తిరుమల: అలిపిరి వద్ద బాంబు బ్లాస్ట్ చేస్తానంటూ ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు. నిందితున్ని తమిళనాడు రాష్ట్రం, సేలం జిల్లాకు చేందిన బాలాజీ(39)గా గుర్తించారు. అతన్ని ఈ రోజు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ నెల 15వ తారీఖున అలిపిరి చెక్ పాయింట్ ల్యాండ్ ఫోన్ కి కాల్ చేసాడో వ్యక్తి. మధ్యాహ్నం 3గంటలకు 100 మందిని బాంబ్ బ్లాస్ట్ తో చంపేస్తానని చెప్పడంతో వెంటనే అప్రమత్తం అయ్యారు పోలీసులు. టీటీడీ పోలీసు, విజిలెన్స్ అధికారుల సమన్వయంతో అలిపిరి చెక్ పాయింట్ తనిఖీ చేసారు.
అయినప్పటికీ ఎక్కడా ఎటువంటి పేలుడు పదార్ధాలు లభించలేదు. బాంబు పేలుడుకు సంబంధించి ఫోన్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఎవరైనా ఆకతాయి, దుష్ట చేష్టలకి పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తిరుమల డీఎస్పీ భాస్కర్ రెడ్డి అన్నారు.
ఇదీ చదవండి: ఏపీ పంచాయతీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల హవా
Comments
Please login to add a commentAdd a comment