మూడు టన్నుల ఎర్ర చందనం దుంగలను చిత్తూరు జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మూడు టన్నుల ఎర్ర చందనం దుంగలను చిత్తూరు జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భారీగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు పోలీసుల సాయంతో దాడులు నిర్వహించారు. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం మామండూరు గ్రామం వద్ద శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. లారీలో తరలిస్తున్న ఎర్ర చందనం దుంగలను గుర్తించిన అధికారులు డ్రైవర్ ను విచారించడానికి ప్రయత్నించగా..అతడి తో పాటు.. మరో 5 మంది పరారయ్యారు. లారీ సహా స్వాధీనం చేసుకున్న దుంగలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. స్వాధీనం చేసుకున్న దుంగల విలువ మార్కెట్ లో రూ. 3 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు.