గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తారా? | Raviteja sign a new film for Sithara Entertainments | Sakshi
Sakshi News home page

గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తారా?

Published Mon, Jun 19 2023 1:10 AM | Last Updated on Mon, Jun 19 2023 4:47 AM

Raviteja sign a new film for Sithara Entertainments - Sakshi

రవితేజ యమా స్పీడ్‌గా సినిమాలు చేస్తున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రాలు ‘టైగర్‌ నాగేశ్వరరావు’ అక్టోబరు 20న, ‘ఈగిల్‌’ జనవరిలో రిలీజ్‌ కానున్నాయి. అయితే ఈ చిత్రాల తర్వాత రవితేజ ఏ దర్శకుడితో సినిమా చేస్తారు? అనే చర్చ కొంతకాలంగా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. గోపీచంద్‌ మలినేని, అనుదీప్‌ వంటి దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి.

అయితే తాజాగా జీవీఆర్‌ వాసు చెస్పిన ఓ స్టోరీ లైన్‌కు రవితేజ ఇంప్రెస్‌ అయ్యారని, పూర్తి కథ విన్న తర్వాత ఈ ప్రాజెక్ట్‌పై తుది నిర్ణయం తీసుకుంటారనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ నిర్మించనుందనే ప్రచారం కూడా జరుగుతోంది. మరి.. జీవీఆర్‌ వాసు కథకి రవితేజ ఫైనల్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తారా? లేదా? వేచి చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement