వాషింగ్టన్: మద్యం సేవించడం మంచిదా, కాదా? అన్న అంశాన్ని పక్కన పెడితే మద్యం ప్రియత్వానికి, మానవుల జన్యువులకు విడదీయలేని అవినాభావ సంబంధం ఉందని యేలే యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వారానికి 14 యూనిట్లకు మించి మద్యం సేవించే 4, 35,000 మందిని ఎంపిక చేసి, వారి డీఎన్‌ఏలేని జన్యువులను శాస్త్రవేత్తలు పరీక్షించగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మద్యం ప్రియులందరిలోనూ 29 రకాల జన్యువులు ఒకే రీతిగా ఉన్నాయని తేలింది, అంటే మద్యం తాగడానికి జన్యువులకు సంబంధం ఉందన్నమాట. (ఇకపై ఫోన్‌లు పనిచేయవ్... కారణం?)
‘ఆల్కహాల్ జెనెటిక్ రిస్క్ ఫ్యాక్టర్స్’గా వ్యవహరించే మద్యం ప్రియుల్లో ఉండే జన్యువులు తర్వాత తరానికి కూడా సంక్రమిస్తాయని ఈ అధ్యయనంలో తేలినట్లు శాస్త్రవేత్తలు తెలియజేశారు. మద్యం పుచ్చుకుంటే సంతోషకర భావనలను మెదడు పెంచుతుందని భావించి మద్యం పుచ్చుకోవడం, పుచ్చుకున్నాక అలాంటి భావనలు పెరిగాయని విశ్వవించడం వల్ల మనుషులు మద్యానికి అలవాటు పడతారని ఇంతకుముందు శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. మద్యం గురించి ఆలోచించడం వల్ల మెదడులో ఉత్పత్తయ్యే కొన్ని రసాయనాలు కూడా మద్యం వైపు ఆలోచనలను తీసుకెళుతుందని కూడా చెప్పారు.
ఇప్పుడు మద్యం అలవాటుకు, జన్యువులకు నేరుగా సంబంధం ఉన్న విషయం ఈ అధ్యయనం ద్వారా తెలుస్తోందని అధ్యయనంలో పాల్గొన్న యూనివర్శిటీ సైకియాట్రీ విభాగంలో అసోసియేట్ రిసర్చ్ సైంటిస్ట్ హాంగ్ ఝౌ చెప్పారు. పర్యావరణ, సామాజిక సంబంధాలు కూడా మద్యం ప్రియత్వానికి దారితీస్తాయని ఆయన తెలిపారు. పబ్‌లు, బార్లకు సమీపంలో నివసించే వారిలో కూడా తాగాలనే కోరిక అనుకోకుండా పెరుగుతుందని కూడా ఆయన తెలిపారు. (హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్రయల్స్‌పై నిషేధం)
Comments
Please login to add a commentAdd a comment