Younger sister
-
లంక సిస్టర్స్.. ఇద్దరూ డాక్టర్స్..!
పెనుగొండ(పశ్చిమగోదావరి): ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు నీట్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించి భళా అనిపించారు. ఆచంట మండలం అయోధ్యలంక గ్రామానికి చెందిన గొర్రె వెంకటేశ్వరరావు కుమార్తెలు సాయి తేజస్వి, ఐశ్వర్య ఈ ఘనత సాధించారు. ఇప్పటికే బీడీఎస్ పూర్తిచేసిన సాయితేజస్వి, నీట్ (ఎండీఎస్)లో జాతీయస్థాయిలో 1048 ర్యాంకు సాధించింది. చదవండి: బంగారం ధర పెరుగుతుందా..? తగ్గుతుందా?.. విశ్లేషకులు ఏం చెబుతున్నారు? అక్క స్ఫూర్తితో ఐశ్వర్య కూడా ఈ ఏడాది నీట్లో జాతీయస్థాయిలో 7395 ర్యాంకు సాధించింది. వెంకటేశ్వరరావు ప్రస్తుతం విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తున్నారు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి డాక్టర్లుగా అవకాశం రావడంపై కుటుంబసభ్యులతో పాటు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
తన భార్య సొంత చెల్లిని పెళ్లాడిన స్టార్ హీరో.. కష్టాలతో జీవితం
Actor Karthik Married His Wife Younger Sister: సీనియర్ హీరో కార్తిక్ అంటే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కోలీవుడ్ హీరో అయిన కార్తిక్ సీతాకోక చిలుక వంటి క్లాసిక్ మూవీతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తర్వాత అనుబంధం, అన్వేషణ, పుణ్యస్త్రీ, అభినందన, గోపాల్ రావు గారి అబ్బాయి, మగ రాయుడుతోపాటు కల్యాణ్ రామ్ ఓమ్ 3డి సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు. కొద్ది రోజులు సినిమాలకు గ్యాప్ తీసుకున్న కార్తీక్ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో విలన్‌గా రాణిస్తున్నాడు. అయితే కార్తీక తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు. తెలుగు, తమిళ భాషల్లో కలిపి సుమారు 125కిపైగా చిత్రాల్లో నటించిన కార్తీక్ 1988లో సహనటి రాగిణిని వివాహం చేసుకున్నాడు. కార్తీక్, రాగిణి ఇద్దరూ సోలైకుయిల్ సిమాలో కలిసి నటించారు. వీరికి గౌతమ్ కార్తీక్, ఘైన్ కార్తీక్ కుమారులు ఉన్నారు. గౌతమ్ కార్తీక్ 'కడలి' మూవీతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అనంతరం రాగిణి సోదరి రథిని 1992లో రెండో వివాహం చేసుకున్నాడు కార్తీక్. వీరిద్దరికి తిరన్ కార్తీక్ కొడుకు ఉన్నాడు. చదవండి: నా వల్లే భారతీయ రైల్వేస్‌కు ఆదాయం పెరిగింది: కరీనా కపూర్ అప్పటివరకు ఉజ్వలంగా సాగిన కార్తీక్ కెరీర్ 2000 సంవత్సరం తర్వాత ఒడిదొడుకులు ఎదుర్కొంది. 2005లో వచ్చిన నటుడు సత్యరాజ్ 'శివలింగం ఐపీఎస్' సినిమాలో తొలిసారి విలన్‌గా నటించాడు కార్తీక్. అయితే పలు అనివార్య కారణాల వల్ల ఆ చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. తనకున్న చెడు అలవాట్ల వల్లే తన కెరీర్ నాశనం అయిందని ఒక సందర్భంలో స్వయంగా కార్తీక్ తెలిపాడు. చదవండి: ప్రభాస్ అంటే చాలా ఇష్టం, మేము ఫ్రెండ్స్ కూడా: పీవీ సింధు -
ఆడపిల్లకు ఒక అక్క ఉండాలి!
పనిలో ఉన్నాడు అతను. ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. ‘అవునా!’ అన్నాడు మెల్లిగా. ముఖం మీదకు చిరునవ్వు వచ్చి వాలింది. అప్పటికి అతడి లంచ్ అవలేదు. అవకపోయినా కొంచెం వెయిట్ పెరిగినట్లుగా ఫీల్ అయ్యాడు. చేమంతి పుట్టినప్పుడు కాదు.. ఇప్పుడయ్యాడు అతడు ఆడపిల్ల తండ్రి! స్కూల్ నుంచి వచ్చాడు చేమంతి అన్నయ్య. వస్తూనే ‘అమ్మా, చేమంతి ఎక్కడ?’ అని వెతుక్కున్నాడు. అమ్మ పుట్టాక (వాడు పుట్టాక అని అర్థం) అమ్మని వెతుక్కున్నాడు. చెల్లి పుట్టాక చెల్లిని వెతుక్కుంటున్నాడు. నిన్నటి ఆటేదో మధ్యలో ఆపేశారు అన్నాచెల్లెళ్లు. దాన్ని కంటిన్యూ చెయ్యాలి. అందుకే చెల్లి కోసం చూశాడు. ‘ఎక్కడుందో చూడు’ అని చెప్పే తల్లి.. ‘ఎందుకురా చేమంతి?’ అంది ఆరోజు! అదేం గ్రహించలేదు చేమంతి అన్నయ్య. ‘ఎక్కడికెళ్లింది చేమంతి?’ అని అడిగాడు. ‘ఎక్కడికీ వెళ్లలేదు. ఇకనుంచి చెల్లితో ఆటలు తగ్గించు. ఏడిపించడం కూడా..’ అంది తల్లి. తను కూడా కొన్ని తగ్గించింది. మొదట కూతుర్ని ముద్దు చెయ్యడం తగ్గించింది. ఆడపిల్ల ఎదిగాక అకస్మాత్తుగా ఆ ఇంట్లో పాత్రలు మారిపోయాయి. తండ్రి ఆమెకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయ్యాడు. అన్న ఆమెకు ప్రొటెక్షన్ ఫోర్స్ కమాండో. తల్లి ఆమెకు ఆంతరంగిక సలహాదారు. ముగ్గురూ ఆమెకు కొంచెం దూరం కూడా అయ్యారు. రక్షణ వలయం కాస్త ఎడంగానే కదా ఉంటుంది. అమ్మ, నాన్న, అన్నయ్యలా అమ్మాయికి ఒక స్నేహితుడు కూడా ఉంటే అతడు ఆమెకు జడ్ ప్లస్ కేటగిరీ అయ్యేవాడు. చేమంతి ఎందుకైనా మౌనంగా ఉంటే.. ‘ఏమైంది తల్లీ.. ఒంట్లో బాగోలేదా?’ అని తల్లి ఒళ్లోకి లాక్కుంటుంది. ‘పిల్లేంటి డల్‌గా ఉంది’ అని చేమంతి తండ్రి చేమంతి తల్లిని అడుగుతాడు. ‘చేమంతీ.. ఎందుకలా ఉన్నావ్!’ అని అన్నయ్య అడుగుతాడు. ‘ఏమైంది చేమంతీ! నేనేమైనా అన్నానా?’ అని చేమంతి స్నేహితుడు వెనక్కి ఆలోచిస్తాడు. చేమంతి కళ్లలో ఎందుకైనా నీళ్లు తిరుగుతుంటే ‘బయట ఎవరైనా ఏడిపిస్తున్నారా అమ్మా?’ అని తల్లి లోపలికి తీసుకెళ్లి అడుగుతుంది. ‘నేనున్నాను కదరా.. నాకు చెప్పు..’ అని తండ్రి కూతురి తల నిమురుతాడు. ‘చేమంతీ.. ఇలా రా.. కాలేజ్‌లో ఏమైనా జరిగిందా?’ అని అమ్మానాన్న లేకుండా చూసి అన్నయ్య అడుగుతాడు. ‘ఎవడాడు చేమంతీ.. పద’ అని హాకీ స్టిక్ చేతికిచ్చి బైక్ స్టార్ట్ చేస్తాడు చామంతి స్నేహితుడు. (చదవండి: గుడ్ టచ్.. బ్యాడ్ టచ్) పన్నెండేళ్ల వయసుకొచ్చాక ఆడపిల్ల ఒంటికి ప్రొటెక్షన్ వస్తుంది. ఆమె ఆలోచనలకు ప్రైవసీ పోతుంది. ఎవడాడో చెప్పాలి. కాలేజ్‌లో ఏమైందో చెప్పాలి. మౌనంగా ఎందుకుందో చెప్పాలి. కన్నీళ్లు ఎందుకొస్తున్నాయో చెప్పాలి. చెప్పాలని ఉండి కూడా.. అమ్మకీ, నాన్నకీ, అన్నకీ, ఆఖరికి స్నేహితుడికీ చెప్పలేకపోతుంటే? తనే ధైర్యంగా ఉండాలి. తనే ధీమాగా, తనకు తనే హామీగా, తనే భద్రంగా, తనకు తనే రక్షణగా ఉండాలి. అలా ఉండాలంటే ఒక అక్క ఉండాలి. పన్నెండేళ్లు రాగానే ఇంట్లో వాళ్లంతా ఇంటి ఆడపిల్ల కోసం కత్తీ డాలూ పట్టుకుని రెడీ అయిపోతారు. పన్నెండేళ్లు వచ్చాక కాదు, పన్నెండేళ్లు వచ్చేలోపు ఆ కత్తీ డాలు పట్టుకోవడం తనకే తెలిసుండాలంటే ఇంట్లో అక్క ఉండాలి. అమ్మ ఇవ్వలేని అనువు, నాన్న ఇవ్వలేని చనువు, అన్న ఇవ్వలేని సుళువు, స్నేహితుడు ఇవ్వలేని నెలవు అక్క ఇస్తుంది. బయట జరిగింది ఇంట్లో చెప్పుకోడానికే కాదు, ఇంట్లో జరిగింది బయటికి చెప్పుకోడానికీ అక్క ఉండాలి. చెల్లెలికి అక్కను మించిన ఆప్తురాలు, ఆత్మీయ నేస్తం ఎవరూ ఉండరని 38 దేశాల్లో లక్షా 20 వేలమంది పిల్లల్ని స్టడీ చేసి హార్వర్డ్ యూనివర్సిటీ తాజాగా వెల్లడించింది. అక్క గుండె చెల్లెలి కోసం కూడా కొట్టుకుంటుందట. అపరిచితురాలైనా.. ఆపదలో ‘అక్కా..’ అని పిలిస్తే అక్క కాకుండా పోతుందా?! - మాధవ్ శింగరాజు -
అప్పుడు అక్క.. ఇప్పుడు చెల్లి
చిరంజీవి హీరోగా మలయాళ చిత్రం ‘లూసిఫర్’ తెలుగులో రీమేక్ కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఖుష్బూ నటించనున్నారని తెలిసింది. ‘లూసిఫర్’లో చెల్లెలి పాత్ర కీలకమైనది. ఈ పాత్రకే ఖుష్బూని తీసుకున్నారట. 2006లో విడుదలైన ‘స్టాలిన్’ చిత్రంలో చిరంజీవికి అక్కగా నటించారు ఖుష్బూ. ఇప్పుడు 14 ఏళ్ల తర్వాత ‘లూసిఫర్’ చిత్రంలో ఆయనకు చెల్లెలు పాత్రలో నటించనున్నారని సమాచారం. ఈ చిత్రానికి ‘సాహో’ ఫేం సుజిత్ దర్శకత్వం వహించనున్నారు. తెలుగు ప్రేక్షకుల అభిరుచి మేరకు ‘లూసిఫర్’ కథలో పలు మార్పులు చేర్పులు చేశారట. మరోవైపు తమిళంలో రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘అన్నాత్తే’ సినిమా అంగీకరించారు ఖుష్బూ. ప్రస్తుతానికి సూపర్ స్టార్ రజనీ పాత్రకు సంబంధించినవి కాకుండా ఇతర పాత్రధారులతో కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేశ్ హీరోయిన్గా, మీనా కీలక పాత్ర చేస్తున్నారు. -
అక్కా నీ వెంటే నేను
- ఒకే రోజు అక్కాచెల్లెలు మృతి చింతమానుపల్లె(సి.బెళగల్): మరణంలో అక్కాచెల్లెలు బంధం వీడలేదు. అక్క మరణాన్ని తట్టుకోలేక చెల్లి గుండె ఆగింది. ఒకే రోజు కొన్ని గంటల వ్యవధిలో అక్కాచెల్లెలు మృతి చెందిన ఘటన చింతమానుపల్లె గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తెలుగు చిన్న ఆంజనేయులు, హనుమంతు సోదరులకు ఇనగండ్ల గ్రామానికి చెందిన అక్కా చెల్లెలు సవరమ్మ(70), సరోజమ్మ (68)తో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. సవరమ్మకు కడుపులో గడ్డలు ఉన్నాయంటూ 4 నెలలుగా కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆరోగ్య పరిస్థితి విషమించి శనివారం ఉదయం మృతి చెందింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కలిసి సవరమ్మ అంత్యక్రియలను నిర్వహిస్తుండగా సరోజమ్మ గుండె పోటుకు గురై కుప్పకూలి పోయింది. అక్కాచెల్లెలు మృతితో కుటుంబంలో విషాదం అలుముకుంది. -
అక్కా నీ వెంటే నేను
- ఒకే రోజు అక్కాచెల్లెలు మృతి చింతమానుపల్లె(సి.బెళగల్): మరణంలో అక్కాచెల్లెలు బంధం వీడలేదు. అక్క మరణాన్ని తట్టుకోలేక చెల్లి గుండె ఆగింది. ఒకే రోజు కొన్ని గంటల వ్యవధిలో అక్కాచెల్లెలు మృతి చెందిన ఘటన చింతమానుపల్లె గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తెలుగు చిన్న ఆంజనేయులు, హనుమంతు సోదరులకు ఇనగండ్ల గ్రామానికి చెందిన అక్కా చెల్లెలు సవరమ్మ(70), సరోజమ్మ (68)తో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. సవరమ్మకు కడుపులో గడ్డలు ఉన్నాయంటూ 4 నెలలుగా కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆరోగ్య పరిస్థితి విషమించి శనివారం ఉదయం మృతి చెందింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కలిసి సవరమ్మ అంత్యక్రియలను నిర్వహిస్తుండగా సరోజమ్మ గుండె పోటుకు గురై కుప్పకూలి పోయింది. అక్కాచెల్లెలు మృతితో కుటుంబంలో విషాదం అలుముకుంది. -
కంకణం కట్టుకుందాం
దైవికం దేవుడు కనిపించకపోవచ్చు. కానీ దైవభీతి ఉంటుంది. మన చేతికి రాఖీ లేకపోవచ్చు. కానీ ఆడపిల్లల్ని నిశ్చింతగా ఉంచేందుకు మనకై మనం కంకణం కట్టుకోవచ్చు కదా! రాఖీ పండుగ ప్రతి యేడూ వస్తుంది. అయితే ఈసారి రాఖీ రాకడ వెనుక ‘ప్రత్యేకమైన’ పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులు రాఖీ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమైనవి. రాఖీ.. స్త్రీకి భరోసా ఇస్తుంది. అన్న ఉన్నాడని, తమ్ముడు ఉన్నాడని, భర్త ఉన్నాడని, కొడుకు ఉన్నాడని; వీళ్లందరిలో ఒక రక్షకుడు ఉన్నాడని ధీమాను కలిగిస్తుంది. అయితే అలాంటి ధీమాను, భరోసాను అన్నదమ్ములు, తక్కిన కుటుంబ సభ్యులు, ప్రజా నాయకులు.. వీళ్లెవ్వరూ ఇవ్వలేరని; వాళ్లతో పాటు ప్రభుత్వాలు, చట్టాలు, న్యాయాలు, నాగరికతలు.. ఇవి కూడా ఏమీ చేయలేవని రూఢీ అవుతున్న ఒక నిస్సహాయ వాతావరణంలో మన ఆడకూతుళ్లు బితుకుబితుకుమంటూ ఉన్నప్పుడు వస్తున్న రాఖీ ఇది! 2012 నాటి ఢిల్లీ బస్సు ఘటన తర్వాత, దోషులకు శిక్ష పడిన తర్వాత, నిర్భయ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత కూడా స్త్రీజాతిపై పగబట్టినట్లుగా దేశమంతటా అత్యాచారాలు రోజురోజుకీ ఎక్కువవుతున్నాయి. వాటికి పదింతలుగా.. రక్షణ కల్పించవలసిన వారి (ప్రజానాయకులు, ప్రభుత్వాధికారులు) నోటి నుంచి స్త్రీలకు వ్యతిరేకంగా వెలువడుతున్న అభ్యంతరకరమైన మాటలు కూడా! రేప్ అనేది కొన్నిసార్లు తప్పు, కొన్నిసార్లు రైట్ అట. ఓ మంత్రిగారు అంటారు! ‘ఒక్క యూపీలోనే జరగడం లేదు కదా’ అని ఆ రాష్ర్ట సీఎం గారి చికాకు. ‘పాశ్చాత్య నాగరికత చెడగొడుతోందండీ’ అని స్వామీ నిశ్చలానంద సరస్వతి. ఇంకా ఇలాంటివే రకరకాల విశ్లేషణలు. ‘‘టీవీ చానళ్లు మతిపోగొడుతున్నాయి మరి!’’, ‘‘ఇంటర్నెట్ వచ్చాక ఎడ్యుకేషన్ ఎక్కువైంది’’, ‘‘పెద్దపిల్లల్ని, స్త్రీలని రేప్ చేస్తే అర్థం చేసుకోవచ్చు. మరీ పసికందుల మీద కూడానా?’’, ‘‘ఆ మహిళ గౌరవనీయురాలైతే ఎందుకలా జరిగి ఉండేది?’’, ‘‘మీద పడబోతున్నప్పుడు ‘అన్నయ్యా’ అంటే సరిపోయేది కదా’’, ‘‘ఒంటి నిండా బట్టలుంటే ఇలాంటివి జరగవు’’, ‘‘స్కూళ్లలో స్కర్టుల్ని బ్యాన్ చెయ్యాలి’’, ‘‘సీత లక్ష్మణ రేఖ దాటింది కాబట్టే అపహరణకు గురైంది’’, ‘‘పెట్రోలు, ఫైరు ఒకచోట ఉంటే అంటుకోవా?’’, ‘‘అంతా గ్రహ ఫలం.. గ్రహాలు సరిగ్గా లేకుంటే ఇలాగే జరుగుతుంది’’, ‘‘ఫాస్ట్ ఫుడ్ తింటే ఇంతే’’, ‘‘చీకటి పడ్డాక ఆడపిల్లకు బయటేం పని?’’, ‘‘బడికెళ్లే పిల్ల చేతికి మొబైల్ ఇస్తే అంతే సంగతులు’’, ‘‘బాయ్‌ఫ్రెండ్స్ ఉన్న పిల్లలకే ఎక్కువగా ఇలాంటివి జరుగుతాయి’’, ‘‘ఆ సమయం వస్తే దేవుడు కూడా కాపాడలేడు’’... ఇదీ వరస! అత్యాచారాలు జరక్కుండా చూడండి నాయనలారా, నాయకులారా అని మొత్తుకుంటుంటే... ఇంట్లోంచి బయటికి రావద్దు, వచ్చినా గాలి పీల్చొద్దు, కంట్లో పడిన నలకను తీసుకోవద్దు, వదులైన జడను పబ్లిగ్గా బిగదీసి కట్టుకోవద్దు అంటుంటే ఏం చెప్పాలి? ఇలా మాట్లాడే పెద్దమనుషులక్కూడా ఇంట్లో ఒక చెల్లో, అక్కో, భార్యో, కూతురో ఉండి ఉంటారు కదా. కనీసం బయటి నుండి రాఖీ కట్టేందుకు వచ్చేవారైనా ఉంటారు కదా. చూడాలి.. ఈసారి ఏ అర్హతతో వారు తమ చేతికి రాఖీ కట్టించుకుంటారో! అన్నాచెల్లెళ్లకు, అక్కా తమ్ముళ్లకు ఎంతో ప్రియమైన వేడుక రాఖీ. అన్నగానీ, తమ్ముడు గానీ ఆడపిల్లకు దేవుడిచ్చిన స్నేహితుడు. అలాగే, స్నేహితుడు ఆ పిల్ల ఎంపిక చేసుకున్న సోదరుడు. ఈ స్పృహ ఆడపిల్లలకు ఉంటుంది. ఉండాల్సింది మన ఇళ్లల్లోని అబ్బాయిలకు, రాజకీయాల్లో, ప్రభుత్వ గణాల్లో ఉన్న మొద్దబ్బాయిలకూ. దేవుడు ప్రతి చోటా తను ఉండలేక స్త్రీని సృష్టించాడని అంటారు. మరి ఆ స్త్రీపై అత్యాచారానికి తెగబడడం, ఆ స్త్రీని నోటికి వచ్చినట్లు తూలనాడడం అంటే దేవుడిని దూషించడమే కదా. దేవుడికి అపచారం జరిగినట్లే కదా! దేవుడు కనిపించకపోవచ్చు. కానీ దైవభీతి ఉంటుంది. మన చేతికి రాఖీ లేకపోవచ్చు. కానీ ఆడపిల్లల్ని నిశ్చింతగా ఉంచేందుకు మనకై మనం కంకణం కట్టుకోవచ్చు కదా. - మాధవ్ శింగరాజు