drinking habit
-
మద్యం కూడా మంచిదే బాసూ.. కానీ దానికీ ఓ లెక్కుంది
మద్యపానం ఆరోగ్యానికి హానీకరం అన్న విషయం తెలిసిందే. ఆల్కహాల్ తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, కాబట్టి దీనికి దూరంగా ఉండటమే బెటర్ అని ఇప్పటివరకు చాలాసార్లు వింటూ వచ్చాం. అయితే మద్యాపానంతో ఆరోగ్యమే అంటున్నారు నిపుణులు. కాస్త విడ్డూరంగా ఉన్నా ఇది నిజమే. మితంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఆయుష్షు పెరుగుతుందని, గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్టడీ జరిపిన అధ్యయనంలో తేలింది. అంతేకాకుండా ఙ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందట. మితంగా మద్యపానం తీసుకోవడం కలిగే కలిగే లాభాలు ఏంటి? శరీరానికి ఆల్కహాల్ ఏ విధంగా మేలు చేస్తుందన్నది ఇప్పుడు చూద్దాం.. ►మితిమించనిది ఏదైనా మంచిదే. ఆల్కహాల్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి ఎంత నష్టమో ప్రత్యేకంగా చెప్పనరక్కర్లేదు. కాలేయం దెబ్బతినడంతో పాటు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ మద్యం మితంగా తీసుకుంటే మంచిదే అని మీకు తెలుసా? సరైన పద్దతుల్లో మద్యం తీసుకుంటే శరీరానికి మంచే చేస్తుందట. ► మితంగా మద్యపానం తీసుకోవడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. ► తక్కువ మొత్తంలో మద్యపానం తీసుకోవడం వల్ల ఆయుష్షు పెరుగుతుందట. 25% మరణాల రేటును ఇది తగ్గిస్తుంది. ► రెడ్ వైన్‌లో యాంటీ ఏజినింగ్ గుణాలు ఉంటాయి. చాలా తక్కువ మొత్తంలో ఇది తీసుకోవడం వల్ల చర్మం గ్లో పెరిగి యవ్వనంగా కనిపిస్తారు. ► వైన్ ద్రాక్ష తొక్కలో ఉండే రెస్వెరాట్రాల్ జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కాబట్టి కొద్దిగా వైన్ తీసుకోవడం మంచిదే అంటున్నారు నిపుణులు. ► బీర్, వైన్స్‌లో అధికమొత్తంలో సిలికాన్ ఉంటుంది. ఇది బలమైన, ఆరోగ్యకరమైన ఎముకలకు సహాయపడుతుంది. ► మితమైన మద్యపానం తీసుకోవడం వల్ల కొన్ని మానసిక ప్రయోజనాలు ఉన్నాయి. ► తక్కువ మొత్తంలో మద్యం తాగేవారికి కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం తక్కువట. అదే అధికంగా తీసుకుంటే డీహైడ్రేషన్‌కు గురై కిడ్నీల్లో రాళ్లు వచ్చే అవకాశం ఉంది. గమనిక: మద్యపానం ఆరోగ్యానికి హానికరం. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అతి తక్కువ మొత్తంలో ఆల్కహాల్‌ను తీసుకుంటేనే ప్రయోజనకరం అన్నది ఈ ఆర్టికల్ సారాంశం. మద్యం సేవించడాన్ని ప్రోత్సహించడం మా ఉద్దేశం కాదు. గమనించగలరు. Disclaimer: The information provided in this article is based on general information. Please contact the relevant expert before taking alcohol consumption. -
తాగితే మా ఆయన చాలా క్రూరంగా బిహేవ్ చేస్తాడు.. ఏం చేయాలి?
వ్యసనాల బారిన పడిన వ్యక్తిని ఆ కుటుంబంలోని వారు మొదట్లో గుర్తించరు. తమ వాళ్లు మంచివాళ్లని, చెడు అలవాట్లకు బానిసలు కారని నమ్ముతారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు స్నేహితుల ప్రభావమో, మరొకటో అనుకుంటారు తప్ప సమస్యను పెద్దగా పట్టించుకోరు. ఈ సమస్యను ఫ్యామిలీ డినైల్ అంటున్నారు నిపుణులు. అడిక్షన్స్ గురించి అసలు మన కుటుంబాలు ఎంతవరకు అర్ధం చేసుకుంటున్నాయి..? ఎలాంటి నిర్ణయాలు అమలు చేస్తున్నాయి? ఈ అంశం పై ‘మనం మాట్లాడుకోవాల్సిందే!’ ► అపార్ట్మెంట్లో దాదాపు అన్ని ఫ్లాట్స్ ఒకేలా ఉంటాయి. ఒకబ్బాయి రాత్రి టైమ్‌లో బాగా తాగేసి తమ ఇల్లు అనుకొని, వేరేవాళ్ల ఇంటి బెడ్రూమ్కి వెళ్లి పడుకున్నాడు. ఆ ఇంట్లో వాళ్లు పెద్ద గొడవ చేశారు. ఆ అబ్బాయి వాళ్ల తల్లితండ్రులు తమ పిల్లవాడిని తిట్టకుండా ఏదో పొరపాటున జరిగి ఉంటుందంటూ ఆ కుటుంబంతో గొడవ పడ్డారు. ► ఫ్యామిలీ ఫంక్షన్‌కి భర్త రాలేదు. ‘ఏమైంది..’అని ఎవరైనా అడిగితే ఆరోగ్యం బాగోలేదు అంటారు. ఆ సదరు వ్యక్తి ఇంట్లో ఉండి తాగుతుంటాడు. ► మల్టిపుల్ అడిక్షన్స్‌కు అలవాటుపడిన ఓ అబ్బాయి వచ్చి కౌన్సెలింగ్ తీసుకుంటానంటే, తల్లి ఒప్పుకోలేదు. ‘నీకేమైంది, బాగానే ఉన్నావ్ కదా! పై చదువుల కోసం అమెరికా వెళుతున్నావ్. బాధ్యత తెలిస్తే సెట్ అవుతావులే’ అంటుంది. ► ఒక భార్య ‘మా ఆయన తాగినప్పుడు చాలా క్రూరంగా బిహేవ్ చేస్తాడు. మిగతా సమయాల్లో చాలా చాలా బాగుంటాడు’ అని సరిపెట్టుకుంటుంది. ► ‘మా వాడు చాలా మంచోడు సార్, చాలా జాగ్రత్తగా ఉంటాడు. మొన్ననే తాగి డ్రైవ్ చేయడం వల్ల యాక్సిడెంట్ అయ్యింది’ అంటాడు తండ్రి. ► కజిన్స్ రిలేటివ్ ఫంక్షన్లో ఒకబ్బాయి ఓవర్‌గా తాగాడు. మనవాడు కదా అని మరుసటి రోజు తల్లికి ఫోన్ చేసి ‘అక్కా, మీ అబ్బాయి పార్టీలో ఓవర్‌గా తాగాడు’ అని చెబితే ‘మా అబ్బాయి అలాంటోడు కాదు, ఫ్రెండ్స్, కజిన్స్ బలవంతం చేసుంటారు’ అని వెనకేసుకొచ్చింది. విషయం చెప్పిన వ్యక్తితో మాట్లాడటమే మానేసింది. బంధుమిత్రులు ఎవరైనా ‘మీ అబ్బాయి తాగుతుండగా ఫలానా చోట చూశాం’ అని చెబితే వాళ్లతోనూ మాట్లాడటం మానేసింది. ఒకసారి కాలేజీలో గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డాడు. తల్లిదండ్రులని పిలిస్తే ‘మా అబ్బాయిని కావాలనే బ్లేమ్ చేస్తున్నారు. మీదే అసలు సమస్య అనేసింది.’ ఇలాంటి సమర్థింపులు ఎన్నో .. ఎన్నెన్నో మీకూ తెలిసే ఉంటాయి. వెరీ డేంజర్!! చాలామంది పేరెంట్స్ తమ పిల్లలు వ్యసనాల బారినపడ్డారనే విషయం తెలిసినా వారు ఒప్పుకోరు. వ్యసనపరులకు కుటుంబాల నుంచి ఇలాంటి రక్షణ దొరికితే ఎప్పటికీ మార్పు రాదు సరికదా సర్దుకుపోవడం, కొట్టిపారేయడం చేస్తుంటే మీ కుటుంబం బీటలు వారడానికి సిద్ధంగా ఉందని గ్రహించాల్సిందే! అడిక్షన్ వెరీ వెరీ డేంజర్ డిసీజ్. ఈ సందర్భంలో కుటుంబంలో ఎవరిలోనైనా అడిక్షన్స్‌కు సంబంధించిన లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స చేయించడం మేలు. ధైర్యమే ఆయుధం వ్యసనాల బారిన పడ్డవారు నమ్మబలికే మాటలు చెబుతారు. సంఘటన తర్వాత ‘సారీ..’ అనేస్తారు. చిన్న చిన్న కానుకలు ఇచ్చి, తమ లోపాన్ని కప్పిపుచ్చుకునేవారుంటారు. దీంతో అమ్మ/భార్య/అక్క/ మన వాళ్లే కదా, మన పిల్లలే కదా.. మరోసారి ఇలా చేయరులే అనుకుంటారు. ఇదే విధమైన ప్రవర్తన కొన్నాళ్లకు ముదిరి ఇంట్లో భయోత్పాతాలను సృష్టిస్తుంటారు. కుటుంబం ప్రవర్తన మారాల్సిందే! కొడుకు/కూతురు/హజ్బెండ్/ఫాదర్ కి అడిక్షన్ పట్ల సపోర్ట్ ఇవ్వకూడదు. ఇంట్లో డబ్బులివ్వకపోతే బయట అప్పులు చేస్తారు. పదివేలు, ఇరవైవేలు అప్పు చేసినప్పుడు ఎవరైనా ఇంటి మీదకు వస్తే కుటుంబంలో ఉన్నవారిని బెదిరియ్యకుండా ఆ అప్పు తీర్చేస్తారు. సదరు వ్యక్తికి ఇబ్బంది కలగనీయకుండా అడ్డుగా నిలబడతారు. ఆ సమస్యను ఫేస్ చేయనీయకుండా వెనకేసుకొస్తారు. కాలేజీలో సమస్య వచ్చినా, మరోచోట సమస్య వచ్చినా తల్లిదండ్రులు కొడుకును కాపాడటానికి ట్రై చేస్తారు. దీనివల్ల పిల్లవాడు మరిన్ని తప్పులు చేసేలా ఆ కుటుంబంలోని వారు ప్రోత్సహిస్తున్నట్లే. మందలించాల్సిందే! ముందు తప్పించుకోవడం, సర్దుబాటు చేసుకోవడం నుంచి కుటుంబాల్లో ఉన్నవారు బయటకు రావాలి. కౌన్సెలింగ్ సమయంలో ముఖ్యంగా ఆడవాళ్లకు బలంగా ఉండాలని చెబుతాం. గట్టిగా మందలించమని చెబుతాం. ‘ఇది మా వ్యక్తిత్వం కాదు కదా’ అంటారు. కానీ, మంచితనాన్ని అలుసుగా తీసుకుంటున్నారు అని గుర్తించరు. సమస్యను భరిస్తూ ఉంటే ఏదో ఒక రోజున మిమ్మల్ని వ్యసనపరులు నిస్సహాయ స్థితికి తీసుకెళతారు. కుటుంబం బలంగా ఉండాలంటే మేజర్ రోల్ భార్య/తల్లిదే. ఆమె గట్టిగా ఉండాల్సిందే. కుటుంబం బాగుండాలంటే మంచిగవ్వాల్సిందే! అని చెప్పాలి. ఒకతను ఆల్కహాల్/ డ్రగ్స్ వాడుతున్నాడంటే అతని మైండ్ నిలకడగా లేదని అర్ధం చేసుకోవాలి. ఫ్రెండ్స్, రిలేటివ్స్, శ్రేయోభిలాషుల సాయంతోనైనా సమస్యను చక్కదిద్దాలి. ‘థెరపీ అవసరం లేదు, సదరువ్యక్తికి తెలియకుండా మందులు ఇప్పిద్దాం’ అనుకుంటారు. కానీ, యాంటీ క్రేవింగ్ మెడిసిన్స్ వాడటం వల్ల బ్రెయిన్‌కి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల కొత్త సమస్యలు పుట్టుకు రావచ్చు. అవగాహన, బిహేవియరల్ థెరపీ ద్వారానే పరిష్కరించాల్సి ఉంటుంది. ముందుగా కుటుంబాల వాళ్లు... 1. ఇదొక వ్యసనం అని అంగీకరించాలి. 2. పూర్తి చికిత్స ప్రాముఖ్యాన్ని అర్ధం చేసుకోవాలి. 3. చికిత్సకు కావాల్సినంత టైమ్ ఇవ్వాలి. నలుగురిలో తెలిస్తే పరువు పోతుందని భయపడుతుంటారు. ఏదైనా అనారోగ్యం చేస్తే హాస్పిటల్‌కు ఎలా వెళతామో సైకలాజికల్ సమస్య వస్తే అందుకు సంబంధించిన డాక్టర్ని కలవడానికి ఇబ్బంది పడకూడదు. – డాక్టర్ గిడియన్, డి–అడిక్షన్ థెరపిస్ట్ -
మద్యం తాగుతారా? నెటిజన్ ప్రశ్నకు శ్రుతీహాసన్ సమాధానమిదే!
తమిళసినిమా: ఇండియన్ సినిమాలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి శ్రుతీహాసన్. ఈమె జీవితం తెరిచిన పుస్తకం అని చెప్పవచ్చు. విశ్వనటుడు కమల్‌హాసన్ వారసురాలు అయిన ఈమె హిందీ చిత్రంతో కథానాయకిగా నట జీవితాన్ని ప్రారంభించి ఆపై తెలుగు, తమిళం అంటూ తన స్థాయిని విస్తరించుకుంటూ వచ్చారు. ముఖ్యంగా తెలుగులో శ్రుతీహాసన్ లక్కీ హీరోయిన్. దాదాపు అక్కడ సక్సెస్ అయ్యాయి. ప్రస్తుతం ప్రభాస్‌కు జంటగా సలార్ అనే భారీ చిత్రంలో నటిస్తున్నారు. తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో త్వరలో తిరిగి రావడానికి ముస్తాబవుతుంది. కాగా శ్రుతీహాసన్ గురించి రకరకాల ప్రచారం జరుగుతుంది. పండ్లు ఉన్న చెట్టుకే దెబ్బలు అన్ని సామెత మాదిరి శ్రుతీహాసన్ సినీ వ్యక్తిగత జీవితాల గురించి ఎవరికీ తోచింది వారు రాస్తుంటారు. ప్రచారం చేస్తుంటారు. (చదవండి: కోలీవుడ్ సూపర్‌స్టార్ ఎవరు?) ఇవి కూడా ఎవరూ ఎలాంటి ప్రశ్న వేసినా చాలా బోల్డ్‌గా బదులిస్తుంటారు తన బాయ్‌ఫ్రెండ్‌తో కూడా బహిరంగంగా తిరిగే నటి శ్రుతీహాసన్. ఎందుకంటే ఈమె పుట్టి పెరిగిన వాతావరణం అలాంటిది. తమ తల్లిదండ్రులు తమకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారని, అలాగని వారికి గౌరవానికి తలవంపులు తెచ్చే ఎలాంటి పనిని తాను చేయనని చెబుతారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే తరుచూ అభిమానులతో ఆన్లైన్లో ముచ్చటించే శ్రుతీహాసన్ ఇటీవల ఇన్‌స్ట్రాగామ్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు బదులు ఇచ్చి వారిని ఖుషీ చేశారు. ఈ సందర్భంగా ఒక అభిమాని మీరు మద్యం తాగుతారా? అన్న ప్రశ్న లేదు తాను మద్యం తాగాను, మాదకద్రవ్యాలు కూడా తీసుకోను అంటూ బదులిచ్చారు. అంతేకాకుండా తాను జీవితాన్ని హుందాగా గడిపే నటినని స్పష్టం చేసింది. దటీజ్ శ్రుతిహాసన్ అని మరోసారి నిరూపించుకున్నారు. -
భార్య హత్యకు స్కెచ్.. ఊహించని పరిణామంతో పరుగులు
ఆ తాగుబోతు భర్తతో రోజూ ఆమెకు గొడవే. ఇక భరించలేక పుట్టింటికి వెళ్లిపోయింది. అది అవమానంగా భావించి.. ఆమెను ఎలాగైనా చంపాలని ప్లాన్ వేశాడు. చివరికి ఆ భర్తకే పెద్ద షాకే తగిలింది. భార్యకు బదులుగా ఆమె తల్లి కన్నుమూసింది. దీంతో ఆ భర్త అక్కడి నుంచి పరుగులు అందుకున్నాడు. మధ్యప్రదేశ్ బేతుల్ జిల్లా కోట్వాలి స్టేషన్ పరిధిలోని సైఖేదా గ్రామంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. నిత్యం తాగుతూ ఉండే ఆ భర్త.. రోజూ భార్యతో గొడవ పడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి కూడా ఇద్దరూ గొడవ పడ్డారు. భర్తను భరించలేక.. నానా తిట్లు తిట్టి ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో కోపం పెంచుకున్న ఆ తాగుబోతు.. అత్తింటికి వెళ్లి మరీ భార్యను చంపాలని అనుకున్నాడు. సోమవారం సాయంత్రం అత్తింటికి వెళ్లి.. బయట ఉన్న ఇనుప గేటుకు కరెంట్ వైర్లను కనెక్ట్ చేశాడు. అయితే భార్య బదులు ఆమె తల్లి వచ్చి గేట్‌ను ముట్టుకుంది. దీంతో కరెంట్ షాక్‌తో విలవిలలాడి అక్కడికక్కడే ఆ మహిళ(55) మృతి చెందింది. అది చూసి స్థానికులు కేకలు వేయగా.. ఊహించని పరిణామంతో భయాందోళనకు గురై ఆ భర్త అక్కడి నుంచి పారిపోయాడు. దర్యాప్తులో అసలు విషయం వెలుగు చూడగా.. పరారీలో ఉన్న తాగుబోతు భర్త గురించి పోలీసులు వెతుకుతున్నారు. ఇదీ చదవండి: గంజాయికి బానిసైన కొడుకు.. నల్లగొండలో దారుణ హత్య -
తాగుడు మానేయాలని చెప్పిన భార్యను చపాతీ చేస్తుండగా..
అనంతపురం క్రైం: కుటుంబ కలహాల కారణంగా కట్టుకున్న భర్తనే కాలయముడయ్యాడు. ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ మురళీధర్‌రెడ్డి తెలిపిన మేరకు... నగర శివారులోని పిల్లిగుండ్ల కాలనీలోని ఉషాకృష్ణ సాయి కాంప్లెక్స్‌లో ఎర్రిస్వామి, వరలక్ష్మి దంపతులు నివసిస్తున్నారు. వీరికి మహేష్ (12), నీలిమ (10), శశిధర్ (7) ముగ్గురు సంతానం. గృహ నిర్మాణ పనులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈ క్రమంలో ఎర్రిస్వామి మద్యానికి బానిసయ్యాడు. తాగుడు మానాలంటూ భార్య ప్రాధేయపడుతూ వచ్చేది. సోమవారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి చేరుకున్న ఎర్రిస్వామి భార్యతో ఘర్షణ పడ్డాడు. పిల్లలు ఆకలితో బాధపడుతుంటే వారికి చపాతీలు చేసేందుకు వరలక్ష్మి (30) సిద్ధమైంది. ఆ సమయంలో సుత్తితో వరలక్ష్మి ముఖంపై ఎర్రిస్వామి దాడి చేశాడు. సుత్తి దెబ్బకు ఆమె ముఖం ఛిద్రమై కుప్పకూలింది. ఆమె మరణించినట్లు ధ్రువీకరించుకున్న అనంతరం ఎర్రిస్వామి అక్కడి నుంచి పారిపోయాడు. ఆ సమయంలో బయట ఆడుకుంటున్న కుమారుడు శశిధర్.. ఏమో జరిగిదంటూ ఇంటిలోకి వెళ్లి చూశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న తల్లిని చూసి బోరున విలపిస్తూ బయటకు వచ్చాడు. చుట్టుపక్కల వారు గమనించి, సమాచారం అందించడంతో డీఎస్పీ వీరరాఘవరెడ్డి, సీఐ మురళీధర్‌రెడ్డి అక్కడకు చేరుకుని పరిశీలించారు. క్య్లూస్ టీంను రంగంలో దింపి ఆధారాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
మద్యపానం గుట్టు తెలిసింది!
వాషింగ్టన్: మద్యం సేవించడం మంచిదా, కాదా? అన్న అంశాన్ని పక్కన పెడితే మద్యం ప్రియత్వానికి, మానవుల జన్యువులకు విడదీయలేని అవినాభావ సంబంధం ఉందని యేలే యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వారానికి 14 యూనిట్లకు మించి మద్యం సేవించే 4, 35,000 మందిని ఎంపిక చేసి, వారి డీఎన్ఏలేని జన్యువులను శాస్త్రవేత్తలు పరీక్షించగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మద్యం ప్రియులందరిలోనూ 29 రకాల జన్యువులు ఒకే రీతిగా ఉన్నాయని తేలింది, అంటే మద్యం తాగడానికి జన్యువులకు సంబంధం ఉందన్నమాట. (ఇకపై ఫోన్లు పనిచేయవ్... కారణం?) ‘ఆల్కహాల్ జెనెటిక్ రిస్క్ ఫ్యాక్టర్స్’గా వ్యవహరించే మద్యం ప్రియుల్లో ఉండే జన్యువులు తర్వాత తరానికి కూడా సంక్రమిస్తాయని ఈ అధ్యయనంలో తేలినట్లు శాస్త్రవేత్తలు తెలియజేశారు. మద్యం పుచ్చుకుంటే సంతోషకర భావనలను మెదడు పెంచుతుందని భావించి మద్యం పుచ్చుకోవడం, పుచ్చుకున్నాక అలాంటి భావనలు పెరిగాయని విశ్వవించడం వల్ల మనుషులు మద్యానికి అలవాటు పడతారని ఇంతకుముందు శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. మద్యం గురించి ఆలోచించడం వల్ల మెదడులో ఉత్పత్తయ్యే కొన్ని రసాయనాలు కూడా మద్యం వైపు ఆలోచనలను తీసుకెళుతుందని కూడా చెప్పారు. ఇప్పుడు మద్యం అలవాటుకు, జన్యువులకు నేరుగా సంబంధం ఉన్న విషయం ఈ అధ్యయనం ద్వారా తెలుస్తోందని అధ్యయనంలో పాల్గొన్న యూనివర్శిటీ సైకియాట్రీ విభాగంలో అసోసియేట్ రిసర్చ్ సైంటిస్ట్ హాంగ్ ఝౌ చెప్పారు. పర్యావరణ, సామాజిక సంబంధాలు కూడా మద్యం ప్రియత్వానికి దారితీస్తాయని ఆయన తెలిపారు. పబ్‌లు, బార్లకు సమీపంలో నివసించే వారిలో కూడా తాగాలనే కోరిక అనుకోకుండా పెరుగుతుందని కూడా ఆయన తెలిపారు. (హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్రయల్స్‌పై నిషేధం) -
పరి పరిశోధన
తాగుడును దూరం చేసే జన్యుమార్పులు! తాగుడు అలవాటును అధిగమించేలా మనిషి పరిణమిస్తున్నాడా? అవునంటున్నారు పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. నేచర్ ఎకాలజీ అండ్ ఎవల్యూషన్లో ప్రచురితమైన పరిశోధన వ్యాసం ప్రకారం.. మానవుల్లో ఏ రకమైన మార్పులు జరుగుతున్నాయో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం జరిపారు. ఇప్పటికే పూర్తయిన దాదాపు వెయ్యి జన్యుక్రమ ప్రాజెక్టుల సమాచారాన్ని ఇందుకోసం విశ్లేషించారు. వేర్వేరు ప్రాంతాలకు చెందిన 2500 మంది డీఎన్ఏ వివరాలను పరిశీలించినప్పుడు కొన్ని ఆసక్తికరమైన అంశాలు తెలిశాయి. ఆఫ్రికా సంతతి వ్యక్తుల్లో మలేరియా వ్యాధికి నిరోధకత పెరుగుతూండగా, యూరోపియన్లలో ఒక అమినో యాసిడ్‌లో మార్పులు నమోదయ్యాయి. అలాగే నియాండెర్తల్ జాతికి సంబంధించిన మానవులతో కలవడం వల్ల వచ్చిన రెండు డీఎన్ఏ ముక్కలు అలాగే ఉన్నట్లు తెలిసింది. చివరగా ఏడీహెచ్ అనే జన్యువులో వచ్చిన మార్పు. ఈ జన్యువు శరీరంలో ఆల్కహాల్ డీహైడ్రోజనేస్ అనే ఎంజైమ్ తయారీకి ఉపయోగపడుతుంది. ఇది మద్యాన్ని విడగొట్టి అసిటాల్డీహైడ్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ జన్యువులో వచ్చిన మార్పులు భవిష్యత్తులో శరీరాన్ని మద్యం ప్రభావం నుంచి రక్షించేదిగా ఉందని శాస్త్రవేత్తల అంచనా. మద్యాన్ని వేగంగా విడగొట్టడం ద్వారా తాగుబోతులకు జబ్బు పడిన అనుభూతిని ఇవ్వడం ద్వారా ఈ జన్యువు పనిచేస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. యాంటీబయాటిక్‌ల ప్రభావాన్ని పెంచే కార్బన్ మోనాక్సైడ్! కార్బన్ మోనాక్సైడ్ అనే వాయువు కారణంగా యాంటీబయాటిక్ మందుల ప్రభావం గణనీయంగా వృద్ధి చెందుతుందని జార్జియా స్టేట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అధ్యయన పూర్వకంగా చెబుతున్నారు. మెట్రోనైడజాల్ అనే యాంటీబయాటిక్‌కు కార్బన్ మోనాక్సైడ్‌ను జోడించి ప్రయోగించినప్పుడు హెచ్.పైలోరీ రకం బ్యాక్టీరియా వేగంగా నాశనమైందని వీరు జరిపిన ప్రయోగాల ద్వారా స్పష్టమైంది. కడుపులో పుండ్లు అయ్యేందుకు ఈ హెచ్.పైలోరీ కారణమవుతుందన్నది తెలిసిన విషయమే. కార్బన్ మోనాక్సైడ్‌తో కలిపి ఇచ్చినప్పుడు యాంటీబయాటిక్ ప్రభావం 25 రెట్ల వరకూ ఎక్కువగా ఉందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్ బింగే వాంగ్ తెలిపారు. బ్యాక్టీరియా యాంటీబయాటిక్‌కు స్పందించకపోవడం నిరోధకత కాదని, చాలా సందర్భాల్లో అవి మందులకు అలవాటుపడిపోవడం వల్ల యాంటీబయాటిక్స్ పనిచేయకుండా పోతాయని ఆయన వివరించారు. బ్యాక్టీరియాను మళ్లీ మందులకు సున్నితంగా మారిస్తే అవి వాటి ప్రభావాన్ని చూపుతాయని చెప్పారు. గాఢత ఎక్కువగా ఉండే విషంలా పనిచేసే కార్బన్ మోనాక్సైడ్‌ను అతి తక్కువ సాంద్రతల్లో వాడినప్పుడు మాత్రం చికిత్సకు ఉపయోగపడుతుందని తాము గుర్తించినట్లు చెప్పారు. శరీరంలో సహజసిద్ధంగా ఉత్పత్తి అయ్యే ఈ వాయువు వాపును తగ్గించడమే కాకుండా.. బ్యాక్టీరియా, వైరస్‌లకు కణాలు ప్రతిస్పందించే గుణాన్ని కూడా పెంచుతాయని చెప్పారు. కూల్‌డ్రింక్స్‌తో కేన్సర్ ముప్పు... చక్కెరలు ఎక్కువగా ఉండే కూల్‌డ్రింక్స్ తాగే అలవాటు ఉన్న వారికి ఊబకాయ సంబంధిత కేన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువని మెల్బోర్న్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనం ఒకటి తెలిపింది. దాదాపు 35 వేల మంది అలవాట్లను పరిశీలించి జరిపిన విశ్లేషణ ద్వారా కూల్‌డ్రింక్స్ 11 రకాల కేన్సర్లపై ప్రభావం చూపుతున్నట్లు తెలిసింది. ఇవన్నీ ఊబకాయానికి సంబంధించినవే అయినప్పటికీ అధ్యయనంలో పాల్గొన్న వారు మాత్రం ఊబకాయులు కాకపోవడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నిత్యం కూల్‌డ్రింక్స్ తాగేవారితో పోలిస్తే కృత్రిమ చక్కెరలతో కూడిన డైట్ కూల్‌డ్రింక్స్ తాగే వారికి వ్యాధి ముప్పు తక్కువగా ఉన్నట్లు తమ అధ్యయనం ద్వారా తెలిసిందని అలిసన్ హాడ్జ్ అనే శాస్త్రవేత్త చెబుతున్నారు. అధిక చక్కెర... ఊబకాయానికి, మధుమేహానికి దారితీయవచ్చునని ఇప్పటికే అనేక పరిశోధనలు స్పష్టం చేస్తూండగా.. కేన్సర్ కారకమన్న అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. గత ఏడాది జరిగిన ఒక పరిశోధనలో చక్కెరలు కేన్సర్ కణాలను ఎలా ప్రేరేపితం చేస్తాయో స్పష్టం అవడమే కాకుండా.. చక్కెరలు కణతి ఎదుగుదలకు తోడ్పడుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మెల్బోర్న్ యూనివర్శిటీ జరిపిన అధ్యయనం ప్రాధాన్యత సంతరించుకుంది. కేన్సర్ల నివారణకు చక్కెరలను పూర్తిస్థాయిలో త్యజించడమూ అంత మంచిదేమీ కాదని, కణాలకు అవసరమైన శక్తి గ్లూకోజ్ ద్వారానే లభిస్తుందన్న విషయం మరువరాదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. -
మందుకొట్టే అలవాటు ఉందా.. అయితే?
న్యూయార్క్: మీరు యుక్తవయసులో ఉన్నారా, ఇప్పటికే మీకు మందుకొట్టే అలవాటు ఉందా. అయితే అర్జంటుగా పెళ్లిచేసుకోండి. మద్యపానం అలవాటు నుంచి బయటపడాలనుకుంటే భాగస్వామిని వెతుక్కోవాలని అమెరికా పరిశోధకులు సలహాయిస్తున్నారు. మందుకొట్టే దురలవాటును మాన్పించే శక్తి మ్యారేజీకి ఉందని వారు చెబుతున్నారు. అంతకుముందు పెద్ద మొత్తంలో సేకరించిన సమాచారాన్ని అధ్యయనం చేసి వారు ఈ విషయాన్ని వెల్లడించారు. 18 నుంచి 40 ఏళ్ల వయసున్న వారిలో డ్రింకింగ్ హాబిట్ ఎటువంటి మార్పులు తీసుకొచ్చిందనే దానిపై పరిశీలన జరిపారు. పెళ్లికి ముందు, తర్వాత మందుబాబుల జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయో గమనించారు. పెళ్లైన తర్వాత 50 శాతం మంది తాగుడు తగ్గించినట్టు తమ పరిశీలనలో తేలిందని పరిశోధకులు తెలిపారు. మద్యపానానికి బానిసలుగా మారిన వారు వివాహం తర్వాత మరింత శక్తివంతులుగా మారినట్టు నిర్థారణయిందని మిస్సౌరి యూనివర్సిటీ ప్రొఫెసర్ మాథ్యూ లీ చెప్పారు. వైవాహిక జీవితం కారణంగా మందుబాబులు మద్యపానం అలవాటు గణనీయంగా తగ్గించుకున్నారని వివరించారు.