సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రమైన ధనుర్మాసం పూజలు ఈనెల 16వ తేది నుండి 2018, జనవరి 14వ తేది వరకు జరనున్నాయి. ఈ సందర్భంగా ఈనెల 17వ తేది నుండి శ్రీవారికి సుప్రభాతం బదులు గోదాదేవి విరచిత తిరుప్పావై పాశురాలు పారాయణం చేయనున్నారు. రోజుకొకటి చొప్పున నెలరోజుల పాటు మొత్తం 30 పాసురాలు వేద పండితులు పారాయణం చేయనున్నారు. ఈ నెల రోజుల పాటు గర్భాలయంలో భోగ శ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణస్వామివారికి నిత్య కైంకర్యాలు నిర్వహిస్తారు. భగవంతుడు నిద్ర నుండి మేల్కొని సర్వజగత్‌సృష్టిని లయ బద్దంగా నడిపించడానికి ఈ ధనుర్మాసం నుంచి శ్రీకారం చుడతారని పురాణప్రసిద్ధి. ధనుర్మాసం అంటే దివ్యప్రార్థనకు అనువైన మాసమని అర్థం. ఆండాల్ అమ్మవారి పూజ, తిరుప్పావై పఠనం, గోదా కల్యాణం ప్రసాదాలు మొదలైనవి ధనుర్మాసంలోనే నిర్వహిస్తారు. 2018 జనవరి 15వ తేది నుంచి యథావిధిగా సుప్రభాత సేవ పునఃప్రారంభిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment