తొమ్మిది మందిపై పీడీ యాక్టు | The nine-PD Act | Sakshi
Sakshi News home page

తొమ్మిది మందిపై పీడీ యాక్టు

Published Mon, Sep 1 2014 4:17 AM | Last Updated on Sat, Sep 2 2017 12:41 PM

The nine-PD Act

చిత్తూరు(అర్బన్): జిల్లాలో ఎర్ర చందనం అక్రమ ర వాణా చేయడంలో అంతర్జాతీయ స్థా యిలో పేరొందిన తొమ్మిది మంది స్మగ్లర్లపై పీడీ యూక్ట్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం చిత్తూ రు నగరంలోని పోలీసు అతిథి గృహం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్, అదనపు ఎస్పీ అన్నపూర్ణారెడ్డిలు ఈ వివరాలను వెల్లడించారు.

జిల్లా ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేశామన్నారు. వీరిలో పాత స్మగ్లర్లయిన రియాజ్ ఖాన్, అసీఫ్ అలీఖాన్, లక్ష్మణ్‌నాయక్, ఆయి ల్ రమేష్, ఎన్.శరవణన్, హమీద్ ఖా న్, మహ్మద్ రఫీ, విక్రమ్ మెహందీ, ఎం.లక్ష్మణన్‌పై పీడీ యాక్టు నమోదు చేసినట్లు తెలిపారు. మరో ముగ్గురిపై పీడీ యాక్టుకు ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. త్వరలోనే వీరిని సైతం సెంట్రల్ జైలుకు పంపుతామన్నారు.

ఎర్రచందనం స్మగ్లింగ్ చేసి రూ.వేల కోట్లు గడిం చిన స్మగ్లర్ల ఆస్తులను స్వాధీనం చేసుకునే విషయమై ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు ఎస్పీ తెలిపారు. దీనిపై న్యాయ సలహా తీసుకుని ముం దుకు వెళుతున్నట్లు తెలిపారు. అలాగే విదేశాల్లో ఉన్న స్మగ్లర్లపై కేసులు నమో దు చేసి, వారిని అరెస్టు చేయడానికి కూడా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పా రు. ఇంటర్ పోల్ (అంతర్జాతీయ ద ర్యాప్తు సంస్థ)తో మాట్లాడటానికి ప్రభుత్వానికి ఫైలు పంపామన్నారు.

ప్రభుత్వం కేంద్రంతో చర్చించి, కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారుల సాయంతో విదేశాల్లో ఉన్న స్మగ్లర్లను అరెస్టు చేయా ల్సి ఉందన్నారు. ఈ ప్రక్రియ కూడా త్వరలోనే కొలిక్కి వచ్చే అవకాశం ఉందన్నారు. అలాగే ఇప్పటి వరకు ఎర్ర చం దనం రవాణాలో పేరుమోసిన స్మగ్లర్లను సమాజ బహిష్కరణ దిశగా కూడా చర్య లు చేపట్టామన్నారు. దీనిని అమలు చేయడానికి అన్ని విధి విధానాలు రూ పొందిస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.
 
506 కేసులు.. 4175 మంది అరెస్టు
 
జిల్లాలో 2011 నుంచి ఇప్పటి వరకు ఎర్రచందనం కేసుల్లో సుమారు 506 కేసులు నమోదు చేసి, మొత్తం 4175 మందిని అరెస్టు చేశామన్నారు. ఇందు లో చోటా పెలైట్ల నుంచి అంతర్జాతీయ స్మగ్లర్లు కూడా ఉన్నారన్నారు. జూలై ఒక్క నెలలోనే 18 ఎర్ర చందనం అ క్రమ రవాణా కేసులు నమోదు చేసి 122 మంది నిందితులను అరెస్టు చేసి 15 వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. 2011లో 60 కేసులు నమోదైతే 351 మందిని అరెస్టు చేసి, 41 వేల కిలోల ఎర్రచందనం దుంగల్ని స్వాధీ నం చేసుకున్నామన్నారు. 2012లో 134 కేసుల్లో 895 మందిని అరెస్టు చేసి, 98 వేల కిలోల దుంగల్ని, 2013లో 181 కేసుల్లో 1166 మందిని అరెస్టు చేసి 94 వేల కిలోల దుంగలు స్వాధీనం చేసుకున్నామన్నారు.
 
2014లో 131 కేసుల్లో 1763 మందిని అరెస్టు చేసి 52 వేల కిలలో ఎర్ర చందనం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. దీంతో పాటు నిందితులకు చెందిన 4300 వాహనాలను సీజ్ చేశామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement