తిరుపతి: చిత్తూరు జిల్లా ఏర్పేడు పట్టణంలో బుధవారం వేకువజామున టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఓ లారీ ఎర్రచందనాన్ని తరలిస్తుండగా పోలీసులు వెంబడించారు. ఈ క్రమంలో లారీ ఓ షాప్ లోకి దూసుకెళ్లింది. దీంతో పోలీసులు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. బరితెగించిన స్మగ్లర్లు పోలీసులపై తిరగబడ్డారు. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ఆర్ఎస్ఐ వాసు కి గాయాలయ్యాయి. లారీ, 33 దుంగలను స్వాధీనం చేసుకోగా, 27 మంది కూలీలు పరారయ్యారు. వారి కోసం పోలీసులు తనిఖీలు చేపట్టారు.