
తిరుమల: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల జూన్ నెల కోటాను మార్చి 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ కోసం మార్చి 18 నుంచి 20 ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్ ద్వారా ఈ టికెట్లు పొందిన భక్తులు మార్చి 20 నుంచి 22 మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లిస్తే టికెట్లు మంజూరవుతాయి.
కాగా, ఆర్జిత సేవా టికెట్లు, జూన్ 9 నుంచి 11వరకూ జరిగే శ్రీవారి జ్యేష్టాభిషేకం టికెట్లు, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను టీటీడీ మార్చి 21న ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఇక అంగప్రదక్షిణం టోకెన్లు, శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు, వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు శ్రీవారిని దర్శించుకునే టోకెన్ల కోటాను 22న ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.
ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను మార్చి 24న ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేయనుంది. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా మాత్రమే శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment