చెడు అలవాట్లు వదలించుకోండిలా..!
లండన్: పొరపాటుగా మీ జీవితంలోకి వచ్చిన చెడు అలవాట్ల నుంచి బయటపడటం మీకు సవాలుగా మారిందా! వాటివల్ల దుష్ప్రవర్తన అలవడిందా.. ఆ ప్రవర్తన నుంచి బయటపడేందుకు ఏమైనా పరిష్కారా మార్గాలుంటే బాగుండు అని అనుకుంటున్నారా.. అయితే లండన్ కు చెందిన హైపోధెరపిస్ట్, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ మాస్టర్ ప్రాక్టీసనర్ జాస్మిన్ పిరన్ దురలవాట్లు మానుకునేందుకు కొన్ని చెప్పారు.
అవి
⇒ సాధరణంగా ప్రవర్తనను మార్చుకోవాలని చూసుకునే వారు పుట్టిన రోజుకోసమో లేదా సోమవారం నుంచనో, లేక కొత్త సంవత్సరం రోజో అని నిర్ణయించుకుంటారు. ఎప్పుడంటే అప్పుడు మనసులో బలంగా భీష్మించుకొని మననం చేసుకోవాలి.
⇒ దురలవాటు అని మనకు మనం గుర్తించినప్పుడు అది పొగతాగడంలాంటిదైనా సరే.. పక్కవారి మాటలు వినకుండా మనకు మనమే ప్రాధాన్యం ఇచ్చుకోవాలి.
⇒ మానడానికి కారణమైన పాజిటివ్ ఆలోచనలు జాబితాగా రాసుకోవాలి. వాటిని మననం చేసుకోవాలి
⇒ ముందు చాలా ఓపికగా ఉండి.. చిన్న స్థాయి మార్పు నుంచి భారీ స్థాయిలో మార్పు తెచ్చుకోవాలి. ఇందుకోసం రోజు ఆ సమయంలో సాధన చేయాలి
⇒ మనసులో పుట్టుకొచ్చే ఆ దురలవాటుకు చెందిన భావోద్వేగాలను ఒకసారి సునిశితంగా పరిశీలించాలి.
⇒ ప్రతి రోజూ వస్తున్న మార్పును గమనించాలి.
⇒ ఎంతో కొంత మార్పు వస్తుంటే ఎవరిని వారే ప్రోత్సాహించుకుంటూ రివార్డులు ఇచ్చుకోవాలి.