మందుకొట్టే అలవాటు ఉందా.. అయితే? | Marriage can curb drinking problem | Sakshi
Sakshi News home page

మందుకొట్టే అలవాటు ఉందా.. అయితే?

Published Tue, Aug 4 2015 2:33 PM | Last Updated on Sun, Sep 3 2017 6:46 AM

మందుకొట్టే అలవాటు ఉందా.. అయితే?

మందుకొట్టే అలవాటు ఉందా.. అయితే?

న్యూయార్క్: మీరు యుక్తవయసులో ఉన్నారా, ఇప్పటికే మీకు మందుకొట్టే అలవాటు ఉందా. అయితే అర్జంటుగా పెళ్లిచేసుకోండి. మద్యపానం అలవాటు నుంచి బయటపడాలనుకుంటే భాగస్వామిని వెతుక్కోవాలని అమెరికా పరిశోధకులు సలహాయిస్తున్నారు. మందుకొట్టే దురలవాటును మాన్పించే శక్తి మ్యారేజీకి ఉందని వారు చెబుతున్నారు.

అంతకుముందు పెద్ద మొత్తంలో సేకరించిన సమాచారాన్ని అధ్యయనం చేసి వారు ఈ విషయాన్ని వెల్లడించారు. 18 నుంచి 40 ఏళ్ల వయసున్న వారిలో డ్రింకింగ్ హాబిట్ ఎటువంటి మార్పులు తీసుకొచ్చిందనే దానిపై పరిశీలన జరిపారు. పెళ్లికి ముందు, తర్వాత మందుబాబుల జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయో గమనించారు. పెళ్లైన తర్వాత 50 శాతం మంది తాగుడు తగ్గించినట్టు తమ పరిశీలనలో తేలిందని పరిశోధకులు తెలిపారు.

మద్యపానానికి బానిసలుగా మారిన వారు వివాహం తర్వాత మరింత శక్తివంతులుగా మారినట్టు నిర్థారణయిందని మిస్సౌరి యూనివర్సిటీ ప్రొఫెసర్ మాథ్యూ లీ చెప్పారు. వైవాహిక జీవితం కారణంగా మందుబాబులు మద్యపానం అలవాటు గణనీయంగా తగ్గించుకున్నారని వివరించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement