Top Stories
ప్రధాన వార్తలు

పాక్ తూటాలకు... క్షిపణులతో బదులివ్వండి
న్యూఢిల్లీ: సీమాంతర ఉగ్రవాదం పట్ల భారత్ ప్రతిస్పందన ఇకపై సరికొత్త రీతిలో ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. ‘‘పాక్‌తూటాలకు కచ్చితంగా క్షిపణులతో సమాధానం చెప్పండి. అది చేపట్టే ఒక్కో దుశ్చర్యకూ కలలో కూడా ఊహించనంత బలంగా బదులివ్వండి’’ అని సైనిక దళాలను ఆదేశించాశారు. త్రివిధ దళాల అధినేతలతో ఆయన ఆదివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ సిందూర్‌పై విస్తృతంగా చర్చించారు. పాక్ దాడులను సహించడానికి ఏ మాత్రమూ వీల్లేదంటూ మోదీ స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై, ముష్కరులపై ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా ముగియలేదని స్పష్టంచేశారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే చెల్లించాల్సిన మూల్యం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. కశ్మీర్ అంశంలో విదేశీ మధ్యవర్తిత్వాన్ని అంగీకరించేది లేదని పునరుద్ఘాటించారు. పాకిస్తాన్‌తో జరిగే ఏ చర్చలైనా సరే కేవలం పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)ను, పాక్‌లో దాక్కున్న ఉగ్రవాదులను భారత్‌కు అప్పగించడంపైనే ఉంటాయని కేంద్రం తేల్చిచెప్పింది. చట్టవిరుద్ధంగా ఆక్రమించుకున్న పీఓకేను, ఉగ్రవాద మూకలను భారత్‌కు అప్పగించాల్సిందేనని, పాక్‌కు మరో గత్యంతరం లేదని స్పష్టం చేసింది. ‘‘ఆ దేశంతో చర్చలు వీటిపై మాత్రమే జరుగుతాయి. అది కూడా కేవలం డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) స్థాయిలో మాత్రమే కొనసాగుతాయి’’ అని కేంద్రం ఉద్ఘాటించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ సహా ఉగ్రవాదుల అప్పగింతపై తప్ప మరో అంశంపై చర్చించే ప్రసక్తే లేదని తెలిపింది. ఉగ్రవాదానికి పాక్ మద్దతు కొనసాగుతున్నంత కాలం సింధూ నది జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం తథ్యమని పేర్కొంది. విదేశాంగ మంత్రులు, లేదా జాతీయ భద్రతా సలహాదారుల స్థాయిలో చర్చలు జరగాలని పాక్ ప్రతిపాదిస్తుండగా అందుకు భారత్‌కు అంగీకరించడం లేదు.దాడి చేస్తే గట్టిగా ఎదురుదెబ్బజేడీ వాన్స్‌కు మోదీ స్పష్టీకరణ న్యూఢిల్లీ/వాషింగ్టన్: పాకిస్తాన్ ఒకవేళ భారత్‌పై మళ్లీ దాడికి దిగితే అంతకంటే గట్టిగానే ఎదురుదెబ్బ తీస్తామని అమెరికాకు మోదీ తేల్చిచెప్పారు. తమ ప్రతిస్పందన అత్యంత తీవ్రస్థాయిలో, దాయాదికి వినాశకరంగా ఉంటుందని స్పష్టంచేశారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ శనివారం మోదీతోఫోన్‌లో మాట్లాడారు. కాల్పుల విరమణ ఒప్పందం గురించి ప్రస్తావించారు. అనంతరం విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, పాక్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్‌తో కూడా వాన్స్ చర్చించారు. పాక్ కాల్పులు ఆపితేనే సంయమనం పాటిస్తామని అమెరికాకు భారత్ తేల్చిచెప్పినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. భారత్–పాక్ ఘర్షణల గురించి అమెరికా నిఘా వర్గాల నుంచి ఆందోళనకరమైన సమాచారం అందిన కారణంగానే మోదీ తో వాన్స్ మాట్లాడారని సమాచారం. సున్నితమైన అంశం కావడంతో బయటకు వెల్లడించలేదని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆర్మీ కమాండర్లకు పూర్తి స్వేచ్ఛ పాక్ దాడులను తిప్పికొట్టాలని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ఆదేశం న్యూఢిల్లీ: సరిహద్దుల్లో పాకిస్తాన్ సైన్యం దాడులకు దిగితే గట్టిగా ప్రతిస్పందించాలని, తగిన రీతిలో బుద్ధి చెప్పాలని ఆర్మీ కమాండర్లకు సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆదేశాలు జారీ చేశారు. దాడులను తిప్పికొట్టే విషయంలో వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. సైనిక చర్యలు నిలిపివేస్తూ అంగీకారానికి వచ్చినట్లు భారత్, పాక్ శనివారం ప్రకటించడం తెలిసిందే. అయినప్పటికీ పాక్ సైన్యం కవి్వంపు చర్యలకు పాల్పడింది. శనివారం రాత్రి సరిహద్దుల్లో కాల్పులు జరపగా, భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. ఈ పరిణామాలపై ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది సమీక్ష జరిపారు. మరోసారి పాక్ సైన్యం కాల్పులకు గట్టిగా ప్రతిస్పందించాలని ఆదేశించారు. ఈ విషయంలో ఆర్మీ కమాండర్లకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ఆయన తేల్చిచెప్పారు.

అవును.. మా యుద్ద విమానం ధ్వంసమైంది: పాక్ అధికారిక ప్రకటన
ఇస్లామాబాద్: భారత్, పాకిస్తాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగిన విషయం తెలిసిందే. భారత ముప్పెట దాడి చేస్తూ పాకిస్తాన్‌కు చుక్కలు చూపించింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ యుద్ధ విమానంపై అటాక్ చేయడంతో అది ధ్వంసమైంది. ఈ విషయాన్ని స్వయంగా పాకిస్తాన్ ఆర్మీకి చెందిన సీనియర్ అధికారి ఎట్టకేలకు అంగీకరించారు. ఈ మేరకు తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించారు.పాకిస్తాన్ సైన్యం, వైమానిక దళం, నావికాదళ సీనియర్ అధికారులు ఆదివారం అర్ధరాత్రి సంయుక్త విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి మాట్లాడుతూ.. ఇటీవల భారత్ జరిపిన దాడిలో పాకిస్తాన్ యుద్ధ విమానం ధ్వంసమైందని అధికారికంగా ప్రకటించారు. భారత్ దాడులను ఎదుర్కొనే క్రమంలో ఇలా జరిగిందన్నారు. అయితే నష్టం ఏ స్థాయిలో ఉందనే విషయంపై పూర్తి వివరాలు వెల్లడించలేదు. అయితే, భారత్-పాకిస్తాన్ మధ్య శనివారం కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఈ ప్రకటన చేయడం గమనార్హం.ఇదే సమయంలో భారత పైలట్.. పాకిస్తాన్ సైన్యానికి పట్టుబడ్డారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై చౌదరి స్పందించారు. ఇది ఫేక్ వార్త అని ఖండించారు. భారత్ పైలట్ ఎవరూ తమ ఆధీనంలో లేరని స్పష్టం చేశారు. అలాగే, భారత్ దాడులను తాము సమర్థవంతంగా ఎదుర్కొంటున్నట్టు చెప్పుకొచ్చారు. పాక్‌ను దెబ్బకొట్టాం..మరోవైపు.. ఆపరేషన్ సిందూర్‌లో భారత్ సాధించిన విజయాలను మన సైన్యం ఆదివారం వెల్లడించిన విషయం తెలిసిందే. పాక్ విమానాలను నేల కూల్చామని ఎయిర్ మార్షల్ ఎ.కె.భారతి తెలిపారు. అయితే, ఆ సంఖ్య ఎంత అన్నది ఆయన చెప్పలేదు. ‘‘మన సరిహద్దు లోపలికి పాక్ యుద్ధవిమానాలను రాకుండా నిరోధించాం. కాబట్టి వాటి శకలాలు మా దగ్గర లేవు. కాకపోతే కచ్చితంగా కొన్ని విమానాలను కూల్చాం’’ అని తెలిపారు.బ్రహ్మోస్ సూపర్ పవర్..ఇదిలా ఉండగా.. భారత్, పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో భారత్ తీసుకున్న ఓ కీలక నిర్ణయం శత్రువు వెన్నువిరిచేలా చేసింది. తన అమ్ముల పొదిలోని బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణులను వ్యూహాత్మకంగా వినియోగించడంతో.. అప్పటి వరకూ అణ్వాయుధాలున్నాయంటూ ప్రగల్బాలు పలికిన దాయాది దేశం వెన్నులో వణుకుపుట్టింది. మొత్తం పరిస్థితే మారిపోయింది. పాకిస్తాన్ అధికారిక రాజధాని ఇస్లామాబాద్ అయినా.. పాలన మొత్తం జరిగేది రావల్పిండి నుంచే. ఇక్కడ చక్లాలాలోని ఆ దేశ ఆర్మీ చీఫ్ కార్యాలయం నుంచే సైన్యానికి ఆదేశాలు వెళుతుంటాయి. శనివారం తెల్లవారుజామున భారత్ లక్ష్యంగా ఎంచుకున్న పాక్‌లోని కీలక ప్రాంతాల్లో రావల్పిండి సమీప నూర్ ఖాన్ వైమానిక స్థావరం అత్యంత ప్రధానమైనది. ఇక్కడ గగనతల రీఫ్యూయలర్ ట్యాంకర్ విమానాలు, భారీ రవాణా విమానాలు ఉన్నాయి. అప్పటికే పాకిస్థాన్ సైన్యం దిల్లీ లక్ష్యంగా ప్రయోగించిన ఫతాహ్-11 బాలిస్టిక్ క్షిపణులను భారత బలగాలు... గగనతల రక్షణ వ్యవస్థ ఎస్-400తో మధ్యలోనే పేల్చివేసింది. శుక్రవారం అర్ధరాత్రి శ్రీనగర్ నుంచి నలియా వరకు 26 లక్ష్యాలపైకి పాక్ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించగా వాటన్నింటినీ భారత రక్షణ దళాలు సమర్థంగా అడ్డుకున్నాయని అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే.

మా బతుకులతో ‘ఆడుకోవద్దు’
భూమితో మాది విడదీయరాని అనుబంధం.. వ్యవసాయం తప్పితే మాకు వేరే వృత్తి తెలియదు.. తక్కువో ఎక్కువో ఉన్నదాంట్లోనే పంటలు పండించుకుంటున్నాం, గుట్టుగా బతుకుతున్నాం.. కన్నతల్లి లాంటి భూమిని మానుంచి లాక్కుని మా జీవితాలతో ఆటలాడొద్దు.. గతంలో భూ సమీకరణకు తీసుకున్న భూములకే ఇప్పటికీ దిక్కూమొక్కు లేదు.. ఇప్పుడు మా నుంచి తీసుకున్న భూమికి ఎప్పుడు న్యాయం చేస్తారు? కళ్లముందు ఉన్న భూమిని పోగొట్టుకుని.. ఎక్కడో ఇచ్చే భూమి మాకెందుకు? – స్పోర్ట్స్ సిటీ భూసమీకరణ గ్రామసభల్లో రైతులుసాక్షి ప్రతినిధి, విజయవాడ: రైతులు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నా, మా భూములు ఎందుకివ్వాలని నిలదీస్తున్నా, తమ జీవితాలతో ఆడుకోవద్దని వేడుకుంటున్నా, స్పోర్ట్స్ సిటీ పేరుతో భూ సమీకరణ ద్వారా భారీఎత్తున భూములను తీసుకునేందుకే ప్రభుత్వం సిద్ధమవుతోంది. అన్నదాతలు ససేమిరా అంటున్నా.. మాయమాటలతో మభ్యపెట్టి ముందుకు అడుగులు వేస్తోంది. ఇందులోభాగంగానే అధికారులు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. వీటిలో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయినా సరే సర్కారు తన ధోరణిని మార్చుకోవడం లేదు.ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు, త్రిలోచనాపురం, కాచవరం, కేతనకొండ, జమీమాచవరంలో స్పోర్ట్స్ సిటీకి అవసరమైన భూములను ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో తీసుకునేందుకు రెవెన్యూ అధికారులు గ్రామ సభలు ఏర్పాటు చేశారు. వాస్తవానికి స్పోర్ట్స్ సిటీకి తొలుత కృష్ణా నది లంక గ్రామాలు, లంక భూములను ప్రభుత్వ పెద్దలు ఎంచుకున్నారు. నెల రోజుల క్రితం కృష్ణా పరీవాహక ప్రాంతమైన చినలంక, పెదలంక, ఇబ్రహీంపట్నం, జూపూడిలో లంక భూములను మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, పలువురు ఎమ్మెల్యేలు పరిశీలించారు. కానీ, ఈ భూములకు కృష్ణా వరద తాకిడి ఉంటుందనే కారణంతో తాజాగా మూలపాడు పరిధిలోని మెరక ప్రాంత భూములపై కన్నేశారు.అయితే, స్పోర్ట్స్ సిటీ, ఐకానిక్ బ్రిడ్జి పేరుతో విలువైన, జీవనాధారమైన భూములను తీసుకునేందుకు ప్రభుత్వం పన్నిన పన్నాగాన్ని రైతులు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. స్పోర్ట్స్ సిటీ పేరుతో వ్యాపారం చేసేందుకే తమ భూములను తీసుకుంటున్నారనే అభిప్రాయం రైతుల్లో నెలకొంది. దీంతో పంట పొలాలను ఇవ్వబోమని విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య ఎదుట తెగేసి చెప్పారు. వారు ఒప్పుకోకున్నా ఏదోరకంగా భూములు స్వా«దీనం చేసుకునే ఎత్తుగడల్లో ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. ఒప్పుకోకున్నా ఒప్పుకొన్నట్లు.. రైతుల అభిప్రాయ సేకరణకు రెవెన్యూ అధికారులు గురు, శుక్రవారాల్లో గ్రామ సభలు నిర్వహించారు. మూలపాడు సభలో కొందరు భూములు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు కూటమి నేతలు ప్రకటించారు. కానీ, వెంటనే 90 శాతం మంది రైతులు ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇవ్వబోమని తహసీల్దార్ వెంకటేశ్వర్లుకు తెగేసి చెప్పారు. అమరావతి రాజధానినే ఇప్పటివరకు అభివృద్ధి చేయలేదని ఇక తమ ప్రాంతాన్ని ఎప్పుడు అభివృద్ధి చేస్తారని సూటిగా ప్రశి్నంచారు. వ్యవసాయమే జీవనాధారంగా బతికే తాము పొలాలను ఎలా ఇస్తామని నిలదీశారు. భూమి మా చేతిలో ఉంటేనే బంగారంజమీమాచవరంలో సభకు హాజరైన రైతులు అందరూ ల్యాండ్ పూలింగ్‌లో భూములిచ్చేది లేదని తేల్చి చెప్పారు. కాచవరం, కేతనకొండ గ్రామ సభల్లో ఆర్డీవో కావూరి చైతన్య పాల్గొన్నారు. కాచవరంలో ఒకరిద్దరు భూస్వాములు మినహా మిగిలిన రైతులు ప్రభుత్వానికి పొలాలు ఇవ్వబోమని ప్రకటించారు. కేతనకొండలో రైతులు నిరసనగా చప్పట్లు కొడుతూ మరీ పొలాలు ఇచ్చేది లేదని వెల్లడించారు. ‘భూమి మా ఆధీనంలో ఉంటే పిల్లల చదువులు, వివాహాలు, కుటుంబ అవసరాలకు వాడుకుంటాం. ప్లాటు ఇవ్వడానికి మరో మూడు నాలుగేళ్లు పడుతుంది. అప్పటివరకు మా అవసరాలు ఎలా తీరతాయి’ అంటూ ఆర్డీవో చైతన్యను రైతులు సూటిగా ప్రశి్నంచారు.2,874 ఎకరాల సేకరణకు ఎత్తుగడ ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం మండలం ఐదు గ్రామాల పరిధిలోని భూములను ల్యాండ్ పూలింగ్‌లో సేకరించేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామ సభల్లో స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి గ్రామాల్లో ఉన్న భూముల వివరాలను వెల్లడించారు. మూలపాడులో 313 ఎకరాలు, కాచవరంలో 590 ఎకరాలు, త్రిలోచనాపురంలో 1,390 ఎకరాలు, జమీమాచవరంలో 301 ఎకరాలు, కేతనకొండలో 280 ఎకరాలు చొప్పున మొత్తం 2,874 ఎకరాలను ల్యాండ్ పూలింగ్‌లో తీసుకోనున్నారు. వీటిలో ఎక్కువగా పట్టా భూములు ఉండగా, ఎన్ఎస్పీ కాలువ, ప్రభుత్వ అసైన్మెంట్, లంక భూములు కొన్ని ఉన్నాయి. చిన్న, సన్నకారు రైతుల పొట్టకొడతారా? చిన్న, సన్నకారు రైతుల భూములను ల్యాండ్ పూలింగ్‌లో తీసుకోవడం దుర్మార్గమైన చర్య. వారి పొట్టకొడతారా? పూలింగ్‌పై ప్రతి గ్రామంలో రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. రెవెన్యూ అధికారుల వద్ద వారి ఆవేదనను వెల్లడించారు. భూములే జీవనాధారం అని కూడా తేల్చిచెప్పారు. మెజార్టీ రైతుల అభిప్రాయం మేరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. –గరికపాటి శ్రీదేవి, జెడ్పీ వైస్ చైర్మన్, మూలపాడు 3 పంటలు పండే భూములు.. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ఇబ్రహీంపట్నంలో ఎకరా రూ.కోటి నుంచి రూ.2 కోట్ల ధర పలుకుతోంది. మా భూముల్లో ఏడాదికి మూడు పంటలు పండుతాయి. వీటిని ప్రభుత్వానికి ఇచ్చేది లేదు. – ఎస్డీ జానీ, పీఏసీఎస్ మాజీ చైర్మన్, కేతనకొండ ఉన్నది 80 సెంట్లు.. అదీ తీసుకుంటారా? 80 సెంట్ల భూమిలో వ్యవసాయం చేస్తున్నా. కొంత భాగం పొలంలో గ్రాసం పెంచి పాడి పరిశ్రమను నిర్వహిస్తున్నా. కుటుంబాన్ని పోషించుకుంటున్నా. నాకు వ్యవసాయం తప్ప మరో పని తెలియదు. ఇప్పుడు ఉన్న పొలం తీసుకుని ప్లాటు ఇస్తామంటే ఎలా? – ఆళ్ల శ్రీనివాసరావు, రైతు, త్రిలోచనాపురం

భారత రక్షణశాఖకు ఇళయరాజా విరాళం
ప్రఖ్యాత సంగీత దర్శకుడు, ఎంపీ ఇళయరాజా భారత రక్షణశాఖకు తన ఒక్క రోజు పారితోషకాన్ని విరాళంగా ప్రకటించారు. దీని గురించి ఆయన తన ఎక్స్ మీడియాలో పేర్కొంటూ పహల్గామ్లో మన దేశ పర్యాటకులపై ఉగ్రమూక దాడిచేసిందని, మన దేశ సైనికులు దీనికి తప్పక ప్రతీకారం తీర్చుకోవాలన్నారు. వారి ధైర్య సాహసాలు అభినందనీయం అని తెలిపారు. మన సైనికులు ఆత్మస్థైర్యంతో వారిని మట్టు పెడతారనే నమ్మకంతో,మన దేశ రక్షణ శాఖకు దేశ పౌరుడిగా, ఎంపీగా తన ఒక్క రోజు పొరితోషికాన్ని విరాళంగా ప్రకటిస్తున్నట్లు ఇళయరాజా పేర్కొన్నారు. కాగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్– పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రం కావడంతో దేశం మొత్తం హై అలెర్ట్ ప్రకటించడం, తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో ఇరుదేశాల సరిహద్దుల్లో శాంతి నెలకొనడం తెలిసిందే.

పాక్‌కు చెక్ పెట్టిన భారత్.. ఉగ్రవాదుల అంత్యక్రియల్లో ఉన్నది వీరే..
ఢిల్లీ: ఉగ్రవాదుల ఏరివేత, ఉగ్ర స్థావరాలపై దాడులే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రస్థావరాలను భారత్ ఆర్మీ ధ్వంసం చేసింది. ఆపరేషన్ సిందూర్‌లో దాదాపు వంద మంది టెర్రరిస్టులు మృతి చెందారు. అయితే, ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాక్ ఆర్మీ ఉన్నతాధికారులు హాజరు కావడం, ఆ దేశ పతాకం కప్పడం చర్చనీయాంశమైంది.వివరాల ప్రకారం.. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా ఆర్మీ దాడిలో మృతి చెందిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాక్ ఆర్మీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు.. పాక్ దేశ పతాకం కప్పడం చర్చనీయాంశమైంది. అయితే, తొలుత తాము అంత్యక్రియల్లో పాల్గొనలేదని పాక్ బుకాయించినా భారత్ ఫొటోలు విడుదల చేసేసరికి కిమ్మనకుండా ఉండిపోయింది.ఇక, తాజాగా ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాల్గొన్న పాక్ అధికారుల పేర్లను భారత్ విదేశాంగశాఖ వెల్లడించడం గమనార్హం. ఇందులో ఉన్నతస్థాయి అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. అంత్యక్రియల్లో పాల్గొన్నది వీరే.. లెఫ్ట్‌నెంట్ జనరల్ ఫయ్యాజ్ హుసేన్ షా, లాహోర్ ఐవీ కార్ప్స్ కమాండర్, మేజర్ జనరల్ రావు ఇమ్రాన్ సర్తాజ్, లాహోర్ 11వ ఇన్ఫ్రాంట్రీ డివిజన్, బ్రిగేడియర్ మహ్మద్ ఫర్ఖాన్ షబ్బీర్, డాక్టర్ ఉస్మాన్ అన్వర్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పంజాబ్ పోలీస్, మాలిక్ సోహైబ్ అహ్మద్ భెర్త్, పంజాబ్ ప్రావిన్స్ అసెంబ్లీ మెంబర్ ఉన్నారు. Video showing Pakistani Army officials attending the funerals of slain Lashkar-e-Taiba (LeT) terrorists yesterday. The man leading the Janaza is Hafiz Abdul Rauf - a US designated terrorist.Once again blurring the lines between state and terror - the world is watching you 🇵🇰 pic.twitter.com/MjsJXcyDMl— Vinayak Tripathi (@belikevinayak) May 8, 2025

కొత్త ఫండ్లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా?
నా వద్దనున్న పెట్టుబడుల్లో 60% బ్యాంకు ఎఫ్డీలలో ఇన్వెస్ట్ చేశాను. మిగిలిన 40% ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టాను. ఇప్పుడు ఈక్విటీ పెట్టుబడుల విలువ బాగా పెరిగింది. ఇలాంటి సందర్భాల్లో నేను ఏం చేయాలి? – మనోజ్ సిన్హామీరు ఈక్విటీకి 60 శాతం, డెట్‌కు 40 శాతం కేటాయింపులతో అస్సెట్ అలోకేషన్ విధానాన్ని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు మీ మొత్తం పెట్టుబడుల్లో ఈక్విటీ వాటా 80%కి చేరి డెట్ పెట్టుబడులు 20%గా ఉన్నాయని అనుకుంటే.. పోర్ట్‌ఫోలియో పరంగా రిస్క్ పెరిగినట్టు అవుతుంది. ఎందుకంటే ఎక్కువ పెట్టుబడులు ఈక్విటీల్లో ఉండడంతో మార్కెట్ల ఆటుపోట్ల ప్రభావం పెట్టుబడుల విలువపై అధికంగా పడుతుంది. దీంతో మానసిక ప్రశాంతత కోల్పోవచ్చు.రిస్క్ ఎక్కువగా తీసుకోకూడదన్నది మీ అభిప్రాయం అయితే.. ఈక్విటీ పెట్టుబడులను తిరిగి 60%కి తగ్గించుకుని, డెట్ పెట్టుబడులను 40%కి పెంచుకోవాలి. దీన్నే అస్సెట్ రీఅలోకేషన్తో లేదా అస్సెట్ రీబ్యాలన్స్గా చెప్పుకోవచ్చు. అస్సెట్ రీబ్యాలన్సింగ్తో ఉన్న మరో ప్రయోజనం.. అధిక స్థాయిల్లో విక్రయించి, తక్కువలో కొనుగోలు చేయడం సాధ్యపడుతుంది. అంటే విలువ గణనీయంగా పెరిగిన చోట విక్రయించి.. అదే సమయంలో పెద్దగా పెరగని చోట కొనుగోలు చేస్తాం.ఉదాహరణకు పెట్టుబడుల్లో ఈక్విటీల వాటా పెరిగితే.. ఈక్విటీలు బాగా ర్యాలీ చేశాయని అర్థం. దాంతో అస్సెట్ రీబ్యాలన్స్లో భాగంగా అధిక వ్యాల్యూషన్ల వద్ద పెట్టుబడులు కొంత వెనక్కి తీసుకుని డెట్‌కు మళ్లిస్తాం. తరచూ కాకుండా.. ఏడాదికి ఒకసారి పెట్టుబడులను సమీక్షించుకుని అస్సెట్ రీబ్యాలన్స్ చేసుకోవచ్చు. లేదా ఏదైనా ఒక సాధనంలో (ఈక్విటీ లేదా డెట్) పెట్టుబడుల విలువ మీరు నిర్ణయించుకున్న పరిమితికి మించి 5 శాతానికి పైగా పెరిగిపోయిన సందర్భాల్లోనూ రీబ్యాలన్స్ చేసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో) ప్రకటనలు తరచూ కనిపిస్తున్నాయి. వీటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచి నిర్ణయమేనా? లేక ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఫండ్స్‌లో మంచి ట్రాక్ రికార్డు ఉన్నవి ఎంపిక చేసుకోవాలా? – జైరూప్కొత్త పథకాల పట్ల, మరీ ముఖ్యంగా పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టినప్పుడు ఆసక్తి ఏర్పడడం సహజమే. పెట్టుబడుల ప్రపంచంలో కొత్త అంటే అది మెరుగైనదని కాదు. చాలా వరకు ఎన్‌ఎఫ్‌వోలు ఇన్వెస్టర్ల కోసం కొత్తగా తీసుకొచ్చేదేమీ ఉండదు. ఇప్పటికే గొప్పగా నిర్వహిస్తున్న మ్యూచువల్ ఫండ్స్ వ్యూహాలను పోలినవే ఎక్కువ సందర్భాల్లో ఎన్ఎఫ్వోలుగా వస్తుంటాయి. ఇప్పటికే ఉన్న పథకాల మాదిరి కాకుండా.. ఎన్‌ఎఫ్‌వోలకు గత పనితీరు చరిత్ర ఉండదు.సదరు ఎన్ఎఫ్వో ఫండ్ మేనేజర్ మార్కెట్ సైకిల్స్, రిస్క్‌ను సమర్థవంతంగా ఎలా ఎదుర్కొంటారన్నది తెలియదు. కొత్త ఫండ్ అని ఎంపిక చేసుకోవడం అంటే.. మంచి ట్రాక్ రికార్డు ఉన్న క్రికెటర్లను కాదని, అప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని క్రికెటర్‌ను జట్టులోకి తీసుకోవడం వంటిదే. కొత్త ఆస్సెట్ క్లాస్ లేదా పెట్టుబడుల విధానాన్ని ఆఫర్ చేయకుండా, అప్పటికే ఉన్న పథకాల పెట్టుబడుల వ్యూహాలకు నకలుగా వచ్చే ఫండ్‌ను ఎంపిక చేసుకోవడానికి ఎలాంటి కారణం కనిపించడం లేదు.సమాధానాలు: ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్

‘ఆసరా’కు ఎసరు.. బాలింతలకు కొసరు
సాక్షి, అమరావతి: ‘ఆడబిడ్డ నిధి’ కింద 18 ఏళ్లు పైబడిన మహిళలకు ఏటా రూ.18 వేలు ఇస్తాం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం.. బడికెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15 వేలు చొప్పున తల్లికి వందనం అందిస్తాం’.. అంటూ ఎన్నికలకు ముందు ఎన్నో సాధ్యంకాని హామీలను ఎడాపెడా ఇచ్చేసిన చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చాక వాటిలో ఒక్కటీ అమలుచేయకుండా మహిళలను దగా చేస్తున్నారు. తానిచ్చిన హామీలను అటకెక్కించడమే కాకుండా వైఎస్ జగన్ ప్రభుత్వంలో అమలుచేసిన సంక్షేమ పథకాలను సైతం నిర్దాక్షిణ్యంగా ఆపేశారు. ఆరోగ్యశ్రీ కింద బాలింతలకు అందే రూ.ఐదు వేల ఆసరా సాయానికీ మంగళం పాడేశారు. వైఎస్ జగన్ పాలనలో ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రసవానంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన 24 గంటల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) విధానంలో బాలింతకు ఆసరా సాయాన్ని ఇచ్చేవారు. కానీ, గతేడాది టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చీ రాగానే ఈ సాయాన్ని పూర్తిగా అటకెక్కించింది. ఇలా ఆరోగ్యశ్రీ ఆసరాకు గండికొట్టి ఏకంగా రూ.5 వేలు చొప్పున బాలింతలకు నష్టం చేకూరుస్తూ.. కేవలం రూ.వందలు విలువచేసే సబ్బు, పౌడర్ డబ్బాలతో కూడిన బేబీ కిట్ ఇస్తామంటూ ప్రకటించింది.ఐదేళ్లలో 15 లక్షల మందికి అన్యాయం..రాష్ట్రంలో ఏటా ఆరోగ్యశ్రీ పథకం కింద మూడు లక్షలకు పైగా ప్రసవాలు నమోదవుతుంటాయి. ఆరోగ్య ఆసరా పథకం కింద ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన వెంటనే వీరందరికీ గత ప్రభుత్వంలో రూ.5 వేలు చొప్పున బ్యాంకులో జమచేసేవారు. ఈ సాయాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిలిపేయడంతో ఏటా మూడు లక్షల చొప్పున లెక్కేసినా 2024–29 మధ్య ఐదేళ్లలో 15 లక్షల మంది మహిళలకు సాయం నిలిచిపోతుంది. అలాగే, ఒక్కొక్కరికి రూ.5 వేలు చొప్పున ఐదేళ్లలో కనిష్టంగా రూ.750 కోట్లను పేద, మధ్యతరగతి బాలింతలు నష్టపోతున్నారు. ఇక టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తోంది. మొదటి ఏడాదిలో రూ.5 వేలు చొప్పున ఇప్పటికే బాలింతలకు దాదాపు రూ.150 కోట్ల మేర కోల్పోయారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండి ఉంటే సక్రమంగా తమకు ఆసరా సాయం అంది ఉండేదని వీరు చెబుతున్నారు. ఇలా పెద్ద మొత్తంలో పేదింటి మహిళలకు నష్టం చేకూర్చి కేవలం రూ.వందలు విలువచేసే కిట్లు పంపిణీకి ప్రభుత్వం ప్రయత్నిస్తుండడంపై వారు దుమ్మెత్తి పోస్తున్నారు.కిట్ల కొనుగోలులోనూ లూటీ తంతు?ఇక ఆస్పత్రులకు మందుల సరఫరా.. అత్యవసర వైద్యసేవల కల్పన.. రోగనిర్ధారణ.. ఇలా వివిధ రకాల కాంట్రాక్టులను ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు అవినీతిమయంగా మార్చేశారు. అయినవాళ్లు, పెద్ద మొత్తంలో కమీషన్లు ఇచ్చే సంస్థలకే కాంట్రాక్టు కట్టబెట్టడం ద్వారా పెద్ద మొత్తంలో ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. ఇదే తంతు బేబీ కిట్ల కొనుగోలులోనూ చోటుచేసుకునే అవకాశాలున్నాయి. ఇప్పటికే బేబీ కిట్లు సరఫరా చేసే ఒకరిద్దరు కాంట్రాక్టర్లు ఓ అమాత్యుడిని కలిసినట్లు తెలిసింది. ఆ అమాత్యుడి సిఫార్సుతో వీరు వైద్యశాఖను సంప్రదించినట్లు సమాచారం.

16 లేదా 17 నుంచి ఐపీఎల్!
న్యూఢిల్లీ: ప్రతీ వేసవిలో మెరుపు క్రికెట్ వినోదాన్ని పంచే ఐపీఎల్‌కు ఈసారి ఉద్రిక్త పరిస్థితుల సెగ తగిలింది. భారత్, పాక్‌ల మధ్య డ్రోన్ల యుద్ధంతో లీగ్‌ను వారంపాటు వాయిదా వేశారు. ఇపుడు తాజా కాల్పుల విరమణ నేపథ్యంలో పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్న బీసీసీఐ ఐపీఎల్ పునఃప్రారంభానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ వారాంతంలోనే ఆటను తిరిగి ప్రారంభించాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ నెల 16 లేదంటే 17 నుంచి ఐపీఎల్ మళ్లీ మొదలవనుంది. ఫైనల్ వేదికను కోల్‌కతా నుంచి అహ్మదాబాద్‌కు మార్చే యోచనలో బీసీసీఐ ఉంది. ఈ మార్పునకు వర్ష సూచనే కారణమని తెలిసింది. ఆటగాళ్ల సంసిద్ధత, విదేశీ ఆటగాళ్లను వెంటనే రప్పించే ఏర్పాట్లను వెంటనే పూర్తిచేయాలని రేపటికల్లా ఫ్రాంచైజీలన్నీ రెడీగా ఉండాలని బీసీసీఐ సూచించింది. అన్నీ డబుల్ హెడర్‌లేనా? ఈ నెలాఖరుకల్లా ఐపీఎల్‌ను పూర్తిచేయాలని పట్టుదలతో ఉన్న లీగ్ పాలకమండలి మిగతా లీగ్ మ్యాచ్‌ల్ని డబుల్ హెడర్ (రోజూ రెండు మ్యాచ్‌ల చొప్పున)లుగా నిర్వహించే ప్రణాళికతో ఉంది. హైదరాబాద్‌లోనే ఆ రెండు ప్లే ఆఫ్స్ హైదరాబాద్ అభిమానులకు ఎలాంటి నిరాశలేకుండా ముందనుకున్న షెడ్యూల్ ప్రకారమే రెండు ‘ప్లేఆఫ్స్’ మ్యాచ్‌లు ఉప్పల్ స్టేడియంలోనే జరుగుతాయని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి. తేదీలు మారినా... తొలి క్వాలిఫయర్, ఎలిమినేటర్ మ్యాచ్‌లు హైదరాబాద్‌లోనే నిర్వహిస్తారు. అయితే రెండో క్వాలిఫయర్ సహా ఫైనల్ పోరుకు వేదికైన కోల్‌కతాలోనే వాతావరణ సమస్యలు ఎదురవుతాయని తెలిసింది. ఈ నేపథ్యంలో విజేతను తేల్చే మ్యాచ్‌కు వర్షం అడ్డులేకుండా ఉండేలా అహ్మదాబాద్‌ను ఫైనల్ వేదికగా ఖరారు చేసే అవకాశముంది. మొత్తానికి సోమవారం షెడ్యూల్‌పై కసరత్తు పూర్తి చేస్తారని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి.

నేడు సాగర్.. రేపు చార్మినార్..
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ సుందరి పోటీల సందర్భంగా తలపెట్టిన కార్యక్రమాలను ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే నిర్వహించనున్నారు. భారత్–పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం, పోటీదారుల భద్రత నేపథ్యంలో కొన్ని కార్యక్రమాల నిర్వహణపై నిర్వాహకులు తొలుత సందిగ్ధంలో పడ్డారు. ముఖ్యంగా చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్, అనంతరం పాత నగరంలోని చౌమొహల్లా ప్యాలెస్‌లో స్వాగత విందు కార్యక్రమాలు రద్దు చేసే అంశాన్ని పరిశీలించారు. కానీ ఇప్పుడు వాటిని యధావిధిగా నిర్వహించాలని నిర్ణయించారు. సరిహద్దులో ఉద్రిక్తతలు కొంత తగ్గిన నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఈ కార్యక్రమాలను యధావిధిగా నిర్వహించనున్నారు. స్వాగత విందులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు సినీ, క్రీడారంగ ప్రముఖులు పాల్గొనే అవకాశం ఉంది. ఇక సోమవారం సాయంత్రం పోటీదారులు, విదేశీ ప్రతినిధులు నాగార్జున సాగర్ సమీపంలోని బుద్ధవనం పర్యటనకు వెళ్లనున్నారు. బుద్ధ జయంతి సందర్భంగా అక్కడ జరిగే కార్యక్రమాన్ని వారు ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. అక్కడే రాత్రి విందు అనంతరం హైదరాబాద్‌కు బయలుదేరతారు. చార్మినార్ నుంచి లాడ్‌బజార్ వరకు నడక మంగళవారం సాయంత్రం పోటీదారులు చార్మినార్ నుంచి లాడ్‌బజార్ వరకు నడుస్తూ పరిసరాలను వీక్షిస్తారు. షాపింగ్ చేస్తారు. చార్మినార్ చరిత్రను తెలుసుకుంటారు. అనంతరం చౌమొహల్లా ప్యాలెస్‌లో జరిగే స్వాగత విందులో పాల్గొంటారు. ఈ సందర్భంగా సంప్రదాయ వాద్యకచేరీ కొనసాగుతుంది. విందులో ఇంటర్ కాంటినెంటల్, తెలంగాణ వంటకాలు విందులో తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ ధమ్ కీ బిర్యానీ, ఖుర్బానీ కా మీఠా, బగారా బైంగన్, పత్తర్ కీ ఘోష్, పనీర్ టిక్కా, పులావ్, దహీ వడ, పానీపురి, బాదుషా, గులాబ్ జామూన్ లాంటి వంటకాలు రుచి చూపించనున్నారు. ధమ్ కీ బిర్యానీ ఎక్కువ మసాలా ఘాటు లేకుండా తయారు చేయాలని ఆదేశించారు. ఇక యూరప్, ఆఫ్రికా, ఆమెరికా, కరేబియన్, ఆసియా ఓషియానా ప్రాంతాల సుందరీమణులు సైతం ఉన్నందున వారి స్థానిక వంటకాలను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. పోటీల్లో పొల్గొనే సుందరీమణుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నగరంలోని నాలుగు ఫైవ్ స్టార్ హోటళ్లనుంచి మెనూ తెప్పించి పరిశీలించి, ఒక హోటల్‌కు ఆర్డర్ ఇచ్చారు. ఆసియా వంటకాలలో సుషీ (జపాన్), డిమ్సమ్ (చైనా), థాయ్ గ్రీన్ కర్రీ (థాయ్‌లాండ్) వంటివి, యూరోపియన్ వంటకాలైన ఇటాలియన్ పాస్తా, ఫ్రెంచ్ రాటటౌలీ, స్పానిష్ పాయెల్లా, అమెరికా ఖండానికి సంబంధించిన మెక్సికన్ టాకోస్, బ్రెజిలియన్ ఫెయిజోడా, అమెరికన్ బార్బెక్యూ రిబ్స్ లాంటివి, ఆఫ్రికాకు చెందిన ఇథియోపియన్ డోరో వాట్, మొరాకన్ టాగిన్, హమ్ముస్‌తో పాటు మెడిటరేనియన్ ఫలాఫెల్, క్వినోవా సలాడ్ లాంటి వాటిని వడ్డించే వీలుందని సమాచారం. మెనూను మిస్ వరల్డ్ లిమిటెడ్ ప్రతినిధులకు చూపి వారు అనుమతించినవే సిద్ధం చేస్తారని తెలుస్తోంది. మే 26న హైటెక్స్‌లో జరిగే గలా డిన్నర్ సందర్భంగా తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ కూడా ఉంటుందని చెబుతున్నారు.

ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. ఊహలు నిజమవుతాయి
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: పౌర్ణమి రా.9.03 వరకు, తదుపరి బహుళ పాడ్యమి, నక్షత్రం: విశాఖ పూర్తి (24 గంటలు), వర్జ్యం: ప.11.40 నుండి 1.26 వరకు, దుర్ముహూర్తం: ప.12.21 నుండి 1.13 వరకు, తదుపరి ప.2.56 నుండి 3.48 వరకు అమృతఘడియలు: రా.10.16 నుండి 12.03 వరకు, మహ వైశాఖి, బుద్ధపూర్ణిమ; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 5.33, సూర్యాస్తమయం: 6.18. మేషం...... సన్నిహితులు, మిత్రుల సాయం పొందుతారు. ఆస్తి విషయాలలో చికాకులు తొలగుతాయి. వాహన, కుటుంబసౌఖ్యం. వ్యాపారులకు అనుకూలం. ఉద్యోగులకు సమస్యల నుంచి విముక్తి.వృషభం... సన్నిహితులతో సఖ్యత. ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. వాహనాలు, భూములు కొంటారు. ఆలయ దర్శనాలు. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు. ఉద్యోగులకు బాధ్యతలు తగ్గుతాయి.మిథునం.... ఆకస్మిక ప్రయాణాలు. సోదరులు, మిత్రులతో వివాదాలు. పనుల్లో ఆటంకాలు. అనారోగ్యం. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు కొద్దిపాటి చికాకులు.కర్కాటకం... ప్రయాణాల్లో మార్పులు. అనుకోని ధన వ్యయం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. బంధువులతో స్వల్ప వివాదాలు. అనారోగ్యం. వ్యాపారులకు నిరాశ. ఉద్యోగులకు చిక్కులు.సింహం... ఉద్యోగయత్నాలలో విజయం. పరిచయాలు పెరుగుతాయి. అనుకున్నది సాధిస్తారు. దైవచింతన. ధనలాభం. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ఒత్తిళ్లు తొలగుతాయి.కన్య... బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆలయాల దర్శనాలు. వ్యాపారులకు చిక్కులు. ఉద్యోగులకు ఒత్తిళ్లు.తుల..... చిన్ననాటి మిత్రులతో సఖ్యత. ఆస్తి విషయాలలో అగ్రిమెంట్లు. ధన,వస్తులాభాలు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ఉన్నతస్థితి. వాహనయోగం.వృశ్చికం..... ఆరోగ్య, కుటుంబసమస్యలు. వ్యాపారులకు నిరుత్సాహం. చేపట్టిన పనులు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారులు నిదానంగా వ్యవహరించాలి. ఉద్యోగులకు సామాన్యస్థితి.ధనుస్సు... ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. విలువైన వస్తువులు కొంటారు. ఉద్యోగయత్నాలలో కదలికలు. వ్యాపారులు ముందడుగు. ఉద్యోగులకు అనుకూల మార్పులు. దైవచింతన.మకరం... ఆకస్మిక ధనలాభం. ఊహలు నిజమవుతాయి. మిత్రుల నుంచి శుభవర్తమానాలు. భూ వివాదాలు తీరతాయి. వ్యాపారులు ఉత్సాహంతో సాగుతారు. ఉద్యోగులకు మంచి గుర్తింపు.కుంభం.... కొత్తగా రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారులకు గందరగోళం. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి.మీనం... బంధువులు విమర్శలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. దూరప్రయాణాలు. వ్యాపారులకు లాభాలు స్వల్పమే. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు.
భారత్‌లో ఐఫోన్ల తయారీ రెట్టింపు..?
వై.వి.ఎస్. చౌదరి- తారక రామారావు సినిమా ప్రారంభం
జీతాలు.. పన్ను భారం.. జాగ్రత్తగా లెక్కించాలి
పాక్‌కు చెక్ పెట్టిన భారత్.. ఉగ్రవాదుల అంత్యక్రియల్లో ఉన్నది వీరే..
తలవంచని అమ్మతనం
కొత్త ఫండ్లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా?
అవును.. మా యుద్ద విమానం ధ్వంసమైంది: పాక్ అధికారిక ప్రకటన
Murali Nayak: మళ్లీ ఎప్పుడొస్తావ్ చిన్నోడా..?
వేల్యూ ఇన్వెస్టింగ్‌కి పెరుగుతున్న ప్రాధాన్యత
భారత రక్షణశాఖకు ఇళయరాజా విరాళం
సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త తెలుగు సినిమా
రీరిలీజ్‌లో ‘జగదేక వీరుడు..’ వసూళ్ల సునామీ.. ఎంతంటే?
Virat Kohli: ‘కెప్టెన్సీ అడిగాడు.. బీసీసీఐ కుదరదు అంది.. అందుకే’!
మృణాల్ ఠాకూర్‌తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన సుమంత్
కెనరా బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త
సార్! మన సైన్యం అంతా బార్డర్ నుంచి వచ్చి టెర్రరిస్టుల అంత్యక్రియల్లో బిజీగా ఉన్నారు! నేనూ వచ్చేదా!!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
పాకిస్తాన్‌కు మా మద్దతు కొనసాగుతుంది
IPL 2025: మిగిలిన మ్యాచ్‌లు మేము నిర్వహిస్తాం: బీసీసీఐకి ఆఫర్!
ఈ రాశి వారికి పాతబాకీలు వసూలవుతాయి.. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు.
విరాట్ కోహ్లి సంచలన నిర్ణయం!.. బీసీసీఐకి చెప్పేశాడు!
16 ఏళ్ల యువకుడితో.. నా భార్య వెళ్ళిపోయింది సార్.!
భారత్ పై మళ్లీ కాల్పులకు తెగబడ్డ పాక్
భార్యకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన డాక్టర్ బాబు
భారత సైన్యంపై విమర్శలు.. మహిళా ప్రొఫెసర్ సస్పెండ్
పాన్ ఇండియా హీరో..పబ్లిక్ లైఫ్‌లో జీరో...
ఆల్రెడీ పాలన స్టార్ట్ అయినప్పటి నుంచి హామీలు అమలు చేయకుండా చాలా ‘స్మార్ట్’గానే వ్యవహరిస్తున్నాం కదా సార్!
పాక్‌పై బలూచ్ లిబరేషన్ ఆర్మీ కీలక ప్రకటన
నేను పీకే తాలుకా.. తలచుకుంటే లేపేస్తా...!
ప్రధాని మోదీకి జేడీ వాన్స్ ఫోన్
భారత్‌లో ఐఫోన్ల తయారీ రెట్టింపు..?
వై.వి.ఎస్. చౌదరి- తారక రామారావు సినిమా ప్రారంభం
జీతాలు.. పన్ను భారం.. జాగ్రత్తగా లెక్కించాలి
పాక్‌కు చెక్ పెట్టిన భారత్.. ఉగ్రవాదుల అంత్యక్రియల్లో ఉన్నది వీరే..
తలవంచని అమ్మతనం
కొత్త ఫండ్లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా?
అవును.. మా యుద్ద విమానం ధ్వంసమైంది: పాక్ అధికారిక ప్రకటన
Murali Nayak: మళ్లీ ఎప్పుడొస్తావ్ చిన్నోడా..?
వేల్యూ ఇన్వెస్టింగ్‌కి పెరుగుతున్న ప్రాధాన్యత
భారత రక్షణశాఖకు ఇళయరాజా విరాళం
సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త తెలుగు సినిమా
రీరిలీజ్‌లో ‘జగదేక వీరుడు..’ వసూళ్ల సునామీ.. ఎంతంటే?
Virat Kohli: ‘కెప్టెన్సీ అడిగాడు.. బీసీసీఐ కుదరదు అంది.. అందుకే’!
మృణాల్ ఠాకూర్‌తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన సుమంత్
కెనరా బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త
సార్! మన సైన్యం అంతా బార్డర్ నుంచి వచ్చి టెర్రరిస్టుల అంత్యక్రియల్లో బిజీగా ఉన్నారు! నేనూ వచ్చేదా!!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
పాకిస్తాన్‌కు మా మద్దతు కొనసాగుతుంది
IPL 2025: మిగిలిన మ్యాచ్‌లు మేము నిర్వహిస్తాం: బీసీసీఐకి ఆఫర్!
ఈ రాశి వారికి పాతబాకీలు వసూలవుతాయి.. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు.
విరాట్ కోహ్లి సంచలన నిర్ణయం!.. బీసీసీఐకి చెప్పేశాడు!
16 ఏళ్ల యువకుడితో.. నా భార్య వెళ్ళిపోయింది సార్.!
భారత్ పై మళ్లీ కాల్పులకు తెగబడ్డ పాక్
భార్యకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన డాక్టర్ బాబు
భారత సైన్యంపై విమర్శలు.. మహిళా ప్రొఫెసర్ సస్పెండ్
పాన్ ఇండియా హీరో..పబ్లిక్ లైఫ్‌లో జీరో...
ఆల్రెడీ పాలన స్టార్ట్ అయినప్పటి నుంచి హామీలు అమలు చేయకుండా చాలా ‘స్మార్ట్’గానే వ్యవహరిస్తున్నాం కదా సార్!
పాక్‌పై బలూచ్ లిబరేషన్ ఆర్మీ కీలక ప్రకటన
నేను పీకే తాలుకా.. తలచుకుంటే లేపేస్తా...!
ప్రధాని మోదీకి జేడీ వాన్స్ ఫోన్
సినిమా

సిందూరం ఎక్కడ అని ప్రపంచం అడుగుతోంది
కశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి ఘటన యావత్ భారతదేశాన్ని కలచివేసింది. ఈ ఘటనకు ప్రతీకారంగా పాకిస్తాన్‌పై భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పహల్గాం ఘటన, ఆపరేషన్ సిందూర్‌లపై ఇప్పటికే పలువురు ప్రముఖ నటీనటులు స్పందించారు. తాజాగా ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘‘భార్యతో కలిసి వేసవి సెలవుల కోసం పహల్గాం వెళ్లిన భర్తను ఉగ్రమూక కాల్చి చంపింది.తన భర్తను చంపవద్దని ఆ భార్య ఎంతగానో ఏడుస్తూ, ప్రాధేయపడినా ఆ ఉగ్ర ఉన్మాది వినలేదు. ఆమె కళ్ల ముందే భర్తను అతి కిరాతకంగా కాల్చి చంపాడు. ఆమెను విధవరాలని చేశాడు. భర్త మరణాన్ని తట్టుకోలేని ఆ భార్య... తనను కూడా చంపేయమని అడిగినా... ‘నిన్ను చంపను... వెళ్లి చెప్పుకో..’ అని ఆ రాక్షసుడు అన్నాడు. నా కుమార్తెలాంటి ఆమె మానసిక స్థితి చూస్తుంటే .. ‘ఆమె వద్ద చితాభస్మం ఉన్నా... సిందూరం ఎక్కడ అని ప్రపంచం అడుగుతోంది’ అని మా నాన్న (హరివంశ్ రాయ్ బచ్చన్) రాసిన ఓ పద్యంలోని వాక్యం నాకు గుర్తొచ్చింది. అందుకే నేను నీకు సిందూరం ఇస్తున్నా... అపరేషన్ సిందూర్... జై హింద్... భారత సైన్యమా... ఎప్పటికీ ఆగకు... వెనకడుగు వేయకు’’ అంటూ భావోద్వేగమైన ΄పోస్ట్‌ను షేర్ చేశారు అమితాబ్ బచ్చన్.

టాలీవుడ్ ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్టైనర్.. సెన్సార్ పూర్తి
రుత్విక్, ఇక్రా ఇద్రిసి హీరో హీరోయిన్లుగా పరిచయమవుతోన్న చిత్రం వైభవం. ఈ ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ సినిమాకు సాత్విక్ దర్శకత్వం వహిస్తున్నారు. నూతన నిర్మాణ సంస్థ రమాదేవి ప్రొడక్షన్స్ బ్యానర్లో ఈ సినిమాను రూపొందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది.తాజాగా ఈ మూవీ సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఈ ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్టైనర్కు క్లీన్ యూ సర్టిఫికేట్ లభించింది. ఇదివరకే విడుదలైన రెండు పాటలకీ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న వైభవం మూవీ ఈనెల 23న థియేటర్లలో సందడి చేయనుంది.

హార్ట్ బీట్ పెంచే వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
కోలీవుడ్ వెబ్ ప్రపంచంలో హార్ట్‌బీట్ సిరీస్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆస్పత్రి నేపథ్యంలో సాగే ఈ వెబ్ సిరీస్‌లో కుటుంబ అంశాలు, ప్రేమ, ఒక తల్లి ప్రేమ కోసం యువతి పడే ఆరాటం కనిపిస్తుంది. సెంటిమెంట్, పదవి కోసం పోరాటం అంటూ పలు ఆసక్తికరమైన అంశాలతో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అయినా హార్ట్‌బీట్ వెబ్ సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.ఈ వెబ్ సిరీస్ సూపర్ హిట్ కావడంతో దీనికి కొనసాగింపుగా సీజన్–2 రూపొందించారు మేకర్స్. ఈ సిరీస్‌కు దీపక్ సుందర రాజన్ దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. రెజిమల్ సూర్య థామస్ ఛాయాగ్రహణం, చరణ్ రాఘవన్ సంగీతాన్ని అందించారు. ఏ టెలీ ఫ్యాక్టరీ ప్రొడక్షన్స్ పతాకంపై రాజవేలు నిర్మించిన ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు.ఈనెల 22 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించారు. తెలుగు, తమిళం, హిందీలో భాషల్లో అందుబాటులో ఉండనుందని ప్రకటించాకరు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ పాటను విడుదల చేశారు. కాగా.. ఈ సిరీస్‌లో దీపా బాలు, అనుమోన్, యోగలక్ష్మీ, శర్వ, శబరీశ్, చారుకేశ్, రామ్, చంద్రశేఖర్, గిరి ద్వారకేశ్, రేయ ముఖ్య పాత్రలు పోషించారు. వీరితోపాటు అక్షిత, శివం, అబ్దుల్, అమైయ, టీఎం కార్తీక్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. The wait ends with a beat.. Save the date May 22 ❤️❤️🩺#HotstarSpecials Heart Beat Season 2 Streaming from May 22 only on JioHotstar#HotstarSpecials #HeartBeatSeason2 #HeartBeatS2 #HB2 #HB2ComingSoon #LubDubOnHotstar #HeartBeatS2OnHotstar #HeartBeatS2onJioHotstar… pic.twitter.com/cLIci1QpOb— JioHotstar Tamil (@JioHotstartam) May 10, 2025

ఆ సినిమా వల్లే బాలీవుడ్లో ఆఫర్ వచ్చింది: శ్రీ విష్ణు
టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు సింగిల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ నెల 9 నుంచి సింగిల్ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా తొలిరోజే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. మొత్తం రెండురోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద రూ. 11.2 కోట్లు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. శ్రీవిష్ణు కెరీర్లో మరో భారీ హిట్‌గా సింగిల్ మూవీ నిలిచింది.సింగిల్ రిలీజ్ నేపథ్యంలో శ్రీ విష్ణు వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రతి సినిమాతో ఏదో ఒక అనుభవాన్ని ఇచ్చిందని అన్నారు. ప్రారంభంలో చిరంజీవి, వెంకటేశ్ లాంటి పెద్ద హీరోలు ఫోన్ చేసి చెప్పినప్పుడు చాలా ఎనర్జీ ఇచ్చేదన్నారు. బ్రోచెవారేవరురా లాంటి సినిమాకు చాలా ప్రశంసలు వచ్చాయి.. ఆ సమయంలో గొప్ప ఫీలింగ్ కలిగిందని తెలిపారు. బన్నీ, రవితేజ నా ప్రతి సినిమాకు సపోర్ట్ చేస్తుంటారని వెల్లడించారు.ఇక స్వాగ్ సినిమా విషయానికొస్తే.. తమిళం నుంచి చాలా ఫోన్ కాల్స్ వచ్చాయని తెలిపారు. అలాగే మొదటిసారి స్వాగ్ మూవీ తర్వాత బాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చిందని శ్రీ విష్ణు వెల్లడించారు. కాగా.. సింగిల్ మూవీలో కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ చిత్రంగా దర్శకుడు కార్తీక్ రాజు ఈ మూవీని తెరకెక్కించారు. అల్లు అరవింద్ సమర్పణలో విద్య కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి సంయుక్తంగా నిర్మించారు.
న్యూస్ పాడ్‌కాస్ట్

పాకిస్తాన్ తూటాలకు క్షిపణులతో బదులివ్వండి... ప్రతి దుశ్చర్యకూ మర్చిపోలేని రీతిలో గుణపాఠం చెప్పాల్సిందే...

కాల్పుల విరమణకు అంగీకారం.. కొద్దిసేపట్లోనే మళ్లీ కాల్పులు... పాకిస్తాన్ దుర్మార్గ వైఖరిపై భారత్ ఆగ్రహం

రెండో రోజు కూడా రెచ్చిపోయిన పాకిస్తాన్... 20 నగరాలు సహా 26 ప్రాంతాలపై గురి... పాక్ దాడులను దీటుగా తిప్పికొట్టిన భారత సైన్యం

భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం ప్రారంభం... సరిహద్దుల్లో దాడులతో కవ్వించిన పాక్ సైన్యం.. దీటుగా తిప్పికొడుతున్న భారత సేనలు... మూడు పాక్ ఫైటర్ జెట్ల కూల్చివేత, ఇద్దరు పైలట్ల పట్టివేత

పాకిస్తాన్ ఉగ్రవాద తండాలపై 'రక్త సిందూరం' 100 మందికి పైగా ముష్కరులు హతం..

పాక్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి..

దుష్ట పాకిస్తాన్ భరతం పట్టడానికి ముహూర్తం ఖరారు... ఈ వారాంతంలోపే భారీ ఆపరేషన్ జరిగే అవకాశం... బుధవారం రాష్ట్రాల్లో మాక్‌డ్రిల్స్

యాక్సిస్ ఎనర్జీ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో చంద్రబాబు సర్కారు అడ్డగోలు ఒప్పందం... అత్యధిక ధరకు 400 మెగావాట్ల విద్యుత్ కొనడానికి అంగీకారం

అన్నం పెట్టే రైతన్నలకు సున్నం పెడతారా?... కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు

వణుకుతున్న పాకిస్తాన్. భారత్‌ను నిలువరించాలని అరబ్ దేశాలను వేడుకుంటున్న పాకిస్తాన్. తమకు ఉగ్రచరిత్ర ఉందని అంగీకరించిన బిలావల్ భుట్టో
క్రీడలు

ఆర్సీబీకి భారీ షాక్.. ఐపీఎల్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్?
ఐపీఎల్ 2025 పునఃప్రారంభానికి బీసీసీఐ ప్రణాళికలు మొదలు పెట్టింది. భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తలు కాస్త తగ్గుముఖం పట్టడంతో ఐపీఎల్‌ను తిరిగి ప్రారంభించేందుకు భారత క్రికెట్ బోర్డు సిద్దమవుతోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే మే 15 లేదా మే 16న ఐపీఎల్ మ్యాచ్‌లు మళ్లీ మొదలయ్యే అవకాశముంది.అయితే ఈ క్యాష్ రిచ్ లీగ్ పునఃప్రారంభమవుతున్న వేళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు భారీ షాక్ తగిలే సూచనలు కన్పిస్తున్నాయి. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్, ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హాజిల్ వుడ్ గాయం కారణంగా ఐపీఎల్లో మిగిలిన మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. హాజిల్ వుడ్ ప్రస్తుతం భుజం నొప్పితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే మే 3న సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌కు అతడు దూరమయ్యాడు. అయితే అతడు జట్టుతో పాటు ఉండడంతో తర్వాతి మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడని ఫ్యాన్స్ భావించారు. కానీ అంతలోనే బీసీసీఐ ఐపీఎల్‌ను వారం రోజుల పాటు తాత్కాలికంగా వాయిదా వేసింది. దీంతో హాజిల్‌వుడ్ తన స్వదేశానికి వెళ్లిపోయాడు.ఈ క్రమంలో అతడు తిరిగి భారత్‌కు వచ్చే సూచనలు కన్పించడం లేదు. జూన్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ఉన్నందున ముందు జాగ్రత్తగా అతడిని తిరిగి పంపకూడదని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే ఆర్సీబీకి గట్టి ఎదురు దెబ్బే అనే చెప్పాలి. ఈ ఏడాది సీజన్లో హాజిల్‌వుడ్ 10 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు పడగొట్టాడు. టోర్నీ నిలిచే సమయానికి అత్యధిక వికెట్లు తీసిన మూడవ బౌలర్‌గా ఉన్నాడు. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్, స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ కూడా తిరిగి వచ్చేది అనుమానమే. కాగా ఈ ఏడాది సీజన్లో ఆర్సీబీ దుమ్ములేపుతోంది. 11 మ్యాచులలో 8 విజయాలు సాధించి.. 16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు అడుగు దూరంలో నిలిచింది.చదవండి: #Virat Kohli: మనసు మార్చుకోని కోహ్లి.. త్వరలోనే రిటైర్మెంట్?

మనసు మార్చుకోని కోహ్లి.. త్వరలోనే రిటైర్మెంట్?
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించేందుకు సిద్దమయ్యాడని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందే టెస్టు క్రికెట్ నుంచి కోహ్లి తప్పుకుంటాడని, ఇప్పటికే తన నిర్ణయాన్ని బీసీసీఐకి తెలియజేసినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.ఈ క్రమంలో కనీసం ఇంగ్లండ్ సిరీస్ వరకైనా కొనసాగేలా కోహ్లిని ఒప్పించేందుకు బీసీసీఐ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. చాలా మంది మాజీ క్రికెటర్లు కూడా కోహ్లిని తన రిటైర్మెంట్ నిర్ణయంపై పునరాలోచన చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ సిరీస్‌తోనే టీమిండియా 2025- 27 వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ప్రారంభం కానుంది. ఒకవేళ విరాట్ రిటైర్మెంట్ ప్రకటిస్తే, ఈసారి ఇంగ్లండ్‌కు వెళ్లే జట్టులో అనుభవం లేని యువ ఆటగాళ్లే ఉండే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలోనే బీసీసీఐ అతడి మనసు మార్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.మనసు మార్చుకోని కోహ్లి.. కానీ కోహ్లి మాత్రం రిటైర్మెంట్ దిశగానే అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. విరాట్ తను మొదట తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కోహ్లి తన టెస్టు రిటైర్మెంట్ విషయంపై వారాల క్రితమే సెలెక్టర్లకు సమాచారం ఇచ్చాడు. ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో ఆడేలా అతడిని ఒప్పించడానికి బీసీసీఐ ప్రయత్నిస్తోంది.కానీ అతడి మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకునేలా కన్పించడం లేదు. వచ్చే వారం జరిగే సెలక్షన్ సమావేశంలో కోహ్లి కొనసాగుతాడా? లేదా అన్నది తేలిపోనుంది అని బీసీసీఐ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాయి. కాగా రోహిత్ శర్మ ఇప్పటికే టెస్టులకు విడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అతడి స్దానంలో భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ ఎంపికయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ఇంగ్లండ్ సిరీస్‌కు భారత జట్టును మే 23న బీసీసీఐ ప్రకటించనుంది. విరాట్ ఇప్పటివరకు 123 టెస్టుల్లో భారత్ ప్రాతినిధ్యం వహించాడు. 46.85 సగటుతో 9230 పరుగులు చేశాడు. ఇందులో 30 శతకాలు, 31 అర్ధ శతకాలు ఉన్నాయి.చదవండి: IND vs SL: ముక్కోణపు వన్డే సిరీస్ విజేతగా భారత్.. ఫైనల్లో శ్రీలంక చిత్తు

ఐపీఎల్-2025 ఫైనల్ వేదిక, తేదీ మార్పు?
ఐపీఎల్-2025 సీజన్‌ను తిరిగి ప్రారంభించేందుకు బీసీసీఐ సిద్దమవుతోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు లభిస్తే మే 15 లేదా 16వ తేదీన ఐపీఎల్ తిరిగి మొదలయ్యే అవకాశముంది. మంగళవారం (మే 13) నాటికి ఆటగాళ్లందరినీ జట్టుతో చేరేలా చూసుకోవాలని ఫ్రాంఛైజీలకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఆదేశాలు జారీ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఫైనల్ వేదికను మార్చాలని భారత క్రికెట్ బోర్డు యోచిస్తున్నట్లు సమాచారం. షెడ్యూల్ ప్రకారం.. మే 25న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఇప్పుడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియానికి ఫైనల్ వేదికను మార్చనున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా ఫైనల్ మ్యాచ్ తేదీలో కూడా మార్పు చోటు చేసుకోనున్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. మే 25 బదులుగా మే 30న తుది పోరు జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తల కారణంగా ఐపీఎల్-2025ను బీసీసీఐ వారం రోజుల పాటు తాత్కాలికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే మిగిలిన మ్యాచ్‌లకు విదేశీ ఆటగాళ్ల అందుబాటుపై సందిగ్ధత కొనసాగుతోంది. చాలా మంది ఫారన్ ప్లేయర్లు ఇప్పటికే తమ స్వదేశాలకు వెళ్లిపోయారు.చదవండి: IND vs SL: ముక్కోణపు వన్డే సిరీస్ విజేతగా భారత్.. ఫైనల్లో శ్రీలంక చిత్తు

ముక్కోణపు వన్డే సిరీస్ విజేతగా భారత్.. ఫైనల్లో శ్రీలంక చిత్తు
మహిళల ముక్కోణపు వన్డే సిరీస్ విజేతగా భారత్ నిలిచింది. ఆదివారం కొలంబో వేదికగా ఆతిథ్య శ్రీలంకతో జరిగిన ఫైనల్లో 97 పరుగుల తేడాతో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. ఈ తుది పోరులో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 342 పరుగుల భారీ స్కోర్ సాధించింది.భారత బ్యాటర్లలో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana) అద్బుతమైన సెంచరీతో చెలరేగింది. మంధాన క్రీజులో ఉన్నంతసేపు బౌండరీల వర్షం కురిపించింది. మొత్తంగా 101 బంతులు ఎదుర్కొని 15 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 116 పరుగులు సాధించింది. ఆమెతో పాటు హర్లీన్ డియోల్(47), రోడ్రిగ్స్(44), హర్మన్ ప్రీత్ కౌర్(41) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. లంక బౌలర్లలో మల్కీ మదార, విహంగా, కుమారి తలా వికెట్ సాధించారు.అమన్ అదుర్స్.. నాలుగేసిన రాణాఅనంతరం 343 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక అమ్మాయిల జట్టు భారత బౌలర్ల దాటికి 48.2 ఓవర్లలో 245 పరుగులకు కుప్పకూలింది. శ్రీలంక బ్యాటర్లలో కెప్టెన్ చమీరా ఆతపట్టు(51), నీలాక్షి డి సిల్వా(48), విష్మి గుణరత్నే(36) రాణించారు. మిగితా బ్యాటర్లంతా నామమాత్రపు స్కోర్లకే పరిమితమయ్యారు.భారత బౌలర్లలో స్నేహ్ రాణా నాలుగు వికెట్లు పడగొట్టగా.. అమన్‌జోత్ కౌర్ మూడు వికెట్లు సాధించారు. కాగా భారత్, శ్రీలంకతో పాటు దక్షిణాఫ్రికా పాల్గొన్న ఈ టోర్నమెంట్లో ఆడిన 4 మ్యాచ్‌ల్లో మూడింట గెలిచిన హర్మన్ సేన... 6 పాయింట్లతో పట్టిక అగ్ర స్థానంలో నిలిచింది.
బిజినెస్

జీడీపీ వృద్ధి 6.5 శాతం
న్యూఢిల్లీ: దేశ జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) 6.5 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని, స్వల్పకాల ప్రబావాలను అధిగమించే సామర్థ్యం దేశ ఆర్థిక వ్యవస్థకు ఉందని సీఐఐ ప్రెసిడెంట్ సంజీవ్ పురి అన్నారు. వడ్డీ రేట్లు కొంత తగ్గడం, ద్రవ్యోల్బణం దిగిరావడాన్ని ప్రస్తావించారు. వడ్డీ రేట్లు మరింత దిగొస్తాయన్న అంచనాను వ్యక్తీకరించారు. బడ్జెట్లో ఆదాయపన్ను రాయితీలు కల్పించడం, ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులు పుంజుకోవడాన్ని సానుకూలంగా పేర్కొన్నారు. ఇంధనం, రవాణా, మెటల్స్, కెమికల్స్, ఆతిథ్య రంగాల్లో ప్రైవేటు పెట్టుబడులు పెరిగాయన్నారు. అయితే ప్రస్తుతం నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెట్టుబడుల విషయంలో కొంత అప్రమత్తతకు దారితీయవచ్చని అభిప్రాయపడ్డారు. వాణిజ్య అడ్డంకులు పెరిగిపోతున్న క్రమంలో దేశ ప్రయోజనాలను కాపాడుకునేందుకు కీలక భాగస్వాములతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలను తప్పకుండా కుదుర్చుకోవాలని సూచించారు. ముఖ్యంగా యూస్ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధిక టారిఫ్‌లు ప్రకటించడాన్ని గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా రక్షణాత్మక ధోరణి పెరుగుతున్నట్టు చెప్పారు. వాణిజ్యానికి మరిన్ని అవరోధాలు ఏర్పడుతున్న దృష్ట్యా ద్వైపాక్షిక వాణిజ్యాల ద్వారా దేశ ప్రయోజనాలను కాపాడుకోవాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. ముఖ్యంగా యూస్, ఈయూలతో ఒప్పందం ఎంతో కీలకమన్నారు. దేశీయంగా వృద్ధి చోదకాలు, పోటీతత్వం పెంపుపై దృష్టి సారించాలని సూచించారు. వ్యవసాయం, వాతావరణ మార్పుల విషయంలో ఎంతో పరిశోధన, కృషి అవసరమన్నారు. గ్రామీణ వినియోగం పుంజుకున్నప్పటికీ పట్టణ వినియోగం ఫ్లాట్‌గా ఉన్నట్టు చెప్పారు. వచ్చే కొన్ని త్రైమాసికాల్లో పట్టణ వినియోగం సైతం వేగాన్ని అందుకుంటుందని సంజీవ్ పురి అంచనా వేశారు.

ఇండో–పాక్ ఉద్రిక్తతలపై ఇన్వెస్టర్ల దృష్టి
ముంబై: భారత్, పాకిస్తాన్ మధ్య దాదాపు యుద్ధమేఘాలు అలుముకోవడంతో దేశీ స్టాక్ మార్కెట్లు గత వారం చివర్లో బలహీనపడ్డాయి. అయితే వారాంతాన కాల్పుల విరమణకు అంగీకారం కుదిరినప్పటికీ సరిహద్దు పొడవునా పాక్ అతిక్రమణలకు పాల్పడినట్లు వెలువడిన వార్తలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచినట్లు స్టాక్ నిపుణులు తెలియజేశారు. దీంతో మరోసారి అనిశి్చత పరిస్థితులు తలెత్తినట్లు పేర్కొన్నారు. వెరసి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గేవరకూ మార్కెట్లు బలహీనపడవచ్చని అభిప్రాయపడ్డారు.ద్రవ్యోల్బణంపై కన్ను ఏప్రిల్ నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు మంగళవారం(13న) విడుదలకానున్నాయి. మార్చిలో సీపీఐ వరుసగా ఐదో నెలలోనూ నీరసిస్తూ 3.34 శాతానికి పరిమితమైంది. ఈ బాటలో ఏప్రిల్ నెలకు టోకు ధరల ద్రవ్యోల్బణ(డబ్ల్యూపీఐ) వివరాలు 14న వెల్లడికానున్నాయి. మార్చిలో డబ్ల్యూపీఐ 2.38 శాతం నుంచి 2.05 శాతానికి బలహీనపడింది. ఇక ప్రభుత్వం ఏప్రిల్ నెల వాణిజ్య గణాంకాలను గురువారం(15న) ప్రకటించనుంది. మార్చిలో దేశీ వాణిజ్యలోటు 21.54 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఆర్థిక గణాంకాలు కొంతమేర మార్కెట్లను ప్రభావితం చేయవచ్చని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. ఫలితాలు కీలకం ఇప్పటికే గతేడాది(2024–25) చివరి త్రైమాసిక ఫలితాల సీజన్ ముగింపునకు వచి్చంది. ఈ బాటలో ఈ వారం సైతం మరికొన్ని కార్పొరేట్ దిగ్గజాలు జనవరి–మార్చి(క్యూ4) పనితీరును వెల్లడించనున్నాయి. జాబితాలో రేమండ్, టాటా స్టీల్, యూపీఎల్(12న), టాటా మోటార్స్, భారతీ ఎయిర్టెల్, సిప్లా, హీరోమోటో కార్ప్, సీమెన్స్, గెయిల్(13న), ఐషర్ మోటార్స్, లుపిన్, శ్రీ సిమెంట్, టాటా పవర్(14న), అబాట్ ఇండియా, గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా, గోద్రెజ్ ఇండస్ట్రీస్(15న), బీహెచ్ఈఎల్(16న) ఫలితాలు ప్రకటించనున్నాయి. భారత్, పాక్ ఉద్రిక్తతలతోపాటు క్యూ4 ఫలితాలు ట్రెండ్‌కు కీలకంగా నిలవనున్నట్లు మాస్టర్ ట్రస్ట్ గ్రూప్ డైరెక్టర్ పునీత్ సింఘానియా అభిప్రాయపడ్డారు. విదేశీ అంశాలు ఈ వారం ఏప్రిల్ నెలకు యూఎస్ గణాంకాలు వెలువడనున్నాయి. ద్రవ్యోల్బణం 13న, రిటైల్ అమ్మకాలు 15న విడుదలకానున్నాయి. గురువారం ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమీ పావెల్ ప్రసంగించనున్నారు. వరుసగా మూడో సమావేశం(మే)లోనూ ఫెడ్ ఫండ్స్ రేట్లను 4.25–4.5 శాతంవద్ద కొనసాగించేందుకే కట్టుబడిన సంగతి తెలిసిందే. శుక్రవారం(16న) జపాన్ జీడీపీ(జనవరి–మార్చి) ప్రాథమిక వృద్ధి రేటు గణాంకాలు వెలువడనున్నాయి. గత వారమిలా.. భారత్, పాక్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో గత వారం(5–9) దేశీ స్టాక్ మార్కెట్లు డీలాపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ నికరంగా 1,048 పాయింట్లు(1.3 శాతం) క్షీణించి 79,454 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 339 పాయింట్లు(1.4 శాతం) నీరసించి 24,008 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లు సైతం 1.4 శాతం చొప్పున నష్టపోయాయి. అమ్మకాలు పెరిగితేమార్కెట్లు గత వారం చివర్లో బలహీనపడటంతో ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ 24,000 పాయింట్లవద్ద నిలిచింది. భారత్, పాక్ మధ్య ఘర్షణలు నెలకొనడంతో నిఫ్టీ 23,900స్థాయి దిగువకు చేరే వీలున్నట్లు సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు. ఇది జరిగితే మార్కెట్లు మరింత బలహీనపడవచ్చని అభిప్రాయపడ్డారు. ఇలాకాకుండా 24,250 పాయింట్ల ఎగువకు చేరితే బలాన్ని పుంజుకునే వీలున్నట్లు అంచనా వేశారు. భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణతోపాటు పరిస్థితులు కుదుటపడితే సెంటిమెంటుకు ప్రోత్సాహం లభించవచ్చని మెహతా ఈక్విటీస్ సీనియర్ వీపీ(రీసెర్చ్) ప్రశాంత్ తాప్సీ విశ్లేషించారు. సాధారణంగా మార్కెట్లు ఇలాంటి పరిస్థితుల నుంచి త్వరగా రికవరీ సాధిస్తాయని అభిప్రాయపడ్డారు.ఎఫ్‌పీఐలు రివర్స్గేర్గత రెండు వారాలుగా దేశీ స్టాక్స్‌లో నికర కొనుగోలుదారులుగా నిలుస్తున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) గత వారాంతాన ఉన్నట్టుండి నికర అమ్మకందారులుగా నిలిచారు. నగదు విభాగంలో శుక్రవారం(9న) రూ. 3,799 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అయితే ఈ నెలలో ఇప్పటివరకూ రూ. 14,167 కోట్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! జీఎస్టీ వసూళ్లు, ఎఫ్‌పీఐ పెట్టుబడులు ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచుతాయని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు. జనవరిలో రూ. 78,027 కోట్లు, ఫిబ్రవరిలో రూ. 34,574 కోట్లు, మార్చిలో 3,973 కోట్లు వెనక్కి తీసుకున్న ఎఫ్‌పీఐలు ఏప్రిల్‌లో రూ. 4,223 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. తిరిగి ఈ నెలలో దేశీ స్టాక్స్ కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు.

మిస్ సెల్లింగ్.. బుట్టలో పడకూడదంటే..?
ఇటీవలే పదవీ విరమణ చేసిన ప్రకాష్ (60)కు వివిధ ప్రయోజనాల రూపంలో రూ.40 లక్షలు సమకూరాయి. వీటిని బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి (ఎఫ్డీ) దానిపై ప్రతి నెలా ఆదాయం తీసుకోవాలని భావించాడు. సీనియర్ సిటిజన్స్‌కు అర శాతం అదనపు రేటు కూడా అతన్ని ఆకర్షించింది. తీరా బ్యాంక్‌కు వెళ్లిన తర్వాత అక్కడి రిలేషన్ షిప్ మేనేజర్ (ఆర్ఎం) సూచనలతో మరింత రాబడి కోసం ‘స్పెషల్ ఎఫ్డీ’లో ఇన్వెస్ట్ చేశాడు.అది కాస్తా యులిప్ ప్లాన్ అని తర్వాత తెలియడంతో ఎవరికి చెప్పుకోలేక లోలోపలే ఆవేదన చెందాడు. గత రాబడుల గురించి గొప్పగా చెప్పడంతో ఆర్ఎం మాటలతో బోల్తా పడ్డాడు. 55 ఏళ్ల నారాయణ మూర్తి చిన్న కిరాణా దుకాణం నడుపుతున్నాడు. ఒక్కతే కుమార్తె. ఉన్నత విద్య కోసం అమెరికాకు పంపాడు. ఇటీవలే ఊళ్లో భూమిని విక్రయించగా రూ.20 లక్షలు చేతికి వచ్చింది. ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దామని బ్యాంక్‌కు వెళ్లాడు. అక్కడి మేనేజర్ ఎఫ్డీ కంటే మంచి రాబడి వస్తుందంటూ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఆ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయించాడు. మనలో చాలా మందికి ఇలాంటి అనుభవాలు ఎదురుకావొచ్చు. అవగాహనతోనే ఇలాంటి వాటికి చెక్ పెట్టడం సాధ్యపడుతుంది. తిరుచ్చిరాపల్లికి చెందిన నారాయణస్వామి దంపతులకూ ఇలాంటి అనుభవమే ఎదురైంది. గడువు తీరిన ఎఫ్డీని రెన్యువల్ చేద్దామని బ్యాంక్‌కు వెళ్లగా.. దానికి బదులు యులిప్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలన్న సూచన బ్యాంక్ నుంచి వచ్చింది. దీంతో వారు ఫైనాన్షియల్ అడ్వైజర్ (ఆర్థిక సేవల సలహాదారు)ను సంప్రదించారు. యులిప్ ప్లాన్‌లో పెట్టుబడులకు దూరంగా ఉండాలన్న సూచనతో ఎఫ్డీ రెన్యువల్‌కే మొగ్గు చూపించారు. బీమా పాలసీలు, మ్యూచువల్ ఫండ్స్, ఇతర పెట్టుబడి సాధనాలను తప్పుడు మార్గాల్లో విక్రయించడం ఇటీవలి కాలంలో ఎక్కువగా కనిపిస్తోంది. దీన్నే మిస్ సెల్లింగ్‌గా చెబుతున్నారు. బ్యాంక్‌లు, మ్యూచువల్ ఫండ్స్ పంపిణీదారులు, బీమా ఏజెంట్ల బుట్టలో పడకుండా ఉండాలంటే కావాల్సింది అవగాహన, స్వీయ జాగ్రత్తలే. ఇలాంటి సందర్భాల్లో కార్యాచరణ ఎలా ఉండాలన్నది చూద్దాం. 2023 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం ఐఆర్డీఏఐ గణాంకాల ప్రకారం బీమా కంపెనీలకు వ్యతిరేకంగా 1,27,378 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో 50 శాతం జీవిత బీమా కంపెనీలు మిస్ సెల్లింగ్ విధానాలకు వ్యతిరేకంగా దాఖలైనవే ఉన్నాయి. బ్యాంకింగ్ ఉత్పత్తుల కంటే మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ ఉత్పత్తులకు సంబంధించి తప్పుదోవ పట్టించి విక్రయించడం అతిపెద్ద సమస్యగా ఉన్నట్టు గ్రాంట్ థార్న్టన్ పార్ట్నర్ వివేక్ అయ్యర్ తెలిపారు. ‘‘బ్యాంకుల ఉత్పత్తులు సులభంగా, సరళంగా ఉంటాయి. అదే మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ అన్నవి మార్కెట్ రిస్క్‌లు, షరతులతో ముడిపడి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో నిపుణులకు సైతం వీటి గురించి చెప్పడం కష్టంగానే ఉంటుంది’’ అని వివరించారు. బ్యాంకుల ద్వారా ఎక్కువ మిస్ సెల్లింగ్ అవుతున్నది బీమా ఉత్పత్తులేనని ఆర్థిక సర్వే 2024 సైతం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా యస్ బ్యాంక్ ఉదాహరణ గురించి కూడా చెప్పుకోవాలి. లోగడ యస్ బ్యాంక్ సిబ్బంది ఎఫ్‌డీల పేరుతో ఏటీ–1 బాండ్లను కస్టమర్లకు విక్రయించారు. నిజానికి అవి పర్పెచ్యువల్ బాండ్లు. ఈ విషయం తమకు చెప్పనేలేదని కస్టమర్లు ఆరోపించడం గమనార్హం. ఏటీ–1 బాండ్లకు మెచ్యూరిటీ ఉండదు. నిర్ణీత కాలానికోసారి వడ్డీ చెల్లింపులు చేస్తారు. ఎఫ్‌డీల కంటే వీటిపై అధిక రేటు ఉంటుంది. బ్యాంక్ నష్టపోతే వీటికి ఎలాంటి చెల్లింపులు చేయరు. వాటిని రద్దు చేయొచ్చు కూడా. 2020లో యస్ బ్యాంక్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు రూ.8,400 కోట్ల ఏటీ–1 బాండ్లను రద్దు చేసింది.మార్కెటింగ్ లక్ష్యాలు.. → బీమా ఉత్పత్తులను ఎఫ్‌డీల కంటే అధిక రాబడులను ఇచ్చే సాధనాలుగా బ్యాంక్ ఆర్ఎంలు విక్రయిస్తుండడం తరచుగా కనిపిస్తోంది. కొన్ని సందర్భాల్లో మూడు నుంచి ఐదేళ్ల కాలం కోసం ఉద్దేశించిన పెట్టుబడి సాధనాలుగా వాటిని బ్యాంక్ సిబ్బంది విక్రయిస్తున్నట్టు డెలాయిట్ ఇండియా ఇన్సూరెన్స్ సెక్టార్ లీడర్ దేవాశిష్ బెనర్జీ తెలిపారు. → బ్యాంక్ రుణం మంజూరునకు, లాకర్ల సదుపాయం తెరవాలంటే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం తప్పనిసరి అని కొన్ని బ్యాంకులు షరతు పెడుతున్నాయి. → యూనిట్ లింక్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు (యులిప్‌లు), డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్లు (ఇన్వెస్ట్ చేసిన కొంత కాలం తర్వాత నుంచి దానిపై ఆదాయం చెల్లించేవి), గ్యారంటీడ్ ఇన్కమ్ ప్లాన్లు సైతం తçప్పుడు మార్గాల్లో విక్రయిస్తున్నారు. → రిస్క్ అంతగా తీసుకునే సామర్థ్యం లేని సంప్రదాయ ఇన్వెస్టర్లకు అధిక రిస్క్ మ్యూచువల్ ఫండ్స్ పథకాలను విక్రయిస్తున్నారు. → పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సరీ్వసెస్ (పీఎంఎస్), ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్‌లు)ను తరచుగా మ్యూచువల్ ఫండ్స్ కంటే మెరుగైనవంటూ మార్కెటింగ్ చేస్తున్నారు. → కొన్ని సందర్భాల్లో అవసరం లేకపోయినా కస్టమర్లతో రుణాలు తీసుకునేలా ప్రోత్సహిస్తున్నారు. ఎఫ్డీ ప్రారంభిస్తే తక్కువ రేటుపై పర్సనల్ లోన్ ఇస్తామంటూ కొన్ని సందర్భాల్లో బ్యాంక్ సిబ్బంది కస్టమర్లను కోరుతున్నారు. తమకు విధించిన లక్ష్యాలను చేరుకునేందుకు వీలుగా బ్యాంక్ సిబ్బంది ఇలాంటి ఉత్పత్తులను ఏదో ఒక రకంగా కస్టమర్లతో కొనిపించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. → 1 ఫైనాన్స్ మ్యాగజైన్’ 2024 అక్టోబర్ సర్వే నివేదిక ప్రకారం.. లక్ష్యాలను చేరుకోకపోతే ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందన్న భయంతో బ్యాంక్ ఆర్ఎంలలో 57 శాతం మంది ఆర్థిక ఉత్పత్తులను తప్పుడు మార్గాల్లో విక్రయిస్తున్నట్టు చెప్పారు.అవగాహనతోనే నివారణ ఏ ఉత్పత్తిని అయినా కొనుగోలు చేసే ముందు పూర్తి పరిశీలన అవసరం. దాని గురించి సమగ్రంగా తెలుసుకుని, అవగాహన ఏర్పడిన తర్వాతే కొనుగోలుపై నిర్ణయం తీసుకోవాలి. బ్యాంక్‌లు విక్రయిస్తున్నవన్నీ తప్పుదోవపట్టించి అంటగట్టేవిగా చూడడం సరికాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ జీవిత, ఆరోగ్య బీమా అవసరం. ఇప్పుడు చాలా బ్యాంక్‌లు గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజీని, గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని నాన్ గ్రూప్‌తో పోలి్చతే తక్కువ ప్రీమియానికే ఆఫర్ చేస్తున్నాయి. కనుక బ్యాంక్‌ల్లో అందుబాటులో ఉండే ఉత్పత్తుల్లో కొన్ని ప్రయోజనకరమైనవీ ఉంటాయన్నది మర్చిపోవద్దు. ముఖ్యంగా అధిక రాబడుల కాంక్షతో పెట్టుబడి సాధనాలను కొనుగోలు చేయడం సరికాదు. ఇంటర్నెట్లో సంబంధిత ఉత్పత్తి గురించి శోధిస్తే సమగ్ర సమాచారం చిటికెలో లభిస్తుంది. ‘‘ఏజెంట్‌ను గుడ్డిగా నమ్మకుండా కస్టమర్లు తమ పరిశోధన తర్వాత సహేతుక నిర్ణయాలు తీసుకోవాలి. ప్రతి రోజూ ఎన్నో కొత్త ఉత్పత్తులు వస్తుండడంతో బ్యాంక్ ఆర్ఎంలపై లక్ష్యాల భారం పడుతోంది. ఈ ఒత్తిడితో ఆయా సాధనాల గురించి కస్టమర్లకు వివరంగా చెప్పకుండానే తప్పుడు మార్గాల్లో విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంది’’ అని గ్రాంట్ థార్న్టన్ పార్ట్నర్ వివేక్ అయ్యర్ తెలిపారు.మోసపోతే ఏం చేయాలి? → ఇప్పటికే బ్యాంక్ నుంచి ఏదైనా ఉత్పత్తిని కొనుగోలు చేసి, అది తమ అవసరాలను సరిపడదని గుర్తిస్తే దీనిపై చర్యలు చేపట్టొచ్చు. బ్యాంక్ కస్టమర్ సేవల విభాగం లేదా ఆర్ఎం వద్ద ఫిర్యాదు దాఖలు చేయాలి. ఫలితం రాకపోతే అదే బ్యాంక్‌లో ఫిర్యాదుల పరిష్కార విభాగం దృష్టికి తీసుకెళ్లాలి. → బ్యాంక్ స్థాయిలో సమస్య పరిష్కారం కాకపోతే లేదా సంతృప్తికరమైన ఫలితం రాకపోతే అప్పుడు బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. ‘‘సంబంధిత లావాదేవీని రద్దు చేయాలని అంబుడ్స్‌మన్ ఆదేశించగలదు. లేదా పరిహారం ఇప్పిస్తుంది. లేదా దిద్దుబాటు చర్యలకు ఆదేశిస్తుంది. ఇదొక సమర్థవంతమైన పరిష్కార యంత్రాంగం. దీనికి న్యాయపరమైన ప్రతినిధి అవసరం లేదు’’అని ఢిల్లీకి చెందిన న్యాయవాది నిషాంత్ దత్తా సూచించారు. → బ్యాంక్, అంబుడ్స్‌మన్ స్థాయిల్లో పరిష్కారం రాకపోతే అప్పుడు వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార కమిషన్ (వినినయోగదారుల ఫోరమ్) వద్ద కేసు దాఖలు చేయాలి. → చివరిగా కోర్టును ఆశ్రయించడం ద్వారా న్యాయం కోసం ప్రయత్నించొచ్చు. గతంలో పలు హైకోర్టులు, సుప్రీంకోర్టుల వరకు ఇలాంటి మిస్ సెల్లింగ్ కేసులు వెళ్లాయి. ఆ సమయంలో కోర్టులు సైతం కఠినంగా స్పందించాయి. → వీరేంద్ర పాల్ కపూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2014) కేసులో.. రాబడులపై తప్పుడు సమాచారంతో పాలసీని విక్రయించిన బీమా సంస్థ అందుకు పూర్తి బాధ్యత వహించాలని ఆదేశించింది. బ్యాంక్ సిబ్బంది చర్యలకు బ్యాంకులే బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు సైతం 2013లో ఓ కేసు సందర్భంగా స్పష్టం చేసింది. → మ్యూచువల్ ఫండ్స్ పంపిణీదారులు లేదా ఏజెంట్లు ఉత్పత్తులను తప్పుగా అంటగడితే సెబీ వద్ద ఫిర్యాదు దాఖలు చేయాలి. → బీమా ఏజెంట్ల కారణంగా తమకు అనుకూలం కాని ఉత్పత్తులను కొనుగోలు చేసినట్టయితే బీమా అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించాలి. ప్రయోజనాలు.. రిస్క్ లు చూడాలి... బ్యాంక్ ఆఫర్ చేస్తున్నఉత్పత్తిలోని ప్రయోజనాలు, రిస్క్‌లు, అవి తమకు ఏ మేరకు అనుకూలమన్నది ప్రశి్నంచాలి. అర్థవంతమైన వివరణ అనంతరం సరైన నిర్ణయం తీసుకోవాలి. రుణం మంజూరు కావాలంటే దానికి అనుబంధంగా టర్మ్ ప్లాన్ తీసుకోవాలని కోరొచ్చు. అవసరం లేకపోతే అదే విషయం తేలి్చచెప్పండి. తమకు అప్పటికే లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజీ లేకపోతే కొనుగోలును పరిశీలించొచ్చు. సంతకాలు చేసే ముందు ఆయా పత్రాలను వివరంగా చదివి అర్థం చేసుకోవాలి. గ్యారంటీడ్ (హామీతో కూడిన) రాబడుల పేరుతో ఏదైనా ఉత్పత్తిని విక్రయించే ప్రయత్నం చేస్తుంటే.. అది డెట్ సాధనమే అయి ఉండాలి. అధిక రాబడులు వస్తాయంటుంటే అది ఈక్విటీ సాధనమైనా అయి ఉండొచ్చు. గత రాబడులు భవిష్యత్ పనితీరుకు హామీ కాదు. ఉత్పత్తి ఏదైనా సరే తమ అవసరాలకు సరితూగే విధంగా ఉండాలి. ఉదాహరణకు 60 ఏళ్లు నిండిన వారికి జీవిత బీమా కవరేజీ అవసరం ఉండదు. కనుక వారు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. యులిప్‌లు అయినా, ఈక్విటీలు అయినా అధిక రిస్క్‌తో కూడినవి. వృద్ధాప్యంలో మెజారిటీ మొత్తం సురక్షిత సాధనాల్లోనే ఉండాలన్న విషయాన్ని మర్చిపోకూడదు. సెబీ, యాంఫి, ఆర్బీఐ, ఐఆర్డీఏఐ ఇప్పటికే తమ నియంత్రణల పరిధిలో సంస్థలకు ఈ విషయమై ఆదేశాలు జారీ చేశాయి. → మీ అవసరాలను, ఆర్థిక లక్ష్యాలను ముందుగా తేల్చుకోవాలి. ఆ తర్వాత అందుకు అనుకూలమైన సాధనాన్ని ఎంపిక చేసుకోవాలి. → పెట్టుబడుల పత్రాలను సమగ్రంగా చదివి, సందేహాలను తీర్చుకున్న తర్వాతే ముందుకు వెళ్లాలి. → రిస్క్ తీసుకోలేని వారు అధిక రాబడులను ఆశించడం సరికాదు. అధిక రాబడులను ఇచ్చే సాధనాల్లో ఎలాంటి హామీ ఉండదు. → పెట్టుబడులు, రక్షణ కలసిన ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. ఈ రెండింటినీ వేర్వేరుగా తీసుకోవాలి. – సాక్షి, బిజినెస్ డెస్క్

హోండా ఈ-క్లచ్ టెక్నాలజీ బైక్స్: ధరలు ఎలా ఉన్నాయంటే?
హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా.. తన సీబీ650ఆర్, సీబీఆర్650ఆర్ బైకులను ఈ-క్లచ్ వేరియంట్స్ రూపంలో లాంచ్ చేసింది. వీటి ధరలు వరుసగా రూ. 9.60 లక్షలు, రూ. 10.40 లక్షలు (ధరలు ఎక్స్-షోరూమ్). వీటి ధరలు స్టాండర్డ్ మోడల్స్ ధరల కంటే రూ. 40000 ఎక్కువ.హోండా సీబీ650ఆర్, సీబీఆర్650ఆర్ బైకులు చూడటానికి స్టాండర్డ్ మోడల్స్ మాదిరిగా ఉన్నప్పటికీ.. ఇందులోని ఈ క్లచ్ టెక్నాలజీ క్లచ్ లివర్‌ను మాడ్యులేట్ చేయాల్సిన అవసరం లేకుండా గేర్లను మార్చడానికి అనుమతిస్తుంది. ఇందులో క్లచ్ లివర్ అలాగే ఉంటుంది. అయితే రైడర్ కావలసినప్పుడు మాన్యువల్ కంట్రోల్ తీసుకోవచ్చు.ఇదీ చదవండి: రూ. 51వేలతో బుకింగ్: లాంచ్‌కు సిద్దమవుతున్న కొత్త కారుసీబీ650ఆర్, సీబీఆర్650ఆర్ ఈ వేరియంట్స్ రెండూ కూడా 649cc ఇన్లైన్ ఫోర్-సిలిండర్ ఇంజిన్ ద్వారా 95 హార్స్ పవర్, 63 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తాయి. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. కాబట్టి పర్ఫామెన్స్ కూడా మునుపటి మోడల్స్ మాదిరిగానే ఉంటుంది.
ఫ్యామిలీ

ప్రెగ్నెన్సీ టైంలో ముక్కు నుంచి రక్తం కారడం ప్రమాదమా..?
నాకు ఇప్పుడు ఏడవ నెల. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ, నా ముఖం, చేతులు, కాళ్లల్లో ఒక్కసారిగా వాపులు మొదలయ్యాయి. ఇది సాధారణమా లేక ప్రమాదమా?– లక్ష్మీ, నెల్లూరు. వాపు అనేది శరీర భాగాలలో ద్రవం నిలిచిపోవడం వల్ల ఏర్పడుతుంది. ఇది గర్భధారణ సమయంలో తరచుగా కనిపించేదే. సాధారణంగా ఎక్కువ సేపు కూర్చోవటం, నుంచోవటం వలన ప్రెగ్నెన్సీలో వస్తుంది. ఎక్కువ ఉప్పు పదార్ధాలు తిన్నా, బరువు ఎక్కువ ఉన్నా, బీపీ మందులు, స్టెరాయిడ్స్, ఇతర మందులు వాడుతున్నా వస్తుంది. చాలా అరుదుగా కాలేయం, గుండె, మూత్రపిండాల సమస్యల వల్ల కూడా ఈ వాపులు రావచ్చు. ప్రెగ్నెన్సీలో వచ్చే సాధారణ వాపు ఎక్కువగా రాత్రి వేళల్లో కనిపిస్తుంది. ఉదయానికి తగ్గిపోతుంది. కానీ, ఒక్కసారిగా వాపు రావడం, బీపీ పెరగడం, తలనొప్పి, చూపు మసకబారడం వంటివి కనిపిస్తే అది ప్రీ ఎక్లాంప్షియా అంటాం. ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ వాపులు ప్రెగ్నెన్సీలో నెలలు పెరిగే కొద్దీ, ఆ బరువుకి కాళ్లలో రక్త ప్రసరణ తక్కువగా ఉండటంతో వస్తుంది. ఇది తగ్గించుకోవడానికి ఎక్కువ సేపు నిలబడకూడదు. అనుకూలమైన సాక్సులు, చెప్పులు వేసుకోవాలి. బాగా వాకింగ్, వ్యాయామం చేయాలి. ఒకసారి మీరు డాక్టరుని కలిస్తే బీపీ, బరువు అన్నీ పరీక్షించి ఇది నార్మల్ ఏనా కాదా అనేది చెప్తారు.నేను మూడునెలల గర్భవతిని. చాలా అలసటగా ఉంటుంది. నిద్ర పట్టడం లేదు. నిద్రలో చెడు కలలు ఎక్కువగా వస్తున్నాయి. ఏం చేయాలో చెప్పండి?– నందిని, సంగారెడ్డి.ప్రెగ్నెన్సీలో హార్మోన్ల మార్పుల వలన మొదటి మూడు నెలల్లో అలసట, బలహీనత, నిస్సహాయత భావం ఎక్కువగా ఉంటుంది. ఇవి మానసికంగా చాలా ప్రభావితం చేస్తాయి. అందుకే, అన్నింటికీ సమాధానం విశ్రాంతి తీసుకోవటమే. ఈ సమయంలో కాళ్లు రెండు ఎత్తులో పెట్టుకొని కొంచెం విశ్రాంతి తీసుకోవాలి. పోషకాహారం తీసుకోవడం కూడా ఎంతో ముఖ్యం. నెలలు నిండిన తర్వాత అధిక బరువుతో బలహీనంగా, డల్‌గా ఉంటారు. పొట్ట పెరిగే కొద్దీ నిద్రపట్టడం కష్టం కావచ్చు. దీని వలన బేబీకి ఏ ప్రమాదం ఉండదు. రిలాక్సినేషన్, బ్రీతింగ్ టెక్నిక్స్ పాటించాలి. మృదువైన దిండు వాడటం, నిద్రకు అనుకూలంగా పడుకోవడం చేయ్యాలి. అంటెర్నల్ క్లాసెస్లలో ఇవీ నేర్పిస్తారు. వ్యాయామం చేయటం వలన కాస్త ఉపశమనం లభిస్తుంది. ఆహారం తిన్న తర్వాత తప్పకుండా వాకింగ్ చెయ్యాలి. కొంతమందికి నిద్రలేమితోపాటు అలసట, చిరాకు, నిస్సహాయత భావం, పనుల మీద ఆసక్తి లేకపోవటం ఉంటాయి. ఇవి ఉంటే డిప్రెషన్ కావచ్చు. ఇలాంటి సమయంలో మానసిక వైద్య నిపుణుడిని సంప్రదించడం మంచిది.నాకు ఇప్పుడు తొమ్మిదవ నెల. ఒక వారం నుంచి ముక్కు నుండి రక్తం వస్తోంది. ఐస్ ప్యాక్ పెట్టుకోమన్నారు. ఇది సాధారణమేనా? ఏవైనా పరీక్షలు చేయించుకోవాలా?– మమత, యాదాద్రి.ప్రెగ్నెన్సీలో ముక్కులో ఉండే రక్తనాళాలు విస్తరించి, సున్నితంగా మారుతాయి. అప్పుడు ముక్కు నుంచి రక్తం రావడం సాధారణమే. ఇది హార్మోన్ల మార్పులు, ఎక్కువ రక్త ప్రసరణ వలన జరుగుతుంది. కొంతమందికి కొన్ని సెకన్ల నుంచి నిమిషాలపాటు రక్తం రావచ్చు. నిద్రలో కూడా ఇలా జరగచ్చు. ఇలా అయినప్పుడు వెంటనే నిటారుగా కూర్చొని, ముక్కు పై భాగాన్ని గట్టిగా మూసివేసి కొన్ని సెంకడ్ల పాటు పట్టుకుంటే తగ్గిపోతుంది. నోటితో శ్వాసతీసుకోవటం మంచిది. ఐస్‌ప్యాక్ పెట్టుకోవచ్చు. అలా చేసినా తగ్గకపోతే డాక్టర్ని కలవాలి. ముక్కుని ఎక్కువ చీదటం, కిందకు వంగటం, వ్యాయామం చేయటం ఒక రెండు రోజులు మానేయాలి. పది నుంచి పదిహేను నిమిషాల్లో తగ్గకపోతే, వెంటనే డాక్టర్ని కలవాలి. అలసటగా, బలహీనంగా ఉన్నా డాక్టర్‌ను కలవాలి. ఆసుపత్రిలో సన్నని గాజుగుడ్డతో నోస్ ప్యాకింగ్ చేస్తారు. తగ్గిన తర్వాత యాంటీసెప్టిక్ క్రీమ్స్ ముక్కు లోపల ఉపయోగించమని చెప్తారు. ఈ క్రీమ్స్ వలన క్రస్టింగ్, మచ్చలు ఏర్పడకుండా ఉంటాయి. కానీ, కొన్ని కేసెస్‌లో బ్లీడింగ్ డిసార్డర్స్ ఉన్నా, రక్తాన్ని పలుచగా చేసే మందులు వాడుతున్నా, ఈ బ్లీడింగ్ ఎక్కువ కావచ్చు. అందుకే వెంటనే ఆసుపత్రికే వెళ్లాలి. (చదవండి: liposuction: సౌందర్య చికిత్సలు ఇంత డేంజరా..? పాపం ఆ మహిళ..)

నోరూరగాయ.. ఆవకాయ..! ఇప్పుడు చాలా కాస్టలీ గురూ..
‘ముద్దపప్పు మిత్రమై వర్థిల్లే ఆవకాయ వేసవిలో పుట్టి చవులూరించే ఆవకాయ‘ వేసవి వచ్చిందంటే చాలు వంటగదిలో హడావుడి మొదలయ్యేది.. ఆ ఏడాది ఆవకాయ పెట్టే కార్యక్రమం గురించి చర్చోపచర్చలు జరిగేవి.. మంచి మామిడి కాయలు తెచ్చుకోవాలి.. కరెక్ట్ సైజులో ముక్కలు కొట్టించాలి.. సరైన మోతాదులో సంబారాలన్నీ కలుపుకోవాలి.. శుచిగా శుభ్రంగా చేసుకోవాలి. ఎందుకంటే ఏడాదంతా నిల్వ ఉండాలి కదా.. ఆవకాయ పెట్టే విధానం గురించి కొత్త కోడలికి పాఠాలు.. సరిగ్గా నేర్చుకోవడం లేదని కూతురికి అక్షింతలు.. ఇంటి పెద్ద హడావుడే హడావుడి.. ఇదంతా గతం. ఇప్పుడు ఆవకాయ పెట్టే ఓపిక, తీరిక ఎవరికుంది? ఆవకాయ పెట్టడం ఎందరికి వచ్చు? పెరిగిన ధరలతో అది భారంగా మారిన వేళ అంత శ్రమ ఎవరు తీసుకుంటారు?ఊరగాయ ఒక్కటి చాలు.. ముద్దపప్పులో కలుపుకొని తినొచ్చు.. నెయ్యి వేసుకొని అన్నంలో కలుపుకొని ఆరగించవచ్చు.. పెరుగన్నంతో నంజుకుంటూ.. ఆహా ఏమి రుచి అని రాగాలు తీయవచ్చు. ఎక్కువ వంటలు చేయడానికి అవకాశం లేకపోతే ఆ పూట గడిపేయడానికి ఊరగాయ ఒక్కటి చాలు.. కానీ ఏం లాభం.. ఈ తరం రుచులే మారిపోయాయి. వారు కొత్త కొత్త వంటకాలు కోరుతారు. బీపీ పెరుగుతుందని తినే వారిని కూడా తిననివ్వరు. ఇదీ నేటి పరిస్థితి. అయితే ఆవకాయ పెట్టడం అంత ఆషామాషీకాదు. తగ్గిన మామిడి దిగుబడి, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో ఆవకాయ వాసనలు అక్కడక్కడ మాత్రమే ముక్కుపుటాలను సోకుతున్నాయి. ధరల దరువు కొన్ని దశాబ్దాలుగా ఆవకాయ పచ్చడితో ఆంధ్రులకు మంచి అనుబంధం ఉంది. ప్రతి ఇంటా కచ్చితంగా తయారు చేసేవారు. కానీ సరకుల ధరలు ఆకాశాన్నంటడంతో రానురాను ఆవకాయ పెట్టేవారు తగ్గిపోతున్నారు. 40 మామిడి కాయలనుపయోగించి ఆవకాయ పెట్టాలంటే సుమారు రూ.5 వేల వరకు ఖర్చవుతోంది. ప్రస్తుతం మామిడి కాయల దిగుబడి అంతంతమాత్రంగానే ఉంది. మార్కెట్లో మామిడి కాయలు ఒక్కొక్కటి రూ.20లకు కొనుగోలు చేసి ఆవకాయ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. నాణ్యమైన మామిడి కాయలేవీ? వర్షాభావ పరిస్థితుల కారణంగా దిగుబడి బాగా తగ్గిపోయింది. దీనికితోడు తెగుళ్లు కూడా బాగా సోకడంతో నాణ్యమైన మామిడి కాయలు దొరకడం కష్టంగా ఉంటోందని గృహిణులు, పచ్చడి తయారీదార్లు వాపోతున్నారు. ఆవకాయ కోసం ఎక్కువగా కోలంగోవా, కొత్తపల్లి కొబ్బరి, సువర్ణరేఖ, కలెక్టర్ తదితర రకాల మామిడి కాయలను వినియోగిస్తుంటారు. ఈ ఏడాది కలెక్టర్ మినహా మిగతా రకాల మామిడి కాయల దిగుబడి తగ్గిపోయింది. ఏడాదిపాటు నిల్వ ఉండే ఆవకాయకోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. సరైన సమయంలో లేతపరువుతో ఉన్న కాయలనే ఆవకాయ కోసం వినియోగిస్తుంటారు. కొత్తపల్లి కొబ్బరి కాయ రకంతోనే ఆవకాయ పెట్టడానికే ప్రాధాన్యం ఇస్తారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, నాణ్యమైన మామిడికాయల కొరత తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని చాలామంది సొంతంగా ఆవకాయ పెట్టుకునే బదులు సీజనల్ వ్యాపారుల వద్ద సూపర్మార్కెట్లో లభించే ఆవకాయ డబ్బాలను కొనుగోలు చేసుకునేందుకు సిద్ధపడుతున్నారు. ఇన్ని వ్యయప్రయాసలు పడి నిల్వ ఉండే పచ్చళ్లు పెట్టే బదులు మార్కెట్లో రెడీమేడ్‌గా దొరికే పచ్చళ్లు కొనుగోలు చేయడానికే కొంతమంది మొగ్గు చూపుతున్నారు. అయితే ఇంట్లో తయారు చేసిన ఆవకాయకు మరేదీ సాటి రాదన్న ఉద్దేశంతో ఖర్చుకు వెనుకాడకుండా ఇళ్లల్లోనే తయారు చేసేవారూ ఉన్నారు. ఆవకాయ చాలా కాస్ట్లీ గురూ.. 40 మామిడి కాయలతో ఆవకాయ పెడితే ఖర్చు ఇలా అవుతోంది. మామిడి కాయల ధర రూ.800లు, పొట్టు తీసిన ఆవపొడి 2 కిలోలు రూ.560లు, కారం 2 కిలోలు రూ.1450లు, 2 కిలోల దంపిన ఉప్పు రూ.100లు, వెల్లుల్లి కిలో రూ.200లు, గానుగ నూనె 4 కిలోలు రూ.1600లు, కాయలు ముక్కలుగా కోయించడానికి రూ.240లు.. ఇలా 40 కాయల ఆవకాయకు సుమారు రూ.5 వేలు ఖర్చవుతోంది. ఒక కాయకు ఖర్చు రూ.124లు అవుతోంది. ఒక మామిడి కాయను 12 ముక్కలుగా కట్ చేస్తారు. ఈ లెక్కన ఒక ఆవకాయ ముక్క ఖరీదు రూ.10లు పడుతోంది.జాగ్రత్తలు తీసుకుంటేనే ఎక్కువ కాలం నిల్వ నిల్వ ఉండే ఊరగాయలు సొంతంగా పెట్టుకుంటేనే మంచిది. ఆవకాయ పెట్టినప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఏడాదిపాటు నిల్వ ఉంటాయి. నాణ్యమైన మామిడికాయలు తెచ్చుకోవాలి. నెంబర్ వన్ సరకులు ఉపయోగించాలి. గానుగ నూనె వాడటం మంచిది. మాగాయి, తొక్కుడు పచ్చడి వంటి వాటికి ఉప్పులో ఊరబెట్టి అప్పటికప్పుడు ఉప్పు కారం నూనె వంటివి కలుపుకుని వాడుకోవచ్చు. ఆవకాయ అలా కాదు కదా అన్ని ఒకేసారి కలుపుతాం కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. 50 మామిడి కాయలతో ఊరగాయ పెట్టాలంటే రూ.6 వేలకు పైగానే ఖర్చవుతోంది. తప్పని పరిస్థితుల్లో ఖర్చయినా ఇళ్లల్లో వాడకం కోసం పెట్టక తప్పడం లేదు. తయారు చేసిన ఆవకాయను పింగాణీ జాడీల్లో పెడితే పాడవకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండే అవకాశం ఉంది. ప్లాస్టిక్ డబ్బాల్లో ఉంచకూడదు. – విశ్వమోహిని, గృహిణి, ఉద్దండపురం(చదవండి: బలమైన ఎముకలకు బెస్ట్ ఇండియన్ గైడ్ ఇదే..! ఆ నాలుగింటిని మాత్రం..)

సన్నని సైజుకు లావైన డిస్కౌంట్..! ఇది మాములు ఆఫర్ కాదు..
థాయ్‌ల్యాండ్‌లోని ఓ రెస్టారెంట్, కస్టమర్స్‌కి విచిత్రమైన ఆఫర్ ఇస్తోంది. ఇక్కడ భోజనం ఆర్డర్ చేయడానికి ముందు ‘మెటల్ గేట్ చాలెంజ్’ అనే ఫిట్నెస్ టెస్ట్‌లో పాల్గొనాలి. అంటే ఒక ఐదు రకాల వెడల్పు అయిన మెటల్ బార్స్ మధ్య ఏర్పాటు చేసిన సన్నని సందు నుంచి బయటకు రావాలి. ఎంత సన్నని సందు నుంచి బయటకు వస్తే, అంత పెద్ద డిస్కౌంట్ ఇస్తారు. అలా ఐదు నుంచి ఇరవై శాతం వరకు డిస్కౌంట్ పొందచ్చు. అయితే, ఈ విషయం సోషల్ మీడియాలో వివిధ చర్చలకు దారితీసింది. చాలామంది ఫన్నీగా తీసుకున్నా, కొంతమంది మాత్రం దీనిని బాడీషేమింగ్గా పేర్కొంటూ మండిపడుతున్నారు. కాని, హోటల్ యజమానులు మాత్రం ‘ఇది ఆహారం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడానికి చేసిన వినోదాత్మక ప్రయోగం’ అని అంటున్నారు. View this post on Instagram A post shared by Ameana Finds (@ameana_finds) (చదవండి: అక్కడ తింటే.. పర్సు ఖాళీ!)

నటి ప్రియాంక మోహన్ ఇష్టపడే ఫ్యాషన్ బ్రాండ్స్ ఇవే..! ఎక్కడికెళ్లినా అది తప్పనిసరి..
ట్రెండ్స్ వెంట పరుగెత్తకుండా, సింపుల్ స్టయిలింగ్తోనే క్లాసీ లుక్ చూపించే నటి ప్రియాంక మోహన్. చీరలైనా, మోడర్న్ డ్రెసుల్లోనైనా తన ఫ్యాషన్ స్టేట్మెంట్ మాత్రం సింపుల్ అండ్ ఎలిగెన్స్గానే ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఎలిగెన్స్నూ చూపిస్తోంది ఈ ఫ్యాషన్ బ్రాండ్స్‌తో..ఫ్యాషన్‌లో ఎప్పుడూ స్థానాన్ని కోల్పోని క్లాసిక్ ఆభరణమే ఈ మల్టీ లేయర్ చోకర్. మగువ మెడను అంటిపెట్టుకొని ఉంటూ అందాన్ని వెంట తీసుకొని వస్తుంది. అందుకే, చోకర్స్పై మోజూ ఎప్పటికీ తరగనిది. సాధారణ చోకర్స్ మాదిరి కాకుండా రెండు నుంచి ఐదు వరుసల వరకు ముత్యాలు, వివిధ పూసలతో తయారుచేసే వీటికి మధ్యలో ఒక డాలర్ తగిలిస్తే వాటి అందం మరింత ఆకట్టుకునేలా మారుతుంది. కాటన్, సిల్క్, ఆర్గంజా చీరలు, లెహంగాలకు డీప్ నెక్ బ్లౌజులతో ధరిస్తే ఎవ్వరికైనా బాగా నప్పుతుంది. అనార్కలీలకు కూడా అద్భుతంగా మ్యాచ్ అవుతుంది ఈ చోకర్. అయితే, ఈ చోకర్ ధరించినప్పుడు మినిమల్ జ్యూలరీతో స్టయిల్ చేసుకోవడం ఉత్తమం. చెవులకు చిన్న స్టడ్స్, సింపుల్ ఉంగరం ధరించాలి. అలాగే హెయిర్ స్టయిల్స్ కూడా సింపుల్ బన్ లేదా వేవీ హెయిర్ స్టయిల్స్ ట్రై చేసి, చోకర్ అందాన్ని హైలెట్ చేసేయొచ్చు. వివాహాది శుభకార్యాలకు, స్పెషల్ డేస్‌కు ఈ టిప్స్‌తో స్టయిలింగ్ చేసి, మినిమలిస్టిక్ గ్రేస్‌ఫుల్ లుక్ సొంతం చేసుకోండి అచ్చం నటి ప్రియాంక మోహన్‌లా. "చర్మం ఎంత నేచురల్‌గా ఉంటే అంత అందంగా కనిపిస్తాం. అందుకే, మినిమల్ మేకప్‌నే ప్రిఫర్ చేస్తా. ఇక ఎక్కడికెళ్లినా సరే, సన్ స్క్రీన్ తప్పనిసరి. అంటోంది". ప్రియాంక మోహన్. (చదవండి: liposuction: సౌందర్య చికిత్సలు ఇంత డేంజరా..? పాపం ఆ మహిళ..)
ఫొటోలు


తిరుపతి: గంగమ్మ జాతర.. మాతంగి వేషంలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు (ఫొటోలు)


విశాఖపట్నం : ఆర్కే బీచ్‌లో సందర్శకుల సందడే సందడి (ఫొటోలు)


యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణ.. భారీగా పాల్గొన్న భక్తులు (ఫొటోలు)


వీరజవాన్ మురళీ నాయక్ అంతిమ వీడ్కోలు.. జైహింద్.. అమర్‌రహే నినాదాలు (ఫొటోలు)


‘లెవన్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)


మిస్ వరల్డ్ : అందాల ముద్దుగుమ్మలు సందడి.. (ఫొటోలు)


తిరుమల దర్శనం చేసుకున్న యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)


మదర్స్ డే స్పెషల్.. హీరోయిన్ ప్రణీత పిల్లల్ని చూశారా? (ఫొటోలు)


డాక్టర్ బాబు నిరుపమ్ భార్య బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)


వైభవంగా తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర (ఫొటోలు)
అంతర్జాతీయం

పాకిస్తాన్‌కు మద్దతుపై చైనా కీలక ప్రకటన
బీజింగ్: పాకిస్తాన్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, జాతీయ స్వాతంత్య్రం కోసం తమ మద్దతు కొనసాగుతుందని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ స్పష్టంచేశారు. పాక్‌కు అండగా ఉంటామని ఉద్ఘాటించారు. ఆయన శనివారం పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాఖ్ దార్‌తో ఫోన్లో మాట్లాడారు. భారత్–పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, తాజా పరిణామాలను ఇషాఖ్ దార్ వివరించారు.ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లోనూ పాకిస్తాన్ నాయకత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని వాంగ్ యీ ప్రశంసించారు. పాక్ సంయమన ధోరణిని కొనియాడారు. మిత్రదేశమైన పాక్‌కు తమ మద్దతు ఉంటుందని స్పష్టంచేశారు. మరోవైపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్, తుర్కియే విదేశాంగ మంత్రి హకన్ ఫిదాన్తోనూ ఇషాఖ్ దార్ ఫోన్లో మాట్లాడారు.

భారత్‌పై పాక్ ప్రధాని ఓవరాక్షన్ కామెంట్స్.. నెటిజన్లు ఫైర్
ఇస్లామాబాద్: సరిహద్దుల్లో మూడు రోజులుగా జరుగుతున్న భీకర పోరులో అమెరికా మధ్యవర్తిత్వంతో భారత్, పాకిస్తాన్ మధ్య శనివారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన కొద్ది గంటల్లోనే పాకిస్తాన్ తన వక్రబుద్ధిని చాటుకుంటూ రెచ్చగొట్టే విధంగా సరిహద్దులో కాల్పులు జరిపింది. అంతటితో ఆగకుండా.. పాక్ ప్రధాని విచిత్రంగా తమదే గెలుపు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత షెహబాజ్ షరీఫ్ పాకిక్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్బంగా షరీఫ్ మాట్లాడుతూ.. భారత్‌తో యుద్ధంలో తాము విజయం సాధించినట్టు పేర్కొన్నారు. తమ దేశాన్ని, తమ పౌరులను రక్షించుకోవడానికి తాము ఏది చేయడాకైనా వెనుదిరిగేది లేదన్నారు. పాక్‌ను ఎవరైనా సవాల్ చేస్తే వారిని విడిచి పెట్టే ప్రసక్తే లేదని వెల్లడించారు. భారత్ తమ దేశంలోని మసీదులు, సామాన్య పౌరులపై డ్రోన్స్, మిస్సైల్స్ తో దాడులు చేసిందని.. అనేకమంది సాధారణ పౌరుల చావుకు భారత్ కారణమైందని మండిపడ్డారు. తమదేశంపై నిరాధార ఆరోపణలు కూడా చేస్తుందని.. భారత్‌కు తగిన బుద్ధి చెప్పామని.. తమ జోలికి వస్తే ఏదైనా చేయగలమని చూపించామంటూ ఓవరాక్షన్ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.JUST IN: 🇵🇰🇮🇳 Pakistani PM Shehbaz Sharif declares victory over India.pic.twitter.com/go5V3JsGN8— Whale Insider (@WhaleInsider) May 10, 2025 12 Pakistan air bases destroyed, many of their jets shot down by the Indian Army… hundreds of terrorists killed deep inside Pakistan territory.Yet this man, with zero iota of shame, Shehbaz Sharif, says we have won against India. 🤡🤡 pic.twitter.com/qoI7u7NKYY— BALA (@erbmjha) May 10, 2025 ఇక, ఈ వీడియోపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. పాక్ ప్రధాని తీరును ఎండగడుతున్నారు. అమెరికా మధ్యలోకి రాకపోతే పాకిస్తాన్ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. భారత్ దాడులను తట్టుకోలేక తోక ముడిచి.. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్‌కు ఇంత నష్టం జరిగినా మీది ఎలా గెలుపు అవుతుందని ప్రశ్నిస్తున్నారు. 🇵🇰Pakistan Prime Minister Shehbaz Sharif tweets, praises trump & declares victory over India: “We have won, this is victory.”Also, Pakistani people are celebrating victory all over the country.THIS IS SHAMELESS 🤮🤮 pic.twitter.com/1N9YhfGrya— Vaishnavi (@vaishu_z) May 10, 2025 Shehbaz Sharif won the war in twitter 😂 pic.twitter.com/TTGaMKN86t— Mr. Nice Guy (@Mr__Nice__Guyy) May 10, 2025 ఇదిలా ఉండగా.. ఒకవైపు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే, మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంలో కీలక పాత్ర పోషించినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా, సౌదీ అరేబియా తదితర దేశాలకు పాక్ ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడాన్ని యునైటెడ్ కింగ్డమ్, సౌదీ అరేబియా స్వాగతించాయి. ఉద్రిక్తతల నివారణకు ఇది కీలకమైన ముందడుగు అని యూరోపియన్ యూనియన్ పేర్కొంది. ఈ ఒప్పందానికి కట్టుబడి ఉండేలా అన్ని ప్రయత్నాలు జరగాలని ఆకాంక్షించింది. Shehbaz Sharif knows the nation is uneducated and will believe whatever they're told, so he quickly declared victory. He's totally an army puppet. It's honestly laughable to watch him.🤣🤣🤣 #ceasefire #PakistanIndianWar pic.twitter.com/dDUr5ONLhI— Sandeep Pathak⛳ (@iPandit_Pathak) May 10, 2025Pakistan PM Shahbaz Sharif, "we won the war against India. Our attack destroyed the enemy's Air Bases".- Welcome to comedy nights hosted by a country's PM in front of the media. pic.twitter.com/gbcaKX64En— Mufaddal Vohra (@mufaddal_vohra) May 10, 2025

బంగ్లాదేశ్ షేక్ హసీనాకు బిగ్ షాక్
ఢాకా/న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో ముహమ్మద్ యూనుస్ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వం మాజీ మహిళా ప్రధానమంత్రి షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీని నిషేధించింది. ఉగ్రవ్యతిరేక చట్టం నిబంధనల ప్రకారం అవామీ లీగ్‌ను నిషేధించినట్లు శనివారం సాయంత్రం అక్కడి తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది. సలహాదారుల మండలి(కేబినెట్) నిర్ణయం మేరకే నిషేధం విధించామని, నిషేధానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను త్వరలోనే ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది.అవామీ లీగ్, ఆ పార్టీ అగ్ర నేతలపై అంతర్జాతీయ నేరాల ట్రిబ్యూనల్‌లో కొనసాగుతున్న కేసుల విచారణ ముగిసేదాకా ఈ రాజకీయ పార్టీపై నిషేధం అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టంచేసింది. షేక్‌హసీనా సారథ్యంలోని ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు 2024 జూలైలో ఉద్యమించిన విద్యార్థి సంఘాలు, నేతలు, సాక్షుల భద్రత, పరిరక్షణ కోసం అవామీ పార్టీపై నిషేధాజ్ఞలు అమలుచేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. 1949లో అవామీ లీగ్ పార్టీ ఏర్పడింది. తూర్పు పాకిస్తాన్‌లోని బెంగాళీలకు స్వయంప్రతిపత్తి హక్కులు దఖలుపడాలన్న లక్ష్యంతో అప్పట్లో అవామీ లీగ్ ఉద్యమం చేసింది. చివరకు స్వతంత్ర బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కారణమైంది.🇧🇩 In Bangladesh, students and the public have been continuously protesting for the past 48 hours, demanding a ban on the Awami League, the party of former autocratic and murderous Prime Minister Sheikh Hasina. ✊ #HasinaOut #BanAwamiLeague #BangladeshCrisis pic.twitter.com/YueL4gwhc4— Ibnul Wasif Nirob (@Wasifvibes) May 10, 2025NEW! #Bangladesh’s interim government on Saturday banned deposed prime minister Sheikh Hasina’s Awami League under anti-terrorism law.The announcement to ban Hasina’s Awami League came after the student-led newly-floated National Citizen Party (NCP) activists rallied since… pic.twitter.com/0Zwfd6DdU1— DOAM (@doamuslims) May 10, 2025

కమికాజ్ డ్రోన్లను ప్రయోగించిన పాక్
న్యూఢిల్లీ: స్వార్న్ డ్రోన్లతోపాటు కమికాజ్ డ్రోన్లను భారత్‌లో విధ్వంసానికి పాకిస్తాన్ ప్రయోగించగా భారత్ వాటిని విజయవంతంగా అడ్డుకుని ముక్కలుచెక్కలు చేసింది. పహల్గాం ఉదంతం తర్వాత భారత్, పాక్ మధ్య మొదలైన సైనిక చర్యల పర్వంలో పాకిస్తాన్ ఈ కామికాజి డ్రోన్లను ఉపయోగించడం ఇదే తొలిసారి అని రక్షణరంగ నిపుణులు శనివారం వెల్లడించారు. గతంలో అర్మేనియా–అజర్బైజాన్ సాయుధ సంఘర్షణలో, ప్రస్తుతం రష్యా–ఉక్రెయిన్ యద్ధంలో ఈ కమికాజ్ డ్రోన్ల వినియోగం ఎక్కువైంది. ఇప్పుడు భారత్ పైకి పాకిస్తాన్ కమికాజ్ డ్రోన్లను పెద్ద ఎత్తున ప్రయోగించడంతో ఈ తరహా డ్రోన్లపై చర్చ మొదలైంది. కమికాజ్ డ్రోన్‌ను ఆత్మాహుతి డ్రోన్‌గా పేర్కొంటారు. బాంబును లేదా క్షిపణిని మోసుకొస్తూ సంబంధిత లక్ష్యంగా బాంబు/క్షిపణిని జారవిడవడం లేదంటే స్వయంగా అదే కూలిపోయి, పేలిపోవడం ఈ కమికాజ్ డ్రోన్ ప్రత్యేకత. విరుచుకుపడిన వందల కొద్దీ డ్రోన్లు మే 8వ తేదీ అర్ధరాత్రి తర్వాత లేహ్ నుంచి సర్ క్రీక్ ఉప్పుకయ్య దాకా 36 వేర్వేరు ప్రదేశాల గుండా సరిహద్దు ఆవలి నుంచి దాదాపు 400 డ్రోన్లు దూసుకొచ్చాయి. దీంతో క్షణాల్లో అప్రమత్తమైన పలు రకాలైన భారత గగనతల రక్షణ వ్యవస్థలు ఈ డ్రోన్లను అడ్డుకుని కూల్చేశాయి. భారత్ ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన సాంకేతికతతో గగనతల రక్షణ వ్యవస్థను పటిష్టం చేసిన కారణంగానే ఈ డ్రోన్లను నిరీ్వర్యం చేయగలిగిందని, లేదంటే తీవ్ర నష్టం చవిచూడాల్సి వచ్చేదని రక్షణ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంబడి ఈ డ్రోన్లను కూల్చేశాక వీటి శకలాలను భారత మిలటరీ అధికారులు ల్యాబ్‌లకు తరలించి పరిశీలించడంతో ఇవి కమికాజ్ రకానికి చెందినవని నిర్ధారించారు. పంజాబ్, రాజస్తాన్‌లలో ఈ తరహా డ్రోన్ల శకలాలు లభించాయి. తుర్కియే నుంచే తెప్పించారు తుర్కియే దేశంలోని అసిస్‌గార్డ్ సోన్‌గర్ డ్రోన్ కంపెనీ ఈ కామికాజి డ్రోన్లను తయారుచేస్తుంది. దీంతో వీటిని పాకిస్తాన్ తుర్కియే నుంచే తెప్పించినట్లు స్పష్టమైంది. శనివారం తెల్లవారుజామున సైతం బైకర్ వైఐహెచ్ఏ– ఐఐఐ కమికాజ్ డ్రోన్లు పంజాబ్, రాజస్తాన్ సరిహద్దుల గుండా భారత గగనతలంలోకి వచ్చాయి. వీటిని ఎయిర్ డిఫెన్స్ గన్స్‌తో నేలమట్టం చేశామని రక్షణ శాఖ అధికారులు ప్రకటించారు. ఎందుకీ పేరు? కమికాజ్ అనేది జపాన్ పేరు. జపాన్ వైమానిక దళంలోని ఎయిర్‌ఫోర్స్ ప్రత్యేక దళం ఇది. ఇది ఆత్మాహుతి ఫైటర్ పైలట్ల విభాగం. రెండో ప్రపంచ యుద్ధకాలంలో శత్రుదేశాల యుద్ధనౌకలను పేల్చేసేందుకు జపాన్ పైలట్లు తమ యుద్ధవిమానాలను వాటితో ఢీకొట్టించేవారు. అలా రెండో ప్రపంచ యుద్ధకాలంలో దాదాపు 3,800 మంది కమికాజ్ పైలట్లు ఆత్మాహుతి దాడులతో ఏకంగా 7,000 మంది శత్రుదేశాల నావికా సిబ్బందిని చంపేశారు. ఈ స్ఫూర్తితో తయారుచేసిన డ్రోన్లకు కమికాజ్ అని పేరుపెట్టారు.
జాతీయం

పాక్ తూటాలకు... క్షిపణులతో బదులివ్వండి
న్యూఢిల్లీ: సీమాంతర ఉగ్రవాదం పట్ల భారత్ ప్రతిస్పందన ఇకపై సరికొత్త రీతిలో ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. ‘‘పాక్‌తూటాలకు కచ్చితంగా క్షిపణులతో సమాధానం చెప్పండి. అది చేపట్టే ఒక్కో దుశ్చర్యకూ కలలో కూడా ఊహించనంత బలంగా బదులివ్వండి’’ అని సైనిక దళాలను ఆదేశించాశారు. త్రివిధ దళాల అధినేతలతో ఆయన ఆదివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ సిందూర్‌పై విస్తృతంగా చర్చించారు. పాక్ దాడులను సహించడానికి ఏ మాత్రమూ వీల్లేదంటూ మోదీ స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై, ముష్కరులపై ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా ముగియలేదని స్పష్టంచేశారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే చెల్లించాల్సిన మూల్యం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. కశ్మీర్ అంశంలో విదేశీ మధ్యవర్తిత్వాన్ని అంగీకరించేది లేదని పునరుద్ఘాటించారు. పాకిస్తాన్‌తో జరిగే ఏ చర్చలైనా సరే కేవలం పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)ను, పాక్‌లో దాక్కున్న ఉగ్రవాదులను భారత్‌కు అప్పగించడంపైనే ఉంటాయని కేంద్రం తేల్చిచెప్పింది. చట్టవిరుద్ధంగా ఆక్రమించుకున్న పీఓకేను, ఉగ్రవాద మూకలను భారత్‌కు అప్పగించాల్సిందేనని, పాక్‌కు మరో గత్యంతరం లేదని స్పష్టం చేసింది. ‘‘ఆ దేశంతో చర్చలు వీటిపై మాత్రమే జరుగుతాయి. అది కూడా కేవలం డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) స్థాయిలో మాత్రమే కొనసాగుతాయి’’ అని కేంద్రం ఉద్ఘాటించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ సహా ఉగ్రవాదుల అప్పగింతపై తప్ప మరో అంశంపై చర్చించే ప్రసక్తే లేదని తెలిపింది. ఉగ్రవాదానికి పాక్ మద్దతు కొనసాగుతున్నంత కాలం సింధూ నది జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం తథ్యమని పేర్కొంది. విదేశాంగ మంత్రులు, లేదా జాతీయ భద్రతా సలహాదారుల స్థాయిలో చర్చలు జరగాలని పాక్ ప్రతిపాదిస్తుండగా అందుకు భారత్‌కు అంగీకరించడం లేదు.దాడి చేస్తే గట్టిగా ఎదురుదెబ్బజేడీ వాన్స్‌కు మోదీ స్పష్టీకరణ న్యూఢిల్లీ/వాషింగ్టన్: పాకిస్తాన్ ఒకవేళ భారత్‌పై మళ్లీ దాడికి దిగితే అంతకంటే గట్టిగానే ఎదురుదెబ్బ తీస్తామని అమెరికాకు మోదీ తేల్చిచెప్పారు. తమ ప్రతిస్పందన అత్యంత తీవ్రస్థాయిలో, దాయాదికి వినాశకరంగా ఉంటుందని స్పష్టంచేశారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ శనివారం మోదీతోఫోన్‌లో మాట్లాడారు. కాల్పుల విరమణ ఒప్పందం గురించి ప్రస్తావించారు. అనంతరం విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, పాక్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్‌తో కూడా వాన్స్ చర్చించారు. పాక్ కాల్పులు ఆపితేనే సంయమనం పాటిస్తామని అమెరికాకు భారత్ తేల్చిచెప్పినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. భారత్–పాక్ ఘర్షణల గురించి అమెరికా నిఘా వర్గాల నుంచి ఆందోళనకరమైన సమాచారం అందిన కారణంగానే మోదీ తో వాన్స్ మాట్లాడారని సమాచారం. సున్నితమైన అంశం కావడంతో బయటకు వెల్లడించలేదని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆర్మీ కమాండర్లకు పూర్తి స్వేచ్ఛ పాక్ దాడులను తిప్పికొట్టాలని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ఆదేశం న్యూఢిల్లీ: సరిహద్దుల్లో పాకిస్తాన్ సైన్యం దాడులకు దిగితే గట్టిగా ప్రతిస్పందించాలని, తగిన రీతిలో బుద్ధి చెప్పాలని ఆర్మీ కమాండర్లకు సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆదేశాలు జారీ చేశారు. దాడులను తిప్పికొట్టే విషయంలో వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. సైనిక చర్యలు నిలిపివేస్తూ అంగీకారానికి వచ్చినట్లు భారత్, పాక్ శనివారం ప్రకటించడం తెలిసిందే. అయినప్పటికీ పాక్ సైన్యం కవి్వంపు చర్యలకు పాల్పడింది. శనివారం రాత్రి సరిహద్దుల్లో కాల్పులు జరపగా, భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. ఈ పరిణామాలపై ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది సమీక్ష జరిపారు. మరోసారి పాక్ సైన్యం కాల్పులకు గట్టిగా ప్రతిస్పందించాలని ఆదేశించారు. ఈ విషయంలో ఆర్మీ కమాండర్లకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ఆయన తేల్చిచెప్పారు.

మరోసారి కాల్పులు జరిపితే అంతు చూస్తాం..పాక్‌కు ఇండియన్ ఆర్మీ వార్నింగ్
ఢిల్లీ: ఉగ్రవాదం నిర్మూలనే లక్ష్యంతో తలపెట్టిన ఆపరేషన్ సిందూర్‌తో సుమారు 100మందికి పైగా ఉగ్రవాదుల్ని హత మార్చినట్లు త్రివిధ దళాల డీజీఎంవోలు (డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్) మీడియా సమావేశంలో వెల్లడించారు. ఉగ్రవాదం అంతానికి ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించాంఉగ్రవాద శిబిరాలను మాత్రమే టార్గెట్ చేశాంఉగ్రవాద ట్రైనింగ్ సెంటర్లను ముందే గుర్తించాందాడికి ముందే ట్రైనింగ్ సెంటర్లను ఖాళీ చేశారుమురిద్కేలో ఉగ్రవాద ట్రైనింగ్ క్యాంపులను తొలిసారి నాశనం చేశాంఅజ్మల్ కసబ్,డేవిడ్ హెడ్లీ లాంటి వాళ్లు ఇక్కడే ట్రైనింగ్ తీసుకున్నారు9 ఉగ్రవాదుల క్యాంపులపై దాడి చేశాం100 మంది ఉగ్రవాదులు ఎయిర్ స్ట్రైక్‌లో హతమయ్యారుమేం ఎయిర్ స్ట్రైక్ చేసిన తర్వాత పీవోకే వద్ద పాక్ కాల్పులు జరిపిందిఉగ్రవాద శిబిరాలపై దాడి వీడియోలు, ఆ వీడియోల్ని విడుదల చేస్తున్నాంపాకిస్తాన్ మాత్రం ప్రార్ధనా స్థలాలు,స్కూళ్లను టార్గెట్ చేసింది.ఉగ్రవాదులు వారికి సంబంధించిన స్థలాలు మాత్రమే టార్గెట్ చేశాంలాహోర్ నుంచి డ్రోన్,యూఏవీలతో భారత ఎయిర్ బేస్‌లను, ఆర్మీ క్యాంపులను టార్గెట్ చేసింది.గైడెడ్ మిస్సైల్స్‌తో ఉగ్రవాదుల శిబిరాల్ని ధ్వంసం చేశాంలాహోర్‌లో ఎయిర్ డిఫెన్స్ సిస్టంను నాశనం చేశాం లాహోర్ నుంచి డ్రోన్,యూఏవీలతో భారత ఎయిర్ బేస్‌లను, ఆర్మీ క్యాంపులను టార్గెట్ చేసింది.గైడెడ్ మిస్సైల్స్‌తో ఉగ్రవాదుల శిబిరాల్ని ధ్వంసం చేశాంలాహోర్‌లో ఎయిర్ డిఫెన్స్ సిస్టంను నాశనం చేశాంఈనెల 8,9వ తేదీవరకు శ్రీనగర్ నుంచి నలియా వరకు డ్రోన్లతో దాడులు చేసిందిఈ నెల 7 నుంచి 10వ తేదీల మధ్యలో 35 నుంచి 40 మంది పాక్ సైనికులు మృతి చెందారు మరోసారి కాల్పులు జరిపితే పాక్‌ను వదిలిపెట్టంనిన్న మధ్యాహ్నం 3.15గంటలకు పాక్ డీజీఎంవో మాకు ఫోన్ చేశారుకాల్పుల విమరణకు అంగీకరించాలని పాక్ ప్రాధేయ పడిందివిరమణకు అంగీకరించాంకాల్పుల విరమణకు అంగీకరించామో లేదో.. కొన్ని గంటల్లోనే పాక్ కాల్పులకు విమరణకు పాల్పడిందికాల్పులు జరిపింనందుకు పాక్‌కు వార్నింగ్ మెసేజ్ పంపాంఒకవేళ ఈ రోజు రాత్రి కాల్పులు జరిపితే పాక్‌పై దాడి చేసేందుకు ఇండియన్ ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఉందిమరోసారి కాల్పులు జరిపితే పాక్ అంతు చూస్తాంపాక్ కాల్పుల్లో చనిపోయిన సైనికులకు మా నివాళులుఆపరేషన్ సిందూర్‌లో ఐదుగురు భారత సైనికులు అమరులయ్యారుభారత సైనికుల త్యాగం వృధా కాదుఈ రోజు రాత్రి ఏం జరుగుతుంతో మానిటర్ చేస్తున్నాం

‘ఇది చాలా బాధాకరం.. మనం ఏమైనా ఆటవిక రాజ్యంలో ఉన్నామా?’
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ ల మధ్య కాల్పుల విరమణ అంగీకారాన్ని భారత విదేశాంగా కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రకటించిన తర్వాత ఆయన ట్రోలింగ్ బారిన పడ్డారు. విక్రమ్ మిస్రీని ఆయన కుటుంబంపై కొంతమంది పనిగట్టుకుని విమర్శలకు దిగారు. దీన్ని ప్రధాన పార్టీలన్నీ ఖండించాయి. ప్రజాస్వామ్య యుత దేశంలో ఉన్న మనం ఈ రకంగా ఓ అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తిని, కీలక ఆపరేషన్ సంబంధించిన వివరాలను వెల్లడించిన క్రమంలో విక్రమ్ మిస్రీని విమర్శించడం తగదంటూ పలువురు నేతలు ఖండించారు.విక్రమ్ మిస్రీపై విమర్శల చేయడాన్నిభారత మాజీ విదేశాంగశాఖ మంత్రి, కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ తీవ్రంగా ఖండించారు. ‘ మిస్రీని టార్గెట్ చేస్తూ కొందరు విమర్శలు చేయడం చాలా బాధాకరం. విక్రమ్ మిస్రీతో పాటు కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ లది ఆపరేషన్ సిందూర్ లో ఓ కీలక పాత్ర. అత్యున్నత స్థాయిలో తీసుకున్న నిర్ణయాన్ని విక్రమ్ మిస్రీ మీడియాకు వెల్లడించారు. ఇందులో ఆయన తప్పేముంది. నాగరిక సమాజంలో ఉన్న మనం ఇలా ఓ వ్యక్తిని ఎలా ట్రోల్ చేస్తాం. విక్రమ్ మిస్రీని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విమర్శలు చేశారు. ఇది చాలా చాలా బాధాకరం. మనం ఏమైనా ఆటవిక రాజ్యంలో ఉన్నామా?, మన హక్కుల్ని కాపాడుకునే ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం మనం. ఈ రకంగా ట్రోలింగ్ చేసి అధికారులపై మానసికంగా ఒత్తిడి కలిగేలా చేయడం సరైంది కాదు’ అంటూ సల్మాల్ ఖుర్షీద్ ధ్వజమెత్తారు.థాంక్స్ చెప్పడం రాకపోతే..నోరు మూసుకుని కూర్చోండిఅంతకుముందు మరొక కాంగ్రెస్ నాయకుడు సల్మాన్ అనీస్ సోజ్ కూడా విక్రమ్ మిస్రీని కొంతమంది ట్రోల్ చేయడాన్ని తప్పుబట్టారు. కశ్మీర్ కు చెందిన విక్రమ్ మిస్రీ దేశ గౌరవాన్ని నిలబెట్టేలా తన కర్తవ్యాన్ని నిర్వర్తించారు. ఆయన దేశానికి చేసిన సేవలకు మనం ఇచ్చే గౌరవం విమర్శలా?, చేసిన దానికి కృతజ్ఞత చెప్పే సంస్కృతి లేకపోతే నోరు మూసుకుని కూర్చోవడం మంచిది’ అంటూ హితవు పలికారు.Vikram Misri, a Kashmiri, has done India proud. No amount of trolling can diminish his service to the country. If you can't say thank you, learn to shut up.— Salman Anees Soz (@SalmanSoz) May 11, 2025 నిజాయితీ, కష్టపడే తత్వం కల్గిన వ్యక్తి విక్రమ్ మిస్రీనిజాయితీ, కష్టపడే తత్వం కల్గిన వ్యక్తి విక్రమ్ మిస్రీ అంటూ ఏఐఎంఐఎం చీఫ్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. ఆ తరహా వ్యక్తిని ట్రోల్ చేయడం ఎంతమాత్రం సమంజసం కాదని విమర్శలకునుద్దేశించి ట్వీట్ చేశారు. కార్యనిర్వహక వ్యవస్థలో సేవ చేసే వారిని గౌరవించడం నేర్చుకోవాలని ఆయన పేర్కొన్నారు. కార్యనిర్వహక వ్యవస్థలో ఉన్న వారిని విమర్శించడం ఎంతమాత్రం కరెక్ట్ కాదన్నారు ఓవైసీ. Mr Vikram Misri is a decent and an Honest Hard working Diplomat working tirelessly for our Nation.Our Civil Servants work under the Executive this must be remembered & they shouldn’t be blamed for the decisions taken by The Executive /or any Political leadership running Watan E… https://t.co/yfM3ygfiyt— Asaduddin Owaisi (@asadowaisi) May 11, 2025

పీవోకే విషయంలో ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు: మోదీ
ఢిల్లీ: పీవోకేపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ విషయంలో తమ వైఖరిని ఎట్టిపరిస్థితుల్లోనూ మార్చుకునేది లేదని తేల్చి చెప్పారు.. పీవోకేను మాకు అప్పగించడం తప్ప పాక్‌కు వేరే మార్గం లేదన్నారు మోదీ. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియ లేదని, పాక్ కాల్పులు జరిపితే భారత్ దాడులు చేయడం ఖాయమన్నారు.. ‘వాళ్లు (పాక్) ఒక్క తూటా పేలిస్తే.. మీరు క్షిపణితో దాడి చేయండి’ అంటూ త్రివిధ దళాలకు మోదీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. రేపు పాకిస్తాన్‌తో చర్చల వేళ భారత్ వైఖరి ఏమిటో ప్రధాని మోదీ ఒక్కరోజు ముందుగానే ప్రపంచానికి తేల్చి చెప్పారు. పీవోకే విషయంలో అవసరమైతే తాను మధ్యవర్తిత్వం వహిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అసలు పీవోకే విషయంలో తమకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని, దానిని పాక్ తమకు అప్పగించడం తప్పితే మరో మార్గం లేదని మోదీ వ్యాఖ్యానిండంతో ట్రంప్ దీనికి మధ్యవర్తిత్వం వహించాల్సిన అవసరం లేదనే విషయాన్ని మోదీ సూటిగా చెప్పేశారు.ఆపరేషన్ సిందూర్‌పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్,సీడీఎస్‌తో పాటు త్రివిధ దళాదిపతులు హాజరయ్యారు.ఈ సమావేశంలో ప్రధాని మోదీ పీవోకే విషయంలో ప్రపంచ దేశాలకు ఓ సందేశాన్ని పంపించారు. అదే సమయంలో పాక్‌కు గట్టిగా బదులివ్వాలని త్రివిధ దళాలకు ఆదేశాలివ్వడం సంచలనంగా మారింది #WATCH | Delhi: Prime Minister Narendra Modi chairs a meeting at 7, LKM. Defence Minister Rajnath Singh, EAM Dr S Jaishankar, NSA Ajit Doval, CDS, Chiefs of all three services present. pic.twitter.com/amcU1Cjmbu— ANI (@ANI) May 11, 2025కాగా, భారత్, పాకిస్తాన్ల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతలు. ఆపై చోటు చేసుకున్న కాల్పుల విరమణ అంగీకారంతో పరిస్థితులు సద్దుమణిగాయి.పాకిస్తాన్ కాళ్ల బేరానికి డైరెక్ట్‌గా భారత్‌ను ఆశ్రయించకపోయినా అమెరికా అడ్డం పెట్టుకుని కాల్పుల విరమణకు వచ్చారన్నది జగమెరిగిన సత్యం. భారత్, పాక్‌లు కాల్పుల విరమణకు అంగీకారం అంటూ ముందుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించడమే ఇందుకు ఉదాహరణ. ఇక్కడ యుద్ధానికి కాలుదువ్వింది పాకిస్తాన్.. అసలు కాల్పులకు పాల్పడుతోంది ఎవరు?. అది పాకిస్తాన్ కాదా?. అందుకు పహల్గామ్ ఘటన సాక్ష్యం కాదా?. మరి కాల్పుల విరమణ అనేది ఇక్కడ కేవలం పాకిస్థాన్‌కే వర్తిస్తుందనేది ప్రపంచానికి అంతటికీ అర్థమైంది.అయితే కాల్పులు విరమణ అంగీకారం అన్న మూడు గంటల వ్యవధిలోనే పాక్ మళ్లీ దానిని ఉల్లంఘించి భారత్ పై కాల్పులకు దిగింది. దీన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టిన భారత్.. పాకిస్తాన్ దుస్సాహసాన్ని మళ్లీ ప్రపంచం ముందు ఉంచకల్గింది. ఈ పరిస్థితుల నడుమ దాయాది పాకిస్తాన్‌ను అంత త్వరగా నమ్మలేమన్నది కూడా తేలిపోయింది. అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్‌ను భారత్ కొనసాగించనుంది. ఈ విషయాన్ని భారత ఆర్మీ స్పష్టం చేసింది కూడా. పాక్ ఏమైనా దుశ్చర్యలకు పాల్పడితే ఆపరేషన్ సిందూర్ సిద్ధంగానే ఉందనే సంకేతాలిచ్చింది భారత్.
ఎన్ఆర్ఐ

వైట్‌హౌస్‌లో కోనసీమ వాసికి కీలక బాధ్యత
ఐ.పోలవరం: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ కేంద్రంగా పనిచేసే సైబర్ సెక్యూరిటీ, మౌలిక సదుపాయాల భద్రతా సంస్థకు డిప్యూటీ డైరెక్టర్ (డీడీ)గా తెలుగు వ్యక్తి డాక్టర్ గొట్టుముక్కల మధు (Gottumukkala Madhu) నియమితులయ్యారు. మధు తల్లిదండ్రులు గొట్టుముక్కల వెంకట సూర్య సత్యనారాయణరాజు (కొండరాజు), సత్యవాణి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం కేశనకుర్రు (Kesanakurru) గ్రామానికి చెందినవారు. మధు కాకినాడలో ఇంటర్ చదువుకొని ఏలూరులో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అమెరికాలోని టెక్సాస్‌లో ఎంఎస్, ఎంబీఏ చేశారు. మోటోరోలా, శాంసంగ్ కంపెనీల్లో పనిచేశారు. ప్రస్తుతం అమెరికన్ సైబర్ సెక్యూరిటీ విభాగం (CISA)లో డిప్యూటీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.చదవండి: అమరావతి ఐకానిక్.. అమాంతం పెరిగిన ఐదు ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయం

సలహా కమిటీ అడుగులు ముందుకు..
మోర్తాడ్ (బాల్కొండ): తెలంగాణ ప్రవాసీ విధానం (ఎన్ఆర్ఐ పాలసీ) రూపకల్పన, గల్ఫ్ బోర్డు ఏర్పాటు కోసం నిర్దేశించిన గల్ఫ్ సలహా కమిటీ అడుగులు ముందుకు పడ్డాయి. సలహా కమిటీ బాధ్యతలను స్వీకరించిన వారం రోజులలోనే యూఏఈలో ఒక దుర్ఘటన చోటు చేసుకోవడం, ఈ అంశంలో కమిటీ సభ్యులు వేగంగా స్పందించి మృతదేహాలను స్వదేశానికి తెప్పించడంతో బాధిత కుటుంబాలకు ఊరట లభించింది.యూఏఈలోని ఆల్‌కూజ్ ప్రాంతంలోని బేకరీలో పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి చేతిలో నిర్మల్ జిల్లా సోన్‌కు చెందిన ప్రేమ్‌సాగర్, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమన్నపేట్‌కు చెందిన స్వర్గం శ్రీనివాస్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈనెల 11న వీరు హత్యకు గురి కాగా వారం రోజుల వ్యవధిలోనే మృతదేహాలను స్వదేశానికి తెప్పించారు. ఇందులో సలహా కమిటీ కీలకపాత్ర పోషించింది. గల్ఫ్ సలహా కమిటీ చైర్మన్ వినోద్‌కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, ఇతర సభ్యులు ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారులతో యూఏఈ ఘటనపై చర్చించారు. సీఎంవో నుంచి కేంద్ర ప్రభుత్వానికి, విదేశాంగ శాఖకు సమాచారం అందించడంతో వారం రోజులలోనే మృతదేహాలను స్వదేశానికి తీసుకురాగలిగారు. గతంలో గల్ఫ్‌లో ఎవరైనా మరణిస్తే మృతదేహం ఇంటికి రావడానికి నెల రోజుల వరకు సమయం పట్టేది. బాధిత కుటుంబాలకు భరోసా యూఏఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. సలహా కమిటీ విజ్ఞప్తి మేరకు బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. హత్యకు గురైన వ్యక్తుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ విధానంలో ఏదైనా ప్రభుత్వ శాఖలో ఉద్యోగం ఇవ్వాలని సూచించారు. గల్ఫ్ భరోసా కింద రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.అంత్యక్రియలకు ప్రభుత్వ సాయం స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు జగిత్యాల జిల్లా కలెక్టర్ రూ.15 వేల ఆర్థికసాయం మంజూరుచేశారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా మరణిస్తే వారి అంతిమ సంస్కారాలకు మాత్రమే ప్రభుత్వ సాయం అందుతుంది. గల్ఫ్‌లో హత్యకు గురైన ఘటనను మానవతా దృక్పథంతో పరిగణనలోకి తీసుకున్న జగిత్యాల జిల్లా (Jagtial District) కలెక్టర్ సత్యప్రసాద్ తన విచక్షణాధికారాలను ఉపయోగించుకుని స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించారు.చదవండి: స్మిత సబర్వాల్ ధిక్కార స్వరం!శనివారం జరిగిన శ్రీనివాస్ అంతిమ యాత్రలో ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పాల్గొని పాడె మోశారు. ఆయన కూడా సొంతంగా రూ.10 వేల సాయం అందించారు. ఇద్దరు మృతుల ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రకటించారు. సలహా కమిటీ ఏర్పడిన వెంటనే గల్ఫ్ ప్రవాసులకు ప్రయోజనం కల్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంపై గల్ఫ్ కార్మిక కుటుంబాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాయి.

టంపాలో నాట్స్ సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లు
ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అమెరికాలో అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల నిర్వహణ కోసం కసరత్తు ముమ్మరంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లను టంపాలో నాట్స్ నిర్వహించింది. మొత్తం 12 వాలీబాల్ జట్లు, 5 మహిళా త్రోబాల్ జట్లు, 350 మందికిప గా తెలుగు క్రీడాకారులు ఈ టోర్నమెంట్లతో తమ ప్రతిభను చాటేందుకు పోటీ పడ్డారు. క్రీడాకారులను ప్రోత్సాహించేందుకు వారి కుటుంబ సభ్యులు కూడా రావడంతో క్రీడా ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది. మహిళల త్రోబాల్ టోర్నమెంట్లో మొదటి బహుమతిని సన్‌షైనర్స్ జట్టు కైవసం చేసుకుంది. పురుషుల వాలీబాల్ టోర్నమెంట్ ఛాంపియన్లుగా డైనమిక్ రచ్చ జట్టుగా నిలిచింది. టోర్నమెంట్ విజేతలకు బహుమతులు జూలై 4 నుండి 6 వరకు జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో బహుమతులు పంపిణి చేయనున్నారు. నాట్స్ కమ్యూనిటీ సేవల బృందం నుండి రంజిత్ పాలెంపాటి అవిశ్రాంత కృషి ఈ టోర్నమెంట్లు దిగ్విజయంగా జరగడంలో కీలక పాత్ర పోషించింది.నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కోసం జరుగుతున్న ఏర్పాట్లను నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది తెలిపారు. క్రీడాకారులు టోర్నమెంట్లో చూపిన క్రీడాస్ఫూర్తిని మల్లాది ప్రశంసించారు. ( మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, మాధవి యార్లగడ్డ, అపర్ణ కొడాలి, కార్తీక్ తుమ్మటి, శ్రీకాంత్ పాత్ర, శ్యామల, విజయ్ చిన్నం తదితరులు ఈ టోర్నమెంట్ల నిర్వహణకు తమ మద్దతును, సహకారాన్ని అందించారు. జూలైలో జరిగే అమెరికా తెలుగు సంబరాలకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చేలా ఇదే క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించేందుకు వివిధ రకాల క్రీడా పోటీలను నాట్స్ టంపాలో నిర్వహించనుంది. నాట్స్ సంబరాల కమిటి, నాట్స్ క్రీడా కమిటీలు ఈ పోటీల నిర్వహణకు తగిన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగనుంది. నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి లు విజేతలకు శుభాకాంక్షలు తెలియచేసారు. అందరూ టంపా తెలుగు సంబరాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

NATS శాండియాగో లో నాట్స్ చాప్టర్ ప్రారంభం
శాండియాగో : ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన విభాగాలను ప్రారంభిస్తూ తెలుగు వారికి మరింత చేరువ అవుతోంది. ఈ క్రమంలోనే శాండియాగోలో నాట్స్ విభాగాన్ని ప్రారంభించింది. నాట్స్ శాండియాగో చాప్టర్ సమన్వయకర్తగా ప్రశాంతి ఊడిమూడి, మహిళా సాధికార సలహా మండలి సమన్వయకర్తగా హైమ గొల్లమూడికి బాధ్యతలు అప్పగించారు. శాండియాగో నాట్స్ సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్తగా కామ్య శిష్ట్లా, సోషల్ మీడియా సమన్వయ కర్త గా తేజస్వి కలశిపూడి, సేవా కార్యక్రమాల సమన్వయకర్త గా రామచంద్ర రాజు ఊడిమూడి, క్రీడా స్ఫూర్తి సమన్వయ కర్తగా సత్య హరిరామ్, ఆది మోపిదేవి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. శ్రీరామనవమి నాడు శాండియాగో లో నాట్స్ విభాగం ప్రారంభం కావడం ఆనందంగా ఉందని శాండియాగో నాట్స్ సమన్వయకర్త ప్రశాంతి ఊడిమూడి అన్నారు. శాండియాగో లో నాట్స్ తెలుగు వారికి శ్రీరామరక్షలా మారేలా తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. చాప్టర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. తనుష్ భగవత్ ,వీణ-ఋత్వ ఊడిమూడి గానామృతం, వయోలిన్‌తో ధ్రువ గౌరిశెట్టి ,పియానోతో విహాన్ మండపాక అందరిని అలరించారు. ( మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి,నాట్స్ సెక్రటరీ మధు బోడపాటి, జోనల్ వైస్ ప్రెసిడెంట్ మనోహర్ మద్దినేని పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా లాస్ ఏంజెలెస్ చాప్టర్ నుండి నాట్స్ ప్రోగ్రామ్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిలుకూరి,జాతీయ మహిళా సాధికారత సమన్వయ కర్త రాజ్యలక్ష్మి చిలుకూరి,లాస్ ఏంజెలెస్ చాప్టర్ సమన్వయ కర్త మురళి ముద్దన, హెల్ప్ లైన్ సమన్వయ కర్త శంకర్ సింగం శెట్టి పాల్గొన్నారు. నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి ఆధ్వర్యంలో నూతన చాప్టర్ సభ్యులను మనోహర్ మద్దినేని సభకు పరిచయం చేశారు. నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, ప్రెసిడెంట్ (ఎలెక్ట్) శ్రీహరి మందాడి తమ అభినందనలు సందేశం ద్వారా పంపారు. భవిష్యత్తులో శాండియాగో నాట్స్ విభాగం చేపట్టే ప్రతి కార్యక్రమానికి జాతీయ నాయకత్వం మద్దతు ఉంటుందని నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి భరోసా ఇచ్చారు. అమెరికాలో తెలుగు సమాజ అభివృద్ధి దిశగా నాట్స్ జాతీయ వ్యాప్తంగా ఎంతో కృషి చేస్తుందన్నారు. అమెరికాతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న సేవ కార్యక్రమాల గురించి మదన్ పాములపాటి వివరించారు. శాండియాగో చాప్టర్ ఏర్పాటులో నాట్స్ జాతీయ మీడియా కో ఆర్డినేటర్ కిషోర్ నారే కీలక పాత్ర పోషించడం అభినందనీయమని అన్నారు. శాండియాగోలో ఇక నుంచి తెలుగువారికి నాట్స్ అండగా ఉందనే భరోసాను కల్పించే దిశగా శాండియాగో నాట్స్ సభ్యులు కృషి చేయాలని కోరారు.
క్రైమ్

‘పేడ నీళ్ల’ రచ్చ.. అసలేం జరిగిందంటే?
జమ్మలమడుగురూరల్(అన్నమయ్య): ఇంటి ముందు పేడ నీళ్లు చల్లే విషయంలో జరిగిన చిన్న చిన్న పాటి గొడవ పెద్దదై పరస్పరం దాడులు చేసుకునేంత వరకు వెళ్లింది. మండల పరిధిలోని పి. బోమ్మెపల్లి గ్రామంలో జరిగిన ఈ సంఘటన వివరాలు పోలీసుల కథనం మేరకు ఇలా ఉన్నాయి. బొగ్గు గురులక్ష్మి తన ఇంటి ముందు పేడ నీళ్లు చల్లుకుంటూ ఉండగా కొన్ని నీళ్లు పక్కన నివాసం ఉంటున్న రాజచౌడయ్య ఇంటి వద్ద పడ్డాయి. ఈ విషయమై ఇరువురి మధ్య తీవ్ర స్థాయి వాగ్వాదం జరిగింది. దీంతో ఇరు కుటుంబాల వారు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో ఇరు కుటుంబాలకు చెందిన వారు గాయపడ్డారు. గాయపడి వారిలో బొగ్గు నాగ అంజి, మహేష్, నాగేంద్ర, మల్లికార్జున, రామాంజనేయులు, గురులక్ష్మి, మరోవర్గంలో గూడెంచెరువు రాజ చౌడయ్య, సోమశేఖర్, పెద్ద చౌడప్ప, రమణమ్మ, రామ చౌడయ్య ఉన్నారు. రాజ చౌడయ్యకు తలపై బలమైన గాయం కావడంతో మెరుగైన చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరుకు తరలించారు

పెళ్లిలో ప్రతీకారం!
విశాఖపట్నం: భీమిలి మండలం చిప్పాడ పంచాయతీ ఆశిపాలెంలో నల్ల తాతారావు అనే వ్యక్తిని కొందరు వ్యక్తులు తాళ్లతో బంధించి హింసించారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనపై బాధితుడి అన్న ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని.. తాతారావును ఆసుపత్రికి తరలించారు. వివరాలివి. చిప్పాడ పంచాయతీలోని కంచేరుపాలేనికి చెందిన అబ్బాయికి, ఆశిపాలెం యువ తితో శుక్రవారం రాత్రి ఆశిపాలెంలో వివాహం జరిగింది. ఈ వివాహానికి అమనాంకు చెందిన నల్ల తాతారావు.. అతని అన్నయ్య అప్పన్న, తల్లి తవుడమ్మతో కలిసి వచ్చారు. వివాహం అనంతరం అప్పన్న, తల్లి అమనాంకు తిరిగి వెళ్లగా.. తాతారావు అక్కడే మంచంపై నిద్రించాడు. దీనిని గమనించిన పెళ్లి కుమార్తె బంధువులు శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో తాతారావు కాళ్లు, చేతులను తాళ్ల తో కట్టేసి బంధించారు. శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తాతారావు అన్నయ్య అప్పన్నకు ఈ విషయం తెలియడంతో తన తమ్ముడిని విడిచిపెట్టమని బంధువులను కోరాడు. అయితే వారు నిరాకరించారు. గతంలో తాతారావుకు కంచేరుపాలెం యువతితో వివాహం జరిగింది. వారి మధ్య వివాదాల కారణంగా ప్రస్తుతం తాతారావు అమనాంలో, అతని భార్య కంచేరుపాలెంలో ఉంటోంది. గతంలో తాతారావు తన మామ అనుకుని వేరే వ్యక్తిని తీవ్రంగా కొట్టాడని, అందుకు ప్రతీకారంగానే తాము అతన్ని బంధించామని పెళ్లి కుమార్తె బంధువులు ఆరోపించారు. తాతారావు అన్నయ్య ఫిర్యాదు మేరకు భీమిలి పోలీసులు శనివారం సాయంత్రం సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని విడిపించారు. అనంతరం చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకు తన తమ్ముడికి మంచినీళ్లు కూడా ఇవ్వకుండా హింసించిన వారిపై చర్యలు తీసుకోవాలని అప్పన్న డిమాండ్ చేశాడు.

ఊహించని విధంగా పెళ్లి వాయిదా.. యువతి ఆత్మహత్య
అనంతపురం: ఊహించని విధంగా పెళ్లి వాయిదా పడటంతో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ గౌస్ మహమ్మద్‌బాషా తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఇల్లూరుకు చెందిన మస్తానయ్య, సుశీలమ్మ దంపతులు బతుకు తెరువు కోసం కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు వలస వెళ్లి అక్కడే జీవనం సాగిస్తున్నారు. కుమార్తె లక్ష్మీనరసమ్మ(23)కు గుంతకల్లు మండలంలోని ఓ యువకుడితో వివాహం నిశ్చయమైంది. ఈ నెల 14, 15 తేదీల్లో వివాహం జరగాల్సి ఉంది. వారం క్రితమే కుటుంబ సభ్యులంతా స్వగ్రామం ఇల్లూరుకు చేరుకున్నారు. పెళ్లి ఏర్పాట్లల్లో తలమునకలయ్యారు. ఈ క్రమంలో బంధువు ఒకరు చనిపోవడంతో పెళ్లి వాయిదా వేశారు. రెండేళ్ల క్రితం కూడా బంధువొకరు చనిపోవడంతో పెళ్లి ఆగింది. వరుస ఘటనలతో మనస్తాపం చెందిన లక్ష్మీనరసమ్మ తనకు కళ్యాణ యోగం లేదేమోనన్న బాధతో శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుంది. పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం పామిడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

అమ్మా.. నాన్న క్షమించండి
కర్నూలు: ‘నా చావుకు ఎవరూ బాధ్యులు కారు.. అక్క క్షమించు.. అమ్మ నాన్న క్షమించు’ అంటూ ఒక లేఖ రాసి జేబులో పెట్టుకొని రైలు కింద పడి ఈడిగ వంశీక్రిష్ణ (29) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలులోని రామచంద్రనగర్‌లో నివాసం ఉంటున్న ఈడిగ వంశీక్రిష్ణ ఎంఎస్సీ వరకు చదువుకున్నాడు. తండ్రి శ్రీనివాసగౌడ్ ఫారెస్ట్ రేంజ్ అధికారి. శ్రీనివాసగౌడ్, శ్రీదేవి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరి పెద్ద కుమారుడు రాకేష్ గౌడ్ పెళ్లి అయిన 20 రోజులకే ఆత్మహత్య చేసుకున్నాడు. రెండో కుమారుడు వంశీక్రిష్ణ పెళ్లి కాకుండానే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయంశమైంది. రైలు పట్టాలపై మృతదేహంలా.. వివాహ వేడుకకు ఈనెల 7వ తేదీన వేరే ఊరికి శ్రీనివాసగౌడ్, శ్రీదేవి వెళ్లారు. తిరిగి శుక్రవారం ఇంటికి వచ్చారు. కుమారుడు వంశీక్రిష్ణ ఇంట్లో లేకపోవడంతో కర్నూలు చుట్టుపక్కల అంతా గాలించారు. ఎండోమెంట్ కాలనీ సమీపంలో అబ్బాస్ నగర్ రైల్వే పట్టాల పక్కన శనివారం వంశీక్రిష్ణ మృతదేహమై కనిపించాడు. విషయం తెలిసిన వెంటనే కర్నూలు రైల్వే ఎఎస్ఐ కేవీఎం ప్రేమ్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని పరిసరాలను పరిశీలించాడు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ కేంద్రానికి తరలించారు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అన్న మృతిని తట్టుకోలేక.. ఈడిగ వంశీక్రిష్ణ అన్న రాకేష్ గౌడ్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేసేవారు. పెళ్లి అయిన 20 రోజులకే నాలుగు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుండి వంశీక్రిష్ణ మానసిక కుంగుబాటుతో బాధపడేవాడు. అన్న మృతిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
వీడియోలు


శ్రీలంకలో ఘోర రోడ్డు ప్రమాదం


పాకిస్తానీ నటితో చేయను: బాలీవుడ్ హీరో


ముగిసిన వీరజవాన్ మురళీనాయక్ అంత్యక్రియలు


ప్రధాని మోదీ నివాసంలో ముగిసిన సమావేశం


బ్రహ్మోస్ క్షిపణి పనితీరు ఎలా ఉంటుందో పాక్ కు అడగండి


Miss World Competition: తారలు దిగివచ్చిన వేళ..!


పాక్ ను వణికించిన BRAHMOS


ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన


Jana Tantram: కాల్పుల విరమణ వ్యవహారంలో ట్రంప్ పాత్రపై ఆసక్తికరం


పాక్ వైమానిక కీలక స్థావరాలను లక్ష్యంగా విరుచుకుపడ్డ బ్రహ్మోస్