తిరుమలలో బయటపడ్డ నకిలీ టికెట్ల దందా | Duplicate fake ticket issued in Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో బయటపడ్డ నకిలీ టికెట్ల దందా

Published Mon, Dec 25 2017 3:16 PM | Last Updated on Mon, Dec 25 2017 3:16 PM

తిరుమల : తిరుమలలో నకిలీ టికెట్ల దందా బయటపడింది. 300 రూపాయల విలువైన ప్రత్యేక దర్శన నకిలీ టిక్కెట్ల దందా సోమవారం వెలుగులోకి వచ్చింది. చిత్తూరుకు చెందిన వాసు అనే దళారిని టీటీడీ విజిలెన్స్‌ వింగ్‌ అధికారులు ఈ ఘటనకు సంబంధించి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రోజూ వందల నకిలీ టిక్కెట్లపై భక్తులకు దర్శనం కల్పిస్తూ వాసు అక్రమార్జనకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైంది.

కౌంటర్ సిబ్బందితో  దళారి వాసు కుమ్మక్కై ఈ దందాకు తెరలేపినట్లు విచారణలో వెలుగుచూసింది. మూడు నెలల క్రితమే నకిలీ టిక్కెట్ల దందా కేసులో దళారి వాసు జైలుకు వెళ్లి వచ్చాడు. మళ్లీ ఇదే దందా సాగిస్తూ అధికారులకు చిక్కాడు. సురేంద్ర, కనకరాజు అనే ఇద్దరు కౌంటర్ సిబ్బందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement