ఆల్కహాల్, స్మోకింగ్, డ్రగ్స్‌లాంటి దురలవాట్లకు బానిసలై చీకటి నింపుకుంటున్న కుటుంబాలు ఎన్నో. వీటినుంచి బయట పడాలంటే ఏం చేయాలి?! ఈ వ్యసనం కుటుంబాలలో రేపుతున్న చిచ్చును ఆర్పేదెలా?!పరువు పోతుందనే భయంతో సమాజంలో దాక్కుంటున్న మనుషుల్లో ధైర్యం నింపేదెలా?!సమస్యను దాచిపెడితే పెంచి ‘పోషించినట్టే. అందుకే, మనం మాట్లాడుకోవాల్సిందే వ్యసనంపై పోరాడటానికి..!
సమస్యను ఎదుర్కొంటున్న ఒక కుటుంబ కథనం,,,
‘బాబూ.. ఏమీ అనుకోకుండా ఈ బ్రాండ్ లిక్కర్ తెచ్చిపెట్టగలవా?!’ అ΄ార్ట్‌మెంట్ పైఫ్లోర్ నుంచి దిగుతున్న ఓ అపరిచిత అబ్బాయిని పిలిచి అడిగింది శారద (పేరుమార్చడమైనది). ఆ అబ్బాయి ఆమెను ఎగాదిగా చూశాడు. పక్క΄ోర్షన్ వాళ్లు చూస్తే ఏమనుకుంటారో అనే భయంతో.. ‘మా వారికి డ్రింక్ చేసే అలవాటుంది. ఎంతకీ మార్చుకోవడం లేదు. ఆయన్ని బయటకు వెళ్లనివ్వడం లేదు. నేనుగా ఆ వైన్ షాప్‌కి వెళ్లలేను. అందుకే అడుగుతున్నాను’ అంది బతిమాలుతున్నట్టుగా.
‘ఓ.. అలాగే తెచ్చిస్తాను’ అని డబ్బులు తీసుకొని వెళ్లి΄ోయాడు.
అతను తెచ్చిన బాటిల్‌ను ఎవరూ గమనించట్లేదని నిర్ధారించుకుని, థాంక్స్ చెప్పి లోపలికి తీసుకెళ్లింది.
కొన్నాళ్లుగా ఈ సమస్య కారణంగా నరకం చూస్తోంది శారద.
∙∙
శారద ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్. భర్తది కాలేజీలో లెక్చరర్‌గా ఉద్యోగం. ఇద్దరు పిల్లలు. చుట్టుపక్కల వారిలో గౌరవ మర్యాదలకు లోటు లేని కుటుంబం. ‘వాళ్లకేం.. ఇద్దరూ సం΄ాదిస్తున్నారు. చిన్న కుటుంబం చింతల్లేవు’ అంటుంటారు. నలుగురిలో ఎంతో గొప్పగా ఉండే తమ కుటుంబం నేడు దిగజారి΄ోయిన పరిస్థితి చూస్తూ కొన్నాళ్లుగా కంటిమీద కునుకు లేకుండా గడిపేస్తోంది.
మొదట్లో పార్టీలకు వెళ్లినప్పుడు కొద్దికొద్దిగా డ్రింక్ చేసేవాడు శారద భర్త.
వద్దని వారిస్తే ‘డ్రింక్ అనేది ఒక ΄ార్టీ కల్చర్, నలుగురిలో కలుపుగోలుగా ఉండాలంటే ఇలాంటివి పట్టించుకోవద్ద’ని చెప్పేవాడు.
‘నిజమే, కదా! దాదాపుగా చుట్టూ అందరూ అలాగే ఉన్నారు’ అనుకుంది శారద.
పిల్లల చిన్నప్పుడు తక్కువగానే ఉన్న ఈ డ్రింక్ అలవాటు, ఇప్పుడు వారికీ అన్నీ తెలిసే వయసు వచ్చేసరికి పెరిగింది.
΄ార్టీల నుంచి అలవాటు రోజూ రాత్రిపూట తీసుకోవడం, ఆ తర్వాత పగటికి కూడా మారింది. అదేమంటే, ఆరోగ్యంగా ఉండాలంటే ఆ మాత్రం తప్పదని కొన్నాళ్లు, బాధగా ఉందని, ఆనందంగా ఉందని, ఈ మాత్రమైనా ఉంటున్నాను కదా!’ అంటూ ఏదో ఒక వంకన తాగడం పెరిగింది.
పగటిపూట తాగి కాలేజీకి వెళితే, యాజమాన్యం డిస్మిస్ చేసింది. దీంతో జాబ్ ΄ోయిందనే ఆలోచన, డిప్రెషన్‌తో ఇంకా తాగడం పెరిగింది.
తాగి బయటకు వెళ్లినా, ఆ మత్తులో ఎవరితోనైనా గొడవ పెట్టుకున్నా నలుగురిలో పరువు ΄ోతుందని, తనే మందుబాటిళ్లు ఇంటికి తెచ్చిస్తాను, ఎక్కడకూ వెళ్లద్దు అని బతిమాలడం మొదలుపెట్టింది.
∙∙
ఇద్దరిలో ఒకరి స్పందన ఎలాగూ పోయింది. తన ఒక్కదాని సం΄ాదనతో ఇల్లు, పిల్లల ఫీజులు నెట్టుకొస్తోంది. దానికితోడు మందుకు కూడా డబ్బులు ఖర్చు పెట్టాలంటే కష్టంగా ఉంటుంది. కానీ, తప్పడం లేదు. పైగా, రోజు రోజూ భర్త ఆరోగ్య పరిస్థితి ఏమౌతుందో అని ఆందోళన పెరుగుతోంది.
∙∙
కొన్నాళ్లుగా బంధుమిత్రుల వేడుకలు, ΄ార్టీలకు వెళ్లడం బాగా తగ్గించేసింది. అదేమని అడిగితే ముఖ్యమైన పని ఉందని తప్పించుకుని తిరుగుతుంది. ఒక విధంగా స్వీయ సామాజిక బహిష్కరణకు గురైంది.
∙∙
΄పార్టీ ఉందని చెప్పి వెళ్లిన పెద్దబ్బాయి ఇంకా ఇంటికి రాక΄ోవడంతో ఆందోళన పడి΄ోయింది శారద. వచ్చాక వాడిని గమనిస్తే మందు వాసన వస్తోంది. అదేమని నిలదీస్తే.. ‘డాడీని ఏమీ అనవు. పైగా నువ్వే మందు తెప్పించి ఇస్తావు. నన్ను మాత్రం ఎందుకు తిడుతున్నావు!’ అని ఎదురు తిరిగాడు. ఆ మాటలతో తల తిరిగి΄ోయింది శారదకు. ఇంట్లో అందరివైపు బిక్కుబిక్కుమని చిన్నకొడుకు చూసే చూపులు ఆమెను పూర్తి అగాథంలోకి తోసేసినట్టుగా అనిపించాయి.
ఇలాంటి బయటికి చెప్పుకోలేని గాధలు మన చుట్టూ ఉన్నవారిలో ఎన్నో ఉన్నాయి.
– నిర్మలారెడ్డి
కుటుంబమంతా కలిసి...
బయట మద్యం అందుబాటులో ఉంటుంది కాబట్టి, వీళ్లు తాగుతున్నారు అని చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు. ఉదయం లేచిన దగ్గర నుంచి మన చుట్టూ మంచీ–చెడు అంశాలు ప్రతి దానిలోనూ చూస్తుంటాం. దేనిని మనం ఏ విధంగా తీసుకోవాలో మన మెదడు చేసే పనితీరును బట్టి ఉంటుంది. లోపం ఎక్కడ ఉందో గుర్తించి, దానికి విరుగుడు ఏంటా.. అని ఆలోచించడం మన ముందున్న అసలు కర్తవ్యం.
∙కుటుంబం అంతా వ్యసనంపై ΄ోరాటానికి సిద్ధం అన్నట్టుగా ఉండాలి.
∙చుట్టుపక్కల వాళ్లు ఏమనుకుంటారో, బంధుమిత్రుల్లో పరువు ΄ోతుందేమో అనే ఆలోచనకు తావివ్వకుండా ఈ సమస్య గురించి నలుగురితో చర్చించాలి.
∙అపార్ట్‌మెంట్, కాలనీ, సొసైటీ మీటింగ్స్ సమయాల్లో ‘మద్యం అలవాటు’ తప్పనిసరి టాపిక్ అయి ఉండాలి. సమస్య పరిష్కారానికి ఏం చేయాలి అనే ఆలోచనలు పంచుకోవాలి.
∙మద్యం తాగినప్పుడు బాగుంటుందనే ఆలోచన రావడమే సరైనది కాదు. ఇలాంటప్పుడు తమ ఆలోచనల్లోనే తేడాలు వస్తున్నట్టు గుర్తించి, ఇంట్లో వారికి చెప్పి, నిపుణుల సలహా తీసుకోవడం, కంట్రోలింగ్ పవర్‌ని పెంచుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
∙‘కుటుంబంలో ఉన్న అందరూ (పిల్లలు – పెద్దలు) క్రమశిక్షణ ΄ాటించాలి..’ అనే కఠిన నిర్ణయాన్ని అమలు చేయాల్సిందే.
∙ఇంట్లో ఎవరైనా మద్యం తాగుతున్నారు అంటే మొదట్లోనే అలెర్ట్ చేయాలి. కొన్నిసార్లు మాత్రమే కదా, వాళ్లే మారుతారులే అనే ఆలోచనా ధోరణిని దరి చేరనీయకూడదు. సమస్య పెరిగాక తగ్గిద్దామనుకుంటే ‘అలవాటు’ కుటుంబంలోని మిగతా వ్యక్తులపై దాడి చేయడానికి వెనకాడనీయదు. మద్యం తెచ్చుకోవడానికి డబ్బు లేక΄ోతే ఇంట్లో దొంగతనాలు చేయడం, వస్తువులను అమ్మడం, చావడం, చంపడం .. వంటి నేరాలకు దారులు తెరుస్తుంది. అందుకే, సమస్యను పెంచనీయకూడదు.
∙సమస్య గుర్తించిన వెంటనే ఫ్యామిలీ కౌన్సెలింగ్ తీసుకోవడం, నిపుణుల సలహాలు ΄ాటించడం అత్యవసరం.
ఇది ఒక జబ్బు అని గుర్తించాలి
నియంత్రణ కోల్పోవడం వ్యసనం ప్రధాన లక్షణం. నూటికి నూరు΄ాళ్లు నయం అవడం ఉండదు కానీ, నియంత్రణ కోల్పోకుండా చికిత్స చేయవచ్చు. మన మెదడు గుర్తించడం, గుర్తుపెట్టుకోవడం, గుర్తుచేయడం అనే మూడు విధాలుగా పనిచేస్తుంది. బ్రెయిన్‌లో డోపమైన్ కెమికల్ ఉంటుంది. మిగతా సమయాల్లో కంటే తాగినప్పుడు డోపమైన్ రసాయనాలు ఎక్కువ రిలీజ్ అవడంతో ఆనందం అధికంగా ఉంటుంది అనుకుంటారు. మత్తు దిగాక మళ్లీ మామూలే అవుతుంది. అందుకే, ఆ మందు మళ్లీ మళ్లీ తీసుకోవాలని, మోతాదు ఇంకా పెంచమనే బ్రెయిన్ సూచనల ప్రకారం మనిషి నడుచుకుంటాడు. అందుకే, మొదట్లో తక్కువ తాగే వారు కొన్నాళ్లకు డోసు పెంచుతూ ఉంటారు. తాగడానికి ఏవో కారణాలు చెబుతున్నారంటే సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. నిపుణుల సూచనలు తీసుకోవాలి.
– డాక్టర్ గిడియన్, డి–అడిక్షన్ థెరపిస్ట్, లివింగ్ సోబర్, హైదరాబాద్
పార్టీ ఉందని చెప్పి వెళ్లిన పెద్దబ్బాయి ఇంకా ఇంటికి రాక΄ోవడంతో ఆందోళన పడి΄ోయింది శారద. వచ్చాక వాడిని గమనిస్తే మందు వాసన వస్తోంది. అదేమని నిలదీస్తే.. ‘డాడీని ఏమీ అనవు. పైగా నువ్వే మందు తెప్పించి ఇస్తావు. నన్ను మాత్రం ఎందుకు తిడుతున్నావు!’ అని ఎదురు తిరిగాడు. ఆ మాటలతో తల తిరిగిపోయింది శారదకు. ఇంట్లో అందరివైపు బిక్కుబిక్కుమని చిన్నకొడుకు చూసే చూపులు ఆమెను పూర్తి అగాథంలోకి తోసేసినట్టుగా అనిపించాయి.
ఇలాంటి బయటికి చెప్పుకోలేని గాధలు మన చుట్టూ ఉన్నవారిలో ఎన్నో ఉన్నాయి.
– నిర్మలారెడ్డి
ఆశలు పెంచుతోంది..
చదువు ఉండి, నలుగురిలో ఎలా మెలగాలో తెలిసిన మేమే ఇలాంటి సమస్యతో బాధపడుతుంటే దీని తీవ్రత సమాజంలో ఎంత ఉందో అర్థమవుతుంది. ఒక తల్లిగా నా పిల్లలకు చెప్పలేక, టీచర్‌గా స్కూల్లో పిల్లలకు ఏ మంచీ బోధించలేక జీవితం శూన్యంగా అనిపించేది. ఓ రోజు నా ఫ్రెండ్‌తో చె΄్పాక సమస్యకు పరిష్కారం దొరికింది. థెరపిస్ట్‌లను కలిసి, అడిక్షన్ నుంచి నా కుటుంబాన్ని కా΄ాడుకోవాలని కృషి చేస్తున్నాను. ఇప్పుడు నా కుటుంబంలో వచ్చిన మార్పు భవిష్యత్తుపైన ఆశలు పెంచుతోంది.
– శారద, బాధితురాలు
Comments
Please login to add a commentAdd a comment