tiruppavai parayanam
-
పల్లవించిన ప్రజ్ఞ! తమిళులైనా.. తెలుగులో..
యథా రాజా.. తథా ప్రజా.. అన్నట్లు.. ఇంటి వాతావరణం ఆధ్యాత్మిక భావాలతో నిండి ఉంటే, ఆ ఇంట పుట్టిన యువతరం కూడా ఆ దారినే అనుసరిస్తారు. అందుకు చక్కటి ఉదాహరణే కొమాండూరు ప్రజ్ఞ రాఘవన్. తమిళ వైష్ణవులైన ఐటీ ఉద్యోగి కోమాండూరు రాఘవన్, భార్గవి దంపతుల మొదటి సంతానం ప్రజ్ఞ రాఘవన్. ఈమె పల్లవి మోడల్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతోంది. 13 ఏళ్ల చిన్నారి మూడేళ్ల ప్రాయం నుంచే నాయనమ్మ కొమాండూరు నళిని శ్రీనివాసన్ ప్రోత్సాహంతో భక్తి శ్లోకాలను చక్కటి ఉచ్ఛరణతో అలవోకగా పాడడం నేర్చుకుంది. తమిళులకు అతి పవిత్రమైన ధనుర్మాసంలో ప్రతిరోజూ తిరుప్పావై పాశురాలు పాడడం ఆనవాయితీ. నాయనమ్మ, తల్లిదండ్రులు క్రమం తప్పకుండా పాటించే ఈ తిరుప్పావై పారాయణం..ఆ అండాళ్ తల్లి అనుగ్రహంతో పుట్టిందని భావించే ప్రజ్ఞకు సహజంగానే అలవడింది. జన్మతః తమిళులైనా, ప్రాంతీయ భాష అయిన తెలుగుపై ఉన్న గౌరవంతో, నాయనమ్మ నేర్పిన తెలుగు పాఠాలు, ప్రజ్ఞ తెలుగు ఉచ్ఛరణకు మరింత మెరుగులు దిద్దేలా చేశాయి. ఇది గమనించిన తండ్రి రాఘవన్ ప్రజ్ఞ చేత తిరుప్పావై పాశురాలను పాడించి, తన పేరుతో ప్రారంభించిన ‘యువర్స్ ప్రజ్ఞ’ అనే యూట్యూబ్ ఛానల్లో మూడు సంవత్సరాలుగా ధనుర్మాసం 30 రోజులు ప్రసారం చేస్తూ వస్తున్నారు. తిరుప్పావైకి సంబంధించి తండ్రి సేకరించి పొందుపరిచిన వ్యాఖ్యానాన్ని భావయుక్తంగా, స్వచ్ఛమైన పదోచ్ఛారణతో ప్రవచన శైలిలో అందిస్తోంది. పేరుకు తగ్గ ‘ప్రజ్ఞ’.. ప్రజ్ఞ ప్రవచన తీరు చూస్తే పేరుకు తగ్గ ప్రజ్ఞా పాటవాలు చూపుతోంది అని ఎందరో పెద్దల కొనియాడారు. ఈ ఏడాది రాఘవన్ తమిళ పాశురాలను తెలుగులో పాట శైలిలో చేసిన అనువాదాన్ని తన వాక్పటిమతో, పాశుర భావానికి తగినట్లు అందరికీ అర్థమయ్యేలా వ్యాఖ్యానించి తెలుగు భాషాభిమానులు, ఆధ్యాత్మికవేత్తల నుంచి రెట్టింపు ప్రశంసలు పొంది శభాష్ అనిపించుకుంది. ప్రతిభను గుర్తించిన సుబ్బు మ్యూజికల్ అకాడమీ అధ్యక్షులు శ్రీధరం రామ సుబ్రహ్మణ్యం ఈ నెల 12న నిర్వహించిన సంగీత విభావరిలో గౌరవ అతిథి కొమరవోలు శ్రీనివాసరావు, నరేష్కుమార్ ప్రజ్ఞను జ్ఞాపికతో సత్కరించారు. ప్రజ్ఞ సంగీత విభావరులలో గాయకుడైన తండ్రి రాఘవన్‌తో పలు కార్యక్రమాల్లో, సినీ సంగీతంలోనూ శ్రోతలను ఆకట్టుకోవడం కొసమెరుపు. (చదవండి: సాత్విక ఆహారంతో బరువుకి చెక్‌పెట్టండిలా..!) -
శ్రీవారికి తిరుప్పావై నివేదన
తిరుమల/తిరుపతి కల్చరల్: ధనుర్మాసం ప్రారంభం కావడంతో తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం ఉదయం సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదించారు. జనవరి 14వ తేదీ వరకు తిరుప్పావై పారాయణం కొనసాగుతుంది. పవిత్ర ధనుర్మాసం సందర్భంగా పెద్దజీయర్ మఠంలో తిరుప్పావై పారాయణం ప్రారంభమైంది. పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి పాల్గొన్నారు. వేదాల సారమే తిరుప్పావై వేదాల సారమే తిరుప్పావై అని తిరుమల చిన్నజీయర్‌స్వామి ఉద్ఘాటించారు. టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి అన్నమాచార్య కళామందిరంలో తిరుప్పావై ప్రవచనాల ప్రారంభ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నజీయర్ స్వామి అనుగ్రహ భాషణం చేశారు. అనంతరం ప్రవచన కర్త చక్రవర్తి రంగనాథన్స్వామి ధనుర్మాసం గురించి వివరించారు. శ్వేత డైరెక్టర్ ప్రశాంతి, హెచ్డీపీపీ ఏఈవో సత్యనారాయణ, ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్ట్ ప్రోగ్రాం అధికారి పురుషోత్తం పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 14 గంటలు తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూ కంపార్ట్మెంట్లు ఒకటి నిండింది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 48,928 మంది స్వామి వారిని దర్శించుకోగా, 23,322 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామికి కానుకల రూపంలో హుండీలో రూ.3.61 కోట్లు సమర్పించారు. శ్రీవారి దర్శన టోకెన్లు లేని భక్తులకు 14 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. -
Dhanurmasam 2022: తిరుప్పావై ప్రతిధ్వనించే మాసం
గోదాదేవి పేరుతో తిరుప్పావై కావ్యాన్ని ఉపనిషత్తుల సారాంశం అని వర్ణిస్తారు. భగవద్గీతతో సమానంగా సంభావిస్తారు. భగవద్గీత కూడా ఉపనిషత్తుల సారాంశం కనుక గీతోపనిషత్ అంటూ తిరుప్పావైని గోదోపనిషత్ అని గౌరవించారు. వేదోపనిషత్తులను సూర్యోదయం లోనే పఠించాలి. అందాల పల్లె వ్రేపల్లెలో కరువువచ్చింది. అందరూ ఆందోళన పడుతూ క్రిష్ణయ్య దగ్గరకు వెళ్లి తమను ఆదుకోమని గోప గోపీజనులు కోరారు. చిన్నారి కన్నె పిల్లలయిన గోపికలతో వ్రతం చేయిస్తే బాగుంటుందనీ అన్నారట. సరే నని శ్రీకృష్ణుడు గోపికలను పిలిపించి నియమాలు వివరించి, తెల్లవారు ఝామున రావాలని గోపికలకు మరీ మరీ చెప్పి పంపించాడు. దాంతో తిరుప్పావై కథావస్తువు మొదలైంది. శ్రీకృష్ణుడితో గడిపితే కలిగే ఆనందం, ఉత్సాహం గుర్తుకు వచ్చి గోపికలకు నిద్ర పట్టలేదు. ఎంత త్వరగా జాములు గడుస్తాయా, ఎప్పుడు బ్రహ్మ ముహూర్తం వస్తుందా అని ఎదురుచూస్తూ కష్టంగా రాత్రి గడిపారు. తెల్లవారు ఝామునే రమ్మన్నాడు కిట్టయ్య అందరినీ లేపుదాం అని బయలుదేరారు గోపికలు. ఇదీ తిరుప్పావై నాందీ ప్రస్తావన. తమిళంలో అందరికీ అర్థమయ్యేందుకు సులువుగా రచించిన నాలుగు వేల కవితలను నాలాయ రమ్ (నాల్ అంటే నాలుగు, ఆయిరం అంటే వేలు) అంటారు. శాత్తుమఱై అంటే నైవేద్యం తరువాత నాలాయిర ప్రబంధ పారాయణం... తిరుప్పావై మంగళా శాసనం ప్రణవ నాదంతో ముగుస్తుంది. ఈ తమిళ ప్రబంధ పారాయణానికి ఏ ప్రతి బంధకాలూ లేవు. కఠినమైన నిబంధనలు లేవు. వర్ణ భేదం లేదు. కులభేదం లేదు. ఎవరైనా నేర్చుకోవచ్చు. అందరికీ అందే అందమైన కావ్యం తిరుప్పావై. నారాయణ మంత్ర సారాంశాన్ని పాశురంలోని అక్షరక్షరంలో పొదిగిన గోదాదేవి అందరికీ అందించినట్టే, నారాయణుని తిరుమంత్రాన్ని గుడి గోపురం ఎక్కి అందరికీ రహస్యాలు విప్పినవాడు రామానుజుడు. కుల మత భేదాలు లేకుండా అంద రికీ నారాయణుని చేరే జ్ఞాన, వ్రత, మంత్ర సాధనా సోపానాలు తెలియాలని తపించిన వారే ఇద్దరూ– గోదాదేవి, శ్రీరామానుజుడు. తిరుప్పావై జీయర్ అని రామానుజుని అంటారు. గోదాదేవి పుట్టి కావేరి నది తీరంలో శ్రీరంగనిలో లీనమైన రెండు వందల ఏళ్ల తరువాత క్రీస్తు శకం 1000లో జన్మించిన రామానుజుడిని గోదాగ్రజుడిగా కీర్తిస్తారు. దానికి కారణం రామానుజుడు తిరుప్పావైని అంతగా అభిమానించి అందరికీ బోధించడం ఒక కారణమైతే... తనకు రంగనితో వివాహమైతే మధురైకి దగ్గరలో ఉన్న తిరుమాలియుం శోరై ఆలయంలో శ్రీ సుందర బాహుస్వామికి వేయి బిందెల పాయసం చేయిస్తానన్న మొక్కును ఆయన తీర్చడం మరో కారణం. గోదాదేవి శ్రీరంగడిలో లీనం కావడం వల్ల ఆమె తన మొక్కు తీర్చలేకపోయారు. ఆ విషయం విన్న మరుక్షణమే రామానుజుడు శ్రీసుందర బాహుస్వామి ఆలయా నికి వెళ్లి వేయిబిందెల పాయసం సమర్పించారట. శంగత్తమిళ్ అంటే అందమైన తమిళ భాష అని అర్థం. డిసెంబర్ మధ్యలో ఉండే ధనుర్మా సంలో వచ్చే తమిళ నెల. సూర్యుడు ధనుర్ రాశిలో ఉండే నెలను ధనుర్మాసం అంటారు. గోదాదేవి రోజుకో పాశురాన్ని పాడి తోటి వారిని పూజకు పిలిచిన నెల ఇది. ఆ విధంగా 30 అందమైన ఎనిమిది పాదాల కవితలు గోదా గళం నుంచి జాలు వారాయి ఈ నెలలో. పదం పదంలో పుణ్యకథ కనిపిస్తుంది. వాటిని వింటుంటే రామాయణ ఘట్టాలూ, భాగవత తత్వం, శ్రీకృష్ణలీలలు కళ్ల ముందు కదలాడుతాయి. ఇందులో భక్తి సాహిత్యం, శరణాగతి, విశిష్టాద్వైత సిద్ధాంత సారం ఉంటుంది. కానీ ఇది సిద్ధాంత తత్వ గ్రంథం కాదు. ఒక్కో పాశురం ఒక్కొక్క బోధనా, సాధనా... ఒక పిలుపు, వ్రతం, ఆరాధన కలిసిన ప్రేమరస ప్రవాహం. ఆద్యంతం భక్తిభావ బంధురం. తిరుమల తిరుపతిలో ఈ ధనుర్మాసపు ముప్పయ్ రోజులు వెంకన్న సుప్రభాతం వినడు. ‘తిరుప్పళ్లియజిచ్చి’ అని విప్రనారాయణుడు రచించిన పాశురాలు విన్న తరువాత... శ్రీనివాసుడు పొద్దున్నే లేవగానే శ్రావ్యంగా ఈ తిరుప్పావై పాశురాలు రోజుకొకటి చొప్పున మొత్తం 30 వింటాడు. గోదా గీతాగోవిందాన్ని వింటూ గోవిందుడు పరవశిస్తాడు. కనుక ఇది ధనుర్మాసపు గోవింద సుప్రభాతం. మొత్తం దేశమంతటా ఉన్న వైష్ణవాలయాలలో తిరుప్పావై గ్రంథ రహస్యాలను రోజుకో రెండుగంటల చొప్పున వివరించే ఉపన్యాస కార్యక్రమాలు 30 రోజులు సాగుతాయి. తెలుగు రాష్ట్రాలు రెండింటా నారాయణుని కోవెలల్లో ఈ నెలంతా తిరుప్పావై ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. సిరినోము సంక్రాంతి దాకా సాగే ఆధ్యాత్మి కోద్యమం ఇది. (క్లిక్ చేయండి: అదొక విచిత్ర బంధం! పట్టు విడుపులు ఉంటేనే..) - మాడభూషి శ్రీధర్ డీన్, స్కూల్ ఆఫ్ లా, మహీంద్ర యూనివర్సిటీ (డిసెంబర్ 16న ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా) -
శ్రీవారి ఆలయంలో తిరుప్పావై పఠనం ప్రారంభం
సాక్షి, తిరుమల : ధనుర్మాసం ప్రారంభం కావడంతో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం వేకువజామున సుప్రభాతం స్థానంలో తిరుప్పావై నివేదించారు. ధనుర్మాస ఘడియలు శనివారం ఉదయం 11.13 గంటలకు ప్రారంభమయ్యాయి. ధనుర్మాస ఘడియలు 2018 జనవరి 14వ తేదీన ముగియనున్నాయి. తిరుప్పావై పఠనం ఏకాంతంగా జరుగుతుంది. ధనుర్మాసంలో భోగశ్రీనివాసమూర్తులకు బదులుగా శ్రీకృష్ణస్వామివారికి ఏకాంతసేవ నిర్వహిస్తారు. -
శ్రీవారి ఆలయంలో 17 నుండి సుప్రభాతం రద్దు
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రమైన ధనుర్మాసం పూజలు ఈనెల 16వ తేది నుండి 2018, జనవరి 14వ తేది వరకు జరనున్నాయి. ఈ సందర్భంగా ఈనెల 17వ తేది నుండి శ్రీవారికి సుప్రభాతం బదులు గోదాదేవి విరచిత తిరుప్పావై పాశురాలు పారాయణం చేయనున్నారు. రోజుకొకటి చొప్పున నెలరోజుల పాటు మొత్తం 30 పాసురాలు వేద పండితులు పారాయణం చేయనున్నారు. ఈ నెల రోజుల పాటు గర్భాలయంలో భోగ శ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణస్వామివారికి నిత్య కైంకర్యాలు నిర్వహిస్తారు. భగవంతుడు నిద్ర నుండి మేల్కొని సర్వజగత్‌సృష్టిని లయ బద్దంగా నడిపించడానికి ఈ ధనుర్మాసం నుంచి శ్రీకారం చుడతారని పురాణప్రసిద్ధి. ధనుర్మాసం అంటే దివ్యప్రార్థనకు అనువైన మాసమని అర్థం. ఆండాల్ అమ్మవారి పూజ, తిరుప్పావై పఠనం, గోదా కల్యాణం ప్రసాదాలు మొదలైనవి ధనుర్మాసంలోనే నిర్వహిస్తారు. 2018 జనవరి 15వ తేది నుంచి యథావిధిగా సుప్రభాత సేవ పునఃప్రారంభిస్తారు. -
17 నుంచి శ్రీవారికి సుప్రభాతం రద్దు
తిరుమల: తిరుమలలో ఈనెల 17నుంచి శ్రీవారికి సుప్రభాతం కార్యక్రమాన్ని నెల రోజులపాటు నిలిపివేయనున్నారు. ఆలయంలో పవిత్రమైన ధనుర్మాసం పూజలు ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 2018 జనవరి 14వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఈ నెల 17వ తేదీ నుంచి శ్రీవారికి ప్రతిరోజూ నిర్వహించే సుప్రభాతం బదులు గోదాదేవి విరచిత తిరుప్పావై పాశురాలు రోజుకొకటి చొప్పున నెల రోజులపాటు మొత్తం 30 పాశురాలను వేద పండితులు పారాయణం చేస్తారు. ఈ నెల రోజులపాటు గర్భాలయంలో భోగ శ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణస్వామివారికి నిత్య కైంకర్యాలు నిర్వహిస్తారు. భగవంతుడు నిద్ర నుండి మేల్కొని సర్వజగత్‌సృష్టిని లయబద్ధంగా నడిపించడానికి ఈ ధనుర్మాసం నుంచి శ్రీకారం చుడతారని పురాణ ప్రసిద్ధి. ధనుర్మాసం అంటే దివ్యప్రార్థనకు అనువైన మాసమని అర్థం. ఆండాళ్ అమ్మవారి పూజ, తిరుప్పావై పఠనం, గోదా కల్యాణం ప్రసాదాలు మొదలైనవి ధనుర్మాసంలోనే నిర్వహిస్తారు. 2018 జనవరి 15వ తేదీ నుంచి యథావిధిగా సుప్రభాత సేవ జరుగుతుంది. -
శ్రీవారి ఆలయంలో తిరుప్పావై పారాయణం
ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం సాక్షి, తిరుమల: ధనుర్మాసం సందర్భంగా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం వేకువజామున 3 గంటలకు తిరుప్పావై పారాయణం చేశారు. సూర్య సంక్రమణంతో సోమవారం ఉదయం 10.31 గంటల నుంచి ధనుర్మాసంగా పిలిచే మృగశిర మాసం ప్రారంభమైంది. ఈ నెలలో గోదాదేవి విరచిత 30 పాశురాల్లో రోజుకొకటి చొప్పున పారాయణం చేయనున్నారు. మంగళవారం నుంచే తిరుమల ఆలయంతోపాటు తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయం, శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో కూడా తిరుప్పావై పారాయణం మొదలైంది. కాగా, తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉండటంతో లఘుదర్శనం అమలు చేశారు. సర్వదర్శనం కోసం 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నవారికి 5 గంటల్లో స్వామి దర్శనం లభిస్తోంది.