Ghattamaneni Srinivas
-
తాడిపత్రి ఘర్షణలకు ఆ ఇద్దరే కారణం : డీఐజీ
సాక్షి, అనంతపురం: ప్రబోధానందస్వామి ఆశ్రమం ఘటనలో పోలీసుల వైఫల్యంపై ఉన్నతాధికారులు స్పందించారు. తాడిపత్రిలో హింస చెలరేగడంపై సీఐ సురేంద్రనాథ్ రెడ్డి, ఎస్సై రామకృష్ణారెడ్డిలను బాధ్యులను చేస్తూ వారిపై చర్యలకు ఉపక్రమించారు. తాడిపత్రిలోని ఘర్షణలకు అక్కడి సీఐ, ఎస్సైలు కారణమని పేర్కొంటూ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ వారి సస్పెన్షన్‌కు ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులు జేసీ వర్గీయులకు అనుకూలంగా వ్యవహరించడంతోనే అంతటి హింస చెలరేగిందని అన్నారు. సీఐ, ఎస్సైలు ప్రబోధానందస్వామి ఆశ్రమం మీదుగా జేసీ వర్గీయులు ఊరేగింపుకు అనుమతి ఇవ్వకుండా ఉండాల్సిందని చెప్పారు. ఆ దారిలో వెళితే ఘర్షణ జరుగుతుందని ఇంటలిజెన్స్ అధికారులు, నిఘా వర్గాలు హెచ్చరించినా సదరు సీఐ, ఎస్సై పట్టించుకోలేదని డీఐజీ వెల్లడించారు. (చదవండి : స్వామి.. జేసీ.. ఓ పోలీసు!) -
ఎర్ర స్మగ్లర్లపై పీడీ యాక్ట్
ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ అరెస్టయిన నలుగురు స్మగ్లర్లపై ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్టు నమోదు చేసి గురువారం కడప జైలుకు తరలించినట్టు చిత్తూరు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ తెలిపారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ అరెస్టయి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కర్ణాటకకు చెందిన ఎన్టీ. సతీష్‌కుమార్(45), చిత్తూరుకు చెందిన పటాస్ నిస్సార్ అహ్మద్ ఖాన్ (42), తిరువణ్నామలైకు చెందిన పి. రాజేంద్రన్ (34), తిరునన్వేలికి చెందిన మురుగన్ (42)పై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేసి కడప జైలుకు తరలించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 53 మంది ఎర్రచందనం స్మగర్లపై పీడీ యాక్టులు పెట్టామన్నారు. పీడీ యాక్టు నమోదైనవారు మళ్లీ ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తే.. వారిపై రౌడీషీట్లు తెరుస్తామని వివరించారు. ఇప్పటికే 18 మంది స్మగ్లర్లపై రౌడీషీట్లు పెట్టామని వివరించారు.