Actress Shruti Haasan replies to fans about smoking and drinking habits - Sakshi
Sakshi News home page

మద్యం తాగుతారా? నెటిజన్‌ ప్రశ్నకు శ్రుతీహాసన్‌ సమాధానమిదే!

Published Fri, Jun 23 2023 8:15 AM | Last Updated on Fri, Jun 23 2023 9:00 AM

Shruti Haasan Replies To Fans About Smoking And Drinking Habits - Sakshi

తమిళసినిమా: ఇండియన్‌ సినిమాలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి శ్రుతీహాసన్‌. ఈమె జీవితం తెరిచిన పుస్తకం అని చెప్పవచ్చు. విశ్వనటుడు కమల్‌హాసన్‌ వారసురాలు అయిన ఈమె హిందీ చిత్రంతో కథానాయకిగా నట జీవితాన్ని ప్రారంభించి ఆపై తెలుగు, తమిళం అంటూ తన స్థాయిని విస్తరించుకుంటూ వచ్చారు. ముఖ్యంగా తెలుగులో శ్రుతీహాసన్‌ లక్కీ హీరోయిన్‌. దాదాపు అక్కడ సక్సెస్‌ అయ్యాయి.

ప్రస్తుతం ప్రభాస్‌కు జంటగా సలార్‌ అనే భారీ  చిత్రంలో నటిస్తున్నారు. తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో త్వరలో తిరిగి రావడానికి ముస్తాబవుతుంది. కాగా శ్రుతీహాసన్‌ గురించి రకరకాల ప్రచారం జరుగుతుంది. పండ్లు ఉన్న చెట్టుకే దెబ్బలు అన్ని సామెత మాదిరి శ్రుతీహాసన్‌ సినీ వ్యక్తిగత జీవితాల గురించి ఎవరికీ తోచింది వారు రాస్తుంటారు. ప్రచారం చేస్తుంటారు.

(చదవండి: కోలీవుడ్‌ సూపర్‌స్టార్‌ ఎవరు?)

ఇవి కూడా ఎవరూ ఎలాంటి ప్రశ్న వేసినా చాలా బోల్డ్‌గా బదులిస్తుంటారు తన బాయ్‌ఫ్రెండ్‌తో  కూడా బహిరంగంగా తిరిగే నటి శ్రుతీహాసన్‌. ఎందుకంటే ఈమె పుట్టి పెరిగిన వాతావరణం అలాంటిది. తమ తల్లిదండ్రులు తమకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారని, అలాగని వారికి గౌరవానికి తలవంపులు తెచ్చే ఎలాంటి పనిని తాను చేయనని చెబుతారు.

ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే తరుచూ అభిమానులతో ఆన్‌లైన్‌లో ముచ్చటించే శ్రుతీహాసన్‌ ఇటీవల ఇన్‌స్ట్రాగామ్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు బదులు ఇచ్చి వారిని ఖుషీ చేశారు. ఈ సందర్భంగా ఒక అభిమాని మీరు మద్యం తాగుతారా? అన్న ప్రశ్న లేదు తాను మద్యం తాగాను, మాదకద్రవ్యాలు కూడా తీసుకోను అంటూ బదులిచ్చారు. అంతేకాకుండా తాను జీవితాన్ని హుందాగా గడిపే నటినని స్పష్టం చేసింది. దటీజ్‌ శ్రుతిహాసన్‌ అని మరోసారి నిరూపించుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement