tiruamala
-
వైఎస్ జగన్ తిరుమల పర్యటన.. పోలీసుల ఆంక్షలు
సాక్షి,తిరుపతి జిల్లా : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుమల పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ మేరకు గురువారం నాడు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 పోలీసు యాక్ట్ అమల్లోకి తెచ్చారు. శాంతి భద్రతల పరిరక్షణలో వచ్చే నెల 24 తేదీ వరకు సెక్షన్ 30 అమల్లో ఉంటుందని అన్నారు.ముందస్తు అనుమతి లేనిదే ఎలాంటి సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించకూడదు. ర్యాలీలు, ఊరేగింపులు, సభలు, సమావేశాలు నిర్వహించాలంటే చట్ట ప్రకారం పోలీస్ శాఖ నుండి ముందస్తు అనుమతి తప్పనిసరి. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు హెచ్చరించారు. తిరుమల పర్యటనలో వైఎస్ జగన్శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణల నేపథ్యంలో తిరుమల పవిత్రతను, ప్రసాదం విశిష్టతను చంద్రబాబు అపవిత్రం చేసినందుకుగానూ.. ఆ పాప ప్రక్షాళన కోసం ఈ శనివారం(సెప్టెంబర్ 28) ప్రత్యేక పూజలు నిర్వహించాలని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు ఇచ్చారు. వైఎస్ జగన్ సైతం తిరుమలలో పర్యటించనున్నారు. ఇందుకోసం శుక్రవారం రాత్రే ఆయన తిరుమల చేరుకోనున్నారు. శనివారం ఉదయమే వైఎస్ జగన్ స్వామివారిని దర్శించుకుంటారు. -
Samyuktha Menon: తిరుమలలో విరూపాక్ష హీరోయిన్.. కాలినడకన స్వామివారి దర్శనం(ఫోటోలు)
-
ట్రామా దినోత్సవాన్ని పురస్కరించుకుని
ట్రామా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం అపోలో ఆసుపత్రి నేతృత్వంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రమాదం బారిన పడి అత్యవసర సేవల కోసం ఎదురు చూస్తున్న వారికి అధిక రక్తస్త్రావం జరగకుండా, ఆస్పత్రికి తరలించేందుకు ముందుగా అందించాల్సిన సహకారం, వైద్య సేవల గురించి ఇందులో వివరించారు. అపోలో మేనేజింగ్ డైరెక్టర్ సునీతారెడ్డి నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో డాక్టర్లు, బాబు అబ్రహం, సెంథిల్కుమార్, భాస్కర్ ధనపాల్, మధుమిత ప్రసంగించారు. – సాక్షి, చైన్నె -
అలిపిరిలో బాంబు బ్లాస్ట్ బెదిరింపు ఫోన్ కాల్స్.. వ్యక్తి అరెస్టు..
తిరుమల: అలిపిరి వద్ద బాంబు బ్లాస్ట్ చేస్తానంటూ ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు. నిందితున్ని తమిళనాడు రాష్ట్రం, సేలం జిల్లాకు చేందిన బాలాజీ(39)గా గుర్తించారు. అతన్ని ఈ రోజు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 15వ తారీఖున అలిపిరి చెక్ పాయింట్ ల్యాండ్ ఫోన్ కి కాల్ చేసాడో వ్యక్తి. మధ్యాహ్నం 3గంటలకు 100 మందిని బాంబ్ బ్లాస్ట్ తో చంపేస్తానని చెప్పడంతో వెంటనే అప్రమత్తం అయ్యారు పోలీసులు. టీటీడీ పోలీసు, విజిలెన్స్ అధికారుల సమన్వయంతో అలిపిరి చెక్ పాయింట్ తనిఖీ చేసారు. అయినప్పటికీ ఎక్కడా ఎటువంటి పేలుడు పదార్ధాలు లభించలేదు. బాంబు పేలుడుకు సంబంధించి ఫోన్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఎవరైనా ఆకతాయి, దుష్ట చేష్టలకి పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తిరుమల డీఎస్పీ భాస్కర్ రెడ్డి అన్నారు. ఇదీ చదవండి: ఏపీ పంచాయతీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారుల హవా -
తిరుమల శ్రీవారి సన్నిధిలో వైభవంగా వసంతోత్సవాలు (ఫొటోలు)
-
తిరుమల కొండపై నటి అర్చనా గౌతమ్ రచ్చ... అసలు నిజాలు ఇవే
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన యూపీ నటి అర్చన గౌతమ్ సోమవారం నానా రచ్చ చేసిన విషయం తెలిసిందే. రూ.10,500 పెట్టి టికెట్ కొన్నా.. టీటీడీ సిబ్బంది తనకు టికెట్ ఇవ్వలేదని, తనతో దురుసుగా ప్రవర్తించారని ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను టీటీడీ కొట్టిపారేసింది. ఇలాంటి అసత్య ప్రచారాలను భక్తులు నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. అసలు ఆరోజు ఏం జరిగింది? నిజా నిజాలు ఏంటి ఈ వీడియోలో చూడండి. -
దండాలయ్యా.. మాతో నువ్వుండాలయ్యా!
తిరుపతి : ‘అడిగితే తప్ప అమ్మ కూడా అన్నం పెట్టదు. అలాంటిది అడగకుడానే అన్నీ ఇచ్చిన మీరు చల్లంగుండాలయ్యా’ అంటూ గడపగడపనా ప్రజలు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఎంపీ గురుమూర్తి, మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్రెడ్డిని ఆశీర్వదించారు. జగనన్న అందించిన సంక్షేమ పథకాలు తమ జీవితాలకు వెలుగులు ఇచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు అందించలేనన్ని సంక్షేమ పథకాలు అందించిన జగనన్ననే మళ్లీ గెలిపించుకుంటామని చేతిలో చెయ్యేసి హామీ ఇచ్చారు. శుక్రవారం తిరుపతి నగరంలోని 46 డివిజన్లో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి అపూర్వ ఆదరణ లభించింది. అడుగడుగునా హారతులు పట్టి ఆత్మీయంగా స్వాగతం పలికారు. -
అఖండ దీపంపై వదంతులు నమ్మొద్దు..
సాక్షి, తిరుమల: అఖండ దీపంపై వదంతులను నమ్మొద్దని రమణ దీక్షితులు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుప్రభాతం నుంచి ఏకాంతసేవ వరకు అఖండ దీపం వెలుగుతూనే ఉంటుందని తెలిపారు. స్వామివారి కైంకర్యాలు నిత్యం ఆగమశాస్త్రం ప్రకారం జరుగుతున్నాయని పేర్కొన్నారు. కరోనా నివారణకు ప్రభుత్వ సూచనలు పాటిస్తూ ఇళ్లల్లోనే ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తిరుమలలో శాస్త్రోక్తంగా ధన్వంతరి యాగం తిరుమలలో ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో గురువారం శాస్త్రోక్తంగా ధన్వంతరి యాగం ప్రారంభమైంది. లోక సంక్షేమం కోసం టీటీడీ ఈ యాగం నిర్వహిస్తోంది. 27, 28వ తేదీల్లో విశేష హోమాలు నిర్వహిస్తారు. 28న విశేష హోమం అనంతరం మహా పూర్ణాహుతి నిర్వహించి కుంభజలాన్ని జలాశయంలో కలుపుతారు. ఈ శక్తి సూర్యరశ్మి ద్వారా వాతావరణంలో కలిసి మేఘాల ద్వారా వాయు రూపంలో అనారోగ్య కారకాలను నశింపజేస్తుంది. యాగంలో వేదాల్లోని సూర్య జపానికి, అష్టదిక్పాలకులకు సంబంధించిన వేదమంత్రాలను రుత్వికులు పారాయణం చేస్తున్నారు. -
తిరుమలలో మరో ఇద్దరు దళారుల అరెస్ట్
-
తిరుమలలో మరో ఇద్దరు దళారుల అరెస్ట్
సాక్షి, తిరుమల: తిరుమలలో మరో ఇద్దరు దళారులను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. 17 వేల రూపాయలకు రెండు సుప్రభాతం సేవా టిక్కెట్లను విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. దళారులలో ఒకరు టీటీడీ ఉద్యోగి మధుసూదన్ కాగా, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో అటెండర్గా పనిచేస్తున్నాడు. ప్రజా ప్రతినిధులు సిఫార్సు లేఖలతో టిక్కెట్లు పొంది భక్తులకు విక్రయిస్తున్నారని విజిలెన్స్ అధికారులు వెల్లడించారు. టిక్కెట్లు లేకుండానే భక్తులను విఐపి బ్రేక్ దర్శనాలకు అనుమతిస్తునట్లు పోలీసులు గుర్తించారు. -
తిరుమల శ్రీవారి సన్నిధిలో సైడ్ బిజినెస్
-
తిరుమలలో బయటపడ్డ నకిలీ టికెట్ల దందా
తిరుమల : తిరుమలలో నకిలీ టికెట్ల దందా బయటపడింది. 300 రూపాయల విలువైన ప్రత్యేక దర్శన నకిలీ టిక్కెట్ల దందా సోమవారం వెలుగులోకి వచ్చింది. చిత్తూరుకు చెందిన వాసు అనే దళారిని టీటీడీ విజిలెన్స్ వింగ్ అధికారులు ఈ ఘటనకు సంబంధించి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రోజూ వందల నకిలీ టిక్కెట్లపై భక్తులకు దర్శనం కల్పిస్తూ వాసు అక్రమార్జనకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైంది. కౌంటర్ సిబ్బందితో దళారి వాసు కుమ్మక్కై ఈ దందాకు తెరలేపినట్లు విచారణలో వెలుగుచూసింది. మూడు నెలల క్రితమే నకిలీ టిక్కెట్ల దందా కేసులో దళారి వాసు జైలుకు వెళ్లి వచ్చాడు. మళ్లీ ఇదే దందా సాగిస్తూ అధికారులకు చిక్కాడు. సురేంద్ర, కనకరాజు అనే ఇద్దరు కౌంటర్ సిబ్బందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
సాక్షి, తిరుమల : తిరుమలలో గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు 2 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. కాలినడక భక్తులకు 2 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. బుధవారం 62,351 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 26,676 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.2.86కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల : తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి కంపార్టమెంట్లు అన్నీ నిండిపోవడంతో వెలుపల క్యూలైన్లో భక్తులు వేచి ఉండాల్సి వచ్చింది. సర్వ దర్శనానికి 12 గంటలు, కాలిబాట దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారి హుండీ ఆదాయం 2.84 కోట్లు. సోమవారం నుంచి సర్వదర్శనానికి స్లాట్ విధానం ప్రారంభమవుతుంది. దీనికి గానూ 20 ప్రాంతాలలో 117 కౌంటర్లు టీటీడీ ఏర్పాటు చేసింది. ఉదయం ఆరు గంటల నుంచి టోకెన్లను జారీ చేయనున్నారు. సర్వ దర్శనం స్లాట్ విధానానికి ఆధార్ తప్పనిసరి అని అధికారులు తెలిపారు. వారం రోజులపాటు ప్రయోగాత్మక పరిశీలించనున్నారు. -
శ్రీవారి ఆలయంలో 17 నుండి సుప్రభాతం రద్దు
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రమైన ధనుర్మాసం పూజలు ఈనెల 16వ తేది నుండి 2018, జనవరి 14వ తేది వరకు జరనున్నాయి. ఈ సందర్భంగా ఈనెల 17వ తేది నుండి శ్రీవారికి సుప్రభాతం బదులు గోదాదేవి విరచిత తిరుప్పావై పాశురాలు పారాయణం చేయనున్నారు. రోజుకొకటి చొప్పున నెలరోజుల పాటు మొత్తం 30 పాసురాలు వేద పండితులు పారాయణం చేయనున్నారు. ఈ నెల రోజుల పాటు గర్భాలయంలో భోగ శ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణస్వామివారికి నిత్య కైంకర్యాలు నిర్వహిస్తారు. భగవంతుడు నిద్ర నుండి మేల్కొని సర్వజగత్సృష్టిని లయ బద్దంగా నడిపించడానికి ఈ ధనుర్మాసం నుంచి శ్రీకారం చుడతారని పురాణప్రసిద్ధి. ధనుర్మాసం అంటే దివ్యప్రార్థనకు అనువైన మాసమని అర్థం. ఆండాల్ అమ్మవారి పూజ, తిరుప్పావై పఠనం, గోదా కల్యాణం ప్రసాదాలు మొదలైనవి ధనుర్మాసంలోనే నిర్వహిస్తారు. 2018 జనవరి 15వ తేది నుంచి యథావిధిగా సుప్రభాత సేవ పునఃప్రారంభిస్తారు. -
వైకుంఠ ఏకాదశికి తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు
తిరుమల: వైకుంఠ ఏకాదశికి తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. ఈ నెల 29న ఏకాదశి,30న ద్వాదశి రానుంది. ఏకాదశి శుక్రవారం రావటంతో శ్రీవారి దర్శనం నాలుగు గంటలు ఆలస్యం కానుంది. ఏకాదశి నాడు ఉదయం ఐదున్నర గంటలకు వీఐపీ దర్శనం,8 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుందని జేఈఓ శ్రీనివాసరాజు తెలిపారు. డిసెంబర్ 28 నుంచి జనవరి ఒకటో తేదీ వరకు దివ్య దర్శనం, ఆర్జిత సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు, సిఫార్సు లేఖలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. రాజ్యంగ బద్దంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ఏకాదశినాడు ఆరు వీఐపీ దర్శన టికెట్లు, రాజ్యాంగేతర వీఐపీలకు నాలుగు వీఐపీ దర్శన టికెట్లు కేటాయిస్తామన్నారు. ఏకాదశి దర్శనానికి వచ్చే భక్తులను 28న ఉదయం 10 గంటలకు వైకుంఠం క్యూకాంప్లెక్స్లోకి అనుమతిస్తామని జేఈఓ చెప్పారు. తిరుమలలో అదనంగా ఆరు కిలొమీటర్ల క్యూలైన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ద్వాదశి నాడు వీఐపీ దర్శనాలు రద్దు చేశామని, భక్తులకు నిరంతరం ఆహారం, నీరు అందిస్తామని జేఈఓ అన్నారు. -
తిరుమలలో భారీ వర్షం
-
తిరుమలలో స్వర్ణోత్సవం
-
తిరుమలతో భక్తుల కిటకిట
తిరుమల: కలియగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం బుధవారం భక్తులు పోటెత్తారు. అన్నికంపార్ట్మెంట్లు నిండిపోయాయి. సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుండగా.. కాలినడక న వచ్చే భక్చులకు 10 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.