
చిరంజీవి హీరోగా మలయాళ చిత్రం ‘లూసిఫర్’ తెలుగులో రీమేక్ కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఖుష్బూ నటించనున్నారని తెలిసింది. ‘లూసిఫర్’లో చెల్లెలి పాత్ర కీలకమైనది. ఈ పాత్రకే ఖుష్బూని తీసుకున్నారట. 2006లో విడుదలైన ‘స్టాలిన్’ చిత్రంలో చిరంజీవికి అక్కగా నటించారు ఖుష్బూ. ఇప్పుడు 14 ఏళ్ల తర్వాత ‘లూసిఫర్’ చిత్రంలో ఆయనకు చెల్లెలు పాత్రలో నటించనున్నారని సమాచారం. ఈ చిత్రానికి ‘సాహో’ ఫేం సుజిత్ దర్శకత్వం వహించనున్నారు. తెలుగు ప్రేక్షకుల అభిరుచి మేరకు ‘లూసిఫర్’ కథలో పలు మార్పులు చేర్పులు చేశారట. మరోవైపు తమిళంలో రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘అన్నాత్తే’ సినిమా అంగీకరించారు ఖుష్బూ. ప్రస్తుతానికి సూపర్ స్టార్ రజనీ పాత్రకు సంబంధించినవి కాకుండా ఇతర పాత్రధారులతో కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేశ్ హీరోయిన్‌గా, మీనా కీలక పాత్ర చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment