ట్రామా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం అపోలో ఆసుపత్రి నేతృత్వంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రమాదం బారిన పడి అత్యవసర సేవల కోసం ఎదురు చూస్తున్న వారికి అధిక రక్తస్త్రావం జరగకుండా, ఆస్పత్రికి తరలించేందుకు ముందుగా అందించాల్సిన సహకారం, వైద్య సేవల గురించి ఇందులో వివరించారు. అపోలో మేనేజింగ్ డైరెక్టర్ సునీతారెడ్డి నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో డాక్టర్లు, బాబు అబ్రహం, సెంథిల్‌కుమార్, భాస్కర్ ధనపాల్, మధుమిత ప్రసంగించారు.
– సాక్షి, చైన్నె