ఆఫ్గన్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలకమార్పు | Team India Surprise Addition To Squad Ahead Of 3rd ODI Vs Afghanistan | Sakshi
Sakshi News home page

ఆఫ్గన్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలకమార్పు

Jun 19 2026 10:50 AM | Updated on Jun 19 2026 11:41 AM

Team India Surprise Addition To Squad Ahead Of 3rd ODI Vs Afghanistan

స్వదేశంలో అప్గానిస్తాన్‌తో జరుగున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను టీమిండియా 2-0తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. అయితే చెన్నై వేదికగా మూడో వన్డే జరగనున్న నేపథ్యంలో టీమిండియా జట్టులో కీలక మార్పు జరగనుంది. మోకాలి గాయంతో తొలి రెండు వన్డేలకు దూరమైన హర్షిత్ రానా చివరి వన్డే ఆడనున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. 

‘హర్షిత్ రానా  బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రీహాబిలిటేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్నాడు. చెన్నై వేదికగా జరగనున్న మూడో వన్డే ఆడేందుకు టీమిండియాలో జాయిన్ అయ్యాడు’ అని బీసీసీఐ సెక్రటరీ దేవ్‌జిత్ సైకియా తెలిపారు.  ఇక 2026 టీ20 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా సౌతాఫ్రికాతో వార్మప్ మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తూ హర్షిత్ రానా గాయపడ్డాడు. 

దీంతో టీ20 ప్రపంచకప్‌తో పాటు ఐపీఎల్‌కు కూడా దూరమయ్యాడు. అయితే ఫిట్‌నెస్ నిరూపించుకోకుండానే హర్షిత్ రానాకు ఇంగ్లండ్‌, ఐర్లాండ్ టూర్లతో పాటు ఆసియా గేమ్స్‌కు ఎంపిక చేసిన టీమిండియాలో చోటు లభించడం విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో అతడి ఎంపికపై కూడా క్రీడా వర్గాల్లో కూడా పెద్ద చర్చే నడిచింది. ఈ విషయాలన్నీ పక్కనబెడితే హర్షిత్ రానా అప్గానిస్తాన్‌తో మూడో వన్డేలో ఆడడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. 

24 ఏళ్ల హర్షిత్ రానా టీమిండియా తరఫున 14 వన్డేలాడి 16 వికెట్లు తీశాడు. చివరగా ఈ ఏడాది న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో హర్షిత్ రానా టీమిండియా తరఫున మ్యాచ్ ఆడాడు. ఇక గిల్ సారథ్యంలోని టీమిండియా ఆఫ్గన్‌తో వన్డే సిరీస్‌లో మంచి ప్రదర్శన కనబరుస్తోంది. వర్షంతో తొలి వన్డేలో బ్యాటింగ్‌కు పెద్దగా అవకాశం రాలేదు. అయితే రెండో వన్డేలో మాత్రం కెప్టెన్ గిల్‌తో పాటు ఇషాన్ కిషన్ సెంచరీల మోత మోగించారు. దీంతో రెండో వన్డేలో టీమిండియా 170 ప‌రుగుల భారీ తేడాతో విజ‌యాన్ని అందుకుంది.

అఫ్గానిస్థాన్‌తో మూడో వన్డేకి భారత జట్టు: శుభ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, శ్రేయాస్‌ అయ్యర్‌ (వైస్‌ కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌ (వికెట్‌ కీపర్‌), ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), నితీశ్‌ కుమార్‌ రెడ్డి, వాషింగ్టన్‌ సుందర్‌, కులదీప్‌ సింగ్‌ యాదవ్‌, ప్రిన్స్‌ దీప్‌, కృష్ణ యాదవ్‌, యువరాజు బ్రార్, హర్ష్ దూబే, యశస్వి జైస్వాల్, హర్షిత్ రానా.

చదవండి: గాయంతో శ్రేయాంక ఔట్‌.. ఆమె స్థానంలో ఎవరంటే?

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement