
సాక్షి, తూర్పుగోదావరి (పిఠాపురం) : పోలీసులపై ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి రెచ్చిపోవడం.. పోలీసు అధికారుల సంఘం అదేస్థాయిలో వార్నింగ్ ఇవ్వడం.. తిరిగి జేసీ తనదైనశైలిలో బదులివ్వడంపై హోంమంత్రి చినరాజప్ప స్పందించారు. జేసీ తీరు ఆయన విజ్ఞతకే వదులుతున్నానని తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో చినరాజప్ప పేర్కొన్నారు.
టీడీపీ ఎంపీగా ఉండి ప్రభుత్వ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని చినరాజప్ప అన్నారు. పోలీసు సంఘం ప్రతినిధులు కూడా నాలుకలు కోస్తామని అనడం సమర్థనీయం కాదని హితవుపలికారు. ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు సమర్థవంతంగా పని చేస్తున్నారన్నారు. పోలీసులు సంయమనంతో పరిస్థితులను బట్టి స్పందించాలని సూచించారు.
చదవండి :
ఖాకీ డ్రస్ తీసేసి రా..!
Comments
Please login to add a commentAdd a comment