సాక్షి, అనంతపురం: ప్రబోధానందస్వామి ఆశ్రమం ఘటనలో పోలీసుల వైఫల్యంపై ఉన్నతాధికారులు స్పందించారు. తాడిపత్రిలో హింస చెలరేగడంపై సీఐ సురేంద్రనాథ్ రెడ్డి, ఎస్సై రామకృష్ణారెడ్డిలను బాధ్యులను చేస్తూ వారిపై చర్యలకు ఉపక్రమించారు. తాడిపత్రిలోని ఘర్షణలకు అక్కడి సీఐ, ఎస్సైలు కారణమని పేర్కొంటూ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ వారి సస్పెన్షన్‌కు ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులు జేసీ వర్గీయులకు అనుకూలంగా వ్యవహరించడంతోనే అంతటి హింస చెలరేగిందని అన్నారు. సీఐ, ఎస్సైలు ప్రబోధానందస్వామి ఆశ్రమం మీదుగా జేసీ వర్గీయులు ఊరేగింపుకు అనుమతి ఇవ్వకుండా ఉండాల్సిందని చెప్పారు. ఆ దారిలో వెళితే ఘర్షణ జరుగుతుందని ఇంటలిజెన్స్ అధికారులు, నిఘా వర్గాలు హెచ్చరించినా సదరు సీఐ, ఎస్సై పట్టించుకోలేదని డీఐజీ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment