సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో బెటాలియన్ కానిస్టేబుళ్లకు ఊరట లభించింది. కానిస్టేబుల్ కుటుంబ సభ్యుల ఆందోళనతో ప్రభుత్వం పోలీస్ శాఖ కీలక నిర్ణయం శుక్రవారం(అక్టోబర్ 25) తీసుకుంది. బెటాలియన్ కానిస్టేబుళ్ల సెలవుల రద్దు నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ విషయమై కానిస్టేబుల్ కుటుంబ సభ్యులతో చర్చించాలని నిర్ణయించారు.
సెలవుల రద్దుపై బెటాలియన్ కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యుల ఆందోళనలతో హైదరాబాద్‌లో శుక్రవారం పలుచోట్ల ఉద్రిక్తత నెలకొంది. సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో వారిని అరెస్టు చేసి అక్కడినుంచి తరలించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారి డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment