RT75: రవన్న దావత్ ఇస్తుండు.. రెడీ అయిపోండ్రి | RT 75: Ravi Teja Joins Hands With Sithara Entertainments | Sakshi
Sakshi News home page

RT75: రవన్న దావత్ ఇస్తుండు.. రెడీ అయిపోండ్రి

Apr 9 2024 12:19 PM | Updated on Apr 9 2024 2:45 PM

RT 75: Ravi Teja Joins Hands With Sithara Entertainments - Sakshi

వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు రవితేజ. ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలను రిలీజ్‌ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. గతేడాదిలో వాల్తేరు వీరయ్య, రావణాసుర, టైగర్‌ నాగేశ్వరరావు చిత్రాలను రిలీజ్‌ చేశాడు. ఇక ఈ ఏడాది ఇప్పటికే ఈగల్‌ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం హరీశ్‌ శంకర్‌ దర్వకత్వంలో మిస్టర్‌ బచ్చన్‌ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్‌లో ఉండగానే మరో సినిమాను ప్రకటించాడు మాస్‌ మహారాజా.

ఉగాది పర్వదినం సందర్భంగా తన 75వ సినిమా అప్‌డేట్‌ ఇచ్చాడు. ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం వహించగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. అనౌన్స్‌మెంట్ పోస్టర్ చూస్తేనే, ఈ సినిమా 'దావత్'లా ఉండబోతుందనే అభిప్రాయం కలుగుతోంది. 

 అలాగే పోస్టర్ మీద "రవన్న దావత్ ఇస్తుండు.. రెడీ అయిపోండ్రి", "హ్యాపీ ఉగాది రా భయ్" అని తెలంగాణ యాసలో రాసి ఉండటం గమనించవచ్చు. దీనిని బట్టి చూస్తే తెలంగాణ నేపథ్యంలో సాగే చిత్రమని అర్థమవుతోంది. ఈ సినిమాలో రవితేజ పాత్ర పేరు "లక్ష్మణ భేరి" అని తెలిపిన మేకర్స్.. ఈ పాత్ర తీరు ఎలా ఉండబోతుందో కూడా ఉగాది పంచాంగం రూపంలో చెప్పారు. "ఆదాయం: చెప్పను తియ్.. ఖర్చు: లెక్క జెయ్యన్.. రాజ్యపూజ్యం: అన్ లిమిటెడ్.. అవమానం: జీరో" అంటూ రవితేజ పోషిస్తున్న పాత్ర గురించి పోస్టర్ పై రాసుకొచ్చిన తీరు భలే ఉంది.

.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement