సాక్షి, అమరావతి : టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులుపై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎవరా రమణ దీక్షితులు అంటూ సోమిరెడ్డి ఏకవచన ప్రయోగం చేశారు. రమణ దీక్షితుల్ని బొక్కలోకి తోసి.. నాలుగు తంతే నిజాలు బయటకు వస్తాయంటూ బెదిరింపులకు దిగారు.
తిరుమల ఆలయంలో ఏం జరుగుతుందో.. అన్నీ తెలుస్తాయంటూ సోమిరెడ్డి చేసిన వదురుబోతు వ్యాఖ్యలు.. ఆయన నోటిదురుసుతనంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీటీడీ వ్యవహారంలో టీడీపీ ప్రభుత్వ దుర్మార్గానికి సోమిరెడ్డి వ్యాఖ్యలు నిదర్శనమంటూ పండితులు, అర్చకులు మండిపడుతున్నారు.
ఎవరా రమణ దీక్షితులు..!
టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులుపై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నోరుపారేసుకున్నారు. ఎవరా రమణ దీక్షితులు అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆయనలాంటి వారి వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని అన్నారు. టీటీడీ అంశాన్ని బజారుకెక్కించాలని ఆయన అనుకుంటున్నారని ఆక్షేపించారు. నాశనమైపోతారు.. చెత్త రాజకీయాలు పక్కనబెట్టండి అంటూ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అంటే రమణ దీక్షితులకు అంత భయం లేకుండా పోతుందా? అని ప్రశ్నించారు. ‘ఎవరా రమణ దీక్షితులు? బొక్కలో వేసి నాలుగు తగిలిస్తే..?’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీక్షితులు ఏమేం తప్పులు చేశారో మొత్తం తమకు తెలుసునని అన్నారు. ‘రమణ దీక్షితులూ.. మీరు హద్దులు మీరి మాట్లాడుతున్నారు. రమణ దీక్షితులూ.. ఎన్నో రోజులు లేవు. అనుభవిస్తారు మీరు. పత్రికల్లో, చానళ్లలో మీరన్న మాటల గురించి వార్తలు చదవాలా?’ అని సోమిరెడ్డి పేర్కొన్నారు. నాలుగేళ్ల మోదీ, అమిత్‌షా నియంత పాలనకు కర్ణాటక వేదిక అయిందని, కర్ణాటకలో రాహుల్‌గాంధీతో చంద్రబాబు వేదిక పంచుకుంటే తప్పేంటి? అని సోమిరెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment