రవన్న దావత్‌కి రెడీ అయిపోండ్రి | RT75: Ravi Teja teams up with Bhanu Bhogavarapu for his next | Sakshi
Sakshi News home page

రవన్న దావత్‌కి రెడీ అయిపోండ్రి

Published Wed, Apr 10 2024 12:05 AM | Last Updated on Wed, Apr 10 2024 12:05 AM

RT75: Ravi Teja teams up with Bhanu Bhogavarapu for his next - Sakshi

హీరో రవితేజ ల్యాండ్‌ మార్క్‌ మూవీ ‘ఆర్‌టీ 75’  (వర్కింగ్‌ టైటిల్‌) ప్రకటన వెలువడింది. భాను భోగవరపు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించనున్నారు. ఈ చిత్రం ప్రకటించిన సందర్భంగా రిలీజ్‌ చేసిన పోస్టర్‌ మీద ‘రవన్న దావత్‌ ఇస్తుండు.. రెడీ అయిపోండ్రి’ అని ఉంది. ఈ సినిమాలో లక్ష్మణ భేరి అనే పాత్రలో రవితేజ కనిపిస్తారు.

ఈ పాత్ర తీరు ఎలా ఉంటుందో ఉగాది పంచాంగం రూపంలో చెప్పారు. ‘ఆదాయం: చెప్పను తియ్, ఖర్చు: లెక్క జెయ్యన్, రాజ్యపూజ్యం: అన్‌ లిమిటెడ్, అవమానం: జీరో’ అంటూ రాసుకొచ్చారు. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి రిలీజ్‌ చేయనున్నట్లు యూనిట్‌ ప్రకటించింది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్, కెమెరా: కార్తీక్‌ ఘట్టమనేని.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement