Kendriya Vidyalaya schools
-
‘గ్యాన్‌దీప్’.. పిల్లలను డీఎన్ఏ సైంటిస్టులు చేయడమే టార్గెట్
సాక్షి,హైదరాబాద్:కేంద్రీయ విద్యాలయాల విద్యార్థుల నుంచి డీఎన్ఏ సైంటిస్టులను తయారు చేసేందుకు బ్రిక్ సెంటర్‌ఫర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్‌ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ (సీడీఎఫ్‌డీ) కొత్త ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ‘జెనెటిక్స్ఫర్యు’ సహకారంతో ‘గ్యాన్‌దీప్’ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఈ ప్రోగ్రామ్‌కు ఇండియా బయోసైన్సెస్ సంస్థతో పాటు హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయ యూనిట్ సంయుక్తంగా నిధులు సమకూ ర్చనున్నాయి.‘గ్యాన్‌దీప్’ ప్రారంభ సెషన్ శుక్రవారం (నవంబర్ 22) సీడీఎఫ్‌డీ ఆవరణలో జరిగింది. సీడీఎఫ్‌డీ హెడ్ఆఫ్ సైన్స్ అండ్ కమ్యూనికేషన్ డాక్టర్ వర్ష, స్టాఫ్ సైంటిస్ట్ శ్వేతత్యాగి ఆధ్వర్యంలో ఈ సెషన్‌ను నిర్వహించారు. డీఎన్ఏ, జెనెటిక్స్ గురించి ఈ సెషన్లో డాక్టర్ చందనబసు పిల్లలకు వివరించారు.ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌లోని పలు కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. డీఎన్ఏ,జెనెటిక్స్,సెల్సైకిల్ తదితర అంశాల గురించి ఆసక్తిగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అరటిపండ్ల నుంచి డీఎన్ఏను వేరు చేశారు. పలువురికి బహుమతులు ప్రదానం చేశారు. -
బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో 20 మంది విద్యార్థులకు అస్వస్థత..
-
‘కేంద్రీయ’ విద్య అందేనా?
అనకాపల్లి: అనకాపల్లిలో కేంద్రీయ విద్యాలయం ఈ ఏడాదైనా ఏర్పాటయ్యేనా అని పట్టణ ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వంలో ఎంపీ అవంతి శ్రీనివాసరావు అనకాపల్లిలో కేంద్రీ య విద్యాలయం ఏర్పాటుకు ప్రత్యేక కృషి చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రప్పిం చారు. అనకాపల్లి పరిధిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కార్యకలాపాలు, నేవల్ బేస్, బుచ్చెయ్యపేట కొండపై ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక రక్షణ దళ ఉద్యోగుల పిల్లలకు అనకాపల్లి కేంద్రంగా ఏర్పాటయ్యే కేంద్రీయ విద్యాలయంలో చదివేందుకు అవకాశాలు కల్పించాల ని నిర్ణయించారు. గత మూడేళ్ల నుంచి కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ పూర్తయ్యింది. తాత్కాలిక భవనాలలో ప్రారంభానికి ఆటంకం... అనకాపల్లి కేంద్రంగా ఏర్పాటు చేయనున్న కేంద్రీయ విద్యాలయాన్ని సుందరయ్యపేట పంచాయతీ శివారు అచ్చియ్యపేటలోని సర్వే నంబర్ 511లో స్థలాన్ని కేటాయించారు. ఈ స్థలంలో రోడ్డును కూడా ఏర్పాటు చేశారు. రేపో మాపో కేంద్రీయ విద్యాలయం ప్రారంభం అవుతుందని ఆశ పడుతున్న సమయంలో సాంకేతిక అవరోధాలు ఇబ్బందికి గురి చేశాయి. దీనికి తోడు అనకాపల్లి పట్టణంలోని ఉడ్‌పేట ఎలిమెంటరీ పాఠశాలలో రూ.10 లక్షల నిధులతో కేంద్రీయ విద్యాలయం తరగతులను తాత్కాలిక ప్రాతిపదికన ప్రారంభించాలని నిర్ణయించారు. దీనికి గాను భవనాలు, మరుగుదొడ్లు కూడా నిర్మించారు. అయితే కేంద్రీయ విద్యాలయం అధికారులు మాత్రం తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాటు చేసే భవనాల్లో తరగతులు ప్రారంభించమని ఖరాఖండీగా చెప్పేశారు. తాత్కాలిక ప్రాతిపదికన.. ఉత్తరాదిన ఇదే తరహాలో తాత్కాలిక ప్రాతిపదికన కేంద్రీయ విద్యాలయం తరగతులు ప్రారంభిస్తే తర్వాత శాశ్వత ప్రాతిపదికన భవనాలు నిర్మిస్తామని అక్కడి పాలకులు చెప్పి తీరా కేంద్రీయ విద్యాలయం ప్రారంభించాక స్థలం కేటాయించలేదని ఈ కారణంగా దేశం మొత్తం మీద ఎక్కడయితే శాశ్వత ప్రాతిపదికన భవనాలు కేటాయించి భవనాలు నిర్మించడంతో పాటు, వనరులు కల్పిస్తేనే తరగతులు ప్రారంభిస్తామని చెబుతున్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరిగినా ప్రభుత్వం ఏర్పాటయ్యేందుకు ఇంకా సమయం పడుతుంది. ఈ క్రమంలో కేంద్రీయ విద్యాలయం అధికారులు దృష్టి సారించి ఈ ప్రాంత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలతో పాటు మెరిట్ విద్యార్థులకు అడ్మిషన్లు ఇప్పించాలనే వాదన వినవస్తుంది. ఈ అంశం కేంద్రీయ విద్యాలయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ప్రజలు కోరుకుంటున్నారు. డిప్యూటీ కమిషనర్ సిపారసులపైనే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్రీయ విద్యాలయాల డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ పర్యటించారు.ఆయన తాత్కాలిక ప్రాతిపదికన నిర్మించిన భవనాలతో పాటు, అచ్చియ్యపేటలో స్థలాన్ని పరిశీలించారు. ఆయన ఇచ్చిన సూచనలు అమలైతే తప్ప కేంద్రీయ విద్యాలయం ప్రారంభం అయ్యే అవకాశం లేదని విద్యాశాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తరఫున ఎవరైనా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజల కోసం ఆలోచించాలి కేంద్రం స్థానిక ప్రజల అవసరాలను పరిగణనలోకి తీసుకురావాలి. గత మూడేళ్ల నుంచి కేంద్రీయ విద్యాలయం ప్రారంభిస్తామని చెబుతున్నారు. దీనికి గానూ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న భూములు ఇవ్వడంతో పాటు ఎటువంటి సాంకేతిక ఇబ్బందులు లేకుండా చూడాలి. ఎన్నికల ఫలితాల ఆలస్యంగా వచ్చే అవకాశం ఉన్నందున కేంద్రీయ విద్యాలయం అధికారులు చొరవ చూపాలి. వచ్చే ఎన్నికల ఫలితాల అనంతరం కొలువు దీరనున్న జగనన్న ఇటువంటి విద్యా సంస్థల ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి కచ్చితంగా ప్రారంభిస్తారు. – గుడివాడ అమర్నాథ్,వైఎస్సార్సీపీ సమన్వయకర్త, అనకాపల్లి -
కేంద్రీయ స్కూళ్ల భూసేకరణ నిబంధనలు సడలింపు
కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రీయ విద్యాలయ స్కూళ్ల ఏర్పాటుకు భూసేకరణ నిబంధ నలను కేంద్రం సడలించిందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. పలు నగరాల్లో కేంద్రీయ విద్యాలయాల స్కూళ్ల నిర్మాణాని కి అవసరమైన భూమి లభించకపోవడంతో నిబంధనలను సడలించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. మెట్రో నగరాలలో కేంద్రీ య స్కూళ్ల నిర్మాణానికి ప్రస్తుతం అవసర మున్న 4 ఎకరాల భూమిని రెండున్నర ఎకరాలకు, గ్రామీణ ప్రాంతాల్లో 10 ఎక రాల నిబంధనను 5 ఎకరాలకు, పట్టణాల్లో 8 ఎకరాల నిబంధనను 5 ఎకరాలకు తగ్గిం చినట్లు మంత్రి తెలిపారు. ఢిల్లీలో గురు వారం కేంద్రీయ విద్యాలయ స్కూల్‌కు శంఖుస్థాపన చేసిన తర్వాత ఆయన మాట్లా డుతూ కేంద్రీయ స్కూళ్లలో అడ్మిషన్ ప్రక్రి య కోసం ఈ ఏడాది నుంచి ఆన్లైన్ వ్యవ స్థ ఏర్పాటుచేసినట్లు చెప్పారు. కేంద్రీయ స్కూళ్లలో 6 వేలకు పైగా టీచర్లను నియ మించే ప్రక్రియను కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ప్రారంభించిందని తెలిపారు. -
ఇది అధికార దుర్వినియోగం కాదా ?
న్యూఢిల్లీ: దేశంలోని కేంద్రీయ విద్యా సంస్థల్లో ఈ ఏడాది అడ్మిషన్ల కోసం కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఏకంగా 5,100 మంది విద్యార్థులను సిఫార్సు చేశారు. కేంద్ర మంత్రిగా, కేంద్రీయ విద్యాలయ్ సంఘటన్ చైర్‌పర్సన్‌గా ప్రతి విద్యా సంవత్సరానికి కేవలం 1200 మంది విద్యార్థుల అడ్మిషన్ కోసం మాత్రమే ఆమె సిఫార్సు చేసే వీలుంది. ఏకంగా నాలుగింతలుకన్నా ఎక్కువ మందిని సిఫార్సు చేయడం ఇప్పుడు ట్విట్టర్లో చర్చ నీయాంశమైంది. స్మృతి ఇరానీ చేసిన మొత్తం 5,100 మంది విద్యార్థుల సిఫార్సుల్లో ఇటీవల జరిగిన కేంద్రీయ విశ్వవిద్యాలయ బోర్డు సమావేశంలో 3,000 సిఫార్సులను మాత్రమే అంగీకరించారు. వాటిని మంత్రిగారి సిఫార్సులని కూడా పేర్కొన్నారు. మంత్రి చేసిన సిఫార్సుల్లో కొంత మంది విద్యార్థులు స్వచ్ఛందంగా అడ్మిషన్ల నుంచి తప్పుకోగా మరికొంత మంది విద్యార్థుల అడ్మిషన్లను వివిధ కారణాల వల్ల బోర్డు తిరస్కరించినట్టు తెలుస్తోంది. మంత్రిగారి మిగతా సిఫార్సులను ఎందుకు తిరస్కరించారన్న అంశంపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ దర్యాప్తు జరుపుతున్నట్టు కూడా తెలిసింది. గతంలో ఏ ప్రభుత్వం కూడా 1500 మంది విద్యార్థులకు మించి సిఫార్సు చేయలేదు. దేశంలో అవినీతి అక్రమాలను సమూలంగా నిర్మూలిస్తానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పదేపదే చెబుతున్న సందర్భంలో ఆయన కేబినెట్ మంత్రి ఇంతమంది విద్యార్థులను నిబంధనలకు విరుద్ధంగా సిఫార్సు చేయడం ఏమిటని ట్విట్టర్లో ప్రశ్నిస్తున్నారు. విద్య అందని పండైన నిమ్న, వెనుకబడిన వర్గాల విద్యార్థులనే తాను ఎక్కువగా సిఫార్సు చేశానని, వాటిలో పార్టీలతో ప్రమేయం లేకుండా తనను ఆశ్రయించిన కొంత మంది ఎంపీల సిఫార్సులు కూడా ఉన్నాయని, జ్యోతిరాదిత్య సింధియా లాంటి కాంగ్రెస్ ఎంపీలు కూడా ఉన్నారంటూ స్మృతి ఇరానీ ట్విట్టర్లో సమర్థించుకున్నారు. పైగా మీడియాలో ఈ విషయమై వచ్చిన వార్తా కథనంలో రెండు వ్యాక్యాలే నిజమని, మిగతాదంతా వారి ఎజెండా ప్రకారం రాసుకున్నారని ఆరోపించారు. ఎంపీలు సిఫార్సు చేయమంటే మాత్రం నిబంధనలకు నీళ్లొదులుతారా ? అంటూ కొంత మంది నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు. పైగా ఇప్పటికే ఏడాదికి ఆరుగురు విద్యార్థుల అడ్మిషన్లకు సిఫార్సు చేసే అవకాశం ప్రతి ఎంపీకి ఉంది. ఈ కోటాను వచ్చే ఏడాది నుంచి పదికి పెంచుతూ ఇటీవలనే కేంద్రీయ విద్యాలయ బోర్డు నిర్ణయం తీసుకొంది. దీంతో ఎంపీల కోటా 7,900కు పెరిగింది.