తిరుమల : తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి కంపార్టమెంట్లు అన్నీ నిండిపోవడంతో వెలుపల క్యూలైన్లో భక్తులు వేచి ఉండాల్సి వచ్చింది. సర్వ దర్శనానికి 12 గంటలు, కాలిబాట దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారి హుండీ ఆదాయం 2.84 కోట్లు. సోమవారం నుంచి సర్వదర్శనానికి స్లాట్ విధానం ప్రారంభమవుతుంది. దీనికి గానూ 20 ప్రాంతాలలో 117 కౌంటర్లు టీటీడీ ఏర్పాటు చేసింది. ఉదయం ఆరు గంటల నుంచి టోకెన్లను జారీ చేయనున్నారు. సర్వ దర్శనం స్లాట్ విధానానికి ఆధార్ తప్పనిసరి అని అధికారులు తెలిపారు. వారం రోజులపాటు ప్రయోగాత్మక పరిశీలించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment