సాక్షి, తిరుమల: అఖండ దీపంపై వదంతులను నమ్మొద్దని రమణ దీక్షితులు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుప్రభాతం నుంచి ఏకాంతసేవ వరకు అఖండ దీపం వెలుగుతూనే ఉంటుందని తెలిపారు. స్వామివారి కైంకర్యాలు నిత్యం ఆగమశాస్త్రం ప్రకారం జరుగుతున్నాయని పేర్కొన్నారు. కరోనా నివారణకు ప్రభుత్వ సూచనలు పాటిస్తూ ఇళ్లల్లోనే ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తిరుమలలో శాస్త్రోక్తంగా ధన్వంతరి యాగం
తిరుమలలో ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో గురువారం శాస్త్రోక్తంగా ధన్వంతరి యాగం ప్రారంభమైంది. లోక సంక్షేమం కోసం టీటీడీ ఈ యాగం నిర్వహిస్తోంది. 27, 28వ తేదీల్లో విశేష హోమాలు నిర్వహిస్తారు. 28న విశేష హోమం అనంతరం మహా పూర్ణాహుతి నిర్వహించి కుంభజలాన్ని జలాశయంలో కలుపుతారు. ఈ శక్తి సూర్యరశ్మి ద్వారా వాతావరణంలో కలిసి మేఘాల ద్వారా వాయు రూపంలో అనారోగ్య కారకాలను నశింపజేస్తుంది. యాగంలో వేదాల్లోని సూర్య జపానికి, అష్టదిక్పాలకులకు సంబంధించిన వేదమంత్రాలను రుత్వికులు పారాయణం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment