ఎర్ర స్మగ్లర్లపై పీడీ యాక్ట్ | PD Act on red wood smugglers | Sakshi
Sakshi News home page

ఎర్ర స్మగ్లర్లపై పీడీ యాక్ట్

Published Thu, Nov 26 2015 8:29 PM | Last Updated on Sun, Sep 3 2017 1:04 PM

PD Act on red wood smugglers

ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ అరెస్టయిన నలుగురు స్మగ్లర్లపై ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్టు నమోదు చేసి గురువారం కడప జైలుకు తరలించినట్టు చిత్తూరు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ తెలిపారు.

ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ అరెస్టయి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కర్ణాటకకు చెందిన ఎన్‌టీ. సతీష్‌కుమార్(45), చిత్తూరుకు చెందిన పటాస్ నిస్సార్ అహ్మద్ ఖాన్ (42), తిరువణ్నామలైకు చెందిన పి. రాజేంద్రన్ (34), తిరునన్వేలికి చెందిన మురుగన్ (42)పై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేసి కడప జైలుకు తరలించినట్లు తెలిపారు.

ఇప్పటి వరకు జిల్లాలో 53 మంది ఎర్రచందనం స్మగర్లపై పీడీ యాక్టులు పెట్టామన్నారు. పీడీ యాక్టు నమోదైనవారు మళ్లీ ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తే.. వారిపై రౌడీషీట్లు తెరుస్తామని వివరించారు. ఇప్పటికే 18 మంది స్మగ్లర్లపై రౌడీషీట్లు పెట్టామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement