ramana dikshitulu
-
సీఎం జగన్ ధర్మాన్ని నిలబెట్టారు
సాక్షి, అమరావతి: అర్చకులకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేర్చారని టీటీడీ ప్రధానార్చకులు రమణదీక్షితులు అన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మంగళవారం ఆయన తోటి అర్చకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ధర్మానికి హాని కలిగినప్పుడు భగవంతుడు అవతరిస్తాడని.. భగవంతుని ఆశీస్సులతో సీఎం ఆ ధర్మాన్ని నిలబెట్టారన్నారు. సీఎం జగన్‌కు ఈ విషయంలో తామెంతో రుణపడి ఉన్నామని.. గతంలో ఇచ్చిన హామీనీ ఆయన నెరవేర్చారని, సీఎం పాలన దిగ్విజయంగా సాగాలని స్వామివారిని కోరుకుంటున్నానన్నారు. దేవాలయాలకు పూర్వ వైభవం జగన్ ద్వారా వస్తుందనే నమ్మకం కలిగిందని చెప్పారు. సీఎం ఆదేశాలతో మళ్లీ శ్రీవారి సేవ మిరాశీ దేవాలయాల్లో వేల సంవత్సరాలుగా పలువురు అర్చకులు వంశపారంపర్యంగా సేవలందిస్తూ వచ్చారని.. దురదృష్టవశాత్తూ ఇటీవల వంశపారంపర్య అర్చకత్వానికి అడ్డంకులు సృష్టించారని.. కానీ, సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో తమకందరికీ తిరిగి స్వామివారి కైంకర్యాలు చేసుకునే మహద్భాగ్యం కల్గిందని రమణదీక్షితులు సంతోషం వ్యక్తంచేశారు. ప్రతి పాలకుడిలో విష్ణు అంశ ఉంటుందని.. సీఎం జగన్ విష్ణుమూర్తిలా సనాతన ధర్మాన్ని రక్షిస్తున్నారని కొనియాడారు. పదవీ విరమణను తొలగించి తిరిగి తమను విధుల్లోకి తీసుకున్నందుకు సీఎంకు అర్చకులందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని ఆయన తెలిపారు. క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు, ఇతర అర్చకులు ముఖ్యమంత్రి కుటుంబం సంతోషంగా ఉండాలని.. మరిన్ని సంవత్సరాలు సీఎంగా ఆయన ఉండాలని కోరుకుంటున్నామని చెప్పారు. అర్చకుల కుటుంబాలకు భూములివ్వడం సహా దేవాలయాల్లో ధూపదీపాలు చేసుకునే అవకాశం కల్పించాలని సీఎంను కోరామని రమణదీక్షితులు చెప్పారు. సనాతన ధర్మం కాపాడుతూ మరింత జనరంజకంగా ముఖ్యమంత్రి పాలించాలని దైవాన్ని నిత్యం ప్రార్థిస్తామన్నారు. కాగా, టీటీడీ విషయాలను రాజకీయం చేయడం తగదని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే, తిరుమలలో అన్యమత ప్రచారం జరగడంలేదని స్పష్టంచేశారు. పింక్ డైమండ్ మాయం అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున దానిపై ఇప్పుడు మాట్లాడటం సరికాదని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా రమణదీక్షితులు చెప్పారు. సీఎంతో మర్యాదపూర్వక భేటీ అంతకుముందు.. తిరుమల తిరుపతి దేవస్థాన ప్రధానార్చకులు రమణదీక్షితులు, ఇతర అర్చకులు మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు. శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి, తిరుపతి గోవిందరాజస్వామి, తిరుచానూరు పద్మావతి అమ్మవార్ల ఆలయాలకు సంబంధించిన 15 మందికి వంశపారంపర్య అర్చకత్వాన్ని పునరుద్ధరించడంపై సీఎం జగన్‌కు వారంతా కృతజ్ఞతలు తెలిపారు. -
టీడీపీ ఆరోపణలను ఖండించిన రమణ దీక్షితులు
సాక్షి, తాడేపల్లి : తిరుమలలో అన్యమత ప్రచారం జరిగే ప్రసక్తే లేదని టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు స్పష్టం చేశారు. దేవాలయాల్లో నిత్య నైవేద్యాలు, దూపదీపాలు ఆటంకం లేకుండా కొనసాగించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మంగళవారం సీఎం జగన్‌ను కలిశారు. ఈ మేరకు టీటీడీ వంశ పారంపర్య అర్చకుల తరపున సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సంవత్సరాల నుంచి వంశ పారంపర్య అర్చకత్వం కొనసాగుతోందని తెలిపారు. ఇటీవల దానికి అడ్డంకులు ఏర్పడ్డాయని, సీఎం దీన్ని పునరుద్ధరించారన్నారు. వంశపారంపర్య అర్చకులకు పదవీ విరమణను సీఎం వైఎస్ జగన్ రద్దు చేశారని రమణ దీక్షితులు తెలిపారు. సీఎం వైఎస్ జగన్ మరిన్ని సంవత్సరాలు సీఎంగా ఉండి రాష్ట్రంలోని అర్చకులకు మేలు చేయాలని కోరారు. చెట్టుకి పండ్లు ఉన్నపుడు రాతి దెబ్బలు సహజమని, టీటీడీపై ఆరోపణలు కూడా అలాంటివేనని అన్నారు. ఎవరు రాజకీయాల్లో ఉన్నా విమర్శ చేస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. తిరుమలలో అన్యమత ప్రచారం జరగదని, వైఎస్సార్ హయాంలో కూడా ఇలానే దుష్ప్రచారం చేశారని టీడీపీ ఆరోపణలను ఖండించారు. చదవండి: ఆ స్థాయి సోము వీర్రాజుకు ఉందా?: ఎమ్మెల్యే భూమన -
సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన రమణ దీక్షితులు
-
సనాతన ధర్మాన్ని కాపాడిన సీఎం జగన్
తిరుమల: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కారణజన్ముడిలా ధర్మసంస్థాపన కోసం సనాతన ధర్మాన్ని కాపాడారని తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు ఏవీ రమణదీక్షితులు చెప్పారు. ధర్మాన్ని భగవంతుడు రక్షించినట్లుగా అర్చకుల వంశపారంపర్యాన్ని ముఖ్యమంత్రి పునరుద్ధరించారన్నారు. వైఎస్ జగన్ హిందూ దేవాలయాలు, ప్రాచీన దేవాలయాల ప్రతిష్ట కాపాడతారని, ఆలయాలకు పునర్వైభవం కల్పిస్తారని నమ్మకం కలిగిందని చెప్పారు. విశ్రాంత అర్చకులను పునర్నియమించడంపై తిరుమలలోని అర్చక భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వంశపారంపర్య అర్చకుల కోసం దివంగతనేత వైఎస్ రాజశేఖరరెడ్డి దూరదృష్టితో చేసిన చట్టసవరణను తిరిగి ఆయన తనయుడు అమలు చేయడం, మళ్లీ స్వామి సేవ చేసుకునే మహద్భాగ్యం కల్పించడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. 2018లో చట్ట, రాజ్యాంగ విరుద్ధంగా అప్పటి ప్రభుత్వం మిరాశి అర్చకులను వయోపరిమితి పేరుతో పదవీవిరమణ చేసి బాధపెట్టిందన్నారు. వంశపారంపర్యంగా వస్తున్న అర్చకత్వ హక్కులను గత ప్రభుత్వం కాలరాయడంతో అర్చకులు చాలా నష్టపోయారని తెలిపారు. దీనిద్వారా చాలా ఆలయాలు మూతపడ్డాయని, దేవుళ్లకు ఆరాధనలు కరువయ్యాయని చెప్పారు. ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు సీఎం జగన్మోహన్రెడ్డి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకున్నారని తెలిపారు. హైకోర్టులో వేసిన పిటిషన్‌పై జస్టిస్ రామచంద్రరావు తీర్పు మేరకు విధుల్లోకి తీసుకోవాలని సూచించారని తెలిపారు. అప్పటి ప్రభుత్వంలో పాలకమండలి తీసుకున్న 50వ తీర్మానాన్ని కోర్టు రద్దుచేసిందని తెలిపారు. సాంకేతిక కారణాల వల్ల అర్చకులకు వయోపరిమితి నిబంధనల సడలింపు ఆలస్యమైందన్నారు. శ్రీవారిని, దేవాలయాలను, అర్చకుల కుటుంబాలను ఈ మధ్య రాజకీయాలకు వాడుకోవడం దురదృష్టకరమన్నారు. రాజకీయాలకు, తమకు సంబంధం లేదని, అలా వాడుకునేవారు ఉంటే తమ విజ్ఞప్తిని స్వీకరించాలని పేర్కొన్నారు. అర్చకుల పునర్నియామకానికి కృషిచేసిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, ఎమ్మెల్యే కరుణాకరరెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ సమావేశంలో నాలుగు కుటుంబాలకు చెందిన అర్చకులు నరసింహదీక్షితులు, వెంకటదీక్షితులు, శ్రీనివాసదీక్షితులు, అర్చకులు పాల్గొన్నారు. మొన్న సన్నిధి గొల్ల.. నేడు విశ్రాంత అర్చకులు మొన్న సన్నిధి గొల్ల.. నేడు విశ్రాంత అర్చకులు.. వారికి జీవితాంతం శ్రీవారికి సేవచేసే భాగ్యం రాష్ట్ర ప్రభుత్వం కల్పించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సుదీర్ఘకాలంగా పరిష్కారం కాని సమస్యలను వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పరిష్కరిస్తుండటంతో ఆయా వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. తిరుమల శ్రీవారిని మొదటగా దర్శనం చేసుకునే యాదవులకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం వంశపారంపర్య హక్కు కల్పించింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తొలగించిన అర్చకులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరిగి తీసుకుంటూ.. వారికి వారసత్వ హక్కు కల్పించారు. అర్చకులకు వయోపరిమితి నిబంధనను ఎత్తేశారు. వైఎస్ మరణానంతరం రద్దు శ్రీవారి ఆలయానికి సంబంధించి 1987లో మిరాశీ వ్యవస్థను రద్దుచేశారు. అప్పటి నుంచి వంశపారంపర్య హక్కుల కోసం అర్చకులు పోరాడుతున్నారు. 1996లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీరిని తిరిగి ఆలయ అర్చకులుగా నియమించినా.. వారికి పూర్తిస్థాయిలో హక్కులు కల్పించలేదు. అర్చకులకు వంశపారంపర్య హక్కు కల్పించాలంటూ మహానేత, నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన వైఎస్ రాజశేఖరరెడ్డి తిరుమలలోని అర్చకులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో అర్చకులుగా పనిచేస్తున్న వారందరికి వంశపారంపర్య హక్కులు కల్పిస్తూ 2007లో జీవో నంబరు 34 జారీచేశారు. మహానేత మరణానంతరం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం 2012లో అర్చకులకు వయోపరిమితి విధించింది. శ్రీవారి ఆలయంలో 65 సంవత్సరాలు పైబడిన అర్చకులకు ఈ నిబంధనలను అమలు చేయాలని ఆదేశించింది. అర్చకుల అభ్యర్థన మేరకు ఆ నిర్ణయాన్ని రద్దు చేసినప్పటికీ 2018 మే 16న చంద్రబాబు ప్రభుత్వం మరోసారి వయోపరిమితి నిబంధన అమలు చేయాలని నిర్ణయించింది. శ్రీవారి ఆలయంలోని ప్రధాన అర్చకులు నలుగురితోపాటు మరో ఐదుగురు అర్చకులు, గోవిందరాజస్వామి ఆలయం అర్చకుడు, తిరుచానూరు ఆలయానికి చెందిన ఇద్దరు అర్చకులను వయోపరిమితి నిబంధనతో తొలగించింది. నాడు మాట ఇచ్చారు.. నేడు అమలు చేశారు గత ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఇద్దరు అర్చకులు కోర్టును ఆశ్రయించారు. 2018 డిసెంబర్లో అర్చకులకు అనుకూలంగా వచ్చిన తీర్పును చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయలేదు. ఈ విషయాన్ని రమణదీక్షితులు, ఇతర అర్చకులు నాటి ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. తమ ప్రభుతం వచ్చిన వెంటనే సమస్యను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అర్చకులకు వయసుతో సంబంధం లేకుండా శ్రీవారికి సేవచేసే అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 2019 డిసెంబర్లో రమణదీక్షితుల్ని శ్రీవారి ఆలయ ఆగమ సలహాదారుడిగా, గౌరవ ప్రధాన అర్చకులుగా సీఎం వైఎస్ జగన్ నియమించారు. బ్రహ్మోత్సవాల సమయంలో స్వామికి పట్టువస్త్రాలు సమర్పించడానికి వచ్చిన సీఎంను కలుసుకున్న రమణదీక్షితులు అర్చకుల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్.. రమణదీక్షితులు సహా రిటైర్ అయిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని టీటీడీని ఆదేశించారు. సీఎంకు రుణపడి ఉన్నాం మా తాతలు, మా తండ్రి చేసిన వంశపారంపర్య అర్చకత్వాన్ని తిరిగి మాకు కల్పించినందుకు సీఎంకు రుణపడి ఉన్నాం. స్వామికి సేవ చేయడమే మా భావన. రాజులను, చక్రవర్తులను మా వంశీకులందరూ చూశారు. మా కుటుంబం కూడా అదే తరహాలో ముందుకు వెళ్లాలని మా తపన. తిరిగి మా హక్కులను మాకు కల్పించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. – నరసింహదీక్షితులు, మాజీ ప్రధాన అర్చకులు (తిరిగి విధుల్లోకి చేరబోయే అర్చకులు) -
సీఎం జగన్‌కు రుణపడి ఉన్నాం
-
సీఎం జగన్ ధర్మాన్ని నిలబెట్టారు: రమణ దీక్షితులు
సాక్షి, తిరుమల: అర్చకులకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేర్చారని టీటీడీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ధర్మానికి హాని కలిగినప్పుడు భగవంతుడు అవతరిస్తారన్నారు. భగవంతుని ఆశీస్సులతో సీఎం వైఎస్ జగన్ ధర్మాన్ని నిలబెట్టారన్నారు. సీఎం జగన్ పాలన దిగ్విజయంగా సాగాలని స్వామివారిని కోరుకుంటునన్నారు. సీఎం జగన్‌కు తాము ఎంతో రుణపడి ఉన్నామని తెలిపారు. దేవాలయాలకు పునర్ వైభవం వైఎస్ జగన్ ద్వారా వస్తుందనే నమ్మకం కలిగిందని రమణ దీక్షితులు అన్నారు. చదవండి: దేవుడే అస్త్రమా.. ఇదేం రాజకీయం..? ఆర్జిత సేవలకు భక్తుల అనుమతి వాయిదా -
‘టీటీడీలో 140 మందికి పాజిటివ్’
సాక్షి, తిరుమల: కరోనా వైరస్ వల్ల భక్తులకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. దర్శనాలు ప్రారంభించాక టీటీడీలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే 140 మందికి పాజిటివ్ వచ్చిందని పేర్కొన్నారు. పాజిటివ్ వచ్చిన వారిలో అర్చకులు, టీటీడీ ఉద్యోగులు, ఎస్టీఎఫ్ సెక్యూరిటీ సిబ్బంది, లడ్లు తయారు చేసే సిబ్బంది ఉన్నారని వెల్లడించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో 70 మంది కోలుకుని హోంక్వారంటైన్లో ఉండగా, క్వారంటైన్లో ఉన్నవారిలో ఒక్కరు మినహా అందరు ఆరోగ్యంగా ఉన్నారని అన్నారు. ప్రధానంగా 40 మంది అర్చకుల్లో 14 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని.. 60 సంవత్సరాలు నిండిన అర్చకులకి విధుల నుండి సడలింపు ఇచ్చామని తెలిపారు. రమణ దీక్షితులు చేసిన ట్వీట్‌కు రాజకీయ రంగు పులమకండని, గౌరవ ప్రధాన అర్చకులుగా ఉండి ఇలా ట్వీట్ చేయటం మంచి పద్దతి కాదని సూచించారు. ఏమైనా సమస్య ఉంటే రమణ దీక్షితులుతో కూడా చర్చిస్తామని అన్నారు. అర్చకులకి ప్రమాదకరమైన పరిస్థితి నెలకొంటే దర్శనాలు కూడా ఆపివేస్తామని అన్నారు. అర్చకులు బాగుంటేనే శ్రీవారి కైంకర్యాలు సక్రమంగా జరుగుతాయని, దర్శనాల సంఖ్య తగ్గించడం, పెంచడం ఉండదని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. -
అఖండ దీపంపై వదంతులు నమ్మొద్దు..
సాక్షి, తిరుమల: అఖండ దీపంపై వదంతులను నమ్మొద్దని రమణ దీక్షితులు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుప్రభాతం నుంచి ఏకాంతసేవ వరకు అఖండ దీపం వెలుగుతూనే ఉంటుందని తెలిపారు. స్వామివారి కైంకర్యాలు నిత్యం ఆగమశాస్త్రం ప్రకారం జరుగుతున్నాయని పేర్కొన్నారు. కరోనా నివారణకు ప్రభుత్వ సూచనలు పాటిస్తూ ఇళ్లల్లోనే ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తిరుమలలో శాస్త్రోక్తంగా ధన్వంతరి యాగం తిరుమలలో ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో గురువారం శాస్త్రోక్తంగా ధన్వంతరి యాగం ప్రారంభమైంది. లోక సంక్షేమం కోసం టీటీడీ ఈ యాగం నిర్వహిస్తోంది. 27, 28వ తేదీల్లో విశేష హోమాలు నిర్వహిస్తారు. 28న విశేష హోమం అనంతరం మహా పూర్ణాహుతి నిర్వహించి కుంభజలాన్ని జలాశయంలో కలుపుతారు. ఈ శక్తి సూర్యరశ్మి ద్వారా వాతావరణంలో కలిసి మేఘాల ద్వారా వాయు రూపంలో అనారోగ్య కారకాలను నశింపజేస్తుంది. యాగంలో వేదాల్లోని సూర్య జపానికి, అష్టదిక్పాలకులకు సంబంధించిన వేదమంత్రాలను రుత్వికులు పారాయణం చేస్తున్నారు. -
టీటీడీ ఆగమ సలహా మండలి సభ్యునిగా రమణ దీక్షితులు
సాక్షి, తిరుమల: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గతంలో ఇచ్చిన హామీ మేరకు తిరుమల శ్రీవారి ఆలయ పూర్వ ప్రధాన అర్చకుడు ఏవీ రమణదీక్షితులును తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆగమ సలహా మండలి సభ్యునిగా నియమించారు. ఈ మేరకు టీటీడీ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. కొత్తగా నియమితులయ్యే అర్చకులకు సలహాలు, సూచనలు ఇచ్చి తగిన విధంగా మార్గనిర్దేశం చేయడానికి ఆయన సేవలను టీటీడీ వినియోగించుకుంటుందని కూడా ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. రమణ దీక్షితులు సుదీర్ఘకాలం శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడుగా సేవలు అందించారు. శ్రీవారి ఆలయ విశిష్టత, సంప్రదాయాలు, స్వామివారి వివిధ కైంకర్యాలపట్ల ఆయనకు అపార పరిజ్ఞానం ఉంది. అందుకే ఆయన్ని ఆగమ సలహా మండలి సభ్యునిగా నియమించినట్లు టీటీడీ తెలిపింది. ఆగమ సంప్రదాయాలకు అనుగుణంగా ఆలయ నిర్వహణపై కొత్తగా నియమితులయ్యే అర్చకులకు ఆయన తగిన మార్గానిర్ధేశం చేస్తారని టీటీడీ ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. గతంలో టీడీపీ ప్రభుత్వం రమణ దీక్షితులును హఠాత్తుగా పదవీ విరమణ పేరుతో ఆలయ విధుల నుంచి తొలగించింది. అనువంశిక అర్చకులకు పదవీ విరమణ ఉండదని ఎందరు చెప్పినా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు వినిపించుకోలేదు. దీనిపై స్పందించిన అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రమణదీక్షితులును మళ్లీ తిరుమల శ్రీవారి ఆలయ సేవలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఆయన్ను టీటీడీ ఆగమ సలహా మండలి సభ్యునిగా నియమించి మళ్లీ శ్రీవారి సేవాభాగ్యం కల్పించారు. -
రామరాజ్యం ప్రారంభం: రమణదీక్షితులు
తిరుమల: ఆంధ్రప్రదేశ్‌లో రాక్షస పాలన అంతమైందని, రామరాజ్యం ప్రారంభమైందని టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు వ్యాఖ్యానించారు. రమణ దీక్షితులు తిరుమలలో విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్రం కరువు కాటకాలతో అల్లాడిపోయిందని అన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి రాదని తాను నమ్ముతున్నట్లు చెప్పారు. వంశపారంపర్య హక్కును తెలుగుదేశం ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేకంగా కాలరాసిందని ఆరోపించారు. వైఎస్ జగన్ బ్రాహ్మణులకు అండగా నిలిచారని, వంశపారంపర్యం కొనసాగిస్తామని మాట ఇచ్చారు..వైఎస్ జగన్ మాట తప్పరని ఆశిస్తున్నట్లు అన్నారు. ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం వైఎస్ జగన్ కొనసాగుతారని జోస్యం చెప్పారు. టీటీడీలో తిష్ట వేసిన జేఈఓ శ్రీవారి కైంకర్యాలకు ఆటంకం కలిగించారు.. అలాంటి వారిని సాగనంపాలని కోరారు. బ్రాహ్మణులంటే గౌరవం ఉన్న అధికారులనే టీటీడీలో అధికారులుగా నియమించాలని కోరారు. ఏడాది కాలంగా శ్రీవారి కైంకర్యాలకు దూరం కావడం బాధకలిగించిందని తెలిపారు. తిరిగి స్వామివారికి సేవ చేసుకునే భాగ్యం కలిగించాలని నూతన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కోరుతున్నట్లు వెల్లడించారు. -
ఇలాంటి పాలన వద్దే వద్దు..
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఐదేళ్ల చంద్రబాబు పాలనలో అవినీతి, అక్రమాలపై సామాన్యులు, పేదలు, యువత, మహిళలు, రైతులే కాకుండా మాజీ ఉన్నతాధికారులు, మాజీ న్యాయమూర్తులు, విద్యావంతులు, పర్యావరణవేత్తలు ఇలా అన్ని రంగాల ప్రముఖులు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఏ మూల చూసినా అక్రమాలు, అరాచకాలేనని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు తన వర్గం వారే తప్ప బడుగు, బలహీన వర్గాల సంక్షేమం పట్టదని, రాష్ట్రంలో ప్రకృతి వనరుల్ని అడ్డంగా దోచేశారని తూర్పారా బట్టారు. ఈ అవినీతి పరంపరపై పలువురు ప్రముఖులు ఎవరెవరు ఏమన్నారంటే.. చంద్రబాబుకు విలువలు లేవు కాంగ్రెస్‌లో పుట్టి పెరిగిన చంద్రబాబు పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. ఆయనను మించిన అవినీతిపరుడు, అసమర్ధుడు, వెన్నుపోటుదారుడు ఎవరున్నారు? ఇంకొకర్ని విమర్శించే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు? ఆయన పెద్ద జాదూ.. అన్ని కులాలను, మతాల్ని మోసం చేశాడు. వాజ్‌పేయితో కలుస్తానంటే ఆ వేళ ముస్లింలు వద్దన్నారు. అయినా బీజేపీతో చేతులు కలిపాడు. ఆ తర్వాత అవే మసీదుల్లో మీటింగులు పెట్టి.. నన్ను క్షమించండి, మరెప్పుడూ కలవనన్నాడు. మళ్లీ మోదీతో కలిశాడు. వంగి వంగి దండాలు పెట్టాడు. ఇప్పుడు తిడుతున్నాడు. నిన్నటి దాకా రాహుల్ గాంధీని, సోనియా గాంధీని తిట్టి ఇప్పుడు వాళ్లకు దండాలు పెడుతున్నాడు. ప్రత్యేక హోదాలో ఏముందీ? అన్నది చంద్రబాబే. ప్యాకేజీయే మంచిదని చెప్పాడు. మళ్లీ నల్లచొక్కా వేసుకుని హోదా కావాలంటున్నాడు. - పోసాని కృష్ణమురళీ, సినీనటుడు ముస్లింలను బాబు వంచించారు ముస్లింలను నిలువునా వంచించిన వ్యక్తి చంద్రబాబునాయుడు. బాబు పాలనలో మైనారిటీలు ఎప్పుడూ సంతోషంగా లేరు. గుజరాత్ అట్టుడికిపోతూ అమాయక ముస్లింలు ఊచకోతకు గురైతే.. ముసిముసి నవ్వులు నవ్విన వ్యక్తి చంద్రబాబు. హైదరాబాదీ ముస్లిం యువకులను గుజరాత్ పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి జైళ్లలో పెడితే చంద్రబాబు ఏం చేశారు. నాటి ప్రధాని వాజ్‌పేయీ, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీలకు తన మౌనంతో బాసటగా నిలిచి.. ముస్లింలను దగా చేసింది చంద్రబాబు కాదా? వైఎస్ రాజశేఖరరెడ్డి ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లను ప్రకటించి అమలు చేశారు. అది ఎంత మేలు చేసిందో ముస్లింలు కళ్లారా చూశారు. ఆ ఫలాలు అనుభవించిన ఎంతోమంది ఉన్నత స్థితికి చేరుకున్నారు. అలాంటి మహానేత కుమారుడిగా వైఎస్ జగన్‌ను వారు అవే కళ్లతో చూస్తున్నారు. కచ్చితంగా ముస్లిం సమాజం అంతా జగన్‌కు అండగా నిలవాలి, నిలుస్తుంది కూడా! ప్రతి ముస్లిం కుటుంబం కూడా వైఎస్‌ను తమ కుటుంబ సభ్యుడిగా భావించేవారు. జగన్‌ను కూడా అలానే భావిస్తున్నారు. - అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం అధినేత ఇరిగేషన్ అంతా పెద్ద స్కాం ఓట్ల కోసమే ఎన్నికల ముందు వివిధ కులాలు, వర్గాలకు కార్పొరేషన్ల ఏర్పాటును చంద్రబాబు తెరపైకి తెచ్చారు. ఒక సామాజికవర్గం మేలు కోసం తప్ప సీఎంగా ఆయన చేస్తున్నదేమీ లేదు. టీడీపీ నాయకులు కాగితాలపైన కంపెనీలు సృష్టించి విలువైన భూములు కబ్జా చేశారు. డ్వాక్రా సంఘాల ముసుగులో అడ్డగోలుగా ఇసుకను అమ్ముకుని వేల కోట్లు దండుకున్నారు. కేంద్రం చేయాల్సిన పోలవరం ప్రాజెక్టును తీసుకుని దాన్ని ఏ రకంగానూ ముందుకు పోనీయకుండా చేశారు. కాంట్రాక్టర్లకు భారీ లాభాలు వచ్చేలా చేసి.. ఇష్టమొచ్చినట్లు సబ్ కాంట్రాక్టులు ఇచ్చేశారు. ఇరిగేషన్ ఒక పెద్ద స్కామ్. ‘నాకేంటి?’ అన్న తరహాలో బాబు ఆలోచన ఉంటుంది. ప్రగతి సాధించలేక వైఫల్యాన్ని వేరొకరిపై నెట్టేందుకు నవనిర్మాణ దీక్షలు, ధర్మ పోరాట దీక్షలు చేశారు. రాష్ట్రంలో ఈ అయిదేళ్లలో చంద్రబాబు ఒక్క ఓడరేవు కట్టారా? - ఐవైఆర్ కృష్ణారావు, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎన్నికల సమయంలోనే ఈ గిమ్మిక్కులేంటి? సరిగ్గా ఎన్నికల సమయంలో పథకాల పేరుతో డబ్బుల్ని జమ చెయ్యడమేంటి. ఉపాధి హామీ పథకంలో రెండేళ్ల పాటు పనిచేసిన కూలీలకు రూపాయి కూడా ఇవ్వలేదు. చెమటోడ్చి పనిచేసిన వారికి నెలకు రూ.10 వేలపైనే రావాల్సి ఉండగా.. వాటిని ఇవ్వకుండా పసుపు–కుంకుమ అంటూ.. రూ.10 వేలు ఇవ్వడం ఏం న్యాయం. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టే. ఇటీవల సీఎం చంద్రబాబు రాజధాని అమరావతిలో సుమారు 15 మంది ఐఏఎస్‌లకు అప్పనంగా స్థలాలు కట్టబెట్టారు. ఎందుకిలా ఇచ్చారు, రైతుల వద్ద నుంచి భూములు లాక్కున్నది ఐఏఎస్‌లకు ఇచ్చేందుకా. ఎంత దారుణం. – ఈఏఎస్ శర్మ, విశ్రాంత ఐఏఎస్ ఎక్కడ చూసినా అవినీతి, బంధుప్రీతి అక్రమ సొమ్ముతో ఎమ్మెల్యేలను ఇష్టమొచ్చినట్లు కొన్నారు. ప్రజాతీర్పుకు విలువ లేకుండా చేశారు. ఓటుకు పది వేలు ఇచ్చేందుకు సైతం సిద్ధమంటున్నారు. అధికారులను బెదిరించి, భయపెట్టి పార్టీ కార్యకర్తల్లా మార్చేశారు. గత ఐదేళ్లలో పార్టీయే ప్రభుత్వం, ప్రభుత్వమే పార్టీ అన్నట్లుగా వ్యవహరించారు. నయానో భయానో అధికారులను తమ దార్లోకి తెచ్చుకున్నారు. ఫలానా పనికి ఫలానా రేటంటూ వాటాలు పంచుకున్నారు. కాంట్రాకర్లకు బిల్లులు చెల్లించాలంటే.. లంచం ఇవ్వాల్సిందే. కాంట్రాక్ట్ రావాలంటే కమీషన్లు ఇవ్వాల్సిందే. మంత్రులు తప్పు చేస్తే ముఖ్యమంత్రికి చెప్పుకోవాల్సి ఉంటుంది. మరి ముఖ్యమంత్రే తప్పు చేస్తే ప్రజలు ఎక్కడికి వెళ్లాలి.. ఎవరికి చెప్పుకోవాలి..? రాజధాని కోసం మూడు పంటలు పండే భూములను లాక్కున్నారు. భూములు ప్రభుత్వపరం కాక ముందే.. విదేశీ కంపెనీలకు పందేరం పెట్టారు. - జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి మోసకారి బాబును నమ్మొద్దు చంద్రబాబు పాలనలో బీసీలకు ఎలాంటి మేలు జరగలేదు. ఇపుడు 5 ఏళ్లు, అంతకు ముందు 9 ఏళ్లు పరిపాలించిండు. గడ్డపారలు, బర్రెలు, గొర్రెలు, సుత్తెలు, బుట్టలు, చిన్నచిన్న కులవృత్తులు చేసుకుంటూ అర్ధాకలితో బతకమని.. ఇవే కదా ఇస్తానన్నాడు. వాళ్లు మంచి ఉద్యోగాలు సంపాదించేందుకు ఏమైనా చేసిండా? కనీసం ఫీజు రీయింబర్స్‌మెంటునైనా పూర్తిగా ఇవ్వలేదు. మారుతున్న సమాజానికి అనుగుణంగా బీసీలు అభివృద్ధి చెందాలన్న లక్ష్యం జగన్‌కు ఉంది. చంద్రబాబు ఆలోచన ఎంతసేపూ బీసీలు కుల వృత్తులను నమ్ముకొని అలాగే ఎదగకుండా ఉండాలని ఉంది. చంద్రబాబుది అవకాశవాదం. కులాలు, మతాల మధ్య పంచాయితీ పెట్టి పబ్బం గడుపుకోవడం దుర్మార్గం. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు వస్తాయని గట్టిగా నమ్ముతున్నాం. పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెట్టండని చెబితే జగన్ చేసి చూపించాడు. ఏపీలో బీసీలంతా తనకు ఓటేస్తారన్న కుయుక్తితో చంద్రబాబు నన్ను వాడుకున్నాడు. బీసీలను ఉపయోగించుకుని సీఎం కాగానే అవసరం తీరాక వదిలేశాడు. - ఆర్.కృష్ణయ్య, బీసీ సంఘం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పోలవరంలో బాబు చేసిందేమీ లేదు పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు తెచ్చిందొకరు. జాతీయ ప్రాజెక్ట్‌గా చేసిందొకరు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బు ఖర్చుపెట్టింది మరొకరు. మరి పోలవరంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు. సింగపూర్ తరహాలో రాజధానని పదేపదే చెప్పడం ఆత్మన్యూనతాభావం. భారతీయ ఇంజనీర్ల పర్యవేక్షణలో రాజధాని నిర్మిస్తే మురికివాడలుగా మారుస్తారని చంద్రబాబు పేర్కొనడం ఎంత దారుణం. అమరావతిని రాజధానిగా ప్రకటించక ముందే ఆ ప్రాంతంలో తన సామాజికవర్గానికి చెందిన బినామీలతో తక్కువ ధరకు భూములు కొనిపించారు. మేకిన్ ఇండియాలో భాగంగానే అనంతపురంలో కియో కంపెనీ ఏర్పాటైంది. అది తన ఘనతగా చెప్పుకోవడం సరికాదు. హంద్రీనీవా పూర్తయితే రాయలసీమలో 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందేది. హంద్రీనీవాను పూర్తి చేయకుండా.. చేతులారా రాయలసీమను ఈ ప్రభుత్వం నాశనం చేసింది. - వై.వెంకట్రామి రెడ్డి, ఏపీపీఎస్సీ మాజీ ఛైర్మన్ సంపద సృష్టి పెద్ద మాయ రాష్ట్రాభివృద్ధిపై బాబు చెప్పేవన్నీ అబద్ధాలు, అర్ధసత్యాలే. సంపద సృష్టి అనేది పెద్ద మాయ. చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయం దండగన్నారు. రైతులకు రూ.88 వేల కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉంటే.. తీరా మాఫీ రూ.15వేల కోట్లకు మించలేదు. బలవన్మరణాలకు పాల్పడే రైతులకు చంద్రన్న బీమా అన్నారు. అదెక్కడ ఇచ్చారో చెప్పండి. 4, 5 తుపాన్లు వస్తే ఎంతమందికి సాయం చేసారు.? ఎందుకు శ్వేతపత్రాన్ని విడుదల చేయలేదు. 2014 ఎన్నికలకు ముందు వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర, రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నారు. ఉద్దానం కిడ్నీ వ్యాధి పీడితులకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు పెద్ద పెద్ద వాగ్దానాలు చేశారు. ఆచరణలో ఒకే ఒక్క డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే.. అదికూడా సరిగా పనిచేయడం లేదు. - డాక్టర్ దొంతిరెడ్డి నరసింహారెడ్డి, ప్రముఖ పర్యావరణవేత్త రాష్ట్రాన్ని దోచుకుతిన్నారు చంద్రబాబు 14 ఏళ్ల పాలన కుతంత్రాలు, దోపిడీతోనే నడిచింది. సమాజంలో కులాల మధ్య విభేదాలకు బీజం నాటారు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలైన వ్యవస్థలను దిగజార్చి, కోర్టు స్టేలతో విచారణ నుంచి తప్పించుకుంటున్నారు. విచారణ జరగకుండా వాయిదాలు వేయించుకున్న మాత్రాన సచ్ఛీలుడైపోరు. ఏదొక రోజు కోర్టు బోను ఎక్కక తప్పదు. కొత్త పార్టీలను మాయచేసి ప్రతిపక్షంపై ఉసిగొల్పుతున్నారు. రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీలోని ద్వితీయ శ్రేణి నేతలు ప్రజల సొమ్మును దోచుకుతిన్నారు. అగ్రిగోల్డ్, సదావర్తి భూములు, విశాఖ భూ కుంభకోణం, అమరావతి అవినీతి భాగోతం.. ఇలా ఇంత తీవ్రమైన అవినీతి ఏపీలో ముందెన్నడూ జరగలేదు. ఇదంతా కేవలం చంద్రబాబు అసమర్ధ, అవినీతి పాలన వల్లే. - పి.విజయ్‌బాబు, సమాచారహక్కు చట్టం మాజీ కమిషనర్ చంద్రబాబు పాలనలో అంతులేని అవినీతి రాష్ట్రంలో 35 ఏళ్లలో ఇంత దౌర్భాగ్యమైన పాలన చూడలేదు. రాజధాని నిర్మాణాన్ని సొంత రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చుకున్నారు. ఇసుక, మట్టితో సహా సహజ వనరుల్ని అడ్డంగా దోచేశారు. నీరు–చెట్టు, ఉపాధి హామీ అన్నింటా అక్రమాలే. పెండింగులోని సాగునీటి ప్రాజెక్టుల అంచనాలు మూడు రెట్లు పెంచి దోచుకున్నారు. జాతీయ రహదారి నిర్మాణానికి కి.మి.కు రూ. 17 కోట్ల నుంచి రూ. 26 కోట్లయితే.. అమరావతిలో కి.మీ. రూ. 36 కోట్లు పోస్తున్నారు. ఇంటి నిర్మాణంలో చ.అడుగుకు రూ. 2 వేలు ఖర్చవుతుంటే అమరావతిలో తాత్కాలిక సచివాలయ భవన నిర్మాణంలో చ.అడుగుకు రూ. 11,000 ఖర్చు పెట్టారు. ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేని పోలవరం ప్రాజెక్టు విహారయాత్రలకు రూ. 400 కోట్లు దోచిపెట్టారు. మితిమీరిన దుబారా, అక్రమాలతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారు. పీఎంఏవై ఇళ్లకు పక్క రాష్ట్రంతో పోల్చితే మన వద్ద చ.అడుగుకు రూ. వెయ్యికి పైగా ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. 36.5 కోట్ల చదరపు అడుగులకు ఎంత అవినీతి జరుగుతుందో చూడండి. రాజధానిలో శిలాఫలకాలు, సభలు, ఆర్భాటాల కోసం రూ. 350 కోట్లు ఖర్చు చేశారు. హైదరాబాద్‌లోనూ, అమరావతిలోనూ రెండు చోట్ల క్యాంపు ఆఫీసులకు సొబగులు, ఫాంహౌస్‌ల హంగులకు వందల కోట్లు వృథా చేశారు. - అజేయకల్లం, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అర్చకుల కడుపు కొట్టారు వంశపారంపర్య హక్కుల్లో అర్చకులకు పదవీ విరమణ లేదని సుప్రీం, హైకోర్టులు చెప్పినా చంద్రబాబు ప్రభుత్వం దుర్మార్గంగా పదవీ విరమణను తెరపైకి తెచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 34 వేల ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులు, వారి కుటుంబాలు దుర్భర స్థితిలో ఉన్నాయి. టీడీపీ హయాంలో అర్చకులకు ఎలాంటి గౌరవ, మర్యాదలు లేక చాలా కష్టాలు పడుతున్నారు. 2017 డిసెంబర్లో మరమ్మతుల పేరిట 25 రోజులు పోటును మూసివేసి లోపల గోడల్ని పగులగొట్టారు. పోటు వద్ద పల్లవులు, చోళులు, పాండ్యులు, మరికొందరు రాజులు ఇచ్చిన ఆభరణాలు ఉన్నాయని తెలుసుకుని ఈ తవ్వకాలు జరిపారు. వెయ్యికాళ్ల మండపం కూల్చివేసిన సమయంలో భోషాణాల్లో ఆభరణాలు లభ్యమైనట్టు తెలిసింది. – రమణ దీక్షితులు, టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు విశాఖలో రూ. లక్ష కోట్ల కుంభకోణం విశాఖలో హుద్‌హుద్ బీభత్సం కంటే ఈ ఐదేళ్లలో నగరానికి భూబకాసురులు కోలుకోలేనంత నష్టం చేకూర్చారు. ఉత్తరాంధ్రను టీడీపీ సర్కారు పూర్తిగా దగాచేసింది. మళ్ళీ ఈ పాలకులే వస్తే ఇక్కడి వనరులు మొత్తాన్ని ఊడ్చేస్తారు. విశాఖ జిల్లాలో జరిగిన భూ దోపిడీ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. రూ.లక్ష కోట్ల భూ కుంభకోణమని పత్రికలే రాశాయి. మునుపెన్నడూ లేనివిధంగా విశాఖ జిల్లాలో సహజ, ఇంధన వనరుల్ని దోచేశారు. రాష్ట్రంలో ప్రాథమిక రంగాలైన విద్య, వైద్య వ్యవస్థల్ని నాశనం చేశారు. పసుపు కుంకుమ పేరిట ఎన్నికలకు ముందు డబ్బులు జమ చేయడమేంటి...? ఇది ఎన్నికల తాయిలం కాదా? ఈ ఐదేళ్ళ నుంచి ఎందుకు చేయలేదు.? - కేఎస్ చలం, యూపీఎస్సీ మాజీ ఇన్చార్జ్ చైర్మన్ దారుణంగా ఇసుక దోపిడీ ఏపీలో ఇసుకను రాజకీయ మాఫియా దోచుకుంటోంది. కృష్ణా, గోదావరి నదుల్లో ఇసుకను అధికార పార్టీ దోచేస్తోంది. రాష్ట్రమంతా అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఈ దందాలో అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు ఉన్నారు. సీఎం నివాసానికి సమీపంలోనే ఇసుక దోపిడీ సాగుతోంది. ఈ దోపిడీపై విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాను. - రాజేందర్ సింగ్, ప్రముఖ పర్యావరణవేత్త ఇష్టారాజ్యంగా అంచనాల పెంపు పట్టిసీమ ఎత్తిపోతల్లో రూ.374 కోట్లు దోచేశారు. పోలవరం ప్రాజెక్టులో అంచనాలు పెంచి కాంట్రాక్టర్లకు రూ.1853 కోట్ల మేర ప్రయోజనం చేకూర్చారు. రాష్ట్రంలోని 44 సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని ఏకంగా రూ. 27,403.74 కోట్లకు పెంచేసి.. ఒక్కటీ పూర్తి చేయలేదు. ఈ ప్రాజెక్టుల తొలి అంచనా వ్యయం రూ.49,107.78 కోట్లు కాగా, 2017 మార్చి 31 నాటికి పూర్తి చేస్తామన్నారు. అది పూర్తి చేయకపోగా అంచనా వ్యయాన్ని రూ.76,511.52 కోట్లకు పెంచారు. – కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ( కాగ్) డిస్కంలను ముంచేస్తారా?.. సీఎస్ దినేష్ అభ్యంతరం రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు భారీ విద్యుత్ కొనుగోలు కుంభకోణానికి తెరతీయగా.. అప్పటి సీఎస్ దినేశ్ కుమార్ అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ముఖ్యమంత్రి మాత్రం ఆ అంశాన్ని కేబినెట్లో పెట్టి రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగించే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉందని.. ఈ దశలో ఎక్కువ ధరకు సుజ్లాన్ అనే ప్రైవేట్ సంస్థ నుంచి పవన విద్యుత్ కొనుగోలు అవసరం లేదని సీఎస్ దినేశ్ కుమార్ స్పష్టం చేశారు. ఏడాదికి డిస్కమ్స్ రూ.2000 కోట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయని.. ఈ సమయంలో పవన విద్యుత్‌ను యూనిట్ రూ.4.84 పైసలకు కొనుగోలుకు ఒప్పందం చేసుకోవడంపై అభ్యంతరం తెలిపారు. రూ.3.46 పైసలకే ఇచ్చేందుకు ప్రైవేట్ సంస్థలు ముందుకు వచ్చాయన్న అంశాన్ని గుర్తు చేశారు. సీఎస్ టక్కర్ నిరాకరణ.. చట్టాన్నే మార్చేసిన సీఎం రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ కంపెనీల ప్రతిపాదనల్ని సీఆర్డీఏ అధ్యయనం అనంతరం సీఎస్ నేతృత్వంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీకి పంపాలి. అందుకు విరుద్ధంగా ఆర్థిక మంత్రి నేతృత్వంలోని మంత్రుల కమిటీ, సీఎం ఆమోదం అనంతరం ప్రతిపాదనల్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీకి పంపారు. దీనిపై సీఎస్ టక్కర్ తీవ్రంగా స్పందించారు. సీఎం, మంత్రుల కమిటీ ఆమోదం తెలిపితే.. అప్పుడు ఆ ప్రతిపాదనల్ని మంత్రివర్గానికి పంపాలని, అధికారులతో కూడిన అథారిటీకి కాదన్నారు. శాఖలన్నీ ఫైలుపై తమ అభిప్రాయాలను వెల్లడించాలని సీఎస్ టక్కర్ స్పష్టం చేయడంతో చంద్రబాబు ఏకంగా చట్టాన్నే మార్చేశారు. ఆ చట్టంలో సీఎస్ నేతృత్వంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ కి అధికారాలు తొలగిస్తూ ఏకంగా సవరణలు తీసుకువచ్చారు. ఇప్పుడు ఇదే అంశంపై హైకోర్టులో పిల్ దాఖలుకాగా.. విచారణకు స్వీకరించిన హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఏపీలో చెత్తపాలన బిహార్‌తో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. బిహార్‌లో మ్యూజియం నిర్మాణానికి కాంట్రాక్టు తీసుకుని సకాలంలో పూర్తి చేశాం. ఎక్కడా ప్రభుత్వం జోక్యం చేసుకోలేదు. ఏపీ రాజధాని నిర్మాణానికి సంబంధించి మేం ఇచ్చిన డిజైన్లు ఎంపికచేశామన్నారు. తర్వాత ఇష్టానుసారంగా సూచనలిచ్చారు. సీఆర్డీఏ స్వతంత్రంగా పనిచేయడం లేదు. నేతల రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేయడమే తప్ప తామేం చేయలేమని సీఆర్డీఏ ఉద్యోగుల సంభాషణల్లో మాకు తెలిసింది. ఏపీలో చెత్తపాలన సాగుతోంది. - పుమిహికో, మాకీ అసోసియేట్స్ చంద్రబాబు బీసీ, కాపు వ్యతిరేకి చంద్రబాబు బడుగు, బలహీన వర్గాల వ్యతిరేకి. బీసీలు, ఎస్సీలు న్యాయమూర్తులు కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాపులకు ప్రకటించిన 5 శాతం రిజర్వేషన్ న్యాయస్థానాల్లో నిలవదని బాబుకు కూడా తెలుసు. కాపులపై ఆయనకు చిత్తశుద్ధిలేదు. ఇద్దరు బీసీలు, ఒక ఎస్సీ, ఒక బ్రాహ్మణుడిని న్యాయమూర్తులుగా సిఫార్సు చేసినప్పుడు.. వాళ్లందర్నీ తిరస్కరిస్తూ చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో కేంద్రానికి లేఖ రాశారు. స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించే వాళ్లు న్యాయమూర్తులు కాకూడదన్నది చంద్రబాబు లెక్క. వాళ్ల(చంద్రబాబు) అడుగులకు మడుగులొత్తే వాళ్లే కావాలి. కాపులకు రిజర్వేషన్‌పై మంజునాథ్ కమిషన్ వేశారు. మంజునాథ్ నివేదిక ఇవ్వడానికి ముందే కమిషన్‌లో ముగ్గురు సభ్యులను చంద్రబాబు మేనేజ్ చేసి.. రాత్రికి రాత్రి వారితో ఒక రిపోర్టు రాయించుకుని, చైర్మన్‌ను పక్కన పెట్టారు. - జస్టిస్ ఈశ్వరయ్య, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి -
టీటీడీ నిర్ణయంతో ఆ విషయం బట్టబయలైంది!
సాక్షి, తిరుమల : ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అవకతవకలు జరిగాయని టీటీడీ తాజా నిర్ణయంతో బట్టబయలయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ఎన్నడూ లేనివిధంగా స్వామివారి ఆలయంలోకి తొమ్మిది రోజులపాటు భక్తులను అనుమతించబోమని టీటీడీ ఎందుకు నిబంధనలు పెడుతోందని ఆమె ప్రశ్నించారు. టీటీడీ తీరుపై తిరుమల ఆలయం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఇటీవల తీవ్ర ఆరోపణలు చేశారని, టీటీడీ తాజా నిర్ణయం ఆయన ఆరోపణలకు బలం చేకూరుస్తోందని ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. పోటులో తవ్వకాలు జరిగినప్పుడు సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడంతో పోటులోని సంపదలు తవ్వితీశారనే అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. రమణదీక్షితులు టీటీడీ అధికారులపై చేసిన ఆరోపణలు నిజమేనని తాజా పరిణామాలతో అనిపిస్తోందని ఆమె అన్నారు. పుట్టా సుధాకర్ యాదవ్ పాలకమాండలి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి టీటీడీ చుట్టూ వివాదాలు అలుముకుంటున్నాయని రోజా పేర్కొన్నారు. -
అర్చకుల నెత్తిన శఠగోపం
శ్రీరమణ దీక్షితులు చెప్పిన ప్రకారం, వీఐపీల కోసం అర్ధరాత్రి సుప్రభాత సేవ నిర్వహించాలంటూ అర్చకుల మీద టీటీడీ అధికారులు ఒత్తిడి తీసుకురావడం వంటి ఉదాహరణలు కూడా ఉన్నాయి. కానీ అప్పుడు స్వామివారిని మేల్కొల్పడం అపచారం. తోమాల సేవను తూతూమంత్రంగా ముగించాలంటూ ఒత్తిడి తెచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆయన చెప్పారు. వీఐపీల కోసం కొన్నిసార్లు, జనం తాకిడి పేరుతో కొన్నిసార్లు సేవలను ఇలా అసంపూర్ణంగా ముగించేందుకు అధికారులు ఒత్తిడి తెచ్చారని శ్రీరమణ దీక్షితుల ఆరోపణ. శ్రీవారి పోటులో జరిగిన అపచారం మరొకటి. తిరుమల శ్రీవారి ప్రధాన అర్చకులు, తిరుమల తిరుపతి దేవస్థానాల పాలక మండలి– ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య రేగిన వివాదాలు, విమర్శలు భక్తులను మనస్తాపానికి గురి చేస్తున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో, శ్రీవారి ప్రధాన అర్చకుల నిర్బంధ పదవీ విరమణకు టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ఈ అంశాన్ని కేవలం ప్రధాన అర్చకుల సమస్యగా చూడలేం. ఎందుకంటేæ ఇది మన సనాతన ధర్మానికి ఎదురైన సమస్య. కాబట్టి అందరూ తెలుసుకోవలసిన కొన్ని వాస్తవాలు ఉన్నాయి. శ్రీవారి ఆలయంలో సంప్రదాయాలూ ఆచారాలూ గతి తప్పుతున్నాయంటూ సాక్షాత్తు ప్రధాన అర్చకులు శ్రీరమణ దీక్షితులు ఆరోపించారు. కానీ ఆయన చేసిన ఆరోపణలకు, విమర్శలకు సమాధానం చెప్పకుండా కొన్ని స్వార్థపర శక్తులు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నాయి. ప్రభుత్వంతో పాటు, టీటీడీ పాలక మండలి కూడా శ్రీరమణ దీక్షితులుకి రాజకీయ ప్రయోజనాలు అంటగడుతున్నాయి. ఇంతకీ ఈ పాలక మండలి అంటే ఏదీ? ప్రస్తుత ప్రభుత్వం ఎంపిక చేసిన భజన బృందమే. ప్రభుత్వం నుంచి స్వప్రయోజనాలనూ; టీటీడీ అధికారుల నుంచి ప్రత్యేక దర్శనం కోసం ఉచిత టికెట్లూ ప్రసాదం పొట్లాలూ ఆశించే ఒక వర్గం మీడియా వారికి వంత పాడుతున్నది. రామానుజుల వారు నిర్దేశించిన మేరకు వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం జరిగే పూజాదికాలకి శ్రీవారి సన్నిధిలో భంగం వాటిల్లుతున్నది. అలాగే దారుణమైన రీతిలో అధికార దుర్వినియోగం జరుగుతున్నది. అయినప్పటికీ హిందూ సమాజం మౌన ప్రేక్షక పాత్రకు పరిమితమౌతున్నది. ఇది మరింత బాధించే అంశం. ఈ రెండు దశాబ్దాలలో హిందూ ధర్మమే లక్ష్యంగా రెండు దారుణమైన దాడులు జరిగాయి. మొదటిది కంచి మఠం మీద జరిగిన దాడి. అప్పటి హిందూ సమాజం ప్రదర్శించిన ధోరణి మౌన ప్రేక్షక పాత్రకు ఉదాహరణగా నిలుస్తుంది. కొందరు భక్తులు వ్యక్తిగత స్థాయిలో స్పందించడం మినహా, మఠాల నుంచి, సాధుసంతుల నుంచి వచ్చిన స్పందన పరిమితం. మఠాచార్యులు ఆశించిన మేర హిందూ సమాజం స్పందించలేదు. అసలు ఆచార్యులు అంటే వ్యక్తులు కారు. వారు వ్యవస్థల వంటివారు. కానీ సనాతన ధర్మాన్ని సేవించేందుకు రెండున్నరవేల ఏళ్ల క్రితం స్థాపించిన ధార్మిక సంస్థల ఎడల మనం చూపవలసిన మర్యాదను చూపలేదు. రెండోది– తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకస్వామి మీద, ఆలయ సంప్రదాయ మర్యాదల మీద, సాంస్కృతిక సంపద మీద జరుగుతున్న దాడి. ఇప్పుడు కూడా హిందూ సమాజం అదే విధంగా మౌన ప్రేక్షకపాత్రకు పరిమితమైంది. శ్రీరమణ దీక్షితులు (ఆయన మోలిక్యులర్ బయాలజీలో డాక్టరేట్ తీసుకోవడమే కాదు, వైఖానస ఆగమశాస్త్రంలో నిష్ణాతులు) దేవస్థానంలో జరుగుతున్న అపచారాల మీద ఆవేదన వ్యక్తం చేశారు. స్వామివారి నిత్యోపచారాలలో రాజకీయనేతల, పాలక మండలి సభ్యుల, ఇతర ఉద్యోగుల జోక్యం వంటి అంశాలు అందులో ఉన్నాయి. కంచే చేను మేసిన చందంగా తయారయింది పరిస్థితి. శ్రీవారి ఆభరణాలపై ఏటా జరగవలసిన ఆడిట్ జరగడంలేదని ఆయన ఆరోపించారు. దీనిని పెడచెవిన పెట్టగలమా? పైగా ఇలాంటి ఆరోపణ చేస్తారా అంటూ ఆ వ్యక్తి మీద ప్రత్యారోపణలకు దిగడం, పరువు నష్టం దావాలు వేయడం సబబేనా? ఇంతకీ ఆయన చేసిన ప్రధాన ఆరోపణలు ఏమిటి? శ్రీవారి సేవల విషయంలో పాలక మండలి జోక్యం నిరంతరం ఉంటోం దని ఆయన చెప్పారు. శ్రీరమణ దీక్షితులు చెప్పిన ప్రకారం, వీఐపీల కోసం అర్ధరాత్రి సుప్రభాత సేవ నిర్వహించాలంటూ అర్చకుల మీద టీటీడీ అధికారులు ఒత్తిడి తీసుకురావడం వంటి ఉదాహరణలు కూడా ఉన్నాయి. కానీ అప్పుడు స్వామివారిని మేల్కొల్పడం అపచారం. తోమాల సేవను తూతూమంత్రంగా ముగించాలంటూ ఒత్తిడి తెచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆయన చెప్పారు. వీఐపీల కోసం కొన్నిసార్లు, జనం తాకిడి పేరుతో కొన్నిసార్లు సేవలను ఇలా అసంపూర్ణంగా ముగించేందుకు అధికారులు ఒత్తిడి తెచ్చారని శ్రీరమణ దీక్షితుల ఆరోపణ. శ్రీవారి పోటులో జరిగిన అపచారం మరొకటి. పోటు అంటే శ్రీవారి నిత్యనైవేద్యాల కోసం అన్నప్రసాదాలను వండివార్చే చోటు. అక్కడ హఠాత్తుగా మరమ్మతులు చేపట్టారు. కానీ ప్రధాన అర్చకులే పాలకమండలికి ఆగమశాస్త్ర సలహాదారుగా కూడా వ్యవహరిస్తారు. అలాంటిది ప్రధాన అర్చకులకు తెలియకుం డానే శ్రీవారి పోటులో మరమ్మతులు చేపట్టారు. లోపల ఉన్న గ్రానైట్ పలకలను మార్చారు. ఆ సమయంలో అన్నప్రసాదాలను బయట చేయిం చారు. ఇది ఆగమశాస్త్ర విరుద్ధం. పైగా ఆ నైవేద్యాలను కూడా చెల్లించవలసిన పరిమాణంలో చెల్లించలేదు. కానీ అలాంటిదేమీ జరగలేదంటూ పోటుకు చెందిన పేద పనివారితో ప్రకటనలు ఇప్పించి ఈ విషయం వెలుగులోకి రాకుండా అధికారులు ప్రయత్నించారు. నాలుగు కుటుంబాలకు చెందినవారే ప్రధాన అర్చక బాధ్యతలు నిర్వహిస్తారు. తమ వంతుగా ఆ సంవత్సరం బాధ్యతలు స్వీకరించే అర్చకులకు ఆభరణాలను అప్పగించడానికి కూడా ఒక పద్ధతి ఉంది. శ్రీవారి ఆభరణాలను ఏటా ఆడిట్ చేస్తారు. ఇది బహిరంగ ఆడిట్ కూడా. బంగారు గొలుసులు, విడి వజ్రాలు, కెంపులు వంటి వాటిని కూడా ఆడిట్ చేస్తారు. అప్పుడే తమ వంతు మేరకు కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ప్రధాన అర్చకులకు బాధ్యతలు అప్పగిస్తారు. ఇదంతా టీటీడీ అధికారుల సమక్షంలోనే జరుగుతుంది. కానీ 1996 నుంచి ఈ విధానానికి మంగళం పాడారు. పైగా కొన్ని ప్రత్యేక సందర్భాలలో స్వామివారి అలంకారానికి శ్రీకృష్ణదేవరాయల వంటి ప్రభువులు సమర్పించిన ఆభరణాలను ఇవ్వవలసిందని అధికారులను కోరినా పట్టించుకోవడం లేదని కూడా శ్రీరమణ దీక్షితులు ఆరోపించారు. అధికారులు ఇచ్చిన ఆభరణాలతోనే స్వామివారు తృప్తిపడాలి. ఆయా కానుకలు సమర్పించడంలో అప్పటి భక్తులకు ఉన్న అభిమతానికి ఇలా గౌరవమే లేకుండా పోయింది. ఇలాంటి ధోరణి కొన్ని ప్రశ్నలకు కారణమవుతున్నది. ఆ ఆభరణాలన్నీ అక్కడ ఉన్నాయా? ఇక్కడ ఆ ప్రశ్న సబబైనదే కూడా. ఎవరైనా భక్తులు స్వామివారికి ఏదో ఒక ఆభరణం కానుకగా సమర్పించదలిచి పాలక మండలిని సంప్రతిస్తే వారు స్వామివారి పురాతన నగలలో ఒక దాని నమూనాను ఇస్తున్నారు. అప్పటి నుంచి ఆ కొత్త ఆభరణమే స్వామి వారి అలంకారానికి నోచుకుంటున్నది. పాతది ఇనప్పెట్టెలలోకి పోతున్నది. నిజానికి ఆ రెండు అక్కడ భద్రంగా, అందుబాటులో ఉన్నాయా? కాబట్టి ఇలాంటి ఆరోపణలలోని వాస్తవాలను హిందూ సమాజం తెలుసుకోవలసిన అవసరం లేదా? మనం ఏం చేస్తున్నాం? మన ఆచార వ్యవహారాలపై నిర్ణయాలను కోర్టుల పరం చేసి చోద్యం చూస్తూ ఉండిపోవాలా? హిందువుల ప్రార్థనా స్థలాల మీద, దేవస్థానాల వ్యవహారాలలోను ఆదరాబాదరా నిర్ణయాలు వెల్లడిస్తూ అత్యున్నత న్యాయ స్థానం కూడా తన స్థాయిని దిగజార్చుకోరాదు. ఏ సేవకు, ఏ పూజకు ఎంత సమయం సరిపోతుంది, ఎలాంటి నైవేద్యం అర్పించాలి, ఎలాంటి ఆభరణాలతో అలంకరించాలి, బ్రహ్మోత్సవాల నిర్వహణ వంటి అన్ని అంశాలలో కోర్టుల ప్రమేయం సరికాదు. ఇలాంటి వాటిపై నిర్ణయాలు తీసుకునే అధికారం పండితులైన అర్చకస్వాముల పరం చేయాలి. తిరుమలకు కూడా గోపాల్ సుబ్రహ్మణ్యం వంటి అమికస్ క్యూరీ అవసరం ఉందా? నిజానికి దేవస్థానాలలో జరుగుతున్న ఇలాంటి అనర్థదాయక అంశాల మీద హిందూ సమాజంలో శ్రద్ధ చూపుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే, ఆయన డాక్టర్ సుబ్రహ్మణ్యం స్వామి ఒక్కరే. వీటి గురించి సుప్రీంకోర్టులో పోరాడుతూనే, దేవస్థానంలో అవకతవకలపై నిజ నిర్ధారణ చేయడానికి, వాటిని సరిదిద్దడానికి ఆచార్యులను కూడా ఏకత్రాటి మీదకు తీసుకువచ్చే పనిని కూడా ఆయన చేపట్టాలని ప్రార్థిస్తున్నాను. ఒక సంఘంగా ఏర్పడడానికి మఠాధిపతులంతా వెంటనే ముందుకు రావాలి. తిరుపతి జీయరు, అహోబిల మఠం అధిపతి, త్రిదండి జీయరు, ఆండవర్, పెజావర్ స్వామి, హాథీరామ్ మఠం అధిపతి వంటి వారంతా కూడా ఆ సంఘంలో సభ్యులు కావాలి. తిరుపతి జీయరు ఇప్పటికే టీటీడీ పాలక మండలి/ప్రభుత్వం వైపు మొగ్గు చూపారు. అయితే వాస్తవాలు వెలుగులోకి రావలసిన ఈ సమయంలో ఆయనను ఈ పనికి ఒప్పించాలి. కంచి ఆచార్యులు, శృంగేరి మఠాధిపతి కూడా ఈ అంశానికి మద్దతు పలికితే వచ్చే ఊపు వేరుగా ఉంటుంది. ఈ సంఘం ఏం చేయాలి? మఠాధిపతులంతా తమ భక్తులైన ముగ్గురు లేదా నలుగురు ఆడిటర్ల పేర్లు సూచించాలి. అలాగే ఆభరణాల వెల కట్టే వారిని కూడా సూచించాలి. ఈ బృందం కూడా ఆభరణాల ఆడిట్లో ఉంటుందని ప్రకటించాలి. ప్రభుత్వం ఆమోదించక తప్పదు. సేవలు, పూజలు, నైవేద్యాల విషయంలో అధికారులకు సంబంధం లేదని స్వాములు ప్రకటించాలి. తమ అనుభవంలోకి వచ్చిన అన్ని వాస్తవాలను వారు ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలి. 22 ఏళ్ల క్రితం ఆభరణాల ఆడిట్ ఆగిపోయినప్పటికి, అప్పటి జాబితాను పరిగణనలోకి తీసుకోవచ్చు. ఆ తరువాత భక్తులు సమర్పించిన అన్ని ఆభరణాల వివరాలను ఆ జాబితాకు జోడించాలి. ఇది డిజిటల్ యుగం కాబట్టి ప్రతి ఆభరణం వివరాన్ని డిజిటల్ విధానంలో నమోదు చేయాలి. మఠాధిపతుల సంఘం చేసే సేవ భవిష్యత్తులో హిందూ ధర్మానికి మార్గదర్శనం చేయాలి. మన ఆలయాలు, మఠాల నుంచి ప్రభుత్వాలను బయటకు నెట్టే విధంగా చేయాలి. ఏదో చేస్తారని నమ్మి ఓటు వేసిన నాయకులు మరింత కుహనా సెక్యులరిస్టులుగా కని పిస్తున్నారు. ఇలాంటి నేతలు, భక్తిలేని అధికారులు మన మందిరాలలోకి చొరబడ్డారు. అవి నాయకులవి కావు, కోర్టుల ప్రమేయం అవసరం లేదు. అవి స్వాములు, మఠాధిపతుల ఆవాసాలు. వాటిని వారే నిర్వహించాలి. ఎస్వి. బద్రీ, వ్యాసకర్త తమిళనాడు ఆలయ పరిరక్షణ సంఘం వ్యవస్థాపక సభ్యులు contact@globalhinduheritagefoundation.org -
రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు
సాక్షి, తిరుపతి : తాను సామాన్య అర్చకుడిని అని, పుట్టకముందే శ్రీవారు తనను అర్చకుడిగా నియమించుకున్నారని, తాను మరణించేవరకూ స్వామివారికి సేవ చేస్తానని తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు అన్నారు. ఆయన సోమవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. ‘నాకు ప్రమోషన్లు ఉండవు. సెలవులు ఉండవు. అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఉండవు.. రిటైర్మెంట్ ఉండదు. నా జీవితమంతా శ్రీవారి సేవలోనే గడుపుతాను’అని ఆయన అన్నారు. శ్రీవారి వైభవాన్ని కాపాడటమే తన లక్ష్యమని చెప్పారు. 20 ఏళ్లు ఎందుకు మౌనంగా ఉన్నారని తనపై అభియోగాలు మోపుతున్నారని, ఎంతోమంది జేఈవో అధికారుల పర్యవేక్షణలో టీటీడీ కొనసాగిందని, కొందరు అర్చకులంటే చులకనగా చూసేవారని అన్నారు. వంశపారంపర్య అర్చకులను దేవాలయంలోనే లేకుండా చేయాలని కొందరు చూశారని, ఈ అవమానాలను, అరాచకాలను 24 ఏళ్లుగా భరిస్తూ వచ్చానని ఆయన అన్నారు. బాలసుబ్రహ్మణ్యం, ధర్మారెడ్డి, శ్రీనివాసరాజు జేఈవోలుగా వచ్చారని, బాలసుబ్రహ్మణ్యం రోజు తనకు 50 రూపాయలు కూలీ ఇచ్చేవారని ఆయన గుర్తుచేసుకున్నారు. నెలకు ఎన్ని రోజులు పనిచేస్తానో అన్ని రోజులే కూలీ ఇచ్చేవారని అన్నారు. కొన్నాళ్ల తర్వాత అర్చకుల జీతాలను రూ. మూడువేలు చేశారని, రోశయ్య హయాంలో రూ. 60వేలు వేతనంగా ఇచ్చారని, అదే మొన్నటివరకు తాను అందుకున్న వేతనమని తెలిపారు. జేఈవోలుగా పనిచేసిన బాలసుబ్రమణ్యం, ధర్మారెడ్డి, శ్రీనివాసరాజు టీటీడీకి పట్టిన ఏలినాటి శని లాంటి వారని ఆయన ఆరోపించారు. ‘బాలసుబ్రహ్మణ్యం హయాంలో వెయ్యికాళ్ళ మండపాన్ని కూల్చివేశారు. ఎన్నో ఏళ్ల కిందట నిర్మించిన, సుందరమైన, అపురూపమైన వెయ్యికాళ్ల మండపాన్ని కాపాడాలి అని అనేకసార్లు తాను వినతి పత్రం ఇచ్చాను. వెయ్యికాళ్ల మండపాన్ని కూల్చడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వెయ్యి కాళ్లం మండపాన్ని కాపాడేందుకు నేను ఎంతో పోరాటం చేశాను. అక్కడ ఉత్సవాలు జరగడం లేదు కదా.. తీసేస్తే నష్టమేంటన్నారు. 800 ఏళ్ల చరిత్ర కలిగిన వెయ్యి కాళ్ల మండపాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని చెప్పినా.. నిర్దయగా దానిని కూల్చివేశారు. ఇప్పుడు ఆ వేయి స్తంభాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూస్తే బాధగా ఉంటోంది. వెయ్యికాళ్ల మండపానికి అనువుగా పునర్నిర్మాణానికి కృషి చేశా. కానీ బాలసుబ్రహ్మణ్యం దానికి ఒప్పుకోలేదు. చివరికీ నాపై కక్షగట్టి నాకు వంశపారంపర్యంగా వచ్చిన ఇల్లును కూడా కూల్చేశారు. నాకు నిలువ నీడ లేకుండా చేశారు. బాలసుబ్రహ్మణ్యం చట్టవిరుద్ధ కార్యాలతో డబ్బు సంపాదించుకున్నారు. వ్యసనాలకు బానిస అయ్యారు. అర్చకులను ఒరేయ్, పోరా అని సంభోదిస్తూ.. నిత్యం హింసించేవారు. బాలసుబ్రహ్మణ్యం వారసుడు మరో జేఈవో ధర్మారెడ్డి. ధర్మారెడ్డి హయాంలోనే నాపై రెండుసార్లు హత్యాయత్నం జరిగిందన్నారు. మరో జేఈవో శ్రీనివాసరాజు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీనివాసరాజు అవినీతి, అక్రమాల పుట్ట గురించి అందరికీ తెలుసు. అర్చకులను బెదిరించి పూజలు చేయించిన ఘనత శ్రీనివాసరాజుది. పనివాడి కన్నా హీనంగా ఆయన అర్చకులను చూసేవారు. ప్రతిరోజు శ్రీవారి సన్నిధిలో శ్రీనివాసరాజుకు పనేంటి? నాపై వ్యంగ్యమైన ఛలోక్తులు విసిరి అవమానించేవారు’ అని అని రమణ దీక్షితులు అన్నారు. టీటీడీ ఆలయంలో నిధులు ఉన్నాయని బ్రిటిష్ మ్యానువల్ చాలా స్పష్టంగా రాసి ఉందని, ప్రతాపరుద్రుడు శ్రీవారికి సమర్పించిన అత్యంత అమూల్యమైన బంగారు నగలు నేలమాళిగల్లో ఉన్నాయని, ఆ నిధుల కోసం తవ్వకాలు జరిగాయని రమణ దీక్షితులు వెల్లడించారు. ఆ అక్రమాలను బయటపెట్టినందుకే కక్షగట్టిన అధికారులు, నాయకులు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అనాదిగా సంక్రమించిన ఆస్తులు తనకు ఉన్నాయని, అక్రమంగా సంపాదించిన ఆస్తులు తనకు లేవని స్పష్టం చేశారు. తనకు అక్రమ ఆస్తులు ఉన్నాయని కొందరు అధికారులు సోషల్ మీడియాలో కావాలనే ఆరోపణలు చేస్తున్నారని, ఈ విషయంలో సీబీఐ దర్యాప్తుకు సైతం తాను సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. టీటీడీలో అక్రమ తవ్వకాలు, అవకతవకలు, తప్పులు చేస్తున్న అధికారులపై సీబీఐ దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. తనకు 10 రూపాయల అక్రమార్జన ఉన్నా సీబీఐ విచారణకు సిద్ధమని, ఎలాంటి శిక్షకైనా సిద్ధమని అన్నారు. -
సోమిరెడ్డిని తొలగించాల్సిందే!
సాక్షి, న్యూఢిల్లీ: టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులపై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యల వ్యవహారం చల్లారేలా కనిపించటం లేదు. క్షమాపణలు చెప్పినప్పటికీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై పలువురు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఈ వ్యవహారంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మరోసారి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘రమణదీక్షితులపై సోమిరెడ్డి వ్యాఖ్యలు క్షమించరానివి. ఆయన్ని మంత్రి పదవి నుంచి తొలగించాల్సిందే. సోమిరెడ్డి.. ఇకనైనా దగుల్బాజి మాటలు మానుకుంటే మంచింది. ఏపీ సీఎం చంద్రబాబు ఏమైనా మాఫియా రాజ్యం నడుపుతున్నారా? ప్రజలకు ప్రశ్నించే అధికారం ఉండదా? పరిస్థితులు చూస్తుంటే ఏపీలో అసలు ప్రజాస్వామ్యం ఉందా ? అన్న అనుమానాలు కలుగుతున్నాయి’ అని ఆయన పేర్కొన్నారు. (టీటీడీ చరిత్రలో చీకటి రోజు) తిరుమల వెంకన్న ఆలయంలో జరుగుతున్న వ్యవహారాలపై ఆందోళన వ్యక్తం చేసినందుకు మొదట రమణ దీక్షితుల్ని ప్రధాన అర్చకుడిగా పదవి నుంచి తొలగించారని, ఇప్పుడు జైల్లో వేస్తామని భయపెట్టారని జీవీఎల్ విమర్శించారు. కాగా, రమణ దీక్షితులను జైల్లో వేయాలంటూ సోమిరెడ్డి చేసిన తీవ్ర వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. సోమిరెడ్డి వ్యాఖ్యలపై బ్రాహ్మణ సంఘాలతోపాటు పలు వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో చివరికి వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ సోమిరెడ్డిపై గుంటూరు జిల్లా నగరంపాలెం పోలీస్ స్టేషన్లో బ్రాహ్మణ సేవా సమితి ఆదివారం ఫిర్యాదు చేసింది. -
‘పింక్ డైమండ్‌పై రమణ దీక్షితులు ఫిర్యాదు చేశారు’
సాక్షి, చిత్తూరు: పింక్ డైమండ్‌పై రమణ దీక్షితులే తనకు ఫిర్యాదు చేశారని టీటీడీ మాజీ చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ రమణకుమార్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పిక్ డైమండ్‌పై ఫిర్యాదు చేసి.. రమణ దీక్షితులు తనను పక్కదారి పట్టించారని అన్నారు. పింక్ డైమండ్‌పై రమణ దీక్షితులు ఇచ్చిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్నానని, అందుకే తన రిపోర్టులో ఆ విషయం ప్రస్తావించానని తెలిపారు. రమణ దీక్షితులు ఆరోపణలో వాస్తవం లేదని జస్టిస్ జగన్నాథరావు కమిటీ నివేదికలో తేలిపోయిందన్నారు. బంగారు డాలర్ల విచారణ భాగంలోనే పింక్ డైమండ్ విషయం బయటపడిందన్నారు. గతంలో బొక్కసానికి సంబంధించిన రెండు తాళాలు డాలర్ శేషాద్రి వద్దే ఉండేవని, తన రిపోర్టులో ఆయన దగ్గర తాళాలు ఉండకూడదని పేర్కొన్నానట్లు తెలిపారు. దీంతో తాను ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ఆభరణాల భద్రత విషయంలో చాలా మార్పులు చేశారని తెలిపారు. శ్రీ వారి నగలను ఆలయంలో జమాలజీ ల్యాబ్ ఏర్పాటుచేసి లెక్కగట్టారన్నారు. తాను ఇంతవరకూ పింక్ డైమండ్‌ని చూడలేదన్నారు. అదేవిధంగా రమణ దీక్షితులు టీటీడీకి ఇచ్చిన విరాళాన్ని తన అకౌంట్లో వేసుకునే వారని ఆయన ఆరోపించారు. ఈ విషయాన్ని అప్పటి ఈవో రమణాచారి దృష్టికి తీసుకెళ్లామని, అయితే ఈవో ఆయన్ని మందలించి వదిలేశారని రమణ కుమార్ చెప్పారు. ప్రస్తుత పరిణామాలపై సీబీఐ విచారణ చేయించాలని ఆయన కోరారు. -
బాబు ఎందుకు భయపడుతున్నారు?
సాక్షి, అమరావతి : టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులపై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చేసిన తీవ్ర వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రమణ దీక్షితుల్ని అవమానించేవిధంగా సోమిరెడ్డి చేసిన పరుష వ్యాఖ్యలపై తాజాగా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ట్విటర్లో స్పందించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) సంబంధించిన అంశాలను ప్రస్తావించిన రమణ దీక్షితుల్ని జైల్లో వేస్తామని బెదిరించడం దేనికి సంకేతమని జీవీఎల్ ప్రశ్నించారు. రమణ దీక్షితులు లేవనెత్తిన విషయాల్లో చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. రమణ దీక్షితుల్ని ఉద్దేశించి ‘జైల్లో వేసి నాలుగు తగిలించాలి’ అంటూ సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలను జీవీఎల్ తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు దక్షిణాది అసహన సుల్తాన్‌గా మారిపోయారని మండిపడ్డారు. టీటీడీ బోర్డులో హిందువేతరుల్ని నియమించారని తప్పుబట్టారు. తిరుమల వెంకన్న ఆలయంలో జరుగుతున్న వ్యవహారాలపై ఆందోళన వ్యక్తం చేసినందుకు మొదట రమణ దీక్షితుల్ని ప్రధాన అర్చకుడిగా పదవి నుంచి తొలగించారని, ఇప్పుడు జైల్లో వేస్తామని భయపెడుతున్నారని విమర్శించారు. రమణ దీక్షితులుకు సోమిరెడ్డి క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆయనను మంత్రిపదవి నుంచి తొలగించాలని జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. రమణ దీక్షితులుపై సోమిరెడ్డి వ్యాఖ్యలను బీజేపీ నేత ఆంజనేయరెడ్డి కూడా తప్పుబట్టారు. మంత్రులు కూడా చంద్రబాబు తరహాలోనే ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి! గుంటూరు : టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చేసిన పరుష వ్యాఖ్యలపై బ్రాహ్మణ సేవాసంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. సోమిరెడ్డి వెంటనే బ్రాహ్మణులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. రమణ దీక్షితులుపై సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనుకకు తీసుకోవాలని, లేదంటే తిరుమలలో ఆందోళన చేపడతామని బ్రాహ్మణ సేవాసంఘం హెచ్చరించింది. జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంది. టీడీపీ కుల, మతపరమైన రాజకీయాలు చేయడం దారుణమని మండిపడింది. -
ఎవరా రమణ దీక్షితులు..!
సాక్షి, అమరావతి : టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులుపై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎవరా రమణ దీక్షితులు అంటూ సోమిరెడ్డి ఏకవచన ప్రయోగం చేశారు. రమణ దీక్షితుల్ని బొక్కలోకి తోసి.. నాలుగు తంతే నిజాలు బయటకు వస్తాయంటూ బెదిరింపులకు దిగారు. తిరుమల ఆలయంలో ఏం జరుగుతుందో.. అన్నీ తెలుస్తాయంటూ సోమిరెడ్డి చేసిన వదురుబోతు వ్యాఖ్యలు.. ఆయన నోటిదురుసుతనంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీటీడీ వ్యవహారంలో టీడీపీ ప్రభుత్వ దుర్మార్గానికి సోమిరెడ్డి వ్యాఖ్యలు నిదర్శనమంటూ పండితులు, అర్చకులు మండిపడుతున్నారు. ఎవరా రమణ దీక్షితులు..! టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులుపై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నోరుపారేసుకున్నారు. ఎవరా రమణ దీక్షితులు అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆయనలాంటి వారి వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని అన్నారు. టీటీడీ అంశాన్ని బజారుకెక్కించాలని ఆయన అనుకుంటున్నారని ఆక్షేపించారు. నాశనమైపోతారు.. చెత్త రాజకీయాలు పక్కనబెట్టండి అంటూ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అంటే రమణ దీక్షితులకు అంత భయం లేకుండా పోతుందా? అని ప్రశ్నించారు. ‘ఎవరా రమణ దీక్షితులు? బొక్కలో వేసి నాలుగు తగిలిస్తే..?’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీక్షితులు ఏమేం తప్పులు చేశారో మొత్తం తమకు తెలుసునని అన్నారు. ‘రమణ దీక్షితులూ.. మీరు హద్దులు మీరి మాట్లాడుతున్నారు. రమణ దీక్షితులూ.. ఎన్నో రోజులు లేవు. అనుభవిస్తారు మీరు. పత్రికల్లో, చానళ్లలో మీరన్న మాటల గురించి వార్తలు చదవాలా?’ అని సోమిరెడ్డి పేర్కొన్నారు. నాలుగేళ్ల మోదీ, అమిత్‌షా నియంత పాలనకు కర్ణాటక వేదిక అయిందని, కర్ణాటకలో రాహుల్‌గాంధీతో చంద్రబాబు వేదిక పంచుకుంటే తప్పేంటి? అని సోమిరెడ్డి అన్నారు. -
శ్రీవారి ఆభరణాలు భద్రమేనా?
తిరుమల శ్రీవారికి చెందిన వేల కోట్ల విలువజేసే ఆభరణాల భద్రతపై అనుమానాలు తలెత్తుతున్నాయి. చెన్నై మీడియా సమావేశంలో అప్పటి శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులైన రమణ దీక్షితులు స్వామివారి ఆభరణాలపై సందేహాలను వ్యక్తం చేసినప్పటి నుంచీ భక్తుల్లో అనుమానాలు మరింత పెరిగాయి. శ్రీకృష్ణదేవరాయల ఆభరణాలను ప్రత్యక్షంగా చూసి వాటిపై కొద్దోగొప్పో అవగాహన ఉన్న రమణ దీక్షితులు వంటి ప్రముఖ వ్యక్తే సందేహాలను వెలిబుచ్చడం చర్చకు దారి తీసింది. సాక్షి ప్రతినిధి, తిరుపతి : విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు 16వ శతాబ్దంలో తిరుమల శ్రీవారికి సమర్పించిన వేల కోట్ల ఖరీదుజేసే బంగారు, వజ్ర, వైఢూర్య ఆభరణాల భద్రతపై టీటీడీ వర్గాలు నోరు మెదపడం లేదు. మూడు రోజులుగా వివిధ వర్గాల ప్రజలు, మీడియా ప్రశ్నిస్తున్నప్పటికీ కచ్చితమైన సమాధానం చెప్పడం లేదు. దీంతో రాయల వారి నగలపై స్పష్టమైన వివరణ ఇవ్వడంలో టీటీడీ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. గత మంగళవారం చెన్నైలో అత్యవసరంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి టీటీడీలో వంశపారంపర్యంగా వస్తున్న అర్చక వారసత్వాన్ని రద్దు చేయడం ఆగమ శాస్త్ర విరుద్ధ«మని రమణ దీక్షితులు విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన శ్రీవారి బంగారు ఆభరణాల భద్రతను ప్రశ్నించారు. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో స్వామి వారికి అందజేసిన వేల కోట్ల విలువజేసే ఆభరణాలు ఎక్కడ ఉన్నాయి... ఎంత మేరకు భద్రంగా ఉన్నాయని టీటీడీ అధికారులను నిలదీశారు. ఆభరణాల లెక్కలను బహిరంగపరిచి ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని రమణ దీక్షితులు టీటీడీ వర్గాలను కోరారు. కొత్తగా స్వామి వారికి కా నుకల రూపంలో అందిన ఆభరణాలను మాత్రమే ఉత్సవాల సమయంలో అలంకరిస్తున్నారనీ, పాత నగలను బయటకు తీయడం లేదని ఆయన పునరుద్ఘాటించారు. ఇటీవలనే టీటీడీకి చెందిన రూ.1000 కోట్ల నగదును అధికారులు ఓ ప్రయివేటు బ్యాంకులో డిపాజిట్ చేశారు. దీంతో భద్రతను ప్రశ్నిస్తూ శ్రీవారి భక్తుడు నవీన్‌కుమార్‌రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అప్పట్లో డిపాజిట్ల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదంగా మారింది. సరైన సమాధానం చెప్పలేక టీటీడీ అధికారులు సతమతమయ్యారు. ఈ నెల 16న జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో సదరు డిపాజిట్ల పర్యవేక్షణ కోసం సబ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చైర్మన్ సుధాకర్‌యాదవ్ వెల్లడించారు. ఒకవైపు డిపాజిట్ల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో శ్రీవారి విలువైన ఆభరణాలపై సందేహాలు వెల్లువెత్తడం టీటీడీ వర్గాలను కుదిపేస్తోంది. కచ్చితమైన సమాధానం చెప్పలేక అధికారులు నీళ్లు నమిలే పరిస్థితి నెలకొంది. అయితే కొత్తగా విధుల్లో చేరిన నూతన ప్రధాన అర్చకులు మాత్రం ఆభరణాలకు చెందిన రికార్డులన్నీ ఉన్నాయని బదులిచ్చారు. లోగుట్టు పెరుమాళ్ల కెరుక.... 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు తన భార్యలు తిరుమలాదేవి, చిన్నమదేవితో కలిసి 7 సార్లు తిరుమల స్వామి వారిని దర్శించుకున్నారు. అప్పట్లో రాయలవారు దర్శనానికి వచ్చిన ప్రతిసారీ విలువైన బంగారు, వజ్ర, నవరత్నాలతో కూడిన వజ్ర కిరీటాలు, భుజకీర్తులు, కంఠహారాలు, స్వర్ణ ఖడ్గాలను స్వామివారికి ఎంతో భక్తితో సమర్పించారు. 1513 ఫిబ్రవరి 10వ తేదీ తొలిసారి సందర్శించినపుడు నవరత్నాలు పొదిగిన బంగారు కిరీటాన్ని అందజేశారు. అదే సంవత్సరం మే 2వ తేదీ రెండోసారి రాయల వారు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అప్పట్లో మరో కిరీటం, పతకాలు, హారాలు, వెండి హారతి పళ్లాలు అందజేశారు. ఆ తరువాత పుత్రసంతానం కలిగాక భార్య తిరుమలాదేవితో కలిసి వచ్చి (1518 అక్టోబర్ 16) తిరుమల వెంకన్నను దర్శించి బంగారు పీతాంబరాలు, నవరత్నాలను సమర్పించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. మహంతుల కాలంలో కొన్నింటిని కరగబెట్టి కొత్త ఆభరణాలు చేయించే ప్రయత్నాలు జరిగాయని చెబుతున్నారు. ఆ తరువాత 1996 వరకూ కొన్ని ఆభరణాలను అడపా దడపా స్వామి వారికి అలంకరిస్తూ వచ్చారు. ఆ తరువాత కొత్త ఆభరణాలు వచ్చి చేరుతుండటంతో పాత వాటి జోలికెళ్లడం లేదు. ఈ నేపథ్యంలో అసలు రాయల వారి ఆభరణాల మాటేమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పటికైనా టీటీడీ వర్గాలు భక్తుల సందేహాలకు సరైన సమాధానం చెప్పి భక్తుల్లో నమ్మకాన్ని, భరోసాను పెంచాల్సిన అవసరం ఉంది. అధికారులు సమాధానం చెప్పాలి శ్రీవారికి ఉన్న వేల కోట్ల విలువైన ఆభరణాలపై భక్తుల్లో అనుమానాలు తీవ్రతరంకాక ముందే టీటీడీ అధికారులు సమాధానం చెప్పాలి. ఏఏ ఆభరణాలు ఎక్కడ, ఏ రకమైన భద్రతలో ఉన్నాయో వివరిం చాలి. సాక్షాత్తు ఆలయ ప్రధాన అర్చకులై, ఆగమ సలహాదారులుగా వ్యహరించిన రమణ దీక్షితుల వంటి పెద్దలు సందేహాలను వ్యక్తం చేయడం చూస్తే ఏదో జరుగుతోందన్న సందేహాలు తలెత్తుతున్నాయి. నవీన్‌కుమార్‌రెడ్డి, ఆర్పీఎస్ కన్వీనర్, తిరుపతి ఆభరణాల నిర్వహణ లోపభూయిష్టం స్వామి వారి ఆభరణాల నిర్వహణ బాధ్యతలు సరిగా లేవు. అంతా లోపభూయిష్టంగా ఉంది. కోట్ల విలువైన ఆభరణాలపై కనీస జబాబుదారీతనం లేకుండా పోయింది. ఆభరణాలను భక్తుల సందర్శన కోసం ఉంచడం శ్రేయస్కరం. – పురుషోత్తమ రెడ్డి, రాయలసీమ మేథావుల ఫోరం -
రమణ దీక్షితులుపై క్రమశిక్షణా చర్యలు: కేఈ
సాక్షి, అమరావతి: టీటీడీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు తిరుమల ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించారని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పేర్కొన్నారు. దీనిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని.. ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని టీటీడీ అధికారులను ఆదేశిస్తున్నట్లు చెప్పారు. గురువారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రమణ దీక్షితులు ఇటీవల చాలా తప్పులు చేశారని చెప్పారు. ఒక ప్రధాన అర్చకుడు రాజకీయాలు మాట్లాడటం ఆలయ నియమాలకు విరుద్ధమన్నారు. ఇంతవరకూ రమణ దీక్షితులు వ్యవహారాన్ని పెద్దగా పట్టించుకోలేదన్నారు.ఇప్పుడు హద్దులు దాటి మరీ ఆరోపణలు చేస్తున్నందున ఇక ఉపేక్షించేది లేదని చెప్పారు. ఆయన చేసిన పనులపై ప్రత్యేక విచారణ జరిపిస్తామని మంత్రి వెల్లడించారు. అవసరమైతే టీటీడీ ఆస్తులు, ఆభరణాలపై తనిఖీకి ఆదేశిస్తామన్నారు. డాలర్ శేషాద్రి విషయం గురించి కూడా ఆరా తీస్తామన్నారు. -
టీటీడీలో రోజుకో వివాదం.. భక్తులు మండిపాటు
సాక్షి, తిరుమల : టీటీడీలో రోజుకో వివాదం తలెత్తుతున్నాయి. అంతేకాక టీటీడీ వివాదస్పద నిర్ణయాలపై భక్తులు మండిపడుతున్నారు. అరవై ఐదుళ్లు దాటిన అర్చకులకు ఉద్యోగ విరమణ వర్తింపజేయాలని టీటీడీ ధర్మకర్తల మండలి బుధవారం నిర్ణయం తీసుకుంది. దీంతో టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్‌పై యాదవ్ సంఘాలు గుర్రుమంటున్నాయి. టీటీడీ ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయంతో 5మంది మీరాశి అర్చకులు, 10 మంది నాన్ మిరాశి అర్చకులు, ఒక సన్నిధి గొల్ల ఉద్యోగాలు కోల్పోతారు. రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై పూర్తి విచారణ చేయాలని సీఐటీయు నాయకుడు కందారపు మురళి కోరారు. ప్రభుత్వం వెంటనే దీనిపై సమాధానం చెప్పాలని మురళి పేర్కొన్నారు. ‘ఆలయంలో అసలేం జరుగుతుందో భక్తులకు అనుమానాలు కలుగుతున్నాయి. శ్రీవారి అభరణాలు, ఆస్తులు భద్రతపై భక్తులు నమ్మకం కోల్పోతున్నారు. వెంటనే ఈ ఆరోపణలపై ఉన్నత స్థాయి కమిటీతో విచారణ చేయించాలి’. అని కందారపు మురళి అన్నారు. ఆలయ ప్రధానార్చకులు రమణ దీక్షితులకు ఈఓ నోటిసులు కూడా జారీ చేసింది. దీనిపై రమణ దీక్షితులు మాట్లాడుతూ.. మాపై చర్యలు తీసుకునే హక్కు టీటీడీకి లేదన్నారు. ఆ విషయాన్ని చట్టబద్ధంగా ఎదుర్కొంటామని తెలిపారు. 143 చట్టం ప్రకారం మాకు మిరాసిలో వచ్చే ఆదాయం మాత్రమే రద్దయిందని తెలిపారు. వంశపారంపర్యం, సంభవణ, గౌరవంగా చూస్కోవాలని సుప్రీం కోర్టు తీర్పు నిచ్చింది.. కోర్టు నిర్ణయాలను కూడా టీటీడీ లెక్కచెయ్యట్లేదన్నారు. మిరాశి అర్చకులును హీనంగా చూసిన సహించాము.. కానీ కైంకర్యాలలో లోపాలు జరిగితే ఉరుకోము. టీటీడీ అధికారులు వీఐపీల సేవలో తరిస్తూ, మాపై పెత్తనం చలాయిస్తున్నారు. నిత్య సేవలు త్వరగా నిర్వహించాలని మాపై ఒత్తిడి తేస్తున్నారని రమణ దీక్షితులు పేర్కొన్నారు. -
పాలకుల పాపాలతో రాష్ట్రానికి అశాంతి
సాక్షి, చెన్నై: అర్చక వారసత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం ఆగమ శాస్త్ర విరుద్ధమని టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు పేర్కొన్నారు. హిందూ మతాన్ని కనుమరుగు చేసేందుకు భారీ కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తిరుమలలో భక్తులకు శ్రీవారి సేవ దక్కకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నియమ నిబంధనలు తెలియని వారిని అధికారులుగా నియమించి ఆలయాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అతి పెద్ద తప్పు చేస్తోందని, ఈ పద్ధతి మారాలని హెచ్చరించారు. రమణ దీక్షితులు మంగళవారం చెన్నైలో మీడియాతో మాట్లాడారు. స్వామివారిని తాకే శాస్త్రాధికారం ఒక్క ఆగమ అర్చకులకు మాత్రమే ఉందన్నారు. స్వామివారికి కైంకర్యమే మహాపుణ్యం అన్నారు. తిరుమల ఆలయంలో రాజకీయాలు సరికాదని, పాలకుల పాపాల కారణంగా రాష్ట్రానికి, భక్తులకు అశాంతితో పాటు స్వామివారి ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇంతకాలం అవమానాలు భరించామని, ఇక ఓపిక లేదన్నారు. ప్రధాన అర్చకుడిగా ఉన్న తనకే తిరుమల శ్రీవారి ఆభరణాల వివరాలు తెలియడం లేదని రమణ దీక్షితులు పేర్కొన్నారు. ఆభరణాల వివరాలు, ఆలయ లెక్కలను బహిర్గతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. స్వామివారి ఆగ్రహం వల్లే పిడుగులు అధికార బలంతో ఆలయ నియమ నిబంధనలను మార్చేస్తున్నారని రమణ దీక్షితులు ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా వారు, రాజకీయ నాయకుల కోసం భజన చేస్తూ ఆలయాన్ని భ్రష్టు పట్టిస్తున్న వారూ ఉన్నారన్నారు. తోమాల సేవ లాంటి ముఖ్య సేవలకు కూడా బలం, బలగంతో వచ్చేస్తున్నారని, శాస్త్ర విరుద్ధంగా నిర్వహిస్తూ మహాపచారం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆలయంలో పెరుగుతున్న మహాపచారాల కారణంగానే పిడుగులు, ఉరుములు ప్రజలను భయకంపితులను చేస్తున్నాయన్నారు. ఇది స్వామివారి ఆగ్రహమేనని స్పష్టం చేశారు. స్వామివారి సేవకంటే తమ వారి సేవకోసం కైంకర్యాల సమయాలను తగ్గించి మమ అనిపిస్తున్నారని ఆరోపించారు. ఇది మహాపాపం అని హెచ్చరించారు. 1996 వరకు వంశపారంపర్యంగా స్వామివారి ఆభరణాలను సంరక్షిస్తూ వచ్చామని అయితే ఇప్పుడు వాటికి లెక్కలు, జవాబులు చెప్పే వాళ్లే కరువయ్యారన్నారు. అసలు స్వామివారి ఆభరణాలు అన్నీ భద్రంగా ఉన్నాయా..? అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. కట్టడాలు, ఆచారాలు కనుమరుగు చేసే యత్నం శ్రీకృష్ణదేవరాయలు స్వామివారికి సమర్పించిన ఆభరణాల పరిస్థితి ఏమిటో? అని రమణ దీక్షితులు ప్రశ్నించారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి నియమించిన ఐఏఎస్ అధికారి అప్పట్లో వెయ్యికాళ్ల మండపం కూల్చివేశారన్నారు. ఇది ఆగమశాస్త్రాలకు విరుద్ధమని పోరాడామని, ఇప్పుడు ఆ ఆనవాళ్లు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్వామివారి రథమండపం కోసం కూడా పోరాడినా రక్షించుకోలేక పోయామన్నారు. స్వామికి పాలకులు చేసిన మహా అపరాధాల్లో ఇది కూడా ఒకటిగా పేర్కొన్నారు. భావితరాలకు వారసత్వ నిర్మాణాలు, ఆచారాలు కనిపించకుండా ఈ ప్రభుత్వం చేస్తోందని మండిపడ్డారు. మాస్టర్ ప్లాన్ అనే నినాదంతో ఆలయాన్ని, ఆగమ శాస్త్రాలను కాలరాసి ఏకంగా హిందుమతాన్ని కనుమరుగు చేసే భారీ కుట్ర జరుగుతున్నట్టుందని ఆందోళన వ్యక్తంచేశారు. విస్తరణ పేరిట సర్వనాశనం విస్తరణ పేరుతో స్వామివారి ఆలయాన్ని సర్వనాశనం చేస్తున్నారని రమణ దీక్షితులు ఆవేదన వ్యక్తం చేశారు. పురావస్తు శాఖ ద్వారా ఆలయాన్ని పరిశీలిస్తామంటే దాన్ని కూడా రాజకీయం చేశారని పేర్కొన్నారు. టీటీడీపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరుతూ రాష్ట్రపతి, ప్రధాని, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి , హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వినతిపత్రాలు పంపారన్నారు. హుండీ ఆదాయం స్వామివారి సేవకోసం మాత్రమేనని, అయితే, అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు తమ ఊరిలో కల్యాణ మండపం నిర్మించుకునేందుకు రూ.10 కోట్లు అడుగుతున్నారంటే ప్రభుత్వం తీరు ఎలా ఉందో తేటతెల్లం అవుతోందన్నారు. అధికార పక్షం కనుసన్నల్లో జరుగుతున్న అవినీతి నుంచి ఆలయాన్ని, స్వామివారిని కాపాడుకోవడం కోసం తాము పోరాడుతూనే ఉంటామని ప్రకటించారు. తమతోపాటు భక్తులు కూడా స్వామివారిని కాపాడుకోవాల్సి ఉందన్నారు. రాజకీయ నాయకులు, అధికారులు తమ స్వార్థం కోసం సేవల సమయాలను కుదించి, అర్చకులను బెదిరించి పబ్బం గడుపుకుంటున్నారన్నారు. ఇలాంటి పిచ్చి చేష్టల వల్ల స్వామివారి ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. పాలకుల పాపాల కారణంగా రాష్ట్రానికి, భక్తులకు అశాంతితో పాటు స్వామివారి ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. రాజకీయ నాయకులే ఆలయాన్ని భ్రష్టు పటిస్తున్నారన్నారు. దేవాలయాలకు రాజకీయాల నుంచి విముక్తి కల్గించాల్సి ఉందన్నారు. సీబీఐతో విచారణ జరిపించాలి... స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని సైతం వ్యాపార కేంద్రంగా మారుస్తున్నారని రమణ దీక్షితులు పేర్కొన్నారు. అతి ప్రాచీన ఆలయాన్ని కేంద్ర నిపుణుల కమిటీతో పరిరక్షించాలని కోరారు. పురావస్తు, ఆగమ శాస్త్ర పండితులు, ఆభరణాల నిపుణులు, స్వామివారి సేవే పరమావధిగా భావించే సీనియర్ అధికారులను ఈ కమిటీలో నియమించాలని సూచించారు. తిరుమల ఆలయంలోకి అన్యమతస్తుల ప్రవేశ విషయాన్ని రాజకీయాల విచక్షణకే వదలి పెడుతున్నామన్నారు. చరిత్ర తెలియని పాలకమండలి అధికారుల వల్ల ఆలయ ప్రతిష్ట మంట కలుస్తోందన్నారు. తిరుమల ఆలయంలో సాగుతున్న వ్యవహారాలపై సీబీఐతో విచారణ జరిపించాలని రమణ దీక్షితులు కోరారు. -
తిరుమల శ్రీవారి ఆలయంలో నామాల గొడవ
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో నామాల గొడవ... ముదురుతోంది. ప్రతి శుక్రవారం ములవిరాట్కు అభిషేకం, నిజపారద్శకం కాగానే... అర్చకులు ఏకాంతంగా స్వామివారిని అలంకరిస్తారు. అలకరణకు ముందుగా స్వామివారి నామాన్ని పచ్చకర్పూరం, కస్తూరితో తీర్చిదిద్దుతారు. అయితే ఈ నామాలను ఊర్ధ్వపుండ్రాలుగా కాకుండా రూపంలో మార్పు చేస్తున్నట్లు పెదజీయంగారు గుర్తించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో నిఘా పెట్టిన అధికారులు శ్రీవారి సేవల్లో నిర్లక్ష్యం జరుగుతోందని గుర్తించారు. ఈ అపచారానికి రమణదీక్షితులు కుమారుడు రాజేష్ దీక్షితులే బాధ్యులని భావించి అతడిని ఆరు నెలలపాటు శ్రీవారి అభిషేకం సేవల నుంచి దూరం చేశాయి. దీనిపై ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు స్పందిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానంలో అర్చకులపై ఉన్నతాధికారులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు ఆగమ సలహాదారులు, ప్రధాన అర్చకులను సంప్రదించాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అవగాహన లేనివారు చెప్పిన మాటలు వినడం మంచిది కాదన్నారు. ఇప్పటికే శ్రీవారి ఆలయంపై సంఘ విద్రోహ శక్తుల ముప్పు ఉందని రమణ దీక్షితులు ఈ సందర్భంగా గుర్తు చేశారు. టీటీడీలో కొంతమంది కావాలనే సమస్యలు సృష్టిస్తున్నారని విమర్శించారు. శ్రీవారి నామాలలో ఎలాంటి మార్పు లేదని ఆయన స్పష్టం చేశారు. నామాల వివాదంపై న్యాయపోరాటం చేస్తామని రమణదీక్షితులు తెలిపారు.