Vasu
-
కూటమి ఎమ్మెల్యే.. అక్రమ డబ్బు లెక్కలకు మిషన్లు కొన్నారట: మార్గాని భరత్
సాక్షి, తూర్పుగోదావరి: రాష్ట్రంలో అత్యంత అవినీతి ఎమ్మెల్యే ఎవరు అనే పోటీ పెడితే ఆదిరెడ్డి వాసునే మొదటి స్థానంలో ఉంటాడని ఆరోపించారు వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్. డంపింగ్ యార్డ్ కాంట్రాక్టర్ వద్ద స్థానిక ఎమ్మెల్యే రెండు కోట్లు డిమాండ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. అలాగే, ఇసుక నుంచి వచ్చే డబ్బులు లెక్క పెట్టలేక ఆదిరెడ్డి మూడు కరెన్సీ లెక్కించే మిషన్లు కొనుగోలు చేశారట అని వ్యాఖ్యలు చేశారు.రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘దళిత యువకుడిపై కూటమి ప్రభుత్వం జాత్యహంకార ధోరణి చూపించింది. రాజమండ్రిలో దళిత యువకుడుపై జరిగిన ఘటనపై ఢిల్లీలో ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేశాం. జనవరి మూడో వారంలో కమిషన్ ఏపీకి రానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేశారు.సర్దార్ గౌతులచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరైన బీసీ మంత్రులు మూడుసార్లు క్షమాపణ చెప్పాల్సి రావడం దారుణం. సామాజిక కార్యక్రమాలకు అన్ని పార్టీల నాయకులు హాజరుకావడం పరిపాటి. బీసీ నాయకులపై జాతి దురహంకారం చూపిస్తున్నారా?. కమ్మ గ్లోబల్ సమిట్‌లో అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు. అప్పుడు ఎందుకు అడ్డు చెప్పలేదు?. బీసీల పట్ల కూటమి ప్రభుత్వం అణుగదొక్కే వైఖరి అవలంబిస్తోంది.కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల కాలంలో ఈవీఎం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు దందాల లిస్ట్ లెక్కలేనంత ఉంది. కోటిలింగాల ఘాట్ నుండి ఫోర్త్ బ్రిడ్జి వరకు ఉన్న 15 ర్యాంపుల్లో డ్రెడ్జింగ్ చేసి 800 లారీలు ప్రతిరోజు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే మామూలు వసూలు అవుతోంది. లారీకి రూ.8500 తీసుకుంటున్నారు. స్థానిక ఈవీఎం ఎమ్మెల్యేకు రోజుకు ఈ ర్యాంపుల ద్వారా 24 లక్షలు రూపాయలు ఆదాయం వస్తోంది. ఆనంద నగర్ క్వారీ ప్రాంతాల్లో పేకాట క్లబ్బుల కూడా స్థానిక ఎమ్మెల్యే ఆదేశాలతోనే నిర్వహిస్తున్నారు. ఇటువంటి ఎమ్మెల్యే అసెంబ్లీలో భూకబ్జాలు గురించి మాట్లాడటం హాస్యాస్పదం. ఎమ్మెల్యే వెనకాలే తిరిగే వ్యక్తులు అనేక చోట్ల భూకబ్జాలకు పాల్పడ్డారు.ఇసుక నుంచి వచ్చే డబ్బులు లెక్క పెట్టలేక స్థానిక ఎమ్మెల్యే మూడు కరెన్సీ లెక్కించే మిషన్లు కొనుగోలు చేశారట. సనాతన హిందూ ధర్మ పరిరక్షణకు కంకణం కట్టుకున్న పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోనే అతిపెద్ద స్లాటర్ హౌస్ ఉంది. రోజుకు రెండు మూడు వందల గోవులు అక్కడ హతమైపోతున్నాయి. వాటి నిర్వాహకుడు రాజమండ్రి ఈవీఎం ఎమ్మెల్యే అనుచరుడే. దమ్ముంటే ఇప్పుడున్న పదవులకు రాజీనామా చేసి పేపర్ బ్యాలెట్‌తో పోటీకి రండి. నేను సవాల్ విసురుతున్నాను. డంపింగ్ యార్డ్ కాంట్రాక్టర్ వద్ద కూడా ఎమ్మెల్యే రెండు కోట్లు డిమాండ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి అని కామెంట్స్ చేశారు. -
అల్లు అర్జున్, సుకుమార్ గొడవపై బన్నీ వాసు క్లారిటీ
-
"దమ్ముంటే రా.." ఆదిరెడ్డి వాసుకి ఛాలెంజ్
-
తొలిసారి అలాంటి సీన్ చేశా!
‘‘నేనిప్పటివరకూ ఏ సినిమాలోనూ సిగరెట్ తాగే సన్నివేశంలో నటించలేదు. ‘కోట బొమ్మాళి పీఎస్’ సినిమా కథకు అవసరం కావడంతో తొలిసారి స్మోకింగ్ సన్నివేశం చేశాను. అందుకే ఈ చిత్రం నాకు సవాల్‌గా అనిపించింది’’ అని నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ అన్నారు. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. తేజా మార్ని దర్శకత్వంలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా వరలక్ష్మీ శరత్ కుమార్ చెప్పిన విశేషాలు. ∙నేను కథే హీరోగా భావిస్తాను. నా కెరీర్లో తమిళంలో ఎక్కువగా పోలీస్ పాత్రలు చేశాను. కానీ తెలుగులో మాత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’ నా తొలి మూవీ. ప్రస్తుతం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ట్రెండ్ నడుస్తోంది కాబట్టి పోలీస్ ఆఫీసర్ పాత్రలకు క్రేజ్ ఉంటోంది. ∙‘కోట బొమ్మాళి పీఎస్’లో శ్రీకాంత్‌గారు, నేను పోలీస్ ఆఫీసర్స్. ఇద్దరిలో ఒకరు క్రిమినల్ అయితే ఎలా ఉంటుంది? పోలీసులపై రాజకీయ నాయకుల ఒత్తిడి ఏ విధంగా ఉంటుంది? అన్నది ఈ చిత్రకథ. పిల్లి మరియు ఎలుక ఆటలా థ్రిల్ చేసేలా ఉంటుంది. ఓటు గురించి అవగాహన కల్పించే లైన్ కూడా ఉంటుంది. ఎన్నికల టైమ్‌లో వస్తున్న మా సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ∙‘వరలక్ష్మి చాలా వైవిధ్యంగా చేసింది’ అని ప్రేక్షకులు అనుకునేలా మంచి పాత్రలు చేయడమే నా లక్ష్యం. లేడీ ఓరియంటెండ్ సినిమాలతో పాటు పాత్ర నచ్చితే ఎలాంటి మూవీలోనైనా నటించడానికి రెడీ. తెలుగులో నేను నటించిన ‘హనుమాన్’ సినిమా సంక్రాంతికి విడుదలవుతోంది. కన్నడలో సుదీప్తో ‘మ్యాక్స్’ చిత్రంలో నటిస్తున్నాను. -
చంద్రముఖి 2లో ఇదే హైలైట్
-
‘ప్లాస్టిక్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ ఎవరు? రూ.1400 కోట్ల ఆఫర్ వద్దని, భారత్‌కు ఏమి చేశారు?
మన చుట్టూ ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణానికి, మనకు ఎంతో హానికరం అనే విషయం అందరికీ తెలిసిందే. ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణాన్ని కలుషితం చేయడమే కాకుండా జీవరాశుల మరణానికి కారణంగా మారుతున్నాయి. అయితే ప్లాస్టిక్ వ్యర్థాలను తిరిగి వినియోగించేలా రీసైకిల్ చేసేందుకు విరివిగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ దిశగా ముందడుగు వేసిన తమిళనాడులోని మదురైలోగల టీసీఈ ఇంజినీరింగ్ కళాశాల ప్రొఫెసర్ ప్లాస్టిక్ వ్యర్థాలతో ప్రపంచమంతటా రోడ్లు వేయాలనే ఆలోచనను అందించారు. ఫలితంగా ఆయన ‘ప్లాస్టిక్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా పేరొందారు. అతని కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్లను రూపొందించిన ఈ ప్రొఫెసర్ పేరు రాజగోపాలన్ వాసుదేవన్. మధురైలోని టీసీఈ ఇంజినీరింగ్ కాలేజీలో కెమిస్ట్రీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. 2002 సంవత్సరంలో త్యాగరాజర్ కళాశాల ఆవరణలో ప్లాస్టిక్ వ్యర్థాలతో రహదారిని నిర్మించడంలో వాసుదేవన్ తొలిసారి విజయం సాధించారు. వాసుదేవన్ చేస్తున్న కృషికి గుర్తింపు రావడానికి చాలా కాలం పట్టింది. దాదాపు పదేళ్ల కృషి అనంతరం అప్పటి ముఖ్యమంత్రి జయలలిత వద్దకు తన ప్రాజెక్టు తీసుకెళ్లడంతో ఈ సాంకేతికతకు గుర్తింపు వచ్చిందని ఆయన తెలిపారు. జయలలిత తన కృషిని మెచ్చుకున్నారని, సహాయం చేయడానికి ముందుకు వచ్చారని వాసుదేవన్ తెలియజేశారు. వాసుదేవన్ తన ఆలోచనను ప్రపంచంతో పంచుకోవడంతో, దీనిని అతని నుంచి దక్కించుకునేందుకు పలువురు ప్రయత్నించారు. అయితే ఇందుకు వాసుదేవన్ నిరాకరించారు. తన సాంకేతికతను ఆయన ఉచితంగా భారత ప్రభుత్వానికి అప్పగించారు. ఫలితంగా ప్లాస్టిక్ వ్యర్థాలతో వేల కిలోమీటర్ల రోడ్లు నిర్మితమయ్యాయి. వాసుదేవన్ తయారు చేసిన ఈప్రాజెక్టు కొనుగోలుకు అమెరికా సుమారు రూ. 1400 కోట్లు ఆఫర్ చేసిందని అంటారు. అయితే అతను ఈ ఆఫర్‌ను తిరస్కరించారు. తన ఈ ఆవిష్కరణను భారత ప్రభుత్వానికి ఉచితంగా అందించారు. ఫలితంగా దేశంలో రోడ్ల నిర్మాణంలో విప్లవం వచ్చింది. వాసుదేవన్ అందించిన సాంకేతికతను నేడు పంచాయతీలు, మునిసిపాలిటీలు సైతం ఉపయోగిస్తున్నాయి. అలాగే రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కూడా పెద్ద ఎత్తున వ్యర్థ ప్లాస్టిక్‌ను ఉపయోగించాలనే మిషన్‌ను ప్రారంభించింది. ఈ నేపధ్యంలో దేశవ్యాప్తంగా దాదాపు 26 వేల మందిని అనుసంధానం చేసి ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించి, రోడ్డు నిర్మాణంలో వినియోగించేందుకు అనువుగా వ్యర్థ ప్లాస్టిక్‌ను సేకరిస్తున్నారు. వివిధ దేశాలకూ వాసుదేవన్ సాంకేతికత భారతదేశంలో ఇప్పటికే దాదాపు 100,000 కిలోమీటర్ల మేర ప్లాస్టిక్ రోడ్లు తయారయ్యాయి. పలు ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. భారతదేశంలోనే కాదు వాసుదేవన్ అందించిన సాంకేతికతను ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు అమలు చేస్తున్నాయి. ఇండోనేషియాలో బాలి, సెర్బియా, బెకాసి, మకస్సర్ తదితర ప్రదేశాలతో ప్లాస్టిక్-తారు మిశ్రమాలను ఉపయోగించి ప్లాస్టిక్ రోడ్లు నిర్మితమవుతున్నాయి. నెదర్లాండ్స్ ఈశాన్య భాగంలో సైక్లిస్టుల కోసం డచ్ కంపెనీ వెర్కర్ సెల్.. ప్లాస్టిక్ రోడ్లు నిర్మించింది. ఈ క్రమంలో ప్లాస్టిక్ రోడ్ టెక్నాలజీని పరీక్షించేందుకు యునైటెడ్ కింగ్డమ్ 1.6 మిలియన్ పౌండ్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ‘ప్లాస్టిక్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ రాజగోపాలన్ వాసుదేవన్ ప్రతిభను ప్రపంచం మెచ్చుకుంటోంది. ఇది కూడా చదవండి: ఈ నగరంలో నిత్యం శబ్ధాలు ఎందుకు వినిపిస్తాయి? -
గ్రీన్‌సిగ్నల్ ఇస్తారా?
రవితేజ యమా స్పీడ్‌గా సినిమాలు చేస్తున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రాలు ‘టైగర్ నాగేశ్వరరావు’ అక్టోబరు 20న, ‘ఈగిల్’ జనవరిలో రిలీజ్ కానున్నాయి. అయితే ఈ చిత్రాల తర్వాత రవితేజ ఏ దర్శకుడితో సినిమా చేస్తారు? అనే చర్చ కొంతకాలంగా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. గోపీచంద్ మలినేని, అనుదీప్ వంటి దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే తాజాగా జీవీఆర్ వాసు చెస్పిన ఓ స్టోరీ లైన్‌కు రవితేజ ఇంప్రెస్ అయ్యారని, పూర్తి కథ విన్న తర్వాత ఈ ప్రాజెక్ట్‌పై తుది నిర్ణయం తీసుకుంటారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుందనే ప్రచారం కూడా జరుగుతోంది. మరి.. జీవీఆర్ వాసు కథకి రవితేజ ఫైనల్ గ్రీన్‌సిగ్నల్ ఇస్తారా? లేదా? వేచి చూడాలి. -
అంత్యక్రియలకొచ్చి అనంతలోకాలకు.. ప్రమాదంలో అన్నదమ్ములు మృతి
అక్కన్నపేట(హుస్నాబాద్): బంధువుల అంత్యక్రియలకు హాజరై తిరిగి వెళ్తుండగా, మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో కారు అదుపు తప్పి చౌటపల్లి గ్రామానికి చెందిన నలుగురు అన్నదమ్ములు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనతో సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన ఎరుకల కృష్ణ(47), సంజీవ్(43), సురేష్(38), వాసు(35)లు కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం గుజరాత్‌లోని సూరత్‌కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఐదు రోజుల క్రితం స్వగ్రామంలో చిన్నాన్న ఎరుకుల కనకయ్య మృతి చెందడంతో వారంతా కుటుంబసభ్యులతో కలిసి చౌటపల్లికి వచ్చారు. అంత్యక్రియలు పూర్తి కావడంతో మంగళవారం మధ్యాహ్నం నలుగురు అన్నదమ్ములూ భార్యా పిల్లలను గ్రామంలో వదిలేసి, కారులో సూరత్‌కు బయలుదేరారు.అర్ధరాత్రి దాటిన తర్వాత మహారాష్ట్రలోని ఔరంగాబాద్ వద్ద వీరు ప్రయా ణిస్తున్న కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అన్నదమ్ములు అక్కడికక్కడే మృతి చెందగా, కొద్దిసేపటికి మరొకరు మృతి చెందారు. జాతీయ అన్నదమ్ముల దినోత్సవం మే 24న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అన్నదమ్ములు మృతి చెందడంతో ఆ కుటుంబంతో పాటు గ్రామంలోనూ విషాదఛాయలు అలముకున్నాయి. -
జగజ్జనని చిట్ ఫండ్స్.. ఆదిరెడ్డి అప్పారావు, వాసు అరెస్ట్
సాక్షి, తూర్పుగోదావరి: జగజ్జనని చిట్‌ఫండ్ మోసాలపై టీడీపీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు, వాసులను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. కాగా, జగజ్జనని చిట్‌ఫండ్ మోసాలపై సీఐడీ విచారణ చేపట్టింది. ఈ క్రమంలో జగజ్జనని చిట్‌ఫండ్స్ డైరెక్టర్లుగా ఉన్న ఆదిరెడ్డి, వాసులను అధికారులు అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. రాజమండ్రిలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కుటుంబీకులు చిట్‌ఫండ్ నిర్వహిస్తున్నారు. అయితే, ప్రజల నుంచి చిట్స్ వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నారనే విషయం బయటకు వచ్చింది. ఈ క్రమంలో జగజ్జనని చిట్‌ఫండ్ మోసాలపై సీఐడీకి కాకినాడ అసిస్టెంట్ రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నకిలీ ఖాతాలను సృష్టించి మోసాలకు పాల్పడినట్టు, చిట్స్ చెల్లింపుల్లోనూ అక్రమాలకు పాల్పడినట్టు అసిస్టెంట్ రిజిస్ట్రార్ గుర్తించి సీఐడీకి ఆధారాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఖాతాదారుల డబ్బులను దుర్వినియోగం చేసినట్టు, ఫాల్స్ డిక్లరేషన్‌ను అసిస్టెంట్ రిజిస్ట్రార్ గుర్తించారు. 49 సబ్స్కైబర్ల వివరాలను తనిఖీ చేసి ఆధారాలిచ్చారు. డాక్యుమెంట్ల నిర్వహణలోనూ ఆక్రమాలను గుర్తించారు. నిబంధనలకు విరుద్దంగా చిట్‌ఫండ్ నిధులతో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నట్టు గుర్తించడంతో 1982 చిట్ ఫండ్ చట్టాన్ని ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడినట్టు తెలిపారు. దీంతో, జగజ్జనని చిట్‌ఫండ్స్ డైరెక్టర్లు ఆదిరెడ్డి, వాసులను సీఐడీ అరెస్ట్ చేసింది. ఇక, గత నవంబర్ నుంచి రాష్ట్రంలో చిట్‌ఫండ్ కంపెనీల్లో రిజిస్ట్రేషన్ శాఖ తనిఖీలు చేపట్టింది. మార్చి 16న జగజ్జనని చిట్స్ సహా రాష్ట్రంలో పలు చిట్‌ఫండ్ సంస్థల్లో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో వెలుగు చూసిన అంశాల ఆధారంగా సీఐడీకి అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఫిర్యాదు చేశారు. ఇది కూడా చదవండి: కిడ్నీ రాకెట్ కేసును ఛేదించిన పోలీసులు.. -
గోరంట్ల వెర్సెస్ ఆదిరెడ్డి.. సిటీ సీట్ హాట్ గురూ..!
సాక్షి, రాజమహేంద్రవరం: ఇది మల్లెల వేళయని...వెన్నెల మాసమని...తొందరపడి ఒక కోయిల ముందే కూసింది ..విందులు చేసింది...సుఖదుఃఖాలు సినిమాలో దేవులపల్లి రాసిన పాట ఇది.. టీడీపీలో యువ నాయకుడొకరు ఇదే పల్లవి అందుకున్నారు. దీనిపై రాజకీయంగా రసవత్తరమైన చర్చ సాగుతోంది. ఫలితంగా చాలా కాలంగా పార్టీలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరుకు మరోసారి తెర లేచింది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉంది. ఆ పార్టీలో ఎప్పుడూ హాట్ సీట్‌గా పేరున్న రాజమహేంద్రవరం సిటీ కోసం ఇప్పటి నుంచే పోరు మొదలైనట్టుగా కనిపిస్తోంది. కొన్నేళ్లుగా ఈ విషయంలో సిటింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని మామ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, పొరుగున అదే పార్టీకి చెందిన రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోన్న సంగతి బహిరంగ రహస్యమే. ప్రతి ఎన్నికల సందర్భంలో సిటీ నుంచి పోటీ చేయాలని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్న గోరంట్ల ప్రయత్నిస్తూనే ఉంటారు. ఈయనకు పోటీగా ఆదిరెడ్డి అప్పారావు వర్గం టిక్కెట్టు కోసం పోటీ పడుతూ ఉంటుంది. ఇది పార్టీలో సహజ పరిణామంగానే చెప్పుకుంటారు. అటువంటిది సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉన్నా రాజమహేంద్రవరం సిటీ నుంచి తానే పోటీ చేస్తానని సిటింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త.. ఆ పార్టీ నాయకుడు వాసు బుధవారం హఠాత్తుగా ప్రకటించారు. ఈ ప్రకటన వెనుక కారణమేమై ఉంటుందనే చర్చ జరుగుతోంది. అంటే ఇప్పటి నుంచే టీడీపీలో సీట్ల సిగపట్లు మొదలయ్యాయంటున్నారు. చదవండి: (Atmakur Byelection: బీజేపీ బేజార్.. అభ్యర్థి ఎంపికే మైనస్) ఆధిపత్య పోరు రాజమహేంద్రవరం జేకే గార్డెన్స్‌లో సిటీ నియోజకవర్గ పార్టీ సమావేశం సందర్భంగా ఎమ్మెల్యే భర్త వాసు బయటకు వచ్చి మీడియాకు ఈ విషయాన్ని తెలియజేశారు. గత కొంతకాలంగా ఆ పార్టీలో పరిణామాలే ఇందుకు కారణమని భావిస్తున్నారు. ఎమ్మెల్యే గోరంట్ల, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వర్గాల మధ్య పచ్చ గడ్డి వేయకుండానే భగ్గుమనే వాతావరణం ఈ ప్రకటనతో కనిపిస్తోంది. గోరంట్ల రూరల్‌కు వెళ్లిపోయినా సిటీపైనే ఆయన దృష్టి ఉంది. పార్టీలో సీనియర్ అయిన తనను కాదని వేరేవారిని ప్రోత్సహించారనే ఆవేదన ఆయనలో మొదటి నుంచి ఉంది. ఈ విషయాన్ని ఆయన అనేక సందర్భాల్లో వెళ్లగక్కుతూనే ఉంటారు. ఏడాదిన్నర క్రితం సిటీలో తమ వర్గానికి చెందిన వారికి పదవుల్లో ప్రాతినిధ్యం లేకుండా చేశారనే ఆవేదనతో పార్టీ, రాజకీయాలకు దూరమవుతున్నట్టు మీడియాకు తెలియచేసి హైడ్రామా సృష్టించారు. చివరకు పార్టీ పదవులు తమ వారికి సాధించుకుని ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నారు. చదవండి: (జనసేన వారు 62 మంది.. టీడీపీ వారు 21 మంది) టీడీపీలో అంతర్యుద్ధం సిటీ నియోజకవర్గంలో తనకంటూ ఉన్న మాజీ కార్పొరేటర్లతో ఆదిరెడ్డి వర్గానికి పోటీగా గోరంట్ల పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇవన్నీ నడుస్తోన్న క్రమంలోనే తన రాజకీయ వారసుడిగా సోదరుడు శాంతారామ్ తనయుడు రవిరామ్‌ను తెరమీదకు తీసుకువచ్చారు. అంతటితోనే ఆగకుండా సిటీలో తన పుట్టిన రోజు వేడుకలను విస్తృతంగా నిర్వహించి రాజకీయాలకు తానేమీ దూరం కాలేదని స్పష్టం చేశారు. ఇంతకంటే ముందుగానే గోరంట్ల వైరి పక్షమైన మాజీ ఎమ్మెల్సీ అప్పారావు కూడా రాజకీయ వారసుడిగా తనయుడు వాసును ప్రకటించడంతో టీడీపీలో అంతర్యుద్ధం మొదలైంది. నాటి నుంచి చాపకింద నీరులా సాగుతోన్న ఈ రెండు వర్గాల అంతర్గత పోరు వాసు తాజా ప్రకటనతో మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రకటన వెనుక వ్యూహం వాసు ప్రకటన వెనుక రాజకీయ దూరాలోచన ఉందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. భవిష్యత్ రాజకీయ వ్యూహం ఉందంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీ స్థానానికి ఆదిరెడ్డి కుటుంబం నుంచి పోటీకి పెడతారని ఇటీవల ఆ పార్టీలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీనిని గోరంట్ల వర్గం భుజానకెత్తుకుని చేస్తోందని ఆదిరెడ్డి వర్గం అనుమానం వ్యక్తం చేస్తోంది. సిటీ కోసం ఆరాటపడుతోన్న గోరంట్ల వర్గం పనిగట్టుకుని చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టే వ్యూహంలో భాగంగానే వాసు తాజా ప్రకటన అంతరార్థమని తెలుస్తోంది. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సిటీ నుంచే పోటీ చేస్తామని, ఎంపీగా వెళ్లే ప్రసక్తే లేదని వాసు తేల్చి చెప్పారు. సిట్టింగ్ ఎమ్మెల్యే భవాని ఉండగా ఆమెను కాదని భర్త వాసు పోటీ చేస్తాననడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఆమె పనితీరు సమర్థవంతంగా లేదనా, లేక రాజకీయాల్లో రాణించలేక పోతున్నారనా.. వీటిలో ఏ కారణంతో వాసు పోటీకి సై అంటున్నారని నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఆమెను బలపరిచాను, వచ్చే సారి ఆమె నన్ను బలపరుస్తుంది అని వాసు మీడియా వద్ద ముక్తాయించడం గమనార్హం. దీనిపై గోరంట్ల వర్గం ఏ రకమైన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతుందో వేచి చూడాల్సిందే. -
‘వాసు’ గుర్తున్నాడా? వచ్చి 18 ఏళ్లైంది!
సాక్షి, వెబ్‌డెస్క్: తల్లిదండ్రులు వారి కలలను పిల్లలపై రుద్దకూడదనే సందేశాన్ని తెలుపుతూ పూర్తి వినోదాత్మకంగా, మ్యూజికల్‌గా సాగిన చిత్రం ‘వాసు’ . విక్టరీ వెంకటేష్- భూమిక జంటగా నటించిన ఈ చిత్రానికి కరుణాకరన్ దర్శకత్వం వహించారు. హారిస్ జయరాజ్ అందించిన పాటలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. యూత్, ఫ్యామిలీ, మాస్ ఇలా అన్ని రకాల ఆడియన్స్‌ను ఆకట్టుకున్న ఈ చిత్రం గొప్ప విజయాన్ని అందుకుంది. సీసీ మీడియా ఎంటర్టైన్మెంట్పై కేఎస్ రామారావు నిర్మించిన ఈ చిత్రం విడుదలైన నేటికి 18 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఈ సినిమా విశేషాలు మీకోసం.. ‘వాసు’సినిమా పేరు మదిలో మెదలగానే అందరికి గుర్తొచ్చేవి పాటలు. ప్రతీ ఒక్క పాట ఆణిముత్యమే. ముఖ్యంగా ‘పాటకు ప్రాణం పల్లవి అయితే..ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా...’, ’ఓ ప్రేమా.. ఓ ప్రేమా..’ అంటూ సాగే పాటలు సంగీత ప్రియుల్ని ముఖ్యంగా ప్రేమికులను ఎంతగానో అలరించాయి. వెంకటేష్ నటన ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్. సంగీతంపై తన ఇష్టాన్ని తెలుపుతూనే దివ్య(భూమిక)పై ప్రేమ, తండ్రిపై భయం రెండింటిని చాలా చక్కగా బ్యాలెన్స్ చేశాడు. అంతేకాకుండా సునీల్, అలీ, దర్మవరపు సుబ్రమణ్యంలతో వెంకీ చేసే కామెడీ మామూలుగా ఉండదు. అమ్మ, చెల్లితో వచ్చే సెంటిమెంట్ సీన్స్, ప్రేమను వ్యక్తపరిచే సమయంలో వచ్చే ట్విస్టులు ప్రతీ ఒక్కరి మనసులను కదిలించేలా ఉంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో హార్ట్ టచింగ్ డైలాగ్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ రోమాలు నిక్కబొడిచేలా ఉంటాయి. ‘వాసు’ వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ టీవీల్లో ఈ చిత్రం వస్తే ఛానల్ మార్చకుండా చూసేవారు అనేకమంది ఉంటారనడంలో అతిశయోక్తి లేదు. ఎక్కడా బోర్ కొట్టకుండా ప్రతీ సీన్‌ను చాల చక్కగా ప్రజెంట్ చేశాడు దర్శకుడు కరుణాకరన్. ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు లాక్డౌన్ నేపథ్యంలో ఇంట్లోనే ఉంటున్నారు కదా.. కుటుంబసమేతంగా మ్యూజికల్ హిట్ ‘వాసు’ సినిమాను మరో చూసి ఎంజాయ్ చేయండి. చదవండి: పోలీసు బిడ్డగా వారికి సెల్యూట్ చేస్తున్నా మరోసారి అక్షయ్ భారీ విరాళం var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_761247569.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
తిరుమలలో బయటపడ్డ నకిలీ టికెట్ల దందా
తిరుమల : తిరుమలలో నకిలీ టికెట్ల దందా బయటపడింది. 300 రూపాయల విలువైన ప్రత్యేక దర్శన నకిలీ టిక్కెట్ల దందా సోమవారం వెలుగులోకి వచ్చింది. చిత్తూరుకు చెందిన వాసు అనే దళారిని టీటీడీ విజిలెన్స్ వింగ్ అధికారులు ఈ ఘటనకు సంబంధించి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రోజూ వందల నకిలీ టిక్కెట్లపై భక్తులకు దర్శనం కల్పిస్తూ వాసు అక్రమార్జనకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైంది. కౌంటర్ సిబ్బందితో దళారి వాసు కుమ్మక్కై ఈ దందాకు తెరలేపినట్లు విచారణలో వెలుగుచూసింది. మూడు నెలల క్రితమే నకిలీ టిక్కెట్ల దందా కేసులో దళారి వాసు జైలుకు వెళ్లి వచ్చాడు. మళ్లీ ఇదే దందా సాగిస్తూ అధికారులకు చిక్కాడు. సురేంద్ర, కనకరాజు అనే ఇద్దరు కౌంటర్ సిబ్బందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. -
తెలుగువాడి వర్ణఫలం ‘వాసు’
పత్రికల్లో రంగు వెలిసిపోతున్న తెలుగు బొమ్మ చివరి వెలుగు వాసు. బొమ్మల్ని తన బొమ్మల బల్ల వరకే పరిమితం చేసుకున్న సంయమన శీలి. అక్కడి నుంచి లేచాడా.. బొమ్మ కన్నా ప్రపంచం గొప్పదని ఎరుక ఉన్నవాడు. ఉదయాన్నే ఇంట్లోకి వచ్చి పడే దినపత్రిక లోగిల్లో తీరైన రేఖతో ప్రభాత వర్ణాల ఆ నీటి రంగుల ముగ్గు పేరు వాసు - తెలుగమ్మాయిల బుగ్గల ఎరుపు ముక్కు చివరి ముక్కెరను తాకి బంగారు కాంతిని జిగేల్మనిపించినా అది వాసే. అమ్మా, నాయనమ్మల కంచి ధర్మవరం బెనారస్ పోచంపల్లి చీరల ధగధగల మధ్య అల్లరల్లరిగా ఆటలాడే పిల్లిమొగ్గల, కోతి చేష్టల పిల్లకాయల నిండు పండులాంటి ముద్దు మొఖాల చిరునవ్వుకు సంతకం తెలిస్తే అది వాసు. ఈ రోజు తెలుగు వాడి వర్ణ ఫలం పేరు వాసు. తెలుగురేఖ దీటుకు దాని ఎనలేని సానకు బాపు, బాలి, గోపి, మోహన్, కరుణాకర్ వంటివారు శిఖర స్థాయికి చేరిస్తే ఆ పతాకం వెనుక నుంచి పంచ రంగుల సూర్యుణ్ణి వెలుగింప జేసింది చిత్రకారులు చంద్ర, ఆపై ఆయన ప్రియాతి ప్రియ అంతే వాసి వాసు. పాపం చాలామంది శిష్యులు ఒక పెద్ద నడక నడిచాకా వెనక్కి తిరిగి చూసే ఓపికా అవసరమూ లేక నడిచిన దారి గురుతులు మరిచి ‘పాపం ఆయనా! నా గురువా? అబ్బే!’ అని మొహమాటపడతారు కానీ... ఏనాడు చంద్రగారి పక్కన నిలబడి నాలుగునిముషాలైనా ఆయన చిత్రకళా విన్యాసాన్ని ప్రత్యక్షంగా చూడని వాసు, నిద్దరలో కూడా ఇదంతా చంద్ర బొమ్మల భిక్షేనని ఆయన్ని కన్నులక ద్దుకుంటారు. బొత్తిగా వెర్రి ఏకలవ్యుడు. చంద్ర మాత్రం ద్రోణుడు కారు. పత్రికల్లో రంగు వెలిసిపోతున్న తెలుగు బొమ్మ చివరి వెలుగు వాసు. ఒక చిత్రకారుడిగా ఆయన బొమ్మలు ప్రపం చానికి తెలియడమే తప్ప ఆయన గురించి ఫలానా సంవ త్సరం, ఫలానా నెల, ఫలానా ప్రాంతంలో ఫలానా జిల్లాలో పుట్టారు. అప్పుడు అది ఆ జిల్లే కానీ ఇప్పుడు అది ఈ జిల్లా అయ్యింది. పైగా రాష్ర్టం కూడా బదలాయించింది వంటి సమాచారం ఒక అనవసరం. మన వెర్రి కాకపొతే కళాకా రుడికి ఫలానా ఫలానా ఏమిటి? పైగా వాసు వంటి వారికి! వాసు అంటే కొందరి వ్యక్తి కాదు అది అందరి బొమ్మ. కోన సీమ పచ్చని బయలుపై ఠీవిగా నడిచే కోడెదూడ మెడన మెరిసే మువ్వల వరుస తళుకు వాసు కుంచెదే, భద్రాది రాములవారి గోపురంపై నీడ కప్పిన కొబ్బరాకు పచ్చదనం కూడా అదే. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన అమ్మవారి నల్లని విగ్రహపు నవ్వు రంగు కూడా అంతే, శ్రీశైల మల్లికార్జుని కొలువులో సేదతీరుతున్న మల్లియలకు అద్దిన తెల్లని తెలుపు ముత్యపు రంగు కూడా వాసూదే. వాసు ఒక రకంగా కర్మ యోగి ఒక్క ఖానా, పీనా, పిలానాలో తప్ప మరే ఆర్టు గ్రూపుల్లో, గ్రూప్ ఫొటోల్లో తోసుకువచ్చి కనపడే రకం కాదు. ప్రేక్షకుల్లో ఒక ప్రేక్షకుడిగా మాత్రమే ఉండాలనుకుంటాడు. మన బొమ్మలో చేవ సత్తా వుంటే దాన్ని ప్రపంచం చూస్తుంది కానీ మన మొహం వెళ్ళి ప్రపంచం ముందు ఎందుక్కనపడాలని పేరు ప్రఖ్యాతులపై సిగరెట్ పొగ ఊదే ఒక తెంపరి. బొమ్మల్ని తన బొమ్మల బల్ల వరకే పరిమితం చేసుకున్న సంయమన శీలి, అక్కడి నుంచి లేచాడా బొమ్మ కన్నా ప్రపంచం గొప్పదని ఎరుక ఉన్నవాడు. వాసు ఆర్టిస్ట్‌గా కన్నా, ఒక స్నేహిగా, ఒక నిరంతర ప్రయా ణిగా, తనకు నచ్చినవారి మధ్య ఒక సందడిగా బతకాలను కునే మామూలు మనిషి. నేను 24 గంటలు కేవలం ఆర్ట్‌నే పీలుస్తానని హడావుడిగా ఆర్ట్ అ్ప్డేట్స్ కోసం పాకులాడే బాపతు కాదు కాబట్టే ప్రపంచానికి వాసు బొమ్మ తెలిసినంత వాసు అంటే ఏమిటో ఎవరికీ తెలుపదలుచుకోలేదు. తెలుగు బొమ్మల పెద్దలు బాపు, చంద్ర, మోహన్, బాలి, కరుణాకర్ల తరువాత తన బొమ్మల్తో ఈ తరానికి స్ఫూర్తి కలిగిస్తున్న ఈ కాలపు ఒకే ఒక చిత్రకారుడు వాసు. చాలా ఏళ్ళ తరువాత బొమ్మల కాలేజీలో చదువుకునే పిల్లలు, చిత్రకారులమవుదామనుకుని తపించే జనం ఓనామహ శివా యహ దిద్దినంత సీరియస్‌గా ఇప్పుడు వాసు రంగుని రేఖని సాధన చేస్తున్నారు. ఇది నిజంగా గొప్ప విప్లవం. అందుకు తరచు ఫేస్బుక్లో కనబడే వాసూలా గీయాలనుకునే చాలామంది బొమ్మలే సాక్షి. ఇప్పుడు వాయిస్ ఆఫ్ ఇమేజెస్ పేరిట వాసు తన మొదటి బొమ్మల ప్రదర్శన హైదరాబాద్ రవీంద్రభారతి కళాభవన్‌లో డిసెంబర్ 3, 4, 5న ఏర్పాటు చేస్తున్నారు. వర్ణానికి, వర్గానికి, ప్రాంతానికి కట్టుబడని ఈ కళాకారుడి దారిలో వెలిసిన బొమ్మల మైలురాళ్ళ జాతర ఇది. ఈ శుభ సమయాన ఇక్కడ హైదరాబాద్‌లో ప్రారంభ మవుతున్న ఈ రంగుల పండుగను ఇరు రాష్ట్రాల కళాభిమా నులు తమకు తామే పూనుకుని రెండు తెలుగు రాష్ట్రాల ప్రముఖ నగరాల్లో బొమ్మల కొలువుగా కొలువు తీరుస్తే బావుంటుంది. నిజానికి ఈ ప్రదర్శన ఎప్పుడో జరగ వలసింది. కానీ ఇప్పుడు ఇన్నేళ్ళ తరువాత జరుగుతున్న వాసు బొమ్మల కొలువు కూడా ఎవరో బలవంతపెట్టి చేయిం చడం తప్ప వాసు తనకు తాను చేస్తున్నది అని నేను అనుకోవడం లేదు. ఆ పర్సన్- బిహైండ్ ది సీన్ ఎవరో అదే చేత్తో వాసు బొమ్మల పుస్తకం కూడా మార్కెట్లో తెస్తే మా తరం, మా తదుపరి తరం చిత్రకారులకు చాలా పెద్ద బొమ్మల బాలశిక్ష అవుతుంది. నిజానికి వాసు తన బొమ్మల పుస్తకానికి తన సొంత జేబులోంచి చెల్లని అయిదు వందలు, వెయ్యి రూపాయల నోటు తీయనవసరం లేకుండా కొండంత ప్రేమతో ఆ పుస్తక భారం వహించే పెద్దలు ఎంతోమంది వాసు అభిమానులుగా వున్నారు. కానీ ముందుగా చెప్పు కున్నట్టు ఇటువంటి సరదాలు ఏం పట్టని వాసు కర్మ యోగి. అదే మన ఖర్మ. (డిసెంబర్ 3, 4, 5 తేదీల్లో హైదరాబాద్ రవీంద్రభారతిలోని కళాభవన్‌లో వాసు మొదటి బొమ్మల ప్రదర్శన సందర్భంగా) అన్వర్, సాక్షి కార్టూనిస్టు -
ఆగిపోయిన ప్రజా కలం
– ప్రజానాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాసు అస్తమయం – చిన్న వయస్సులోనే వందల పాటలు రాసిన రచయిత – మూడో తరగతే చదివినా.. జీవితాన్ని అధ్యయనం చేసిన ప్రజాకవి – వాసు మృతికి ప్రముఖుల సంతాపం కర్నూలు (కల్చరల్): నా చిట్టి తమ్ముళ్లారా రారే.. నా చిట్టి చెళ్లెల్లారా రారే.. రేపన్న రూపు రేఖలు మీరే... నా సెమట సుక్కో.. నా సెమెట సుక్కో... సుత్తి కొడవలి మీద ముత్యమై మెరిసే...అమ్మా నేను ఆగమైతే.. అక్షరాలు రెండు నేర్వక... నాగమ్మ పడగలో లాంటి రాష్ట్రవ్యాప్త ప్రాచుర్యం పొందిన ప్రజలు పాటలు రాసిన కలం ఆకస్మికంగా ఆగిపోయింది. కర్మాగారాల్లో, చేలల్లో, వర్కు షాపుల్లో పని చేస్తున్న బాల కార్మికుల దయనీయ జీవితాలను కూలి, నాలీల కడగండ్లను సిరాగా మార్చి కలంలో పోసి, అద్వితీయమైన పాటలు రాసిన ప్రజానాట్య మండలి వాసి ఇక లేరు. కర్నూలు నగరం, ఇందిరాగాంధీ నగర్ వాస్తవ్యులైన వాసు చదువుకున్నది మూడో తరగతే. కానీ దారిద్య్రాన్ని అనుభవిస్తూ జీవితాన్ని గడపడంతో పేదరికం కోణాలన్నింటినీ చవి చూసిన వాసు దారిద్య్రంపై అక్షరాలను ఎక్కుపెట్టి సాహితీ సృజన చేశారు. ఆయన ఆదివారం ఉదయం అమరావతిలో జరుగుతున్న ప్రజానాట్య మండలి శిక్షణ తరగతుల్లో పాల్గొంటూ, మాట్లాడుతూనే తీవ్రమైన గుండెనొప్పితో కుప్పకూలి పోయారు. సహచర కళాకారులు ఆయనను వెంటనే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణం కోల్పోయారు. గతరెండు రోజులుగా ప్రజా కళలపై పాటలు రాసి, బాణీలు కట్టి, గజ్జ కట్టి ఆడుతూ, పాడుతూ ఉత్సాహం నింపిన ప్రజా కళాకారుడు తమ కళ్ల ముందే ప్రాణం కోల్పోవడం చూసిన కళాకారులు శోక సంద్రంలో మునిగిపోయారు. బాల్యం నుంచి పాటలపైనే దష్టి .. కర్నూలు నగరంలోని మురికి వాడల్లో పుట్టి పెరిగిన వాసు మూడో తరగతితోనే చదువుకు చుక్క పెట్టారు. పని చేస్తేగాని పొద్దుగడవని స్థితిలో ఉన్న వాసు రకరకాల వర్క్‌షాపుల్లో కూలీగా పని చేశారు. ఈ క్రమంలో ఆయనకు సీపీఎం ప్రధాన నాట్య మండలితో పరిచయం ఏర్పడింది. పదునైన పాటలు పాడుతూ.. పాడుతూ.. ఆయన పాటలు రాయడం ప్రారంభించారు. బాల కార్మిక వ్యవస్థ, నిరక్ష్యరాస్యత నిర్మూలన తదితర కార్యక్రమాల్లో 1990 నుంచి ఆయన చురుగ్గా పాల్గొన్నారు. మహిళా కూలీలు, ఫ్యాక్టరీల్లో కార్మికులు చాలీచాలని జీతాలతో బతుకుతున్న వైనాన్ని అక్షరీకరించారు. ఉద్యమ ప్రస్థానంలో భాగంగా ప్రజా పాటలు పాడుతున్న సుజాత అనే కళాకారిణిని పెళ్లి చేసుకున్నారు. ప్రజానాట్య మండలికే తన పూర్తి జీవితాన్ని అంకితం చేశారు. పేద ప్రజల కడగండ్లను నాటికలుగా, గేయాలుగా, పాటలుగా రాస్తూ ప్రజా కళలను ఆదరించాలనే ప్రచారం చేశారు. ఈయన రాసిన నా సెమట సుక్కో.. పాటను విని ఆంధ్రప్రదేశ్ తెలుగు అధికార భాష సంఘం అధ్యక్షుడు రాళ్లబండి కవితా ప్రసాద్ కన్నీరు కార్చి, వాసును భుజం తట్టి మెచ్చుకున్నారు. సుప్రసిద్ధ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ వాసు పాటల్లో ప్రజల ఆర్థి, ప్రజల వ్య«థ స్పష్టంగా కనిపిస్తుందని ప్రశంసించారు. కళాకారుల సంతాపం.. ప్రజల పాటలు రాస్తూ, పేదల కోసమే జీవితాన్ని అంకితం చేసిన వాసు మరణం ప్రజా నాట్య మండలికి తీరని లోటని, ప్రజా నాట్య మండలి జిల్లా కార్యదర్శి బసవరాజు, సాహితీ స్రవంతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంధ్యాల రఘుబాబు, జిల్లా కార్యదర్శి కెంగార మోహన్ తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. వాసు రాసిన పాటలను పలు వేదికలపై పాడి, ప్రజల్లో చైతన్యం నింపామని, ప్రముఖ గజల్ గాయకుడు మహమ్మద్‌మియ్యా అన్నారు. వాసు పాటలు అజరామరంగా ప్రజల్లో గుండెల్లో నిలిచిపోతాయని ప్రముఖ రచయిత ఇనాయతుల్లా అన్నారు. వాసు పాటలు ప్రజ ల బాధల్ని లోకానికి చాటి చెప్పాయని లలిత కళా సమితి పత్తి ఓబులయ్య అన్నారు. ప్రముఖ రచయితలు ఎస్‌డీవీ అజీజ్, వెంకటకష్ణ, ప్రజాభ్యుదయ సంస్థ భార్గవ, అధ్యక్షుడు శ్రీనివాస్, ధర్మపేట యువజన సంఘం నాయకులు ఇమ్మానియేలు, యేసేపు తదితరులు సంతాపం ప్రకటించారు. -
33 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
-
బరితెగించిన ఎర్రచందనం స్మగ్లర్లు
తిరుపతి: చిత్తూరు జిల్లా ఏర్పేడు పట్టణంలో బుధవారం వేకువజామున టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఓ లారీ ఎర్రచందనాన్ని తరలిస్తుండగా పోలీసులు వెంబడించారు. ఈ క్రమంలో లారీ ఓ షాప్ లోకి దూసుకెళ్లింది. దీంతో పోలీసులు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. బరితెగించిన స్మగ్లర్లు పోలీసులపై తిరగబడ్డారు. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ఆర్ఎస్ఐ వాసు కి గాయాలయ్యాయి. లారీ, 33 దుంగలను స్వాధీనం చేసుకోగా, 27 మంది కూలీలు పరారయ్యారు. వారి కోసం పోలీసులు తనిఖీలు చేపట్టారు. -
ఎన్ఆర్ఐపై పోలీసుల దాష్టీకం
- ప్రవాస భారతీయుడిపై దాడి - డబ్బుల కోసం డిమాండ్ - హెచ్ఆర్సీని ఆశ్రయించిన బాధితుడు - విచారణకు ఆదేశం - పోలీసులపై వేటుపడే అవకాశం నాంపల్లి/ముషీరాబాద్: ప్రవాస భారతీయుడిపై ముషీరాబాద్ పోలీసులు దాష్టీకం చేశారు. విచక్షణారహితంగా కొట్టి గాయపరచడంతో బాధితుడు వాసు మల్లాపురం సోమవారం మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఘటనపై విచారణ జరిపించి జులై 16లోగా నివేదికను అందజేయాలని హక్కుల కమిషన్.. నగర పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది. బాధితుడి కథనం ప్రకారం...మహేంద్ర హిల్స్ కు చెందిన వాసు మల్లాపురం 14 ఏళ్లుగా ఐర్లాండ్‌లో ఉంటున్నారు. వేసవి సెలవులకు నగరానికి వచ్చిన ఆయన ఈనెల 25న ముషీరాబాద్‌కు చెందిన తన స్నేహితులు ప్రీతమ్, నిఖిల్‌లతో కలిసి కోఠిలో ఓ హోటల్లో మద్యం తాగాడు. ఆ తర్వాత వారిని వదిలేందుకు ముషీరాబాద్ అనూషా అపార్ట్‌మెంట్‌కు వెళ్లిన అతను కారును పక్కన ఆపి స్నేహితులతో మాట్లాడుతుండగా అక్కడికి చేరుకున్న బ్లూకోల్ట్స్ సిబ్బంది అర్ధరాత్రి రోడ్డుపై ఏమి చేస్తున్నారంటూ తమపై దాడి చేసినట్లు తెలిపాడు. దీనిపై ప్రశ్నించడంతో పోలీసులకే ఎదురు చెప్తారా తమను స్టేషన్‌కు తీసుకెళ్లి విచక్షణారహితంగా కొట్టినట్లు తెలిపా రు. అన ంతరం సీఐ దగ్గరకు తీసుకెళ్లగా అతను తమను దారుణంగా అవమానించడమేగాక, తమ ఫోన్లు లాక్కున్నారని, రూ. రూ.5 లక్షలు ఇస్తే వదిలి వేస్తానని, లేనిచో పాస్‌పోర్టులు సీజ్ చేస్తానని చెప్పాడన్నారు. లేని పక్షంలో పరారీలో ఉన్నాడంటూ మళ్లీ లోపల వేసి బొక్కలు ఇరగ్గొడతానని హెచ్చరించాడన్నారు. అంతేగాకుంగా తన స్నేహితుడిపై 353 సెక్షన్ కింద కేసు నమోదు చేసి జైలుకు పంపించారని వాపోయారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆతను కోరాడు. ఘటనపై డీసీపీ విచారణ కాగా ఈ విషయంపై విచారణ చేపట్టాలని ఉన్నతాధికారుల ఆదేశంతో సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డి ముషీరాబాద్ ఇన్స్పెక్టర్ బిట్టు మోహన్‌కుమార్, సెక్టార్ ఎస్సైలు సంపత్, భాస్కర్‌రావులను డీసీపీ కార్యాలయాలని పిలిపించారు. సమస్య హెచ్ఆర్సీ వరకు వెళ్లినా ఉన్నతాధికారులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ఆయన వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. నిందితుల్లో ఒక్కరిపై మాత్రమే కేసు నమోదు చేసి మిగతా ముగ్గుర్నీ ఎందుకు వదిలి పెట్టారని ప్రశ్నించిన ట్లు తెలిసింది. ఈ ఘటనకు బాధ్యులైన కానిస్టేబుళ్లు, ఎస్సైపై వేటు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదేనా భద్రత హైదరాబాద్‌లో సీమాంధ్రుల భద్రతకు సెక్షన్-8 అమలు చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నా వద్దనుకున్నాం. ఫ్రెండ్లీ పోలీసింగ్ కోసం ప్రభుత్వం కోట్లు వెచ్చిస్తున్నా సిబ్బందిలో మార్పురావడం లేదు. తప్పు చేయని వ్యక్తులపై పోలీసులు దాడి చేయడం దారుణం. వాసు మల్లాపురంపై జరిగిన దాడి హైదరాబాదులో శాంతిభద్రతల పరిస్థితికి అద్దంపడుతోంది. - ఎస్.చంద్రశే ఖర్ ( గ్రీన్ ఫీల్డ్స్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు) -
బాలికకు ప్రేమ పెళ్లిచేసిన పెద్దలు
అవమానంతో బాలిక తండ్రి ఆత్మహత్య పోలీస్ స్టేషన్ వద్ద గ్రామస్తుల ధర్నా కేవీబీపురం: మైనరైన తన కుమార్తెకు గ్రామ పెద్దలు కులాంతర వివాహం జరిపించారనే అవమానం భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం చిత్తూరు జిల్లా, కేవీబీపురం మండలంలోని రాగిగుంట గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామస్తులు శవాన్ని తీసుకొచ్చి పోలీసుస్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. బాధితుల కథనం మేరకు రాగిగుంట గ్రామానికి చెందిన చెల్లా గోపాల్ కుమారుడు వాసు (21) ఆటో నడుపుతుంటాడు. అతడు, అదే గ్రామానికి చెందిన అగరం సుబ్రమణ్యం కూతురు కవిత (16) ప్రేమించుకున్నారు. వీరి కులాలు వేరుకావడంతో అమ్మాయి తల్లిదండ్రులు వాసును మందలించారు. దాంతో వాసు తన బంధువులు, గ్రామ సర్పంచ్ పిన్నబోయిన అరవింద్, గ్రామ పెద్దలు ఇట్టగుంట శ్రీధర్, గెంజి జనార్ధన్, డబ్బుగుంట కృష్ణయ్య, బిల్లు నరేష్, గెంజి లోకనాథం, గెంజి రమణయ్యను ఆశ్రయించాడు. వారు రహస్యంగా తీసుకెళ్లి ఈ నెల ఐదో తేదీ పెళ్లి చేశారు. దీం తో తీవ్ర మనస్థాపానికి గురైన అగరం సుబ్రమణ్యం గురువారం తెల్లవారుజామున ఉరివేసుకుని మృతి చెందాడు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని రాగిగుంట గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ఎదుట ఉదయం 9 గంటల నుం చి మధ్యాహ్నం 2 గంటల వరకు ధర్నా చేశారు. రహస్య వివాహం జరిపించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్వేటినగరం ఎస్ఐ శ్రీనివాసులు కేవీబీపురం చేరుకుని అందరిపైనా కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు ధర్నా విరమించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. -
అనుమానంతో అమానుషం
గొంతుకోసి భార్యను చంపిన సైకో ఉప్పల్, న్యూస్‌లైన్: భార్యపై అనుమానంతో సైకోగా మారిన భర్త పట్టపగలు ఆమెను అతికిరాతకంగా గొంతుకోసి చంపేశాడు. ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం ఈ దారుణం జరిగింది. పోలీసులు, బంధువు శంకర్ కథనం ప్రకారం... కరీంనగర్ జిల్లా ఇరుకుల్లా గ్రామానికి చెందిన తంగల్లపల్లి వాసు(33)కు మేనమామ కూతురు శ్రీలత (26)తో పదేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి కుమారుడు సాయి పార్దు(7), కుతూరు సింధూ (5) సంతానం. వాసు కుటుంబం మూడేళ్లుగా రామంతాపూర్ కామాక్షిపురంలో నివాసముంటోంది. భర్త వాక్యూం క్లీనర్ల రిపేరర్ కాగా... శ్రీలత చిక్కడపల్లిలో బ్యూటీషియన్‌గా పని చేస్తోంది. గత కొంతకాలంగా వాసు భార్యపై అనుమానం పెంచుకొని రోజూ గొడవపడేవాడు. మతిస్థిమితం లేనట్టు ప్రవర్తించేవాడు. ఈ క్రమంలో ఆసుపత్రుల్లో కూడా చూపించుకున్నాడు. ఇదిలా ఉండగా... భార్య శ్రీలతను హత్య చేయాలని నిర్ణయించుకున్న వాసు కూతురిని తన తల్లి వద్దకు పంపాడు. బుధవారం మధ్యాహ్నం ఇంటికి వచ్చిన వాసు.. కొడుకుకు రూ. 10 ఇచ్చి చాక్లెట్లు కొనుక్కోమని బయటకు పంపాడు. తర్వాత భార్య కళ్లల్లో కారం కొట్టి.. కూరగాయల కత్తితో గొంతుకోసి చంపేశాడు. తర్వాత ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు నమ్మించడానికి యత్నించాడు. వీలు కాకపోవడంతో హత్యకు ఉపయోగించిన కత్తి, కారం ప్యాకెట్‌ను చేత్తో పట్టుకొని బయటకు వచ్చాడు. అతడిని చూసిన స్థానికులు తీవ్రభయాందోళనకు గురయ్యారు. స్థానికులు అతడిని పట్టుకొని నిలదీయగా.. అసలు విషయం బయట పెట్టాడు. స్థానికుల సమాచారం మేరకు ఉప్పల్ సీఐ బాలకృష్ణారెడ్డి, ఎస్ఐలు కిరణ్, ప్రవీణ్‌లు ఘటనా స్థలాన్ని పరిశీలించి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. -
'ఆ ఐదుగురు' మూవీ ట్రైలర్ లాంచ్