సాక్షి, తిరుమల : టీటీడీలో రోజుకో వివాదం తలెత్తుతున్నాయి. అంతేకాక టీటీడీ వివాదస్పద నిర్ణయాలపై భక్తులు మండిపడుతున్నారు. అరవై ఐదుళ్లు దాటిన అర్చకులకు ఉద్యోగ విరమణ వర్తింపజేయాలని టీటీడీ ధర్మకర్తల మండలి బుధవారం నిర్ణయం తీసుకుంది. దీంతో టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్‌పై యాదవ్ సంఘాలు గుర్రుమంటున్నాయి. టీటీడీ ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయంతో 5మంది మీరాశి అర్చకులు, 10 మంది నాన్ మిరాశి అర్చకులు, ఒక సన్నిధి గొల్ల ఉద్యోగాలు కోల్పోతారు.
రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై పూర్తి విచారణ చేయాలని సీఐటీయు నాయకుడు కందారపు మురళి కోరారు. ప్రభుత్వం వెంటనే దీనిపై సమాధానం చెప్పాలని మురళి పేర్కొన్నారు. ‘ఆలయంలో అసలేం జరుగుతుందో భక్తులకు అనుమానాలు కలుగుతున్నాయి. శ్రీవారి అభరణాలు, ఆస్తులు భద్రతపై భక్తులు నమ్మకం కోల్పోతున్నారు. వెంటనే ఈ ఆరోపణలపై ఉన్నత స్థాయి కమిటీతో విచారణ చేయించాలి’. అని కందారపు మురళి అన్నారు.
ఆలయ ప్రధానార్చకులు రమణ దీక్షితులకు ఈఓ నోటిసులు కూడా జారీ చేసింది. దీనిపై రమణ దీక్షితులు మాట్లాడుతూ.. మాపై చర్యలు తీసుకునే హక్కు టీటీడీకి లేదన్నారు. ఆ విషయాన్ని చట్టబద్ధంగా ఎదుర్కొంటామని తెలిపారు. 143 చట్టం ప్రకారం మాకు మిరాసిలో వచ్చే ఆదాయం మాత్రమే రద్దయిందని తెలిపారు. వంశపారంపర్యం, సంభవణ, గౌరవంగా చూస్కోవాలని సుప్రీం కోర్టు తీర్పు నిచ్చింది.. కోర్టు నిర్ణయాలను కూడా టీటీడీ లెక్కచెయ్యట్లేదన్నారు. మిరాశి అర్చకులును హీనంగా చూసిన సహించాము.. కానీ కైంకర్యాలలో లోపాలు జరిగితే ఉరుకోము. టీటీడీ అధికారులు వీఐపీల సేవలో తరిస్తూ, మాపై పెత్తనం చలాయిస్తున్నారు. నిత్య సేవలు త్వరగా నిర్వహించాలని మాపై ఒత్తిడి తేస్తున్నారని రమణ దీక్షితులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment