మద్యపానం ఆరోగ్యానికి హానీకరం అన్న విషయం తెలిసిందే. ఆల్కహాల్ తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, కాబట్టి దీనికి దూరంగా ఉండటమే బెటర్ అని ఇప్పటివరకు చాలాసార్లు వింటూ వచ్చాం. అయితే మద్యాపానంతో ఆరోగ్యమే అంటున్నారు నిపుణులు. కాస్త విడ్డూరంగా ఉన్నా ఇది నిజమే.
మితంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఆయుష్షు పెరుగుతుందని, గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్టడీ జరిపిన అధ్యయనంలో తేలింది. అంతేకాకుండా ఙ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందట. మితంగా మద్యపానం తీసుకోవడం కలిగే కలిగే లాభాలు ఏంటి? శరీరానికి ఆల్కహాల్ ఏ విధంగా మేలు చేస్తుందన్నది ఇప్పుడు చూద్దాం..
►మితిమించనిది ఏదైనా మంచిదే. ఆల్కహాల్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి ఎంత నష్టమో ప్రత్యేకంగా చెప్పనరక్కర్లేదు. కాలేయం దెబ్బతినడంతో పాటు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ మద్యం మితంగా తీసుకుంటే మంచిదే అని మీకు తెలుసా? సరైన పద్దతుల్లో మద్యం తీసుకుంటే శరీరానికి మంచే చేస్తుందట.
► మితంగా మద్యపానం తీసుకోవడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది.
► తక్కువ మొత్తంలో మద్యపానం తీసుకోవడం వల్ల ఆయుష్షు పెరుగుతుందట. 25% మరణాల రేటును ఇది తగ్గిస్తుంది.
► రెడ్ వైన్‌లో యాంటీ ఏజినింగ్ గుణాలు ఉంటాయి. చాలా తక్కువ మొత్తంలో ఇది తీసుకోవడం వల్ల చర్మం గ్లో పెరిగి యవ్వనంగా కనిపిస్తారు.
► వైన్ ద్రాక్ష తొక్కలో ఉండే రెస్వెరాట్రాల్ జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కాబట్టి కొద్దిగా వైన్ తీసుకోవడం మంచిదే అంటున్నారు నిపుణులు.
► బీర్, వైన్స్‌లో అధికమొత్తంలో సిలికాన్ ఉంటుంది. ఇది బలమైన, ఆరోగ్యకరమైన ఎముకలకు సహాయపడుతుంది.
► మితమైన మద్యపానం తీసుకోవడం వల్ల కొన్ని మానసిక ప్రయోజనాలు ఉన్నాయి.
► తక్కువ మొత్తంలో మద్యం తాగేవారికి కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం తక్కువట. అదే అధికంగా తీసుకుంటే డీహైడ్రేషన్‌కు గురై కిడ్నీల్లో రాళ్లు వచ్చే అవకాశం ఉంది.
గమనిక: మద్యపానం ఆరోగ్యానికి హానికరం. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అతి తక్కువ మొత్తంలో ఆల్కహాల్‌ను తీసుకుంటేనే ప్రయోజనకరం అన్నది ఈ ఆర్టికల్ సారాంశం. మద్యం సేవించడాన్ని ప్రోత్సహించడం మా ఉద్దేశం కాదు. గమనించగలరు.
Disclaimer: The information provided in this article is based on general information. Please contact the relevant expert before taking alcohol consumption.
Comments
Please login to add a commentAdd a comment