constanle transfer
-
TG: బెటాలియన్ కానిస్టేబుళ్లకు ఊరట.. ప్రభుత్వ కీలక నిర్ణయం
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో బెటాలియన్ కానిస్టేబుళ్లకు ఊరట లభించింది. కానిస్టేబుల్ కుటుంబ సభ్యుల ఆందోళనతో ప్రభుత్వం పోలీస్ శాఖ కీలక నిర్ణయం శుక్రవారం(అక్టోబర్ 25) తీసుకుంది. బెటాలియన్ కానిస్టేబుళ్ల సెలవుల రద్దు నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ విషయమై కానిస్టేబుల్ కుటుంబ సభ్యులతో చర్చించాలని నిర్ణయించారు.సెలవుల రద్దుపై బెటాలియన్ కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యుల ఆందోళనలతో హైదరాబాద్‌లో శుక్రవారం పలుచోట్ల ఉద్రిక్తత నెలకొంది. సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో వారిని అరెస్టు చేసి అక్కడినుంచి తరలించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారి డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకుంది. -
కానిస్టేబుల్స్‌పై బదిలీ వేటు
అనంతపురం సెంట్రల్ : విధి నిర్వహణలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు కానిస్టేబుల్స్‌ను బదిలీ చేస్తూ ఎస్పీ రాజశేఖరబాబు ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం వన్‌టౌన్‌లో నాగరాజు, రఫి, టూటౌన్లో ముత్యాలు, శ్రీనివాసులు, రామానాయక్, అనిల్‌కుమార్, త్రీటౌన్‌లో దేవదానం, అనిల్‌కుమార్, నరసింహులు నాయుడును బదిలీ చేశారు. అలాగే నాల్గవ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సూర్యనారాయణ, నరేంద్రకుమార్, నాగేంద్రప్రసాద్, బాలాజీ, నరసింహులు, సీసీఎస్‌లో రాజశేఖర్, సుధాకర్, గంగాధర్, నరసింహమూర్తి, మహిళా పోలీస్‌స్టేషన్‌లో బీమ్లానాయక్, నరసింహమూర్తి, లక్ష్మయ్య, నగేష్, పీసీఆర్‌లో మనోహర్‌రెడ్డి, నార్పలలో శ్రీనివాసులు, నూర్‌బాషా, శింగనమలలో షాషావలిపై బదిలీ వేటు పడింది. వీరిని మడకశిర, కంబదూరు, అగళి, రొళ్ళ, ఎన్పీకుంట తదితర ప్రాంతాలకు బదిలీ చేశారు.