సాక్షి,హైదరాబాద్:కేంద్రీయ విద్యాలయాల విద్యార్థుల నుంచి డీఎన్‌ఏ సైంటిస్టులను తయారు చేసేందుకు బ్రిక్ సెంటర్‌ఫర్ ఫర్ డీఎన్‌ఏ ఫింగర్‌ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ (సీడీఎఫ్‌డీ) కొత్త ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ‘జెనెటిక్స్‌ఫర్‌యు’ సహకారంతో ‘గ్యాన్‌దీప్’ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఈ ప్రోగ్రామ్‌కు ఇండియా బయోసైన్సెస్ సంస్థతో పాటు హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయ యూనిట్ సంయుక్తంగా నిధులు సమకూ ర్చనున్నాయి.
‘గ్యాన్‌దీప్’ ప్రారంభ సెషన్ శుక్రవారం (నవంబర్ 22) సీడీఎఫ్‌డీ ఆవరణలో జరిగింది. సీడీఎఫ్‌డీ హెడ్‌ఆఫ్ సైన్స్ అండ్ కమ్యూనికేషన్ డాక్టర్ వర్ష, స్టాఫ్ సైంటిస్ట్ శ్వేతత్యాగి ఆధ్వర్యంలో ఈ సెషన్‌ను నిర్వహించారు. డీఎన్‌ఏ, జెనెటిక్స్ గురించి ఈ సెషన్‌లో డాక్టర్ చందనబసు పిల్లలకు వివరించారు.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌లోని పలు కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. డీఎన్‌ఏ,జెనెటిక్స్,సెల్‌సైకిల్ తదితర అంశాల గురించి ఆసక్తిగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అరటిపండ్ల నుంచి డీఎన్‌ఏను వేరు చేశారు. పలువురికి బహుమతులు ప్రదానం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment