూమ్ వాడి సరిగ్గా నీళ్లు కొట్టరు. ►షేవింగ్ చేసుకుని ఆ రేజర్ సింక్ మీదే వదిలిపెడతారు. ►అన్నం తిని ప్లేట్లోని చెత్తను డస్ట్‌బిన్‌లో వేయకుండానే సింక్‌లో పడేస్తారు. ►పెద్ద పెద్దగా కేకరిస్తూ పండ్లు తోముతారు. ►నిద్ర లేచాక దుప్పట్లు మడిచిన పాపాన పోరు ►బాత్రూమ్లోకి న్యూస్‌పేపర్ తీసుకెళ్లి తడి చేసి పట్టుకొస్తారు ►ఫోన్ ఎప్పుడూ చార్జింగ్ పెట్టుకోరు, పైపెచ్చు ఇంట్లోవాళ్లు ఛార్జింగ్ పెట్టలేదని తిడతారు. ►గీజర్, ఫ్యాన్లు, లైట్లు ఆఫ్ చేయరు. ►వీటిలోని ఏ ఒక్కటి కొనసాగించినా స్త్రీలకు కష్టం. అలాంటిది ఇవన్నీ కొనసాగించేవారు ఉంటే ఆ స్త్రీలు ఎంత రోత అనుభవించాలి. అయినా సరే వారు భర్తలతో ఇంటి మగవారితో నవ్వుతూ వ్యవహరించాలని ఆశించడం ఏం భావ్యం. తప్పు చేస్తూ దబాయింపు ఇవన్నీ పురుషులు మానుకోగల అలవాట్లే. ఇంటి స్త్రీల మీద గౌరవం, ప్రేమ ఉంటే వెంటనే మానుకోవాలి కూడా. ఎప్పుడో ఒకసారి బద్దకించవచ్చు. కాని నిత్యం ఇదే పని అంటే అది ఏం సంస్కారం. ఏదో ఒకనాడు భరించలేక స్త్రీలు మందలిస్తే పురుషులు పౌరుషానికి పోయో, అహం కొద్దో, గిల్ట్తోటో స్త్రీలపై ఎదురుదాడి చేస్తే వాటి వల్ల కలిగే ఫలితాలు ఏమీ బాగుండవు. వ్యక్తుల బయట ప్రవర్తనలు ఇబ్బందిగా ఉంటే సమాజం ఇబ్బంది పడుతుంది. ఇంటి ప్రవర్తనలు ఇబ్బందిగా ఉంటే స్త్రీ మాత్రమే ఆ బాధ అనుభవిస్తుంది. ‘ఎన్నిసార్లు చెప్పినా వినడే’ అని స్త్రీల లోలోపల విరక్తి గూడుకట్టుకోవడం ఏమీ మంచిది కాదు. కనుక మారడం పురుషుల విధి. వారికి నేరుగా చెప్పడం స్త్రీలకు వీలు కాకుంటే ఈ వ్యాసం చూపిస్తే సరి. -
మంచి మాట: మీ చిత్తం ఎలాంటిది?
కొంతమంది ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది, కాని కొందరు ఏది అనుకొంటే అదే జరుగుతుంది. దీనికి మూలకారణం ఆలోచనలే. అవే సానుకూల ఆలోచనలు, ప్రతికూల ఆలోచనలు. ఈ రెండింటికి మూలం చిత్తం. జ్ఞానాన్ని భద్రపరిచే స్థానాన్నే చిత్తం అంటారు. చిత్తంలో ఉన్న చెడు ఆలోచనలు మంచి ఆలోచనలుగా మారాలి. అప్పుడే మనం అనుకున్నవి అనుకున్నట్లుగా జరుగుతాయి. కర్మ చే యించేది మనస్సు, మనస్సుని నియంత్రించేది బుద్ధి. అహంకారం అంటే ప్రకృతి సిద్ధమైన... తన చుట్టూ వున్న పరిస్థితులను తనకు అనుకూలంగా సృష్టించుకోవాలనుకోవటమే. దీనినే మన పెద్దలు ఏమైంది ఇతనికి నిన్నటివరకు బాగానే ఉన్నాడు కదా, ఉన్నట్టుండి ఎందుకు ఇలా మారాడు అనీ లేదా ఇంతలోనే ఇతనిలో ఇంత మంచి మార్పు ఎలా వచ్చింది అనే వారు. దీనికి కారణం చిత్తం నుండి కర్మ ఆ సమయానికి ఆలా పనిచేయడమే. జీవికి వచ్చిపోయే జబ్బులు కూడా కొన్ని చిత్తానికి సంబంధించినవే, మనసు అనియంత్రిత అవయవాలను నియంత్రిస్తుంది. ఇది కలుషితమైతే దీనికి సంబంధించిన గుండె, మూత్రపిండాలు, కాలేయం, పేగులు మొదలైన అవయవాల పై ప్రభావం ఉంటుంది. నియంత్రించే వ్యవస్థ మొత్తం మెదడులో ఉంటుంది. మెదడులో ఏ అవయవానికి సంబంధించిన వ్యవస్థ చెడితే ఆ అవయవం పనిచేయదు. మెదడులో వున్న ఈ వ్యవస్థ సరికావాలంటే మనస్సులో ప్రక్షాళన జరగాలి. అందుకే ఈ మధ్యన వైద్యులు ప్రతి జబ్బుకు మనసు ప్రశాంతంగా ఉంచుకోండి లేదా ధ్యానం చెయ్యండి అని విరివిగా చెబుతున్నారు. మరి అవయవాలకు వచ్చే జబ్బుకు మనస్సుకు సంబంధించిన ధ్యానాలు ఎందుకు అంటే అన్నిటికి మూలం మనసే కనుక. మనసనేది ఆలోచనల ప్రవాహం. కోరికలు, వాంఛలూ ఆలోచనలతో సంక్రమించేవే. అంత వరకూ అనుభవంలోకి రాని దాన్ని అనుభవించాలనుకోవడం కోరిక. అదే అనుభవాన్ని మళ్ళీ మళ్ళీ పొందాలనుకోవడం వాంఛ. మనసు అల్లకల్లోలమైనప్పుడు మనం ఊపిరి వేగంగా తీసుకుంటాం. శ్వాసప్రక్రియలోక్రమబద్ధత ఉండదు. మనసును శాంత పరచడానికి శ్వాసను క్రమబద్ధం చేయడం ఒక పద్ధతి. నిండుగా గాలిని పీల్చి వదలడాన్ని క్రమం తప్పకుండా అభ్యసిస్తే నిశ్చలమైన మానసిక స్థితిని పొందవచ్చు. ప్రాణశక్తి మీద పట్టు సాధించడం కోసం ఊపిరిని నియంత్రించడమే ప్రాణాయామం. కోరికలు, వాంఛల నుంచి మనసును అధిగమించి స్వతంత్రంగా, వ్యక్తిగా ఉండగలిగే వారే యోగి. మనసును అధిగమించడమంటే దాన్ని నొక్కిపెట్టి ఉంచడం, నియంత్రించడం కాదు. మన ప్రవర్తనలో మార్పు చేసుకోవాలి. ఎదుటి వారి విజయానికి అసూయ చెందకుండా, అపజయాన్ని హేళన చేయకుండా ఉండాలి. విజయం, అపజయం, ఒకటి ఒకరు పొందితే. ఇంకొకరు కోల్పోతున్నారు, ఇంకొకరు కోల్పోతే, అది ఇంకెవరికో దక్కుతుంది. సుఖం, దుఃఖం. డబ్బు, ఆస్తి, అంతస్తులు అన్నీ నేడు నాది నాది అనుకున్నవి నిన్న వేరొకరివి, రేపు ఇంకెవరివో. అంటే ఏది ఎవరికి శాశ్వతం కాదు. నాది, నాకు అనే సుడిగుండాలలో ఇరుక్కొని మనసు పాడుచేసుకోవడమే సకల జబ్బులకు మూలం. ఈ సూత్రం అర్థం చేసుకొంటేనే ప్రశాంతత. ఏ ఇద్దరి మనస్సు, జీవన విధానం ఒకలాగే ఉండదు. కాని అందుకు విరుద్ధంగా తనకు అనుకూలంగా ఉండాలనుకోవడమే అహంకారం. ఈ అహంకారాన్ని మార్చుకొంటే చిత్తంలో వున్న చెడు కర్మలు అన్నీ మంచి కర్మలుగా మారి మనిషి జీవన విధానం మొత్తం మారిపోతుంది. అందుకే వెయ్యిమందిని వెయ్యిసార్లు యుద్ధంలో ఓడించిన వాడికన్నా తన మనసును జయించిన వాడే పరాక్రమవంతుడు’ అంటాడు గౌతమ బుద్ధుడు. మనస్సు అంటే సంకల్ప, వికల్పాల కలయిక నీరు నిర్మలంగా ఉన్నప్పుడు అందులో మన ప్రతిబింబం కనిపిస్తుంది. అందులో వేరే ఏమి కలిపినా నీరు కలుషితం అవుతుంది. ప్రతిబింబం అగోచరమౌతుంది. అలానే మనస్సులో మొదట చెడు ఆలోచనలు తరిమేయడానికి మంచి ఆలోచనలు చేయాలి. క్రమంగా మంచి ఆలోచనలూ తగ్గించాలి. అలా తగ్గించగా మనసు నిర్మలం అవుతుంది. –భువనగిరి కిషన్ యోగి -
జల్సాలకు అలవాటు పడి కన్నకొడుకునే!
సాక్షి, రాజేంద్రనగర్: జల్సాలకు అలవాటుపడి అప్పులు చేసి వాటిని తీర్చేందుకు కన్నకుమారుడిని విక్రయించిన తండ్రితో పాటు సహకరించిన ఇద్దరు మధ్యవర్తులు, కొనుగోలు చేసిన భార్యాభర్తలను రాజేంద్రనగర్ పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరివద్ద నుంచి రెండు నెలల చిన్నారి బాలుడిని సురక్షితంగా కాపాడి తల్లికి అప్పగించారు. ఐదు సెల్ఫోన్లతో పాటు రూ.2.40లక్షల స్వాదీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ కనకయ్య తెలిపిన వివరాల ప్రకారం ఎంఎంపహాడీ ప్రాంతానికి చెందిన హైదర్ఆలీ(24), షహానాబేగం(20) భార్యాభర్తలు. వీరికి ఏడాదిన్నర కిందట వివాహమయింది. వృత్తి రీత్యా ఆటో డ్రైవర్ అయిన హైదర్ఆలీ జల్సాలకు అలవాటుపడి అప్పులు చేశాడు. రెండు నెలల కిందట వీరికి పండంటి మగబిడ్డ పుట్టాడు. అప్పటి నుంచి హైదర్ఆలీ బాలుడిని విక్రయించి డబ్బుతో అప్పులను తీరుద్దామంటూ భార్య షహానాబేగంకు తెలుపుతున్నాడు. షహానాబేగం అంతగా పట్టించుకోలేదు. ఈ నెల 15న సాయంత్రం షహానాబేగం రంజాన్ ఉపవాస దీక్ష నేపథ్యంలో ప్రార్థన చేస్తున్న సమయంలో హైదర్ఆలీ కుమారుడిని ఆడిస్తున్నట్లు నటించి బయటకు తీసుకువెళ్లాడు. వట్టెపల్లికి చెందిన మ్యారేజ్ బ్యూరో బ్రోకర్ హజేరాబేగం(28), కిషన్‌బాగ్‌కు చెందిన రేష్మాబేగం(23)లను సంప్రదించి రూ.3.80లక్షలకు కుమారుడిని విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నాడు. ముగ్గురు కలిసి టోలీచౌకిలోని సాఫ్ట్వేర్ ఉద్యోగులైన భార్యాభర్తలు అబ్దుల్ రియాజ్(38), సహేదామహ్మద్(38)లకు పిల్లలు కాకపోవడంతో వారు చిన్నారిని కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. బాలుడిని అమ్మిన హైదర్అలీ తల్లి షహానాబేగం వద్దకు వెళ్లాడు. ఆయన భార్య హైదర్ఆలీకి ఫోన్‌చేయగా తల్లి వద్ద ఉన్నానని, సోదరి వద్ద ఉన్నానంటూ తెలిపాడు. మరుసటి రోజు విషయాన్ని షహానాబేగం తల్లిదండ్రులకు తెలపడంతో వారు ఫోన్లో సంప్రదించగా హైదర్ఆలీ బాలుడిని విక్రయించానని తెలపడంతో రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి శంషాబాద్ ఎస్ఓటీ, రాజేంద్రనగర్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టి ఐదుగురిని సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బాలుడిని తల్లికి అప్పగించారు. -
పోర్న్‌కు బానిసైతే అంతే!
యవ్వనంలోకి అడుగుపెట్టగానే హార్మోన్ల ప్రభావంతో శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఆ సమయంలో అంత వరకు లేని కొత్త ఉత్సాహం, కోర్కెలు చుట్టుముడతాయి. సెక్స్‌కు సంబంధించిన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ప్రస్తుత భారతదేశ ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలు కారణంగా ఇందుకు సంబంధించిన విషయాలను బాహాటంగా చర్చించుకునే అవకాశం లేదు. అందుకని నిన్న, మొన్నటి వరకు సెక్స్ ఎడ్యూకేషన్‌కు సంబంధించిన విషయాలను పుస్తకాలు, స్నేహితుల ద్వారా తెలుసుకోవటం జరిగేది. కానీ, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ పుణ్యమా అని నేడు పోర్న్‌కు సంబంధించిన కంటెంట్ విచ్చలవిడిగా లభిస్తోంది. దీంతో సెక్స్ ఎడ్యూకేషన్‌కు సంబంధించిన విషయాలను తెలుసుకోవటానికి నేటి యువత ప్రధానంగా పోర్న్ సైట్లను ఆశ్రయిస్తోంది. విచ్చలవిడితనంతో పోర్న్ వీడియోలకు బానిసవుతోంది. అదే వారిలో సెక్స్ సంబంధ వ్యాధులకు గురయ్యేలా చేస్తోంది. 12- 20 ఏళ్ల వయస్సులో మెదడు న్యూరోప్లాస్టిసిటీకి సంబంధించి గొప్పమార్పులు చోటుచేసుకుంటాయి. ఈ మార్పుల కారణంగా మెదడు ఏ చర్యకైనా వేగంగా స్పందిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో పోర్న్ ఎక్కువగా చూడటం వల్ల అందుకు సంబంధించిన విషయాలు మెదడులో ముద్రవేసుకుపోతాయి. నిజజీవితంలోనూ అలాంటి అనుభూతి కావాలని మనసు కోరుకుంటుంది. ఆడ,మగల మధ్య సంబంధం సెక్స్‌కు సంబంధించిందేనన్న భావన కలుగుతుంది. ముఖ్యంగా పోర్న్ వీడియోలలో నటించే వారి ప్రైవేట్ భాగాలు యువత మనసులో ప్రత్యేకంగా ముద్రపడిపోతాయి. తమకు కాబోయే భాగస్వామి ప్రైవేట్ భాగాలు కూడా అలానే ఉండాలని కోరుకుంటారు. పోర్న్ వీడియోలలో నటించే వారు అందుకోసమే ప్రత్యేకంగా తీర్చిదిద్దబడ్డారన్న విషయాన్ని గుర్తించరు. ఇదే ఆ తర్వాతి రోజుల్లో పోర్న్‌కు బానిసైన వారి శృంగార జీవితాన్ని నాశనం చేస్తుంది. నేటి యువతపై తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవటం, విచ్చలవిడిగా ఇంటర్నెట్ సదుపాయం లభించటం, మొబైల్ ఫోన్స్ వాడకం ఇవన్నీ వారిని చెడుదోవ పట్టిస్తున్నాయి. పూర్తిగా పోర్న్‌కు బానిసైన యువత దారుణాలకు ఒడిగడుతోంది. వయసుతో సంబంధం లేకుండా దాదాపు 80 శాతం మంది పోర్న్‌ను చూస్తున్నారని అంచనా. ఇందులో ఆడ,మగ అన్న తేడాలేదని గుర్తించాలి. -
ఓ విద్యార్థీ... నీ దారేది?
సాక్షి, తిరుపతి ఎడ్యుకేషన్ : భవానీనగర్‌లోని మోక్షిత ఇంటర్లో 95శాతానికిపైగా మార్కులు తెచ్చుకుంది. ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించి ఇంజినీరింగ్‌లో చేరింది. సహ విద్యార్థులతో కలిసి తరగతులకు డుమ్మా కొట్టి సినిమాలు, షికార్లకు వెళ్లడం ప్రారంభించింది. విలాసానికి అలవాటు పడి అబద్దాలు చెప్పి తల్లిదండ్రుల నుంచి డబ్బులు తీసుకుని విచ్చలవిడిగా ఖర్చు చేసింది. చదువులో వెనుకబడ్డ విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించి కౌన్సెలింగ్ ఇప్పించారు. నాలుగేళ్ల ఇంజినీరింగ్ కోర్సు ఐదేళ్లకు పూర్తయ్యింది. అరాకొర మార్కులు సాధించడంతో అనుకున్న ఉద్యోగం రాక చిరు ఉద్యోగంలో చేరింది. ఇంటర్లో 80శాతం మార్కులతో ఉత్తీర్ణుడైన కార్తీక్ ఇంజినీరింగ్‌లో చేరి నాలుగేళ్లు కష్టపడి చదివాడు. చెడు స్నేహాలు, దురలవాట్లకు దూరంగా ఉండి తరగతులు, ప్రయోగశాలలకు క్రమం తప్పకుండా హాజరై సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించాడు. క్యాంపస్ సెలెక్షన్స్‌లో ప్రతిభ చూపి రూ.10లక్షల వార్షిక వేతనంలో ప్రముఖ కంపె నీలో ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడ్డాడు. పదో తరగతి వరకు ఇంట్లో ఉంటూ పాఠశాలకు వెళ్లే విద్యార్థులే ఎక్కువ. పది పూర్తయిన తర్వాత 60శాతానికి పైగా విద్యార్థులు వసతి గృహాల్లో ఉంటూ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ చదువుతున్నారు. ఈ సమయంలో తప్పటడుగులు వేయడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. సెల్‌ఫోన్‌కు సాధ్యమైనంత దూరంగా ఉండడం మంచిదని విద్యానిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో ఉంటూనే కళాశాలకు వెళ్తున్న విద్యార్థులు సైతం స్నేహితుల ప్రభావంతో దురలవాట్లకు లోనయ్యే పరిస్థితులు ఉన్నాయి. మద్యం, ధూమపానం చేయడానికి అలవాటు పడుతున్నారు. సెల్ఫోన్లో అసభ్యకర చిత్రాలు చూసి ఉద్వేగాలకు లోనై నేరాలకు పాల్పడి భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు. తల్లిదండ్రుల ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. దురలవాట్లకు అలవాటు పడి ఏకాగ్రతతో చదవలేకపోతున్నారు. నగరాల్లోనే కాకుండా పట్టణాల్లో సైతం కొందరు మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. క్రికెట్ బెట్టింగ్‌లకు దిగి అప్పులపాలవుతున్నారు. దీంతో పరీక్షలు సరిగా రాయలేక మార్కులు తక్కువగా వస్తున్నాయి. కొంతమంది ఉత్తీర్ణులు కాకపోవడంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో కళాశాలకని చెప్పి నదులు, సముద్రాల వద్దకు వెళ్లి ప్రమాదాలకు గురవుతున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కన్నవారికి కడుపుకోత మిగులుస్తున్నారు. అరకొరగా చదివితే అంతే అరకొరగా చదివి బొటాబొటి మార్కులతో ఉత్తీర్ణులై కోర్సు పూర్తి చేసిన వారికి సరైన ఉద్యోగం లభించడం లేదు. నైపుణ్యం లేకపోతే ప్రైవేటు రంగాల్లో ఉద్యోగం సాధించడం కష్టమే. ఆ తరువాత హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలకు వెళ్లి లక్షలాది రూపాయల ఫీజుల చెల్లించి ప్రత్యేక కోర్సుల్లో శిక్షణ తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది. మూడు, నాలుగేళ్ల తరువాత చిన్న ఉద్యోగాలతో సరిపెట్టుకుంటున్నారు. సమయాన్ని వృథా చేయకుండా, తాత్కాలిక ఆకర్షణలకు గురికాకుండా కోర్సుల్లో చేరి మొదటి రోజు నుంచే కష్టపడి చదువుతూ నైపుణ్యాలు పెంచుకుని పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు బాగా లభిస్తున్నాయి. తమ ప్రతిభతో పోటీ పరీక్షల్లో సత్తా చాటి జాతీయస్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి ప్రముఖ విద్యాసంస్థల్లో చేరుతున్నారు. అనంతరం ప్రముఖ సంస్థల్లో కొలువు సాధించి కన్నవారికి గౌరవాన్ని తెచ్చిపెడుతున్నారు. సెల్‌తో జాగ్రత్త సెల్‌ఫోన్‌ను విజ్ఞానం పెంచుకోవడం కన్నా వినోద అవసరాలకే ఎక్కువగా వాడుతున్నారు. అర్ధరాత్రి దాటే వరకు సినిమాలు, వీడియోలు చూస్తున్నారు. రాత్రుళ్లు సరిగ్గా నిద్ర పోకుండా తరగతి గదిలో ఏకాగ్రత కొరవడి అధ్యాపకులు చెప్పిన పాఠాలు సక్రమంగా వినలేకపోతున్నారు. వ్యసనాలు వద్దు మద్యం తాగుతూ షికార్లు చేస్తూ కళాశాలలకు డుమ్మా కొడుతున్నారు. చదువును అశ్రద్ధ చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ప్రా ణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వ్యసనాలకు బానిసలై ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోవాలి ఇంటర్ వరకు కొంత నియంత్రణ ఉంటుంది. అనంతరం ఇంజినీరింగ్, ఎంబీబీఎస్, బీఎస్సీ, ఫార్మసీ, డిగ్రీ కోర్సుల్లో చేరుతున్నారు. విద్యార్థులకు ఎక్కువగా స్వేచ్ఛ లభించే దశ ఇదే. దీన్ని సద్వినియోగం చేసుకునే వారు బాగా చదివి తల్లిదండ్రులు గుర్వించేలా ఉన్నత శిఖరాలకు చేరుకుంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఆకర్షణీయమైన వేతనాలతో ఉద్యోగం సాధిస్తున్నారు. సొంతంగా వ్యాపారాలు ప్రారంభించి జీవితంలో విజేతలుగా నిలుస్తున్నారు. ఇదంతా నాణేనికి ఒక వైపు అయితే రెండో వైపు స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ తాత్కాలిక ఆనందాలకు ప్రాధాన్యమిస్తూ చదువుపై శ్రద్ధ చూపకుండా విద్యార్థులు దారి తప్పుతున్నారు. ఆకర్షణను ప్రేమగా భావించి చదువును పాడు చేసుకుంటున్నారు. ప్రేమను తిరస్కరించారని దాడులు చేయడం లేదా.. బలవన్మరణానికి పాల్పడడం జరుగుతోంది. పక్కదారి పడితే అంధకారమే యుక్తవయసులో హార్మోన్ల ప్రభావం ఎక్కువగా ఉండి విద్యార్థులు దారి తప్పే అవకాశం అధికంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు పిల్లల నడవడికను గమనిస్తూ తప్పు మార్గంలో వెళ్లకుండా చూడాలి. కొంచెం ఎక్కువ సమయమే కేటాయించి వారి వ్యవహార శైలి పర్యవేక్షించాలి. నాలుగు నుంచి ఆరేళ్లు కష్టపడి చదివితే బంగారు భవిష్యత్తు లభిస్తుందనే విషయాన్ని పిల్లలకు వివరించి చెప్పాలి. –డాక్టర్ కృష్ణప్రశాంతి, సీనియర్ జనరల్ ఫిజిషియన్ సెల్‌ఫోన్‌కు దూరంగా ఉంచాలి విద్యార్థులు సెల్‌ఫోన్‌కు బానిసలవుతున్నారు. ఎంత తక్కువగా వాడితే అంత మంచిది. పిల్లలను కళాశాలలో చేర్పించి ఇక తమ బాధ్యత తీరిందని తల్లిదండ్రులు భావించకూడదు. నెలలో కనీసం రెండుమార్లయినా కళాశాలకు వెళ్లి అధ్యాపకులతో మాట్లాడి విద్యార్థి గురించి తెలుసుకోవాలి. అవసరాలకు మించి డబ్బు ఇవ్వకూడదు. స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల గురించి పిల్ల లకు వివరిస్తుండాలి. –ఎం.కృష్ణయ్య, ఇంటర్ ప్రాంతీయ పర్యవేక్షణాధికారి(ఆర్ఐఓ) గారాబం పనికిరాదు పిల్లలను అతిగా గారాబం చేయకూడదు. ఇదే వారు పాడవడానికి కారణమవుతుంది. నాయకత్వ లక్షణాలు, నైతిక విలువలు పెంపొందించుకునేలా, పెద్దలను గౌరవించడం, మంచి స్నేహితుల అవసరాన్ని తెలుసుకునేలా చూడాలి. –ప్రకాష్‌బాబు, ప్రిన్సిపాల్, ఎస్పీబ్ల్యూ జూనియర్ కళాశాల -
వ్యసనాలకు బానిసలు కావొద్దు
గోదావరిఖని ఏఎస్పీ విష్ణు ఎస్ వారియర్ సెంటినరీకాలనీ : ఎంతో గొప్ప భవిష్యత్ కలిగిన విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని గోదావరిఖని ఏఎస్పీ విష్ణు ఎస్ వారియర్ సూచించారు. సెంటినరీకాలనీలోని మంథని జేఎన్టీయూ కళాశాలలో సోమవారం విద్యార్థులో నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి ఆయన ముఖ్య అథితిగా హాజరయ్యారు. రానున్న కాలంలో విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిష్యత్ ఉంటుందన్నారు. ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకునే వరకు కఠోర దీక్షతో కృషి చేయాలన్నారు. అప్పుడే లక్ష్యం నెరవేరి ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని వివరించారు. ర్యాగింగ్, గంజాయి, అల్కహాల్లకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. తమపై తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలను అడియాశలు చేయవద్దని ఆయన సూచించారు. ఈ కార్యాక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ శ్రీధర్‌రెడ్డి, సీఐ దేవారెడ్డి, ఎస్సై ప్రదీప్‌కుమార్, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఈ మందుతో చెడు అలవాట్లు దూరం
న్యూయర్క్: పలు రకాల మత్తు పదార్థాలకు బానిసలై వాటి నుంచి బయటపడలేకపోతున్న బాధితులు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారందరికీ ఒక శుభవార్త. రక్తపోటును అదుపులో ఉంచడానికి ఉపయోగించే ఇస్రాడైపైన్ అనే ఔషధం కొకైన్, ఆల్కహాల్.. దురలవాట్లను మాన్పించేందుకు కూడా సమర్థవంతంగా ఉపయోగపడుతుందని న్యూయార్క్ శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇలాంటి అలవాట్లకు అనుకూలంగా మెదడుపై పడిన ముద్రలను చెరిపేసి.. ఆ అలవాట్లను దూరం చేసేలా ఈ ఔషధం పనిచేస్తుందని టెక్సాస్ విశ్వవిద్యాలయానికి చెందిన న్యూరో సైంటిస్ట్ హితోషి మొరికవా వెల్లడించారు. దీన్ని తొలిసారిగా ఎలుకలపై ప్రయోగించగా సత్ఫలితాలు వచ్చాయని అన్నారు. మెదడులోని నరాల పనితీరు, జ్ఞాపకశక్తి పెరుగుదలకు కూడా ఈ మెడిసిన్ దోహదపడుతోందని చెప్పారు. -
చెడు అలవాట్లు వదలించుకోండిలా..!
లండన్: పొరపాటుగా మీ జీవితంలోకి వచ్చిన చెడు అలవాట్ల నుంచి బయటపడటం మీకు సవాలుగా మారిందా! వాటివల్ల దుష్ప్రవర్తన అలవడిందా.. ఆ ప్రవర్తన నుంచి బయటపడేందుకు ఏమైనా పరిష్కారా మార్గాలుంటే బాగుండు అని అనుకుంటున్నారా.. అయితే లండన్ కు చెందిన హైపోధెరపిస్ట్, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ మాస్టర్ ప్రాక్టీసనర్ జాస్మిన్ పిరన్ దురలవాట్లు మానుకునేందుకు కొన్ని చెప్పారు. అవి ⇒ సాధరణంగా ప్రవర్తనను మార్చుకోవాలని చూసుకునే వారు పుట్టిన రోజుకోసమో లేదా సోమవారం నుంచనో, లేక కొత్త సంవత్సరం రోజో అని నిర్ణయించుకుంటారు. ఎప్పుడంటే అప్పుడు మనసులో బలంగా భీష్మించుకొని మననం చేసుకోవాలి. ⇒ దురలవాటు అని మనకు మనం గుర్తించినప్పుడు అది పొగతాగడంలాంటిదైనా సరే.. పక్కవారి మాటలు వినకుండా మనకు మనమే ప్రాధాన్యం ఇచ్చుకోవాలి. ⇒ మానడానికి కారణమైన పాజిటివ్ ఆలోచనలు జాబితాగా రాసుకోవాలి. వాటిని మననం చేసుకోవాలి ⇒ ముందు చాలా ఓపికగా ఉండి.. చిన్న స్థాయి మార్పు నుంచి భారీ స్థాయిలో మార్పు తెచ్చుకోవాలి. ఇందుకోసం రోజు ఆ సమయంలో సాధన చేయాలి ⇒ మనసులో పుట్టుకొచ్చే ఆ దురలవాటుకు చెందిన భావోద్వేగాలను ఒకసారి సునిశితంగా పరిశీలించాలి. ⇒ ప్రతి రోజూ వస్తున్న మార్పును గమనించాలి. ⇒ ఎంతో కొంత మార్పు వస్తుంటే ఎవరిని వారే ప్రోత్సాహించుకుంటూ రివార్డులు ఇచ్చుకోవాలి. -
అన్నను చంపిన తమ్ముడు
* చెడు అలవాట్లను అడ్డుకున్నందుకు.. * కాల్ రికార్డ్స్ ఆధారంగా హత్య కేసు ఛేదింపు బాన్సువాడ : తనకు ఉన్న చెడు అలవాట్లను అడ్డుకుంటున్న అన్ననే హతమార్చాడు ఓ ప్రబుద్ధుడు. అన్నపై గడ్డపారతో దారుణంగా దాడి చేసి హతమార్చిన తమ్ముడు, శవాన్ని తన స్నేహితుని సహాయంతో స్కూటర్‌పై తీసుకెళ్ళి పాడుబడ్డ బావిలో పడేశాడు. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించగా, పోలీసులు చాకచక్యంగా నిందితుడిని పట్టుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి బుధవారం విలేకరులకు వెల్లడించారు. పట్టణంలోని ఎర్రమన్నుకుచ్చలో నివసించే ఉల్లెపు సాయిలుకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఉల్లెపు సాయిలు (24) దినసరి కూలీగా పని చేయగా, చిన్న కుమారుడు ఉల్లెపు పాపయ్య (22) జులాయిగా తిరిగేవాడు. తనకు ఆటో కొనివ్వాలని తండ్రిని పలుమార్లు కోరాడు. అయితే అతని అన్న సాయిలు అడ్డుకొని, ఆటో కొని ఇచ్చినా సంపాదించడని, జులాయిగానే తిరుగుతాడని తండ్రికి చెప్పాడు. ప్రతి పనిలో తనను తన అన్న అడ్డుకొంటున్నాడని కోపోద్రిక్తుడైన పాపయ్య, అన్నను హతమార్చడానికి పథకం పన్నాడు. గత నెల 30న తండ్రి సాయిలు, వ్యక్తిగత పని నిమిత్తం భార్యతో కలిసి ఆర్మూర్‌కు వెళ్ళగా, ఇంట్లో కేవలం అన్నదమ్ములు మాత్రమే ఉన్నారు. దీంతో రాత్రి ఒంటిగంట ప్రాంతంలో పాపయ్య గడ్డపారతో అన్న వీపుపై, వృషణాలపై తీవ్రంగా చితకబాదాడు. అనంతరం ఉరి వేసి హతమార్చాడు. శవాన్ని బీడీవర్కర్స్ కాల నీలో ఉన్న పాడుబడ్డ బావిలో తన స్నేహితుడైన నాగరాజు సహాయంతో పడేసి ఇంటికి వచ్చారు. తల్లిదండ్రులు మరుసటి రోజు ఇంటికి రాగా, సాయిలు లేకపోవడంతో ఆందోళన చెందారు. నాలుగురోజుల తరువాత తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కొడుకు కోసం ఎంత వెతికినా కనబడకపోవడంతో, నిందితుడైన చిన్న కొడుకు , అన్నయ్య శవం బీడీవర్కర్స్ కాలనీలోని బావిలో ఉందని చెప్పాడు. దీంతో లబోదిబోమంటూ తల్లిదండ్రులు ఈనెల 9న శవాన్ని కనుగొని, పోలీసులకు సమాచారం అందించారు. ఇది ఆత్మహత్య కాదని, హత్యేనంటూ తండ్రి అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు చా కచక్యంగా కేసు ను విచారించారు. తమ్ముడైన పాపయ్యపైనే అనుమానాలు రావడంతో అతని కాల్రికార్డ్స్ను పరిశీలించారు. అలాగే మృతుడి సెల్‌ఫోన్‌ను చంపిన మరుసటిరోజే రియాజ్ అనే వ్యక్తికి పాపయ్య విక్రయించినట్లు తేలింది. దీంతో హత్య ఇతనే చేశాడనే కోణంలో విచారణ జరుపగా, వాస్తవాలు బయటపడ్డా యి. నిందితుడైన పాపయ్యను, అతని మిత్రుడైన నాగరాజును అదుపులోకి తీసుకొని విచారణ జరుపగా, తామే హత్య చేసినట్లు అంగీకరించారు. ప్రతీ పనిలోనూ తనను అడ్డుకొంటున్నందుకే హత్య చేశానంటూ పాపయ్య పేర్కొన్నాడు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. -
స్నేహితులుంటే... దురలవాట్లు దూరం!
స్నేహాల వల్ల దురలవాట్లు వస్తాయనేది పాతమాట... సరైన స్నేహితులు లేకపోవడం కూడా దురలవాట్లకు దారితీయవచ్చనేది పరిశోధకులు చెప్పిన కొత్తమాట! మనసుకు దగ్గరైన స్నేహితుడితో కాసేపు గడిపినా, సరదాగా ముచ్చటించినా మనకు కలిగే ఆనందం అలాంటిలాంటిది కాదు. ఈ బిజీ లైఫ్‌లో ఎంతో ఊరటనిచ్చే శక్తి స్నేహితులకు ఉంటుంది. అయితే మనసుకు మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా స్నేహం ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు బ్రిగ్హమ్ యంగ్యూనివర్సిటీ అధ్యయనకర్తలు. ప్రతిమనిషికీ కొంత మంది మంచి స్నేహితులుంటారు. అయితే ఉద్యోగం కోసమో, నివాసం కోసమో కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు స్నేహితుల కొరత వస్తుంది. మనవాళ్లు ఎవరైనా దగ్గర ఉంటే బావుండుననే భావన మనసును మెలిపెడుతూ ఉంటుంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే కొత్త అలవాట్లు అలవడే అవకాశం కూడా ఉంటుందని అధ్యయనకర్తలు అంటారు. ఒంటరితనం, మనసులోని మాట చెప్పుకోవడానికి మరో మనిషి లేకపోవడం మందు, సిగరెట్లను స్నేహితులుగా చేసే అవకాశాలు కూడా ఉంటాయని అంటున్నారు. అందుకే కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడు వీలైనంత కలివిడిగా వ్యవహరించి, మన మనస్తత్వానికి సెట్ అయ్యే స్నేహితులను సంపాదించుకోవాలని వారు సూచిస్తున్నారు.