తిరుపతి,సాక్షి: తిరుపతి తొక్కిసలాటలో తమిళనాడు సేలం చెందిన మల్లికా అనే భక్తురాలు మరణించారు. అయితే మల్లికా అనారోగ్యం కారణంగా మరణించిందని ఎఫ్ఐఆర్ నమోదు చేయడం పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసుల తీరుపై మృతురాలు మల్లికా భర్త కృష్ణన్ చిన్నగోవిందన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకుంఠ ద్వార దర్శన టికెట్లు కోసం వచ్చి తొక్కిసలాటలో చనిపోతే అనారోగ్యంతో మరణించినట్లు ఎఫ్‌ఐఆర్ ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. నా భార్య మృతికి టీటీడీ, పోలీసులే కారణం. మీరు నాశనం అయిపోతారంటూ మల్లిక భర్త ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలి కుటుంబ సభ్యులు సైతం పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment