Genetics
-
కంటి వ్యాధులకు జన్యు చికిత్స
న్యూఢిల్లీ: వంశపారంపర్యంగా వచ్చే కంటి వ్యాధులను నయం చేసేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) కాన్పూర్ అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని రిలయన్స్ లైఫ్ సైన్సెస్‌కు లైసెన్స్ ఇచ్చింది. ఈ జన్యు చికిత్సను రిలయన్స్ లైఫ్ మరింత అభివృద్ధి చేసి వాణిజ్యపరం చేయనుంది. జన్యు చికిత్సకు (జీన్ థెరపీ) సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం, భారత్‌లోని ఒక విద్యాసంస్థ నుండి కంపెనీకి బదిలీ చేయడం ఇదే మొదటిసారి అని ఇరు సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. ఐఐటీ కాన్పూర్‌కు చెందిన బయాలాజికల్ సైన్సెస్, బయో ఇంజనీరింగ్ విభా గానికి చెందిన జయంధరణ్ గిరిధర రావు, శుభమ్ మౌర్య ఈ పేటెంటెడ్ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. జంతువుల్లో దృష్టి లోపాన్ని సరిదిద్దడంలో ఇది మెరుగ్గా పనిచేసిందని ఐఐటీ కాన్పూర్ తెలిపింది. -
అన్ని జీవుల జన్యుగుట్టు తేల్చే ప్రాజెక్ట్!
మెల్బోర్న్: ప్రపంచంలోని ప్రతి సంక్లిష్ట జాతి జన్యువుల లోగుట్టును విశదీకరించే భారీ ప్రాజెక్టు పూర్తైతే జీవశాస్త్రంలో సంచలనాలు చూడవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. పదేళ్లలో దాదాపు 18 లక్షల స్పీసిస్ (ప్రజాతులు) జీనోమ్ సీక్వెన్సింగ్ చేసే ద ఎర్త్ బయోజీనోమ్ ప్రాజెక్ట్ (ఈబీపీ)కు 2018లో శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టు లక్ష్యాలు, పురోగతి తదితర వివరాలను మంగళవారం సైన్స్ జర్నల్స్‌లో ప్రచురించారు. ఈ ప్రాజెక్టు పూరై్తతే ఇంతవరకు జరిగిన బయోలాజికల్ రీసెర్చ్ రూపురేఖలు మారతాయి. విశేషాలు.. ► ఈ ప్రాజెక్టులో 22 దేశాలకు చెందిన 44 సంస్థలు పాలుపంచుకుంటున్నాయి. సుమారు 5వేల మంది శాస్త్రవేత్తలు ఈ ప్రాజెక్టు కోసం పనిచేస్తున్నారు. ► ప్రాజెక్టుకు దాదాపు 470 కోట్ల డాలర్ల వ్యయమవుతుందని అంచనా. ► సంక్లిష్ట జీవులు ఎలా ఉద్భవించాయి? జీవ వైవిధ్యత ఎలా మనుగడ సాగిస్తోంది? తదితర ప్రశ్నలకు సమాధానాలు ఈ ప్రాజెక్టుతో లభిస్తాయని అంచనా. ► హ్యూమన్ జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రాజెక్ట్ ప్రేరణతో 2016లో ఈబీపీని ప్రతిపాదించారు, 2018 నవంబర్‌లో అధికారికంగా ప్రారంభించారు. ► ప్రతి కుటుంబం (టాక్జానమీలో ఫ్యామిలీ) నుంచి కనీస ఒక్క జీనోమ్ సీక్వెన్సింగ్‌ను తొలిదశలో పూర్తి చేయాలని సంకల్పించారు. ► రెండోదశలో సుమారు 1.8లక్షల జాతుల సీక్వెన్సింగ్ చేస్తారు, మూడోదశలో అన్ని జీవుల సీక్వెన్సింగ్ పూర్తవుతుంది. ► ఏకకణ జీవుల నుంచి మానవుల వరకు భూమిపై ఉన్న అన్ని జీవుల జీనోమ్ సీక్వెన్సింగ్ ఈ ప్రాజెక్టులో పూర్తి చేస్తారు. అంటే దాదాపు ప్రతి ప్రాణి జన్యు గుట్టును ఈ ప్రాజెక్టు బహిర్గతం చేస్తుంది. ► దీనివల్ల భవిష్యత్‌లో వైద్య, ఫార్మా రంగాల్లో ఊహించని పురోగతి సాధించవచ్చని పరిశోధకుల అంచనా. -
ఆ జన్యువులోనే కోవిడ్ మరణాల గుట్టు!
కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే లక్షలాది మందిని బలితీసుకుంది. కొన్నిదేశాల్లో ఇంకా ప్రభావం చూపుతూనే ఉంది. ఈ వైరస్ బారినపడి చనిపోయినవారిలో.. పెద్దవయసువారు, వివిధ వ్యాధులున్నవారే కాకుండా ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని మధ్యవయసువాళ్లు, యువత కూడా ఉన్నారు. మరి ఇలా ఏ అనారోగ్యం లేకుండా నిక్షేపంగా ఉన్నవారు కూడా కోవిడ్‌తో చనిపోవడానికి వారిలో జన్యు వ్యత్యాసమే (జీన్ వేరియేషన్) కారణమని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంతకీ ఆ జన్యువు ఏమిటి, ఎందుకు ప్రాణాల మీదికి వస్తోంది, పరిశోధనలో తేలిన వివరాలివి.. ఊపిరితిత్తుల కణాల్లో.. సాధారణంగా పిల్లలు, యువతతోపాటు 60 ఏళ్లలోపు వయసు వారిలో రోగ నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) ఎక్కువగా ఉంటుంది. 60 ఏళ్లు దాటినవారిలో వయసు పెరిగినకొద్దీ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. కానీ కోవిడ్ బారినపడి చనిపోయినవారిలో 30ఏళ్ల నుంచి 60ఏళ్ల మధ్య వయసువారు కూడా పెద్ద సంఖ్యలో ఉండటంపై ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ జీనోమిక్స్ విభాగం శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. తీవ్రస్థాయిలో కోవిడ్‌కు గురై ఊపిరితిత్తులు దెబ్బతిన్నవారు, తక్కువగా ప్రభావితమైన వారి జన్యుక్రమాన్ని పోల్చి చూశారు. మన ఊపిరితిత్తుల కణాల్లో ఉండే ‘ఎల్‌జెడ్‌టీఎఫ్‌ఎల్1’ అనే జన్యువులోని ఒక వేరియేషన్ కరోనా మరణాలు ఎక్కువగా ఉండటానికి కారణమని గుర్తించారు. ఏమిటీ ‘ఎల్‌జెడ్‌టీఎఫ్‌ఎల్1’? ఊపిరితిత్తుల కణాలగోడలు దృఢంగా ఉండటానికి, వైరస్ల దాడిని ఎదుర్కొని, కణాలు తిరిగి బలం పుంజుకోవడానికి ఈ జన్యువు తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ జన్యువులో రెండు రకాలు (వేరియంట్లు) ఉన్నాయని.. అందులో ఒకరకం కోవిడ్ ఇన్ఫెక్షన్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తోడ్పడితే.. మరో రకానికి ఈ శక్తి తక్కువగా ఉన్నట్టు గుర్తించామని వెల్లడించారు. ఇలా తక్కువ శక్తి ఉన్న రకం జన్యువు.. దక్షిణాసియా దేశాల వారిలో 60 శాతం, యూరోపియన్ దేశాల్లో 15 శాతం, ఆఫ్రికా వారిలో 2.4 శాతం, తూర్పు ఆసియా దేశాల వారిలో 1.8 శాతం ఉన్నట్టు తేలిందని వివరించారు. ‘రిస్క్’ రెండింతలు.. ప్రస్తుతం కరోనా వ్యాప్తి కారణంగా మన శరీరంలో నేరుగా ఎక్కువ ప్రభావం పడిన జన్యువు ‘ఎల్‌జెడ్‌టీఎఫ్‌ఎల్1’ అని పరిశోధనకు నేతృత్వం వహించిన ఆక్స్ఫర్డ్ వర్సిటీ ప్రొఫెసర్ జేమ్స్ డేవిస్ చెప్పారు. అయితే కేవలం ఈ ఒక్క జన్యువు కారణంగానే పెద్ద సంఖ్యలో మరణాలు నమోదైనట్టు చెప్పలేమని.. మధుమేహం, గుండెజబ్బులు వంటివి ఉన్నవారిలో తక్కువ శక్తి ఉన్న జన్యువు ఉంటే.. మరణించే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. భారతదేశంలో టైప్–2 మధుమేహం,గుండె జబ్బుల బాధితులు ఎక్కువని.. దానికితోడు తక్కువ సామర్థ్యమున్న ‘ఎల్‌జెడ్‌టీఎఫ్‌ఎల్1’ జన్యువు ఉన్నవారి సంఖ్య కూడా ఎక్కువేనని జేమ్స్ డేవిస్ తెలిపారు. ఈ రెండింటి కారణంగానే కరోనా రెండో వేవ్ సమయంలో భారతదేశంలోని కొన్నిప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో మరణాలు నమోదయ్యాయని వెల్లడించారు. వయసు పెరిగిన కొద్దీ.. తక్కువ సామర్థ్యమున్న ‘ఎల్‌జెడ్‌టీఎఫ్‌ఎల్1’ జన్యువు ఉన్నవారు.. తమకంటే పదేళ్లు ఎక్కువ వయసున్న వారితో సమానంగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లకు లోనవుతారని ప్రొఫెసర్ జేమ్స్ డేవిడ్ వెల్లడించారు. అలాంటి వారిలో 20–30 ఏళ్ల తర్వాత ప్రతి పదేళ్లకు ప్రమాద అవకాశం రెండింతలు అవుతూ ఉంటుందని వివరించారు. అయితే తక్కువ సామర్థ్యమున్న ‘ఎల్‌జెడ్‌టీఎఫ్‌ఎల్1’ జన్యువు ఉన్నంత మాత్రాన ప్రమాదకరమని అనుకోవద్దని.. ఇతర జన్యువులు, రోగ నిరోధక శక్తి, ఎలాంటి వ్యాధులు లేకపోవడం వంటివి రక్షణగా ఉంటాయని స్పష్టం చేశారు. -
జెనెటిక్ వైద్యులు, శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఓఎస్ రెడ్డి కన్నుమూత
హైదరాబాద్: జెనెటిక్ వైద్యులు, శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఓఎస్ రెడ్డి (92) కన్నుమూశారు. దేశంలో జెనెటిక్స్ను ప్రొఫెసర్ ఓఎస్ రెడ్డి ప్రారంభించారు. ఉస్మానియా వర్సిటీకి సుదీర్ఘ కాలం ప్రొఫెసర్ ఓఎస్ రెడ్డి సేవలు అందించారు. జెనెటిక్స్ ప్రపంచంలో దాదాపు 5 వేల రకాల రోగాలు, జబ్బులు వంశపారంపర్యంగా వస్తాయనేది నిపుణుల మాట. ప్రస్తుత కాలంలో దంత సమస్యలు కూడా ఈ అనువంశిక రోగాల జాబితాలో చేరిపోయాయి. వీటికి సంబంధించి చికిత్సలను అందించాలన్నా, రాకుండా నిరోధించాలన్నా జన్యుశాస్త్ర నిపుణుల పాత్ర చాలా కీలకం కానుంది. -
సెకండ్ వేవ్ ముగిసిందనుకోవద్దు..
సాక్షి, హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్ ముగింపు దశకు వచ్చిందా? గత 4 రోజులుగా కేసుల్లో తగ్గుదల నమోదవుతుండటాన్ని చూస్తే.. అలాగే అనిపించవచ్చు కానీ.. ఈ విషయంలో అంత తొందర వద్దంటున్నారు సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ) గౌరవ సలహాదారు డాక్టర్ రాకేశ్ మిశ్రా. వారం రోజుల సగటులో కేసుల తగ్గుదల ఉంటేనే వ్యా ధి తగ్గుముఖం పడుతున్నట్లు భావించాలని ఆ యన ‘సాక్షి’తో మాట్లాడుతూ వివరించారు. దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 4 రోజులుగా తగ్గు తూ వస్తోంది. రోజుకు 4 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్న దశ నుంచి 2.6 లక్షల స్థాయికి కేసులు తగ్గాయి. కానీ దీని ఆధారంగా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిందన్న అంచనాకు రావడం సరికా దని ఆయన స్పష్టం చేశారు. దేశవ్యాప్తం గా కరోనా నిర్ధారణ పరీక్షలు గరిష్ట స్థాయిలో జరుగుతున్నా అత్యధికం నగర ప్రాంతాలకే పరిమితమయ్యాయన్నా రు. ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో తప్పులు, మరికొన్ని అంశాలను కూడా పరిగణనలోకి తీసు కుంటే సెకండ్ వేవ్ తగ్గిందా.. లేదా అన్నది తెలిసేందుకు ఇంకో వారం పట్టొచ్చన్నారు. గ్రామా ల్లో పరీక్షలు, నిఘా మరింత పెంచాలని, తద్వా రా వ్యాధి మరోసారి ప్రమాదకరంగా మారకుం డా చూడొచ్చని సూచించారు. జన్యుక్రమ నమోదు కొనసాగుతోంది.. దేశంలో వైరస్ రూపాంతరితాలను గుర్తించేందు కు వాటి జన్యుక్రమాలను గుర్తించే ప్రక్రియ కొన సాగుతోందని రాకేశ్ మిశ్రా తెలిపారు. ‘ఈ ఏడా ది జనవరిలో దాదాపు 6 వేల వైరస్ జన్యుక్రమాలను విశ్లేషించాం. ఇప్పటివరకు దేశంలో దాదా పు 7,500 రూపాంతరితాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలకు ఇప్పటికే తెలుసు’ అని వివరించారు. ‘ఈ రూపాంతరితాల్లో కొన్నింటితో మాత్రమే ప్రమా ద తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రస్తుతానికి యూకే వేరియంట్ దేశంలో ఎక్కువగా వ్యాపిస్తోంది. కొత్తగా గుర్తించిన రూపాంతరితాల్లో ఆందోళన కలిగించేవి ఏవీ లేవు’ అని తెలిపారు. వ్యాక్సిన్లు పని చేస్తాయి: ‘కరోనా వైరస్ జన్యుమార్పులకు గురవుతున్నా ఇప్పటివరకు అభివృ ద్ధి చేసిన టీకాలు వాటిని సమర్థంగా అడ్డుకుంటున్నాయి. యాంటీబాడీలు తక్కువున్నంత మా త్రాన టీకా పనిచేయట్లేదని కాదు. వైరస్‌ను అడ్డుకునేందుకు కావాల్సినన్ని యాంటీబాడీలు ఉత్ప త్తి అయితే చాల’ని రాకేశ్‌మిశ్రా వివరించారు. జంతుజాలంపై నిఘా: కరోనా వైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకిన నేపథ్యంలో భ విష్యత్తులో ఇలాంటి విపత్తులను నివారించేందు కు జంతుజాలంపై నిఘా కొనసాగాలని రాకేశ్ మిశ్రా తెలిపారు. కరోనా కుటుంబంలో 32 వైరస్‌లున్నా.. మనిషికి ఏడింటి గురించే తెలుసని, ఎప్పుడు ఏ వైరస్ మనుషులకు ప్రబలుతుందో తెలుసుకునేందుకు అటవీ జంతువులను పరిశీలిస్తూనే ఉండాలని ఆయన పేర్కొన్నారు. 2–డీజీతో మేలే.. కరోనా చికిత్స కోసం భారత రక్షణ ప రిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) త యారు చేసిన 2–డీజీపై సీసీఎంబీలో పరీక్ష లు జరిగాయని, ఇది సమర్థంగా పనిచేస్తుం దని స్పష్టమైందని రాకేశ్ మిశ్రా తెలిపారు. డీఆర్డీవో అనుబంధ సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అల్లైడ్ సైన్సెస్ (ఇన్మాస్) అభివృద్ధి చేసిన ఈ మందుతో ఆక్సిజన్ అవసరం తగ్గిపోవడ మే కాకుండా.. ఆస్పత్రిలో ఉండాల్సిన స మయం తగ్గుతుందని చెప్పారు. ఈ మం దును ఇప్పటికే పలు ప్రాంతాల్లో వినియోగి స్తున్నారని.. ఫలితాలేమిటన్నది మరికొన్ని రోజుల్లో స్పష్టంగా తెలుస్తుందని చెప్పారు. -
చందమామ మీద భద్రపర్చనున్న వీర్యం, అండాలు
భూమిపై పెరిగిపోతున్న కాలుష్యం, పర్యావరణ అసమతుల్యత శాస్త్రవేత్తలను ఎప్పుడూ భయపెడుతూనే ఉంటాయి. ప్రమాదకరమైన పరిస్థితుల వల్ల భూమిపై జీవావరణం దెబ్బతింటుందని, జీవులు అంతరించిపోతాయని వారు ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే వేలాది జీవులు పలు కారణాల వల్ల అంతరించిపోయాయి. భూమిపై జీవుల మనుగడ ప్రశ్నార్థకమవుతున్న నేపథ్యంలో ఇతర గ్రహాల్లో మనుగడ సాగించేందుకు ఉన్న అవకాశాలపై చాలా కాలం నుంచి పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అలాగే సౌర కుటుంబంలో భూమికి సహజ ఉపగ్రహమైన జాబిలిపై ఇప్పటికే కాలు మోపి.. చాలా ఏళ్ల నుంచి అక్కడి పరిస్థితులను అంచనా వేస్తున్నారు. అయితే ఇతర గ్రహాల వలే చంద్రుడు కూడా ప్రాణుల మనుగడకు అనుకూలం కాదని ఇప్పటి వరకూ నమ్ముతున్నారు. కానీ, మన విలువైన వనరులను భద్రపరచడానికి స్టోరేజీలా మూన్ ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం.. చంద్రుడిపై జీన్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయాలని సైంటిస్టులు ప్రతిపాదన చేశారు. మనుషులతో సహా సుమారు 67 లక్షల జీవులకు సంబంధించిన పునరుత్పత్తి కణాలు, వీర్యం, అండాలు ఆ లూనార్ బ్యాంక్‌లో భద్రపరచాలని సూచిస్తున్నారు. పాశ్చాత్య మతగ్రంథాలలో జీవుల రక్షణకు ఉపయోగించిన ‘ఆర్క్’లాంటి ఈ బ్యాంకును మోడరన్ గ్లోబల్ ఇన్సూ్యరెన్స్ పాలసీగా చూడాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆరిజోనా యూనివర్సిటీకి చెందిన మెకానికల్, ఏరోస్పేస్ ఇంజనీర్ జెకన్ తంగ, అతని బృందం తయారు చేసిన ఓ రిపోర్టును ఇటీవల జరిగిన ఏరోస్పేస్ సదస్సులో సమర్పించారు. రక్షణ చర్యల్లో భాగంగా లక్షలాది జీవుల వీర్యం, అండాల శాంపిల్స్‌ను లూనార్ బ్యాంకుకు తరలించాలని ఆ రిపోర్టులో ప్రతిపాదించారు. చంద్రుడి ఉపరితలం సేఫ్ ఇటీవల జరిగిన ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ ఇన్స్టిట్యూట్ (ఐఈఈఈ) వార్షిక ఏరోస్పేస్ సదస్సులో తంగ ప్రసంగిస్తూ.. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని జీవుల నమూనాలను భద్రపరచడానికి భూమిపై భాండాగారం నిర్మాణం సరైంది కాదన్నారు. మరో గ్రహాన్ని లేదా చందమామపైనైనా జీవుల జన్యువులను భద్రపరిచే భాండాగారాన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నెలకొల్పాలని సూచించారు. ఒకవేళ భూగోళంపై ఎంతటి విధ్వంసం జరిగినా.. జీన్ బ్యాంక్‌లో భద్రపరిచిన జీవులను ఇప్పుడున్న శాస్త్రసాంకేతికత పురోగతితో పునరుత్పత్తి చేయవచ్చు అని ఆయన తన ప్రసంగంలో సూచించారు. ఇటీవల చంద్రుడి ఉపరితలంపై కనుగొన్న లావా గోతుల్లో ఆ బ్యాంకును భద్రపరచవచ్చని తంగా అభిప్రాయపడ్డారు. ఆ గోతులు రెడీమేడ్ స్టోరేజీగా ఉపయోగించుకోవచ్చన్నారు. 80 నుంచి 100 మీటర్ల లోతుతో ఉండే ఈ గోతులు జీన్ బ్యాంక్ రక్షణకు సరిగ్గా సరిపోతాయని, ఈ గోతుల్లో భద్రపరిస్తే ఉల్కాపాతాలు, స్పేస్ రేడియేషన్ నుంచి రక్షణ పొందవచ్చన్నారు. అయితే తంగ జీన్ బ్యాంక్ ప్రతిపాదన కొత్త కాదు. ఆర్కిటిక్ సముద్రంలోని స్పిట్స్ బర్గెన్ ఐల్యాండ్పై స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్‌ని భూమిపై ఇప్పటికే నెలకొల్పారు. దీనిలో మొక్కల విత్తనాలు, ఇతర సీడ్స్‌లకు చెందిన 9,92,000 శాంపిల్స్ భద్రపరిచారు. -
కరోనాపై చైనా మరో కథ
జెనీవా: చైనా నోటికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. కరోనా వైరస్ తొలుత భారత్‌లో బయటపడిందంటూ కాకమ్మ కథలు మొదలు పెట్టింది. కరోనా వైరస్ మొదటిసారిగా ఎక్కడ ఎలా బయటపడిందనే అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) విచారణ వేగవంతం చేసిన నేపథ్యంలో చైనా భారత్‌ను లక్ష్యంగా చేసుకొని నిందలు మోపుతోంది. 2019 వేసవిలో భారత్‌లో కరోనా వైరస్ పుట్టిందని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన పరిశోధకుల బృందం పేర్కొంది. జంతువుల నుంచి మనుషులకి కలుషిత నీటి ద్వారా సోకిన ఈ వైరస్ వూహాన్‌కి చేరుకుందని వారు కొత్త కథ వినిపిస్తున్నారు. వూహాన్లో తొలి కేసు బయటపడినంత మాత్రాన వైరస్ పుట్టుక అక్కడే జరిగిందని చెప్పలేమంటున్నారు. జన్యు మార్పుల ద్వారా పుట్టుక తెలుసుకోవచ్చు: చైనా కొత్త వాదన కరోనా వైరస్‌కు సంబంధించిన జన్యుక్రమం, దాని డీఎన్ఏని విశ్లేషించి అది ఎక్కడ ఆవిర్భవించిందో వాదిస్తూ చైనా శాస్త్రవేత్తలు ఒక నివేదికని డబ్ల్యూహెచ్ఓకి సమర్పించారు.ప్రధానంగా భారత్, బంగ్లాదేశ్‌లో వైరస్ తక్కువగా మ్యుటేషన్ చెందుతోందని ఆ రెండూ ఇరుగు పొరుగు దేశాలు కావడంతో అక్కడ్నుంచే వైరస్ వచ్చి ఉండవచ్చునని శాస్త్రవేత్తలు వాదించారు. అయితే చైనా శాస్త్రవేత్తల వాదనల్లో వాస్తవం లేదని గ్లాస్గో యూనివర్సిటీకి చెందిన నిపుణుడు డేవిడ్ రాబర్ట్సన్ అన్నారు. -
మధుమేహ నిర్ధారణకు కొత్త మార్గం!
జన్యు శాస్త్రం సహాయంతో మధుమేహాన్ని నిర్దారించే కొత్త మార్గం ద్వారా భారతీయుల్లో మెరుగైన నిర్థారణ,చికిత్సకు మార్గం సుగమం చేస్తుందని నూతన పరిశోధనలు తేల్చాయి. భారతదేశంలో మధుమేహపు తప్పు నిర్థారణ ఒక సమస్యగా మారింది. ప్రామాణిక పాశ్చాత్య పాఠ్యపుస్తకాల్లో ఉండే మధుమేహ లక్షణాలు భారతీయుల్లో భిన్నంగా ఉండడం ఈ తరహా సమస్యకు దారి తీస్తోంది. ఇటీవల కాలం వరకూ టైప్ -1 మధుమేహం పిల్లల్లో కౌమార దశలో కనిపిస్తుందని, అదే విధంగా టైప్ -2 మధుమేహం ఊబకాయం ఉన్నవారిలోనూ, ఎక్కువ వయసు గల వారిలోనూ అంటే సాధారణంగా 45 సంవత్సరాలు దాటిన వారిలో కనిపిస్తుందని నమ్మేవారు. ఏదేమైనా టైప్ 1 మధుమేహం పెద్దవారిలో కూడా కనిపిస్తుందని ఇటీవలి పరిశోధనలు తెలియజేస్తున్నాయి. అయితే టైప్ -2 మధుమేహం యువకులు మరియు సన్నగా ఉన్న భారతీయుల్లో కూడా పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో రెండు రకాల మధుమేహాలను వేరు చేయటం మరింత క్లిష్టంగా మారింది. టైప్ -1 మధుమేహం జీవితకాలం ఇన్సులిల్ ఇంజెక్షన్లు అవసరమయ్యే రెండు రకాల వేర్వేరు చికిత్సా విధానాలను అనుసరిస్తుంది. టైప్ -2 మధుమేహం తరచుగా ఆహారం లేదా మాత్రల చికిత్సతో నిర్వహించటం జరుగుతుంది. మధుమేహ రకాన్ని తప్పుగా వర్గీకరించడం ఉప-ప్రామాణిక మధుమేహ సంరక్షణ విషయంలో సమస్యలకు దారి తీయవచ్చు. పూణేలోని కె.ఈ.ఎం. ఆసుపత్రి, సి.ఎస్.ఐ.ఆర్ - సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ), హైదరాబాద్, యు.కె.లోని యూనివర్సిటీ ఆఫ్ ఎక్సెటర్ పరిశోధకుల మధ్య నిర్వహించిన ఒక నూతన ప్రచురణ, భారతీయుల్లో టైప్ -1 మధుమేహ నిర్ధారణలో జన్యువులు కీలకమైన విషయాలను, ప్రభావవంతగా చూపిస్తాయని తెలిపింది. టైప్ 1 మధుమేహం అభివృద్ధి చెందే అవకాశాన్ని పెంచే వివరణాత్మక జన్యు సమాచారాన్ని ఎక్సేటర్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన జన్యు ప్రమాద స్కోరు పరిగణలోకి తీసుకుంది. ఆరోగ్య పరీక్షల సమయంలో ఎవరిలోనైనా టైప్ 1 మధుమేహం ఉందో లేదో నిర్ణయించటంలో ఈ స్కోరును ఉపయోగించవచ్చు. ఇప్పటి వరకూ ఈ పరిశోధనలు యూరోపియన్ జనాభా మీద జరిగాయి. ఇప్పుడు సైంటిఫిక్ రిపోర్ట్స్ లో ప్రచురించిన ఓ పత్రికలో, భారతీయుల్లో టైప్ 1 మధుమేహాన్ని గుర్తించటంలో యూరోపియన్ రిస్క్ స్కోర్ ప్రభావవంతంగా ఉంటుందా అనే విషయాన్ని పరిశోధకులు విశ్లేషించారు. ఈ బృందం భారతదేశంలోని పూణె నుంచి మధుమేహం ఉన్న వారిని అధ్యయనం చేసింది. టైప్ 1 మధుమేహం ఉన్న 262 మందిని, టైప్ 2 మధుమేహం ఉన్న 352 మందిని, మధుమేహం లేని 334 మంది ఆరోగ్య పరిస్థితులను ఈ బృందం విశ్లేషించింది. వీరంతా భారతీయు (ఇండో-యూరోపియన్) మూలాలకు చెందిన వారు. భారతీయ జనాభా నుంచి వచ్చిన ఫలితాలను వెల్ కమ్ ట్రస్ట్ కేస్స్ కంట్రోల్ కన్సార్టియం అధ్యనం నుంచి యూరోపియన్లతో పోల్చి పరిశోధించారు. డయాబెటిస్ యు.కె, పూణెలోని కె.ఈ.ఎం. హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ మరియు భారతదేశంలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సి.ఎస్.ఐ.ఆర్) మద్ధతుతో ఈ పరిశోధన, భారతీయుల్లో సరైన రకమైన మధుమేహాన్ని గుర్తించటంలో ఈ పరీక్ష ప్రభావ వంతంగా ఉందని, ప్రస్తుత రూపంలో కూడా ఇది యూరోపియన్ డేటా మీద ఆధాపడి ఉంటుందని కనుగొన్నారు. ఈ రచయితలు జనాభా మధ్య జన్యుపరమైన తేడాలను గుర్తించారు. దీని ఆధారంగా భారతీయ జనాభా విషయంలో ఫలితాలను మరింత బాగా తెలుసుకునేందుకు పరీక్షలను మరింత మెరుగుపరచవచ్చు. ఈ విషయం గురించి ఎక్సెటర్ మెడికల్ స్కూల్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ రిచర్డ్ ఓరం తెలియజేస్తూ, సరైన మధుమేహం రకాన్ని నిర్ధారించడం వైద్యులకు చాలా కష్టమైన సవాలు అని, టైప్ 1 మధుమేహం ఏ వయసులోనైనా సంభవిస్తుందనే విషయం మనకు ఇప్పుడు తెలుసుకున్నామన్నారు. తక్కువ బీఎంఐ ఉన్న వారిలో టైప్ -2 మధుమేహం కేసులు ఎక్కువగా ఉన్నందున ఈ పని భారతదేశంలో మరింత కష్టమన్న ఆయన, తమ జన్యు రిస్క్ స్కోరు భారతీయులకు సమర్థవంతమైన సాధనమని తమకు తెలుసునన్నారు. డయాబెటిక్ కెటోయాసిడోసిస్ వంటి ప్రాణాంతక సమస్యలను నివారించేందుకు, అదే విధంగా ఉత్తమ ఆరోగ్య ఫలితాలను సాధించడానికి ప్రజలకు అవసరమైన చికిత్సను పొందటంలో సహాయపడుతుందని వివరించారు. పూణేలోని కె.ఈ.ఎం. హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్‌కు చెందిన డాక్టర్ చిత్తరంజన్ యాజ్నిక్, డాక్టర్ ఓరమ్ చెప్పిన విషయాలతో అంగీకరించారు. భారతీయ యువతలో సైతం అంటువ్యాధిలా విస్తరిస్తున్న మధుమేహం, దాని దీర్ఘకాలిక జీవ, సామాజిక మరియు ఆర్థిక చిక్కులను నివారించేందుకు ఈ సమస్యను సరిగ్గా నిర్థారించడం అత్యంత ఆవశ్యకమని పేర్కొన్నారు. కొత్త జన్యుసాధనం దీనికి బాగా ఉపకరిస్తుందని, భారతీయ శరీరంలో (సన్నని కొవ్వు కలిగిన భారతీయులు) అధిక కొవ్వు మరియు అల్ప కండర ద్రవ్యరాశి కారణంగా ఇన్సులిన్ తగ్గిన చర్యకు వ్యతిరేకంగా ప్యాంక్రియాటిక్ బి కణాల విఫలతను నిర్థారించటంలో ఇది సహాయపడుతుందని తెలిపారు. మధుమేహ రోగుల శారీరక లక్షణాలు ప్రామాణిక అంశాల నుంచి భిన్నంగా ఉన్న భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మధుమేహ రోగుల్లో ఈ పరీక్షను ఉపయోగించాలని ఎదురు చూస్తున్నట్లు ఆయన తెలిపారు. భారతీయ మరియు యూరోపియన్ జనాభాలో టైప్ 1 మధుమేహంతో సంబంధం ఉన్న తొమ్మిది జన్యు విభాగాలను (ఎస్.ఎన్.పి.లుగా పిలుస్తారు) రచయితలు కనుగొన్నారు. దీని ద్వారా భారతీయుల్లో టైప్ 1 మధుమేహం ఆగమనాన్ని అంచనా వేయడానికి దీన్ని ఉపయోగించవచ్చు. సి.ఎస్.ఐ.ఆర్ - సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సి.సి.ఎం.బి)లో అధ్యయనానికి నాయకత్వం వహించిన చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ జీఆర్ చందన్ ఈ విషయం గురించి తెలియజేస్తూ, భారతీయ మరియు యూరోపియన్ రోగుల్లో వేర్వేరు ఎస్ఎన్పీలు అధికంగా ఉన్నాయని గమనించటం ఆసక్తికరంగా ఉందని, ఈ ఎస్ఎన్పీలతో పర్యావరణ కారకాలు సంకర్షణ చెందే అవకాశాన్ని ఇది బయటపెడుతుందని వివరించారు. భారతదేశ జనాభా జన్యు వైవిధ్యాన్ని బట్టి, అధ్యయన ఫలితాలు దేశంలోని ఇతర సంతతి విషయాల్లో కూడా ధృవీకరించాల్సి ఉంది. సి.ఎస్.ఐ.ఆర్ – సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సి.సి.ఎం.బి) డైరక్టర్ డాక్టర్ రాకేశ్ కె.మిశ్రా ఈ విషయం గురించి వివరిస్తూ, 15 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల టైప్ 1 మధుమేహం ఉన్న వారిలో 20 శాతం భారతదేశంలో ఉన్నందున, జన్యు పరీక్ష కిట్ లను అభివృద్ధి చేస్తున్నారని, టైప్ 1 మరియు టైప్ 2 మధుమేహాలను విశ్వసనీయంగా గుర్తించగలిగే ఈ కిట్ దేశానికి అత్యంత ప్రాధాన్యత కల అంశమని తెలిపారు. -
మద్యపానం గుట్టు తెలిసింది!
వాషింగ్టన్: మద్యం సేవించడం మంచిదా, కాదా? అన్న అంశాన్ని పక్కన పెడితే మద్యం ప్రియత్వానికి, మానవుల జన్యువులకు విడదీయలేని అవినాభావ సంబంధం ఉందని యేలే యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వారానికి 14 యూనిట్లకు మించి మద్యం సేవించే 4, 35,000 మందిని ఎంపిక చేసి, వారి డీఎన్ఏలేని జన్యువులను శాస్త్రవేత్తలు పరీక్షించగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మద్యం ప్రియులందరిలోనూ 29 రకాల జన్యువులు ఒకే రీతిగా ఉన్నాయని తేలింది, అంటే మద్యం తాగడానికి జన్యువులకు సంబంధం ఉందన్నమాట. (ఇకపై ఫోన్లు పనిచేయవ్... కారణం?) ‘ఆల్కహాల్ జెనెటిక్ రిస్క్ ఫ్యాక్టర్స్’గా వ్యవహరించే మద్యం ప్రియుల్లో ఉండే జన్యువులు తర్వాత తరానికి కూడా సంక్రమిస్తాయని ఈ అధ్యయనంలో తేలినట్లు శాస్త్రవేత్తలు తెలియజేశారు. మద్యం పుచ్చుకుంటే సంతోషకర భావనలను మెదడు పెంచుతుందని భావించి మద్యం పుచ్చుకోవడం, పుచ్చుకున్నాక అలాంటి భావనలు పెరిగాయని విశ్వవించడం వల్ల మనుషులు మద్యానికి అలవాటు పడతారని ఇంతకుముందు శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. మద్యం గురించి ఆలోచించడం వల్ల మెదడులో ఉత్పత్తయ్యే కొన్ని రసాయనాలు కూడా మద్యం వైపు ఆలోచనలను తీసుకెళుతుందని కూడా చెప్పారు. ఇప్పుడు మద్యం అలవాటుకు, జన్యువులకు నేరుగా సంబంధం ఉన్న విషయం ఈ అధ్యయనం ద్వారా తెలుస్తోందని అధ్యయనంలో పాల్గొన్న యూనివర్శిటీ సైకియాట్రీ విభాగంలో అసోసియేట్ రిసర్చ్ సైంటిస్ట్ హాంగ్ ఝౌ చెప్పారు. పర్యావరణ, సామాజిక సంబంధాలు కూడా మద్యం ప్రియత్వానికి దారితీస్తాయని ఆయన తెలిపారు. పబ్‌లు, బార్లకు సమీపంలో నివసించే వారిలో కూడా తాగాలనే కోరిక అనుకోకుండా పెరుగుతుందని కూడా ఆయన తెలిపారు. (హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్రయల్స్‌పై నిషేధం) -
కరోనా జన్యుక్రమం నమోదు
సాక్షి, హైదరాబాద్: ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్‌కు ముకుతాడు వేసేందుకు అన్నివైపుల నుంచి ప్రయత్నాలు జోరందుకుంటున్నాయి. టీకా, మందుల తయారీలో ఇప్పటికే పలు కంపెనీలు నిమగ్నమై ఉండగా.. ఈ వైరస్‌ను క్షుణ్ణంగా అర్థం చేసుకునేందుకు హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ), ఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆప్ జినోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (ఐజీఐబీ)లు జన్యుక్రమ నమోదును దాదాపు పూర్తి చేశాయి. అన్నీ సవ్యంగా సాగితే ఒకట్రెండు వారాల్లోనే కనీసం 5 ఐసోలేట్ వైరస్ల జన్యుక్రమాల నమోదు పూర్తి చేస్తామని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. కరోనా బారిన పడ్డ వ్యక్తి నుంచి వేరు చేసిన వైరస్‌ను ఐసోలేట్ అంటారు. జన్యుక్రమాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటే ఈ వైరస్ ఎప్పుడు.. ఎలా పుట్టింది.. ఎలా పరిణమించిందన్న విషయాలు తెలుస్తాయని, తద్వారా భవిష్యత్తులో ఈ రకమైన వైరస్‌లను అడ్డుకోవడం సాధ్యమవుతుందని వివరించారు. వైరస్ పూర్తి జన్యుక్రమాన్ని తెలుసుకోవాలంటే బోలెడన్ని ఐసొలేట్‌ల జన్యుక్రమాలు అవసరమవుతాయి. ఎంత ఎక్కువ సంఖ్యలో ఐసొలేట్ జన్యుక్రమాలు ఉంటే.. అంత కచ్చితత్వంతో జన్యుక్రమాన్ని నమోదు చేయొచ్చు. ఆ వైరస్ గురించి అధ్యయనం చేయొచ్చు. ఈ కారణంగానే సీసీఎంబీతో పాటు ఐజీఐబీ కూడా ఐసోలేట్ జన్యుక్రమాలను నమోదు చేసే పనిలో ఉందని, ఇంకో వారం పది రోజుల్లో కావాల్సినంత సమాచారాన్ని సేకరించగలుగుతామని రాకేశ్ మిశ్రా తెలిపారు. వైరస్‌లకు సంబంధించి దేశంలోని ఏకైక పరిశోధన సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచి తాము కరోనా సోకిన వారి నుంచి వేరు చేసిన వైరస్‌లను సేకరిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని వైరస్ల జన్యుక్రమాలను నమోదు చేయడం ద్వారా ఎక్కువ ప్రయోజనముంటుందని చెప్పారు. -
ఒక్క రక్త పరీక్షతో కేన్సర్ నిర్ధారణ
కేన్సర్ మహమ్మారికి చెక్ పెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలెన్నో.. కానీ విజయవంతమైనవి కొన్నే! తొందరగా గుర్తించలేకపోవడం, రోగ నిరోధక శక్తిని ఏమార్చే కేన్సర్ కణాలు.. అందుబాటులోని మందుల ప్రభావం ఒక్కొక్కోరిపై ఒక్కొలా ఉండటం.. వందల సంఖ్యలో ఉండే జన్యుమార్పుల ప్రభావం! ఇలా కారణాలు అనేకం! కానీ.. ఈ పరిస్థితి మారిపోతోంది. భారత్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ సంస్థ చేపట్టిన పరిశోధనలు.. త్వరలోనే కేన్సర్‌ను సమర్థంగా ఎదుర్కోవచ్చన్న ఆశలు కల్పిస్తున్నాయి. సాక్షి, హైదరాబాద్: పది మిల్లీ లీటర్ల రక్తం! మీ శరీరంలో కేన్సర్ ఉందో లేదో నిర్ధారించుకునేందుకు సరిపోతుంది. విస్తృత స్థాయిలో రక్త పరీక్షలు చేయనక్కర్లేదు. బ యాప్సీ (కణజాలాన్ని కత్తిరించి పరీక్షించడం) చే యాల్సిన పరిస్థితే ఉండదు. ఇదేదో బాగుందే.. ఇం తటి అద్భుతం ఎలా సాధ్యమైందీ అని ప్రశ్నిస్తే.. రక్తంలో ఉండే చిన్న కణాల గుంపు (క్లస్టర్) ద్వారా అని సమాధానమిస్తారు దతార్ కేన్సర్ జెనెటిక్స్కు చెందిన వినీత్ దత్తా. నాసిక్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ కేన్సర్‌ను తొలిదశల్లోనే గుర్తించడంతో పాటు, మెరుగైన చికిత్స మార్గాలను కూడా సూచించే సరికొత్త రక్త పరీక్షను సిద్ధం చేసింది. రక్తంలో కేన్సర్ కణితి అవశేషాల (డీఎన్ఏ, ఆర్ఎన్ఏ వంటివి) ఆ ధారంగా వ్యాధిని నిర్ధారించేందుకు ఇప్పటికే లిక్విడ్ బయాప్సీ పేరుతో ఒక పద్ధతి అందుబాటులో ఉంది. అయితే అతి తక్కువ సంఖ్యలో ఉండే ఈ అవశే షాలను గుర్తించడం చాలా కష్టం. ‘కణితి నుంచి వి డిపోయిన కణాలు, డీఎన్ఏ ముక్కలు, ఆర్ఎన్ల వంటి అనేక బయో మార్కర్లను గుర్తించడం కష్టం. చాలాసార్లు తప్పుడు ఫలితాలు కూడా చూపిస్తాయి. అందుకే దతార్ కేన్సర్ జెనెటిక్స్ వీటిపై కాకుండా ప్రత్యేకమైన కణాల గుంపు ద్వారా కేన్సర్‌ను నిర్ధారిస్తుంది’అని వినీత్ దత్తా ‘సాక్షి’కి తెలిపారు. వారంలోనే ఫలితాలు..: ప్రస్తుతం కేన్సర్ నిర్ధారణ పరీక్షకు కనీసం నాలుగైదు వారాలు పడుతుంది. దతార్ జెనెటిక్స్ తయారుచేసిన పరీక్ష ద్వారా వా రంలోనే ఫలితాలు తెలుసుకోవచ్చు. ఏ రకమైన కేన్సర్ ఉంది? ఏ రకమైన మందులకు మెరుగ్గా స్పందిస్తుంది? దుష్ప్రభావాలు తక్కువగా ఉండటంతో పాటు మెరుగైన ఫలితాలిచ్చే మందులు వంటివి కూడా ఒకే పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. సుమారు 16 వేల మందితో తాము జరిపిన అధ్యయనంలో 90 శాతం కచ్చితత్వంతో కేన్సర్‌ను నిర్ధారించగలిగామని, ఏ రకమైన కేన్సర్ అన్నది 97 శాతం కచ్చితంగా చెప్పగలమని వినీత్ తెలిపారు. ఖరీదు మాటేమిటి?: కేన్సర్ నిర్ధారణ చికిత్సలకు ప్రస్తుతం అవుతున్న వ్యయం చాలా ఎక్కువ. అయితే తాము అభివృద్ధి చేసిన పరీక్ష చాలా చౌకగా అందరికీ అందుబాటులో ఉండేలా ఉంటుందని వినీత్ అంటున్నారు. దేశంలో ఏటా లక్షల మంది కేన్సర్ బారిన పడుతుండగా చాలామందిలో పరీక్షలు చేయించుకునే స్తోమత ఉండదు. మహిళలకు వచ్చే రొమ్ము, గర్భాశయ ముఖద్వార కేన్సర్ల విషయంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ‘ఈ రక్త పరీక్షలను నగర ప్రాంతాలకే కాక, గ్రామీణ ప్రాంతాల్లోనూ అందుబాటులో ఉండేలా చూడాలని నిర్ణయించాం. సొంతంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీ కాబట్టి ఖర్చు కూడా తక్కువగానే ఉంటుంది’అని వినీత్ వి వరించారు. ఈ విషయంలో ఇతర సంస్థలతో కలిసి పనిచేసేందుకు దతార్ జెనెటిక్స్ సిద్ధంగా ఉందన్నారు. ప్రస్తుతానికి తాము రక్త కేన్సర్లను గుర్తించలేమని.. మరిన్ని పరిశోధనల ద్వారా దీన్ని కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నా రు. మరిన్ని వివరాల కోసం https:// datarpgx. com/ వెబ్‌సైట్‌ను చూడొచ్చని పేర్కొన్నారు. -
ట్యాగ్ నుంచి పేటెంటెడ్ టెక్నాలజీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లైవ్‌స్టాక్ టెక్నాలజీ కంపెనీ ట్రాపికల్ యానిమల్ జెనెటిక్స్ (ట్యాగ్) పేటెంటెడ్ టెక్నాలజీ ‘ట్రాపికల్ బొవైన్ జెనెటిక్స్’ను అందుబాటులోకి తెచ్చింది. పాడి రైతుల ఆదాయం పెంపు లక్ష్యంగా దీనిని అభివృద్ధి చేసినట్టు ట్యాగ్ ఎండీ ప్రవీణ్ కిని వెల్లడించారు. కంపెనీ కో–ఫౌండర్ ఆలూరి శ్రీనివాస రావు, ఫ్యూచర్ టెక్నాలజీ ఆర్కిటెక్ట్ బ్రూస్ వైట్లాతో కలిసి సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ‘భారత్‌లో ఆవు/గేదె ఏడాదికి సగటున 1,500 లీటర్లు ఇస్తుంది. మా టెక్నాలజీతో ఇది 4,000 లీటర్లకు చేరుతుంది. ఎంబ్రియో టెక్నాలజీ కారణంగా ఆవుల ఉత్పాదకత గణనీయంగా పెరుగుతుంది. మరో విధానమైన ప్రెగ్నెన్సీ ఫ్రీ లాక్టేషన్ పద్ధతిలో ఆవు గర్భం దాల్చకుండానే పాలను ఇస్తుంది. ప్రతి ఏడాది ఒక ఇంజెక్షన్ ఇస్తే చాలు. పశువు జీవిత కాలం అంతా పాలను అందిస్తుంది. గుజరాత్‌లోని ఆనంద్‌లో ఏడాదికి ఒక లక్ష అండాలను అభివృద్ధి చేయగలిగే సామర్థ్యమున్న ప్లాంటు ఉంది. ఇటువంటి కేంద్రం ఒకటి తెలంగాణ లేదా అంధ్రప్రదేశ్‌లో నెలకొల్పుతాం. ఇప్పటికే కంపెనీలో రూ.56 కోట్లు వెచ్చించాం’ అని వివరించారు. -
జన్యుమార్పిడి వంగ అక్రమ సాగుతో కలకలం
నిషేధం ఉన్నప్పటికీ జన్యుమార్పిడి వంగ పంట హర్యానాలో సాగులో ఉన్న విషయం కలకలం రేపింది. అనుమతి లేని కలుపు మందును తట్టుకునే బీటీ పత్తి కొన్ని లక్షల ఎకరాల్లో సాగులోకి వచ్చినట్టుగానే నిషిద్ధ జన్యుమార్పిడి వంగ పంట కూడా పొలాల్లోకి వచ్చిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పదేళ్ల క్రితం బీటీ వంగ రకాన్ని ప్రైవేటు కంపెనీ తయారు చేసినప్పుడు దేశవ్యాప్తంగా అప్పటి పర్యావరణ మంత్రి జయరామ్ రమేశ్ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపితే.. వ్యతిరేకత వెల్లువెత్తింది. అంతటితో బీటీ వంగపై కేంద్రం నిషేధం విధించింది. పదేళ్ల తర్వాత ఈ వంగడం రైతు పొలంలో కనిపించడం ఏమాత్రం సమర్థనీయంగా లేదు. కాయతొలిచే పురుగును తట్టుకుంటుందని చెబుతున్న బీటీ వంగను ఫతేబాద్‌లో ఒక రైతు సాగు చేస్తున్నట్టు వెల్లడైంది. బస్టాండ్ల దగ్గరల్లో విత్తనాల దుకాణాల్లో విత్తనం కొన్నట్లు ఆ రైతు చెబుతున్నారు. మన దేశంలో నిషేధించిన మూడేళ్ల తర్వాత 2013లో బంగ్లాదేశ్ ప్రభుత్వం బీటీ వంగ సాగును అనుమతించింది. మొదట్లో కొన్నాళ్లు కాయతొలిచే పురుగును తట్టుకున్న బీటీ వంగ, ఆ తర్వాత తట్టుకోలేకపోతున్నదని సమాచారం. అక్రమ పద్ధతుల్లో బీటీ వంగ వంగడాన్ని రైతులకు అందిస్తుండడంపై జన్యుమార్పిడి వ్యతిరేక వర్గాలు మండిపడుతున్నాయి. ‘మనకు 3,000కు పైగా వంగ రకాలు ఉన్నాయి. బీటీ వంగ పండించడం మొదలు పెడితే ఈ సంప్రదాయ వంగడాలన్నీ జన్యుకాలుష్యానికి గురవుతాయి. వంగ పంటలో జీవవైవిధ్యం అడుగంటిపోతుంది. పత్తిలో జరిగింది ఇదే..’ అని కోలిషన్ ఫర్ ఎ జీఎం ఫ్రీ సంస్థ ప్రతినిధి శ్రీధర్ రాధాకృష్ణన్ అన్నారు. అధికారులు బీటీ వంగ సాగవుతున్న పొలాల నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించాలి. నిషిద్ధ విత్తనాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో కనిపెట్టాలి. జన్యుమార్పిడి బీటీ పత్తి మొక్కలను ధ్వంసం చెయ్యాలి. నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పించడంతోపాటు నిషిద్ధ విత్తనాలు రైతులకు అంటగడుతున్న కంపెనీలపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కోరుతున్నారు. రైతులు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ‘ఎందరు రైతులు సాగు చేస్తున్నారో..’ ఫతేబాద్‌లో రైతు సాగు చేస్తున్న వంగ తోట నుంచి నమూనాలను సేకరించి న్యూఢిల్లీలోని జాతీయ మొక్కల జన్యువనరుల బ్యూరో(ఎన్.బి.పి.జి.ఆర్.)కు పరీక్షల నిమిత్తం పంపామని, పది రోజుల్లో ఫలితం వెలువడుతుందని హర్యానా ఉద్యాన శాఖ డైరెక్టర్ జనరల్ అర్జున్ సింగ్ శైని తెలిపారు. ‘ఇది బీటీ వంగే అని తేలితే దాన్ని అరికట్టడానికి చాలా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఆ పొలంలో పంటను ధ్వంసం చేయాలి. ఆ విత్తనాలు రైతు చేతికి ఎవరెవరి చేతులు మారి వచ్చాయన్నది నిగ్గుతేల్చాల్సి ఉంటుంది. బీటీ వంగ అక్రమంగా సాగవుతుండడమే నిజమైతే దేశంలో ఇంకా ఎంత మంది రైతుల దగ్గరకు ఈ విత్తనాలు చేరాయో కనిపెట్టాల్సి ఉంటుంది’ అని శైని అన్నారు. బీటీ వంగ, నాన్ బీటీ వంగ -
జీవజాతులపై పరిశోధనలు అవసరం
సాక్షి, హైదరాబాద్: జీవశాస్త్రవేత్తల ప్రయోగాలు ఎలుకలు, బొద్దింకలు, ఈగలు వంటి నమూనా జంతువులకే పరిమితం చేయకుండా అన్ని రకాల జీవజాతులపై పరిశోధనలు జరపాలని నోబెల్ గ్రహీత మార్టిన్ షాలిఫీ సూచించారు. ఆవిష్కరణలు, పరిశోధనలు ఒక్కరివల్ల అయ్యేవి కావని, ఆయా రంగాల్లో కృషి చేస్తున్న ఇతర శాస్త్రవేత్తల సహకారం కూడా అవసరమని తెలిపారు. హైదరాబాద్‌లో జరుగుతోన్న ‘కణజీవశాస్త్ర అంతర్జాతీయ సదస్సు’కు ఆయన హాజరై మాట్లాడారు. గ్రీన్ ఫ్లోరోసెంట్ ప్రొటీన్ ఆవిష్కరణ ద్వారా జీవిలో చూడలేని జన్యుపరమైన చర్యలను ప్రత్యక్షంగా చూసేలా చేశామన్నారు. జన్యుశాస్త్రంలో మౌలిక పరిశోధనలు వేగం పుంజుకునేందుకు, హెచ్ఐవీ పరిశోధనల్లోనూ ఈ ఆవిష్కరణ కీలకంగా మారిందని చెప్పారు. వీటితోపాటు మందుపాతరల గుర్తింపునకు, చీకట్లో వెలుగులు చిమ్మే పట్టుతయారీకి పనికొచ్చిందని తెలిపారు. గొప్ప ఆవిష్కరణల్లో చాలావరకూ యాదృచ్ఛికంగా జరిగినవేనన్నారు. ఘనంగా ప్రారంభమైన ఐసీసీబీ కణజీవశాస్త్రంలో కృషి చేస్తున్న శాస్త్రవేత్తలందరినీ ఒకే వేదికపైకి చేర్చే లక్ష్యంగా తొలిసారి హైదరాబాద్‌లో నిర్వహిస్తోన్న ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆన్ సెల్ బయాలజీ–2018 శనివారం ఘనంగా ప్రారంభమైంది. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) ఆసియా పసిఫిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ సెల్ బయాలజిస్ట్, ఇండియన్ సొసైటీ ఫర్ సెల్ బయాలజిస్ట్ వంటి సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. నాలుగు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో దాదాపు 1200 మంది జాతీయ, అంతర్జాతీయ శాస్త్రవేత్తలు పాల్గొంటున్నారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన శాఖ సహాయ మంత్రి వై.ఎస్.చౌదరి ఆదివారం హాజరు కానున్నారు. -
క్రికెటర్లకు జన్యు పరీక్షలు!
ముంబై: స్కిన్‌ఫోల్డ్ టెస్ట్... డెక్సా టెస్ట్... యోయో టెస్ట్... అన్నీ అయిపోయాయి. ఇప్పుడు క్రికెటర్ల జన్యు రహస్యాలు కూడా తెలుసుకునే పనిలో బీసీసీఐ పడింది! ఫిట్నెస్ విషయంలో ఎక్కడా రాజీ పడరాదని నిర్ణయించుకున్న బోర్డు, ఇందులో భాగంగా భారత ఆటగాళ్లందరికీ డీఎన్ఏ టెస్టులు నిర్వహిస్తోంది. దీని ద్వారా ఆటగాడు శరీరంలోని కొవ్వును కరిగించుకునేందుకు, కండరాల పటిష్టతకు అవకాశం ఏర్పడటంతో పాటు వేగం పెంచుకునేందుకు, కోలుకునే సమయం గురించి మరింత స్పష్టత వచ్చేందుకు కూడా ఈ టెస్టు ఉపయోగపడుతుంది. ప్రస్తుతం భారత జట్టులో సభ్యుడైన ఆటగాడి శరీరంలో 23 శాతానికి మించి కొవ్వు ఉండరాదు. జనెటిక్ ఫిట్నెస్ టెస్టుగా కూడా పిలుచుకునే ఈ పరీక్షతో ఆటగాడి శరీరానికి సంబంధించి 40 రకాల జీన్స్ గురించి సమస్త సమాచారం అందుబాటులోకి వస్తుంది. టీమ్ ట్రైనర్ శంకర్ బసు సూచన మేరకు దీనిని తీసుకొచ్చారు. దీనిని నిర్ధారించిన బీసీసీఐ అధికారి ఒకరు ఈ పరీక్ష కోసం ఒక్కో ఆటగాడికి గరిష్టంగా రూ.30 వేలు అవసరమవుతుందని, అది పెద్ద మొత్తమేమీ కాదని చెప్పారు. ప్రఖ్యాత ఎన్బీఏ, ఎన్‌ఎఫ్‌ఎల్‌లలో కూడా డీఎన్ఏ టెస్టు అమల్లో ఉంది. -
భార్యాభర్తలు విడిపోవడానికి కీలక కారణం ఇదే?
వాషింగ్టన్: కొన్ని కుటుంబాల్లో దంపతులు విడాకులు తీసుకోవటానికి లేదా విడిపోవటానికి గల కీలక కారణం తెలిసిపోయింది. విడాకులు తీసుకున్న దంపతుల పిల్లలు కూడా తమ భాగస్వామితో విడిపోయేందుకు గల అవకాశాలను పరిశీలించిన పరిశోధకుల బృందం అందుకు జన్యువులే కారణంగా తేల్చారు. ఒక ప్రత్యేకమైన జీన్స్ వల్లనే కొన్ని కుటుంబాల్లో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోందని కనిపెట్టారు. దత్తత కుటుంబాల్లో ఉన్న పిల్లలు తమను కన్నవారి మాదిరిగానే విడాకులు తీసుకునే సందర్భాలు ఎక్కువగా ఉన్నట్లు యూఎస్‌లోని వర్జినియా కామన్వెల్త్ వర్సిటీ పరిశోధకులు తేల్చారు. ఇటువంటి పిల్లలు తమను దత్తత తీసుకున్న దంపతుల మాదిరిగా కలిసి ఉండలేక పోతున్నారని స్వీడన్ జనగణన రికార్డుల ఆధారంగా కనుగొన్నారు. ఫ్యామిలీ రికార్డుల ప్రకారం... విడిపోయిన దంపతుల పిల్లలు తమ తల్లిదండ్రుల మాదిరిగానే భాగస్వామితో తలెత్తే సమస్యలను పరిష్కరించుకోలేకపోతున్నారని, కలిసి ఉండటంపై నిబద్ధత, సానుకూల దృక్పధం చూపలేకపోతున్నారని పరిశోధకులు చెబుతున్నారు. తల్లిదండ్రుల మధ్య ఘర్షణను చూస్తూ పెరిగిన పిల్లలు అవే లక్షణాలను అలవర్చుకుంటున్నారని అంటున్నారు. ఇదే ఒరవడి తరాలుగా కొనసాగుతూ వస్తోందని భావిస్తున్నారు. కుటుంబ పరిణామంలో ఇది కీలకమైన ఆవిష్కరణ అని తెలిపారు. విడాకుల జీన్స్ ఉన్న వారిని వైద్యుల సరైన పర్యవేక్షణ, మార్గదర్శనం ద్వారా సరైన మార్గంలో నడిచేలా చేసే వీలుంటుందని చెప్పారు. -
ఒక్క సిగరెట్ కూడా ప్రమాదకరమే!
చాలా మంది సిగరెట్ మానేసే ప్రక్రియలో రోజుకు ఒక్కటే తాగుతుంటామని, అలా క్రమంగా తగ్గిస్తామని అనుకుంటుంటారు. అయితే రోజుకు ఒక్క సిగరెట్ మాత్రమే కాదు... సగం సిగరెట్ అయినా అది ప్రమాదకరమే అంటున్నారు యూఎస్‌లోని నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు చెందిన నిపుణులు. ఆ సంస్థలోని క్యాన్సర్ ఎపిడెమియాలజీ అండ్ జెనెటిక్స్ విభాగానికి చెందిన మాకీ ఇన్యోయ్ చోయ్ అనే శాస్త్రవేత్త మాట్లాడుతూ... ‘‘రెండు... ఒకటి... అనే లెక్కలతో ఏమాత్రం ప్రయోజనం లేదు. సిగరెట్ అంటూ ముట్టించాక... అది సగమైనా సరే ప్రమాదకరమే’’ అంటున్నారు. ఆమె ఆధ్వర్యంలో 59 నుంచి 82 ఏళ్ల వయసులో ఉన్న దాదాపు మూడు లక్షల మందిపై ఒక అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయన ఫలితాల గురించి ఆమె మాట్లాడుతూ ‘‘కొంతమంది తమ అలవాటు మానలేక సిగరెట్ వెలిగించి, సగం సిగరెట్ అంటూ ఒకటి రెండు పఫ్స్ తీసుకుంటారు. అయితే అస్సలు సిగరెట్ తాగని వాళ్లతో పోల్చినప్పుడు ఇలా ఒకటి, రెండు ఫప్స్ తీసుకునే 64 శాతం మందికి పొగాకుతో కలిగే ముప్పులన్నీ వస్తుంటాయని హెచ్చరిస్తున్నారామె. ఇలా ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే రిస్కు సాధారణ ప్రజల్లో కంటే 12 రెట్లు ఎక్కువని వివరించారు. అలాగే పొగాకు అలవాటు లేని సాధారణ వ్యక్తితో పోలిస్తే సిగరెట్ తాగేవాళ్లలో ఎంఫసిమా వంటి శ్వాసకోశ వ్యాధులు వచ్చే రిస్క్ సైతం రెండున్రర రెట్లు ఎక్కువని చెబుతున్నారు. స్మోకింగ్‌ను క్రమంగా తగ్గించడం కంటే అకస్మాత్తుగా ఆపేయడం ఏ వయసులో వారికైనా సురక్షితమే అంటున్నారు ఆమెతోపాటు అధ్యయనంలో పాల్గొన్న వైద్య నిపుణులు.