
మోహన్‌లాల్ హీరోగా నటించిన మలయాళ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ‘లూసిఫర్’ (2019) మళ్లీ విడుదల కానుంది. స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో ఒక చిన్న రోల్‌లో నటించడమే కాకుండా.. దర్శకత్వం కూడా వహించారు. ఈ మూవీ భారీ విజయం అందుకోవడంతో సీక్వెల్‌గా ‘ఎల్2: ఎంపురాన్’ సినిమా కూడా తెరకెక్కించారు. ఈ మూవీలో కూడా మోహన్‌లాల్ హీరోగా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్రలో నటిస్తూ, దర్శకత్వం వహించారు.
‘లూసిఫర్’ మార్చి 20న రీరిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. ఈమేరకు మోహన్‌లాల్ ట్రైలర్‌ను కూడా తన సోషల్‌మీడియాలో షేర్ చేశారు. ఈ మూవీకి సీక్వెల్‌గా వస్తున్న ‘ఎల్ 2 :ఎంపురాన్’ మార్చి 27న విడుదల కానున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. పార్ట్-2 విడుదలకు ముందు ఇలా పార్ట్-1 రీరిలీజ్ చేయడం వల్ల ప్రేక్షకులకు సినిమా బాగా రీచ్ అవుతుందని మేకర్స్ ప్లాన్ చేశారు. లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్ నిర్మించిన ‘ఎల్2: ఎంపురాన్’ సినిమా తెలుగు, తమిళం, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.

మొదట కేవలం మలయాళంలో మాత్రమే విడుదలైన లూసిఫర్ బాక్సాఫీస్ వద్ద రూ. 160 కోట్ల రాబట్టి భారీ విజయాన్ని అందుకుంది. అయితే, తెలుగులో గాడ్‌ఫాదర్ పేరుతో మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేసిన విషయం తెలిసిందే. కానీ, ఇక్కడ పెద్దగా చిరు ప్రభావం చూపలేకపోయారు. దీంతో రూ. 100 కోట్ల వరకు మాత్రమే గాడ్‌ఫాదర్ కలెక్ట్ చేసింది. మలయాళంలో విడుదలైన లూసిఫర్‌తో పోల్చితే చాలా వ్యత్యాసం కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment