quota
-
TTD : శ్రీవాణి, ఎస్ఈడీ టికెట్ల విడుదల తేదీల మార్పు
సాక్షి, తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనానికి డైరెక్ట్ లైన్లోకి అనుమతిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు శ్రీవారిని 65,299 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,863 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.75 కోట్లు.మార్చి నెల శ్రీవాణి, ఎస్ఈడీ కోటా విడుదల తేదీలో మార్పుతిరుమల, 2024 డిసెంబర్ 20: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జనవరి 10 నుండి 19 వరకు పది రోజుల వైకుంఠ వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి శ్రీవాణి టికెట్లను డిసెంబరు 23వ తేదీ ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు.అలాగే పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను డిసెంబరు 24వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయడం జరుగుతుంది.ఈ నేపథ్యంలో మార్చి నెల శ్రీవాణి, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల తేదీలను మార్పు చేయడమైనది.డిసెంబరు 25వ తేదీ ఉదయం 11 గంటలకు మార్చి నెల శ్రీవాణి టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు.డిసెంబరు 26వ తేదీ ఉదయం 11 గంటలకు మార్చి నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేయడం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 3 గంటలకు తిరుమలలోని వసతి గదుల కోటాను విడుదల చేస్తారు.ఈ మార్పును గమనించి టీటీడీ వెబ్ సైట్లో https://ttdevasthanams.ap.gov.in/home/dashboardలో మాత్రమే టికెట్లను బుక్ చేసుకోవాల్సిందిగా భక్తులకు తెలియజేయడమైనది. -
రేపు శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల మార్చి కోటా విడుదల
తిరుమల: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల 2025 మార్చి నెల కోటాను డిసెంబరు 18 ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ టికెట్ల రిజిస్ట్రేషన్ కోసం డిసెంబరు 18 నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. టికెట్లు పొందిన వారు డిసెంబరు 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించి టికెట్ తీసుకోవాలి.21న ఇతర సేవా టికెట్ల విడుదల\⇒ కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను డిసెంబరు 21న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.⇒ వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన మార్చి నెల కోటాను డిసెంబర్ 21 మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. 23న అంగప్రదక్షిణం టోకెన్లు⇒ మార్చి నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను డిసెంబర్ 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.శ్రీవాణి టికెట్ల ఆన్లైన్ కోటా⇒ శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన మార్చి నెల ఆన్లైన్ కోటాను డిసెంబర్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా⇒ వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా మార్చి నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను డిసెంబర్ 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల⇒ మార్చి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను డిసెంబర్ 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.తిరుమల, తిరుపతిలో గదుల కోటా విడుదల⇒ తిరుమల, తిరుపతిలో మార్చి నెల గదుల కోటాను డిసెంబర్ 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు.⇒ డిసెంబరు 27న మార్చి నెల శ్రీవారి సేవ కోటా విడుదల చేస్తారు.⇒ https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరుతోంది. -
తిరుమల: నేడు ఆగష్టు ఆర్జితసేవా టికెట్ల విడుదల
తిరుపతి, సాక్షి: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల శిలాతోరణం వరకు క్యూలైన్లో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ప్రత్యేక దర్శనానికి 6 గంటల సమయం కాగా, సర్వదర్శనం కోసం 24 గంటల సమయం పడుతోంది.ఇక.. నిన్న(శుక్రవారం) 71,510 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల్లో 43,199 తలనీలాలు సమర్పించారు. మొత్తంగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.63 కోట్లుగా లెక్క తేలింది.నేడు ఆగష్టు కోటా టికెట్లుతిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను మే 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల.సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ సేవా టికెట్లు మే 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు.టికెట్లు పొందిన వారు మే 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించాలి.మే 17 ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవాటికెట్ల కోటా, శ్రీవారి ఆలయంలో ఆగస్టు 15 నుండి 17వ తేదీ వరకు నిర్వహించనున్న వార్షిక పవిత్రోత్సవాల సేవా టికెట్లను విడుదల.మే 21న మద్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవల కోటా విడుదల.మే 23న అంగప్రదక్షిణం టోకెన్లు, శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ టికడట్లు, వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా విడుదల.మే 24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదలమే 24 మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలలో గదుల కోటా విడుదల.https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచన. -
దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలి
సాక్షి, హైదరాబాద్: జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు బీసీ కుల గణన చేపట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లలో అంతర్భాగంగా ఓబీసీ మహిళలకు ప్రత్యేక కోటా కల్పించాలని, కేంద్రంలో ఓబీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్ దతియా జిల్లా కేంద్రం నుంచి ఓబీసీ హక్కుల ఫ్రంట్ వ్యవస్థాపకుడు దామోదర్ సింగ్ యాదవ్ తలపెట్టిన ‘పీడిత్ అధికార్ యాత్ర’ ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఓబీసీల అనైక్యతను ఆసరాగా చేసుకుని ప్రభుత్వాలు వారికి దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ఓబీసీలకు న్యాయం చేయలేదు అధికారంలో ఉన్నప్పుడు ఓబీసీలకు న్యాయం చేయని కాంగ్రెస్ ఇప్పుడు ఓబీసీ న్యాయమూర్తుల సంఖ్య తక్కువగా ఉండటాన్ని ప్రశ్నిస్తోందని కవిత ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాల్లో ఓబీసీల సంఖ్య తక్కువగా ఉండటాన్ని ప్రశ్నించారు. దామోదర్ సింగ్ యాదవ్ ప్రారంభించిన పీడిత్ అధికార్ యాత్ర దేశవ్యాప్తంగా విస్తరిస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన ఉద్యమాలు అందరికీ స్పూర్తిదాయకమని, కేసీఆర్ స్పూర్తితో ఓబీసీ హక్కుల సాధన ఉద్యమం ముందుకుసాగాలని కవిత పిలుపునిచ్చారు. కేసీఆర్ స్పూర్తితోనే ఉద్యమాన్ని మొదలు పెట్టినట్లు ఓబీసీ ఫ్రంట్ వ్యవస్థాపకుడు దామోదర్ యాదవ్ తెలిపారు. -
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్ పార్టీ
-
పీజీ మెడికల్ యాజమాన్య కోటా సీట్లకు మరోసారి కౌన్సెలింగ్
సాక్షి, అమరావతి: 2023–24 విద్యా సంవత్సరానికి పీజీ మెడికల్ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి ఇటీవల నిర్వహించిన రివైజ్డ్ కౌన్సెలింగ్‌ను రద్దు చేసినట్టు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం ప్రకటించింది. యాజమాన్య కోటా సీట్ల ప్రవేశాల కోసం మళ్లీ వెబ్ఆప్షన్లు స్వీకరిస్తూ గురువారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. నీట్ పీజీ అర్హత సాధించిన అభ్యర్థులు 24 గంటల్లోగా ఆప్షన్లు నమో దు చేసుకోవాలని సూచించింది. అనివార్య కారణాలతో ఎవరైనా అభ్యర్థులు ఆప్షన్లు నమోదు చేసుకోకపోతే గతంలో నిర్వహించిన కౌన్సెలింగ్‌కు వారు నమోదు చేసుకున్న ఆప్షన్లను పరిగణనలోకి తీసుకుంటామని రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి తెలిపారు. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) పేరిట శాంతీరామ్, జీఎస్ఎల్, మహారాజా కళాశాలల్లో పీజీ సీట్ల పెంపునకు నకిలీ అనుమతులు వెలువడిన నేపథ్యంలో తొలుత నిర్వహించిన కౌన్సెలింగ్‌ను యూనివర్సిటీ రద్దు చేసి, రివైజ్డ్ కౌన్సెలింగ్ నిర్వహించింది. ఆ తర్వాత రాజమండ్రి జీఎస్ఎల్ కళాశాలలో రేడియో డయగ్నోసిస్‌లో 14 పీజీ సీట్లకు నకిలీ అనుమతులు వెలువడినట్టు ఎన్ఎంసీ మంగళవారం ప్రకటించింది. ఇదే కళాశాలలో ఎమర్జెన్సీ మెడిసిన్‌లో మరో రెండు సీట్లకు నకిలీ అనుమతులు వచ్చినట్లు గురువారం తెలిపింది. దీంతో యాజమాన్య కోటా రివైజ్డ్ ఫేజ్–1 కౌన్సెలింగ్‌ను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని ప్రభుత్వం విశ్వవిద్యాలయాన్ని ఆదేశించింది. -
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసన మండలికి ఎమ్మెల్యేల కోటా అభ్యర్థులుగా దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్ కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డిలను బీఆర్ఎస్ అధినేత, సిఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ నెల 9న అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చూసుకోవాల్సిందిగా శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డిలను సీఎం కేసీఆర్ ఆదేశించారు. కాగా... రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు, గవర్నర్ ద్వారా నామినేట్ అయ్యే ఇద్దరి పేర్లను కేబినెట్ సమావేశం తర్వాత ప్రకటించనున్నారు. చదవండి: బంగ్లాదేశీయులకు కూడా సర్టిఫికెట్లు ఇచ్చారేమో.. రాజాసింగ్ సంచలన ఆరోపణలు -
కేంద్రీయ విద్యాలయాలు.. ఎంపీలకు షాక్!
న్యూఢిల్లీ: కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోటా సీట్లు రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం వెల్లడించింది. ప్రత్యేక కోటా కింద కేటాయిస్తున్న ఈ సీట్లపై.. ఈ మేరకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్(కేవీఎస్) బుధవారం ప్రకటన చేసింది. కేవీఎస్ ఇప్పటివరకు ఒక్కో ఎంపీకి కోటా కింద 10 సీట్లు కేటాయిస్తూ వస్తోంది. అయితే ఈ కోటా పెంచాలని ఎంపీలు డిమాండ్ చేస్తుండగా.. ఇప్పుడు ఏకంగా కోటాను కేంద్రీయ విద్యాలయ సంఘటన్ పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం విశేషం. అలాగే తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ అడ్మిషన్లు ఉండవని ఉత్తర్వుల్లో పేర్కొంది. స్పెషల్ ప్రొవిజన్ కింద ఎంపీలు, కేంద్ర ఉద్యోగుల పిల్లలు, కేంద్ర ప్రభుత్వ అవార్డు గ్రహీతల పిల్లలు సహా 19 కేటగిరీల్లో కోటా కేటాయింపులు ఉంటూ వచ్చాయి. -
సుప్రీం కోర్టులో సీఎం స్టాలిన్‌కు ఎదురు దెబ్బ...
-
స్టాలిన్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు షాక్
న్యూఢిల్లీ: తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీం కోర్టు గట్టి షాకిచ్చింది. వన్నియార్ కమ్యూనిటీకి కేటాయించిన 10.5 శాతం అంతర్గత రిజర్వేషన్ చెల్లదని, ఇందుకోసం రూపొందిచిన చట్టాన్ని రద్దు చేస్తూ గురువారం ఆదేశాలు ఇచ్చింది. ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందంటూ తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించింది బెంచ్. ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో వన్నియార్ కమ్యూనిటీకి 10.5 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది ప్రభుత్వం. ఇందుకోసం స్టాలిన్ ప్రభుత్వం 2021లో ప్రత్యేక చట్టం కూడా తీసుకొచ్చింది. అయితే ఓబీసీ కోటాలో ఈ రిజర్వేషన్ రాజ్యాంగబద్ధం కాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అత్యంత వెనుకబడిన తరగతుల(MBC) కోసం 20 శాతం కోటా ఉండగా.. అందులో 10.5 శాతం వన్నియార్ కమ్యూనిటీకి వర్తింపజేస్తూ 2021 తమిళనాడు యాక్ట్‌ను తీసుకొచ్చింది అక్కడి ప్రభుత్వం. ఈ క్రమంలో అభ్యంతరాలు వ్యక్తంకాగా.. తమిళనాడు యాక్ట్ 2021ను కొట్టేస్తూ ఇంతకు ముందు మద్రాస్ హైకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. తాజాగా చట్టాన్ని రద్దు చేయాలంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులనే సమర్థించింది సుప్రీం కోర్టు. జస్టిస్ ఎల్ నాగేశ్వరావు, బీఆర్ గవాయ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెల్లడించింది. MBCలలో వన్నియార్లను ప్రత్యేక సమూహంగా పరిగణించాల్సిన డేటాను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, తద్వారా రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 16లకు ఈ చట్టం వ్యతిరేకంగా ఉంది, అందుకే ఈ చట్టాన్ని రద్దు చేస్తున్నామని ఈ సందర్భంగా బెంచ్ వ్యాఖ్యానించింది. చట్టాలు చేసుకునే హక్కు చట్ట సభలకు ఉన్నా.. కుల ఉప తరగతులను ప్రభావితం చేసే విధంగా రాష్ట్రాలకు ఉండబోదని బెంచ్ పేర్కొంది. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లకు దారి చూపండి.. సుప్రీంకోర్టుకు కేంద్రం విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: ఏళ్లుగా ప్రధాన స్రవంతికి దూరంగా ఉండిపోయినా వారికి... రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రిజర్వేషన్లు రూపంలో సమాన అవకాశాలు కల్పించాలని చూస్తున్నామని, దీనికి తగిన దారి చూపించాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. పదోన్నతుల సమయంలో ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ ఉద్యోగులకు రిజర్వేషన్లు అమలు చేయడానికి రాష్ట్రాలు, కేంద్రానికి కచ్చితమైన మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్రం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లో రిజర్వేషన్లపై జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయిలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. కేంద్రం తరఫు అటార్నీ జనరల్ వాదనలు వినిపిస్తూ... పదోన్నతుల్లో రిజర్వేషన్లపై తగిన మార్గదర్శకాలు రూపొందించకపోతే సమస్యలు తీవ్రం అవుతాయని, ఎప్పటికీ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదని తెలిపారు. చదవండి: (గుడ్ న్యూస్: విదేశీ ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా) ‘‘పదోన్నతులు మెరిట్ ఆధారంగా తప్ప భర్తీ చేయడం లేదు. కానీ ఏళ్ల తరబడి ఓ వర్గం వెనకబడిపోయింది. దేశప్రయోజనాలు, రాజ్యాంగ ప్రయోజనాల దృష్ట్యా సమానత్వం తీసుకురావాలి. దామాషా ప్రాతినిధ్యంతోనే సమానత్వం వస్తుంది’’ అని వేణుగోపాల్ తెలిపారు. పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించడానికి ఓ సూత్రం కావాలని, ఒక వేళ నిర్ణయాన్ని రాష్ట్రాలకు వదిలేస్తే సమస్య మళ్లీ మొదటికి వస్తుందని వేణుగోపాల్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. వాదనల అనంతరం ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది. -
Lalu Prasad Yadav: కుల గణన చేయాల్సిందే
పట్నా(బిహార్): కేంద్ర ప్రభుత్వం కుల ప్రాతిపదికన జనాభా గణనను నిర్వహించాలని రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు. కుల గణన తర్వాత మొత్తం జనాభాలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల సంఖ్య సగం కంటే ఎక్కువగా ఉందని తేలితే ఆ మేరకు రిజర్వేషన్లలో తగిన ప్రాధాన్యత దక్కాలని ఆయన అభిలషించారు. మొత్తం జనాభా కంటే ఈ వర్గాల జనాభా సగం కంటే ఎక్కువగా ఉంటే ఇప్పుడు అమలవుతోన్న 50 శాతం రిజర్వేషన్ పరిమితిని ఎత్తివేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. బుధవారం ఆర్జేడీ పార్టీ కార్యకర్తల శిక్షణ కార్యక్రమంలో ఢిల్లీ నుంచి వర్చువల్ పద్ధతిలో ఆయన ప్రసంగించారు. ‘ స్వాతంత్య్రం రాక ముందు నాటి జనాభా ప్రాతిపదికనే రిజర్వేషన్ కోటాలను అప్పటి నుంచి ఇప్పటిదాకా కొనసాగిస్తున్నాం. వేర్వేరు సామాజిక వర్గాల తాజా జనాభాలను లెక్కించి 50 శాతం రిజర్వేషన్ల పరిమితిపై నిర్ణయాలు తీసుకోవాలి. కుల గణన చేపట్టాలని తొలిసారిగా డిమాండ్ చేసింది నేనే. ఈ డిమాండ్‌ను పార్లమెంట్ వేదికగా గతంలోనే నాటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను. ఇప్పుడున్న కోటా ప్రస్తుత అవసరాలకు సరిపోదు. రిజర్వేషన్లు పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవట్లేదు’ అని లాలూ వ్యాఖ్యానించారు. లాలూ చిన్న కుమారుడు, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సైతం కుల గణన అంశాన్ని ప్రధాని మోదీ వద్ద ఇటీవల ప్రస్తావించారు. ఆరోగ్యం కుదుటపడ్డాక త్వరలోనే బిహార్‌లో అన్ని జిల్లాల్లో పర్యటిస్తానని లాలూ చెప్పారు. దాణా కుంభకోణం, తదితర కేసుల్లో దోషిగా తేలి శిక్ష అనుభవిస్తూ, మరి కొన్ని కేసుల్లో ఆయన నిందితుడిగా ఉన్న సంగతి తెల్సిందే. అనారోగ్యం, మెరుగైన చికిత్స కారణాలతో బెయిల్ లభించడంతో ఈ ఏడాది జైలు నుంచి బయటికొచ్చారు. ప్రస్తుతం ఢిల్లీలో చికిత్స తీసుకుంటున్నారు. చదవండి: Farmers Protest: రైతు నిరసనలకు 300 రోజులు -
హిజ్రాలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్
సాక్షి బెంగళూరు: ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో హిజ్రాలకు ఒక శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు కర్ణాటక హైకోర్టుకు రాష్ట్ర సర్కార్ తెలిపింది. హిజ్రాలకు రిజర్వేషన్ కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని సంగమ స్వయం సేవా సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏఎస్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది విజయకుమార్ పాటిల్ తన వాదనలు వినిపిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలానుసారం అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో ఒక శాతం పోస్టులను హిజ్రాలకు కేటాయించేందుకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు కర్ణాటక పౌరసేవా నియామక చట్టం–1977 సెక్షన్ 9ని సవరించినట్లు తెలిపారు. ఈ విషయమై ఇప్పటికే రెండు నోటిఫికేషన్లను కూడా ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఈ నోటిఫికేషన్లపై అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తదుపరి విచారణను ధర్మాసనం ఈ నెల 20కు వాయిదా వేసింది. చదవండి: ఆరోగ్య కార్యకర్తలకు భద్రత కల్పించండి -
USA: గ్రీన్‌కార్డు నిరీక్షణకు తెరపడేనా!
గ్రీన్ కార్డు కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న భారతీయుల నిరీక్షణకు తెరపడేదెన్నడు? కంట్రీ కోటా పరిమితి 7 శాతాన్ని ఎత్తేస్తే భారతీయులకి ఏ మేరకు ప్రయోజనం కలుగుతుంది? కరోనా మహమ్మారి నేపథ్యంలో గత ఏడాదిగా అమెరికా రాకపోకలపై ఆంక్షలతో గ్రీన్ కార్డులు మంజూరు కాకపోవడం మన దేశానికి కలిసి వస్తుందా? ఇప్పుడు సర్వత్రా ఇదే చర్చ జరుగుతోంది. అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడం కోసం ఉద్దేశించిన గ్రీన్‌కార్డు మంజూరులో పెద్ద దేశం, చిన్నదేశం అన్న తేడా లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో 20వ శతాబ్దం మధ్యలో దేశాలకు పరిమితి విధించారు. ప్రతీ ఏడాది జారీ చేసే గ్రీన్‌కార్డుల్లో ఏ ఒక్క దేశానికీ ఏడు శాతానికి మించి జారీచేయకూడదని పరిమితి విధించారు. ఇప్పుడవే భారతీయ టెక్కీలకు శాపంగా మారాయి. అగ్రరాజ్యంలో పర్మనెంట్ రెసిడెంట్ హోదా పొందాలంటే జీవిత కాలం వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధికారంలోకి వచ్చాక దేశాల పరిమితిని ఎత్తేయడం కోసం రెండు బిల్లుల్ని ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టడంతో భారతీయుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఆ రెండు బిల్లుల్లో ఏది ఆమోదం పొందినా భారతీయ టెక్కీలకు భారీ ఊరట లభిస్తుంది. భారత్ నుంచి అత్యంత నైపుణ్యం కలిగిన టెక్కీలు పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నా... గ్రీన్ కార్డు కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. చిన్న దేశాల నుంచి తక్కువ సంఖ్యలో వెళ్లేవారికి వెనువెంటనే గ్రీన్ కార్డు రావడం అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టం వాటిల్లుతుందన్న అభిప్రాయాలు నెలకొన్నాయి. ఏ దేశం నుంచి వచ్చారు అన్నది కాకుండా అమెరికాకు ఎంతవరకు వారి సేవలు ఉపయోగపడతాయి అన్నదే ఆధారంగా గ్రీన్ కార్డులు మంజూరు చేయాలని డెమొక్రాటిక్ ప్రజాప్రతినిధి లోప్గ్రెన్ అభిప్రాయపడ్డారు. నైపుణ్యం కలిగిన వారే దేశంలో స్థిరపడితే అమెరికా ఆర్థిక వ్యవస్థకు అండదండగా ఉంటారని, అందుకే కాలం చెల్లిన కంట్రీ క్యాప్‌ను తొలగించాలన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. అదే జరిగితే భారత్, చైనా దేశాలకే అత్యధికంగా గ్రీన్ కార్డులు మంజూరు అవుతాయి. ప్రతినిధుల సభలో బిల్లులు ► ఈక్వల్ యాక్సెస్ టు గ్రీన్‌కార్డ్స్ ఫర్ లీగల్ ఎంప్లాయిమెంట్ (ఈగల్) చట్టం–2021ని ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డుల మంజూరులో 7 శాతంగా ఉన్న కంట్రీ క్యాప్‌ను ఎత్తేయడం, కుటుంబ వీసాల పరిమితిని ఏడు నుంచి 15 శాతానికి పెంచడం ఉన్నాయి. దీని ప్రకారం ఉద్యోగంలో అత్యంత ప్రతిభను చూపిస్తూ, అధిక జీతం తీసుకుంటున్న వారికి తొలుత గ్రీన్ కార్డులు మంజూరు చేస్తారు. ఇది ప్రతినిధుల సభ ఆమోదం పొంది, సెనేట్‌లో పాసైతే... బైడెన్ సంతకంతో చట్టం అవుతుంది. ► అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నికల సమయంలో అక్రమ వలసదారులకు పౌరసత్వం కల్పిస్తానన్న హామీని నెరవేర్చుకోవడానికి అమెరికా పౌరసత్వ చట్టం 2021ను ఇప్పటికే ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. ఇందు లో కూడా గ్రీన్‌కార్డులకు సంబంధించి కంట్రీ కోటాను ఎత్తేయాలని ఉంది. ఈ బిల్లు ప్రకారం ఎవరు ముందు దరఖాస్తు చేసుకుంటే వారికే ముందు గ్రీన్ కార్డు మంజూరు చేయాలి. గ్రీన్‌కార్డు మంజూరైన తర్వాత అయిదేళ్లకి అమెరికా పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చునన్న ప్రస్తుత నిబంధనల్ని మూడేళ్లకి తగ్గించారు. అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్), 2020 గణాంకాల ప్రకారం పెండింగ్‌లో ఉన్న గ్రీన్ కార్డు దరఖాస్తులు – 12 లక్షలు పైగా పెండింగ్‌లో ఉన్న భారతీయుల దరఖాస్తులు – 8 లక్షలు (66%) ప్రతీ ఏడాది జారీ చేసే గ్రీన్ కార్డులు – 3,66,000 (ఇందులో రెండు కేటగిరీలు ఉంటాయి) కుటుంబాలకు ఇచ్చే గ్రీన్ కార్డులు – 2,26,000 ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డులు – 1,40,000 ఈ గ్రీన్‌కార్డుల్లో భారతీయులు ఎక్కువగా దరఖాస్తు చేసుకునే ఈబీ–2, ఈబీ–3 కేటగిరీ కింద ఏడాదికి 40,040 గ్రీన్ కార్డుల జారీ కంట్రీ కోటా కారణంగా నష్టపోతున్న దేశాలు: భారత్, చైనా, మెక్సికో, ఫిలిప్పీన్స్ – నేషనల్ డెస్క్, సాక్షి -
బీసీల కోటాపై టీడీపీ ఆట
సాక్షి, అమరావతి: బలహీన వర్గాలు రాజకీయంగా ఎదగకుండా ప్రతిపక్ష టీడీపీ అడుగడుగునా అడ్డుపడుతోందనే వాదనకు బలం చేకూర్చేలా న్యాయ వివాదాలకు పురిగొల్పుతుండడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా విపక్షం కుట్రపూరితంగానే బీసీ రిజర్వేషన్లపై వివాదం రాజేస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికలకు ఆటంకాలు కల్పించి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ.5 వేల కోట్లకుపైగా నిధులను అడ్డుకునే దుర్బుద్ధి దీని వెనక దాగుందని పేర్కొంటున్నారు. అన్ని రాష్ట్రాలు తగ్గిస్తున్నా.. ధైర్యంగా ముందుకే జగన్ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కలిపి ఇచ్చే రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని 2010లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత దేశంలో 24 రాష్ట్రాలు ఒక్కొక్కటిగా బీసీలకిచ్చే రిజర్వేషన్లను 16–25 శాతం వరకు తగ్గించుకున్నాయి. ఏడాదిన్నర క్రితం తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు 34 శాతం నుంచి 22 శాతానికి తగ్గించటాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన కేసులను హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టివేశాయి. అయినప్పటికీ ఆ తర్వాత 2019 డిసెంబరులో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ధైర్యంగా ముందుకెళ్లి బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతో కలిపి మొత్తం 59.85 శాతం రిజర్వేషన్ల అమలుకు క్యాబినెట్లో ఆమోదించి జీవో కూడా జారీ చేసింది. ఆ జీవో మేరకు ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర హైకోర్టు కూడా ఆమోదం తెలిపింది. అయితే టీడీపీ నేతలు దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లడంతో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 59.85%రిజర్వేషన్ల జీవోతో ఎన్నికలు జరపడంపై స్టే ఇచ్చింది. సుప్రీంకోర్టు సూచనతో తిరిగి దీనిపై హైకోర్టులో విచారణ జరగడంతో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని తీర్పు వెలువడింది. 59.85 శాతం రిజర్వేషన్లతో ఎన్నికల నిర్వహణకు మొదట రాష్ట్ర హైకోర్టు ఆమోదం తెలిపిన తర్వాత టీడీపీ నేత సుప్రీంకోర్టులో కేసు వేయకుంటే బీసీలకు 34 శాతంతోనే ఎన్నికలు జరిగేవని పేర్కొంటున్నారు. ఎన్నికలు, నిధులను అడ్డుకోవడమే విపక్షం ధ్యేయం రాష్ట్రంలో సర్పంచుల పదవీ కాలం 2018 ఆగస్టుతో ముగిసినప్పటికీ నాడు అధికారంలో ఉన్న చంద్రబాబు గ్రామ పంచాయతీలకు తిరిగి ఎన్నికలు నిర్వహించలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2019లోనే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంకాగా టీడీపీ హయాంలో నామినేటెడ్ పదవి పొందిన ఆ పార్టీ నేత బిర్రు ప్రతాప్‌రెడ్డి సుప్రీంకోర్టు, హైకోర్టులలో వరుసగా కేసులు వేయడంతో వాయిదా పడుతూ వచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయించడం, రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన దాదాపు రూ.5,100 కోట్ల నిధులను అడ్డుకోవడమే టీడీపీ ధ్యేయమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పార్లమెంట్లో చట్టమే మార్గం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై వివాదాలకు రాజ్యాంగ బద్ధతే శాశ్వత పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు. రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొంటున్నారు. పార్లమెంట్లో చేసిన చట్టం కారణంగా తమిళనాడులో 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలవుతున్నాయి. తమిళనాడు ప్రభుత్వం గతంలోనే కేంద్రంపై ఒత్తిడి తేవడంతో 69 శాతం రిజర్వేషన్లు అమలు చేసే విధంగా రాజ్యాంగాన్ని సవరించి 9వ షెడ్యూల్లో చేర్చారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ సీఎం జగన్ సూచన మేరకు వైఎస్సార్సీపీ ఎంపీలు గతేడాది మార్చిలో పార్లమెంట్లో బిల్లు పెట్టడం చరిత్రలో నిలిచిపోతుందని పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇప్పుడు సుప్రీంకు వెళితే ప్రయోజనమా? బీసీ రిజర్వేషన్లపై టీడీపీ ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లినా ప్రయోజనం లేదని బీసీ సంఘాలు పేర్కొంటున్నాయి. బీసీలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాలైన కర్ణాటకలో అప్పటి ముఖ్యమంత్రి, ప్రముఖ బీసీ ఉద్యమ నాయకుడు సిద్ధరామయ్య హయాంలో బీసీ రిజర్వేషన్లు 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించారు. బీసీ నేతలైన బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, మధ్యప్రదేశ్ మాజీ సీఎం చౌహాన్ కూడా 2013–2014లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 18 – 22 శాతం తగ్గించారని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు వాదనలో పసలేదు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న వాదనలో పసలేదు, ఉపయోగం లేదు. గత ప్రభుత్వాలు చాలాసార్లు స్పెషల్ లీవ్ పిటిషన్ వేశాయి. ప్రతి కేసులో కూడా సుప్రీంకోర్టు రిజర్వేషన్లు 50 శాతం మించరాదని తీర్పు చెప్పింది. అలాంటప్పుడు మళ్లీ సుప్రీంకోర్టుకు వెళితే ఆ తీర్పు పునరావృతం అవుతుంది. చంద్రబాబు చర్యలతో కాలయాపన తప్ప బీసీలకు ఒరిగేదేమీ ఉండదు’ – ఆర్.కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు బీసీ రిజర్వేషన్లపై సుప్రీంలో టీడీపీ పిటిషన్ సాక్షి, న్యూఢిల్లీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయుడు, మాజీ ఎంపీలు కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప తదితరులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని కోరారు. -
కోటా పిటిషన్లపై ఏప్రిల్ 8న విచారణ
సాక్షి, న్యూఢిల్లీ : అగ్రవర్ణ పేదలకు విద్యా సంస్థలు, ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఏప్రిల్ 8న విచారణకు చేపడతామని సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనం చేపట్టాలని కొందరు పిటిషనర్లు లేవనెత్తడాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటామని జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఎస్ఏ నజీర్‌లతో కూడిన సుప్రీం బెంచ్ వెల్లడించింది. కాగా అంతకుముందు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, తాను రాజ్యాంగ ధర్మాసనం ఎదుట హాజరుకావాల్సి ఉందని చెబుతూ విచారణ వాయిదా వేయాలని సుప్రీం బెంచ్‌ను కేంద్రం తరపున వాదనలు విపిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. పిటిషనర్ల తరపున హాజరైన రాజీవ్ ధవన్ మార్చి 11న సుప్రీం ఉత్తర్వులను ప్రస్తావిస్తూ ఈ పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఆర్థిక ప్రాతిపదికన జనరల్ కేటగిరీకి రిజర్వేషన్లు వర్తింపచేయడం రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధమని పిటిషనర్ పేర్కొన్నారు. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితికి లోబడి ఉండాలన్నారు. కాగా అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణను చేపట్టిన సంగతి తెలిసిందే. -
‘కోటా’ వద్దంటున్న యువ తరం
తొలిసారి ఓటుహక్కు వినియోగించుకోవడం.. ఎడమ చేతి చూపుడు వేలిపై సిరా చుక్కని చూపిస్తూ ఓ సెల్ఫీ దిగడం.. మాకూ ఒక హక్కు వచ్చిందన్న ఆనందం.. దానికి మించినదేముంటుంది? ఎవరెస్ట్ ఎక్కినంత సంబరం.. ఆ ఉత్సాహమే వేరు.. చేతిలో స్మార్ట్‌ఫోన్.. సోషల్ మీడియాలో స్టేటస్‌తో హల్చల్ చేస్తోన్న ‘ఈ–తరం’ ఓట్లపై రాజకీయ పార్టీలన్నీ దృష్టి సారించాయి. ఇంతకీ నవతరం నడక ఎటువైపు? జాతీయతే వారి నినాదం యువతరం అనగానే ఉద్యోగాలు, స్వేచ్ఛ కోరుకుంటారని భావిస్తారు ఎవరైనా. గత ఎన్నికల్లో మోదీ ఉద్యోగాల హామీకి ఆశపడిన యువతరం.. ఉద్యోగాలు వస్తాయనే నమ్మకంతోనే ఆయనకు ఓట్లు వేసిందన్న అంచనాలున్నాయి. అయితే తొలిసారి ఓటుహక్కు వినియోగించుకునే ఓటర్ల మదిలో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేసింది ట్రిబ్యూన్ పత్రిక. ఆ పత్రిక ఉత్తరాది రాష్ట్రాల్లో కాలేజీలన్నీ చుట్టి ఒక సర్వే నిర్వహించింది. అందులో ఆశ్చర్యకరమైన అభిప్రాయాలు వెల్లడయ్యాయి. తొలి ఓటర్లలో అత్యధికులు దేశ భద్రతకే అధిక ప్రాధాన్యం ఇస్తామని కుండబద్దలు కొట్టారు. పుల్వామా దాడుల తర్వాత మోదీ సర్కార్ నక్క జిత్తులమారి పాక్‌ను దెబ్బకు దెబ్బ తీసిందని కాలేజీ విద్యార్థులు ముక్తకంఠంతో నినదించారు. 2016లో పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రయిక్స్ నేపథ్యంలో వచ్చిన ‘ఉరీ’ సినిమాను తాము ఎన్నిసార్లు చూశామో లెక్కే లేదన్నారు. మోదీ దౌత్యానికి ఫిదా పాక్ సైన్యానికి చిక్కిన ఐఎఎఫ్ అధికారి అభినందన్ విడుదల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దౌత్యపరమైన చర్యలు చేపట్టిన తీరుకు తాము ఫిదా అయినట్టుగా త్రిపాఠి అనే విద్యార్థి, వారి స్నేహితులు తమ మనోగతాన్ని బయటపెట్టారు. యూపీ, ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, హరియానా, కశ్మీర్, పశ్చిమబెంగాల్.. ఇలా ఏ రాష్ట్రంలో కాలేజీకి వెళ్లి అడిగినా అదే సమాధానం వినిపించింది. సర్వేయర్లు ఏ ప్రశ్న వేసినా అటు తిరిగి ఇటు తిరిగి సర్జికల్ స్ట్రయిక్స్ గురించే విద్యార్థులు ఉత్సాహంగా మాట్లాడారు. పాక్‌తో ప్ర«ధాని మోదీ వ్యవహరించిన తీరుకి ముగ్ధులయ్యామని, ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు భారత్ మాట వింటున్నాయంటే అందుకు మోదీ కారణమని ప్రశంసించారు. దివ్య తోమర్ అనే గ్రాడ్యుయేట్ విద్యార్థి విపక్షాలు వైమానిక దాడులపై సాక్ష్యాధారాలు చూపించాలన్న డిమాండ్లపైనా మండిపడ్డారు. ‘దేశ భద్రత అంశంలో మనందరం ఐక్యంగా ఉండాలి. భారత్ ప్రభుత్వం మన రక్షణ దళానికి ఒక ఊపు వచ్చేలా వ్యవహరించింది. పాకిస్తాన్‌కు తన స్థానమేంటో గుర్తు చేసింది‘‘ అని కామెంట్ చేశారు. మా కాళ్ల మీద నిలబడతాం నిరుద్యోగంపై ప్రస్తావించినా విద్యార్థులు వినిపించుకునే స్థితి కొన్ని కాలేజీల్లో కనిపించలేదు. ‘ఉద్యోగాలు కూడా ఎన్నికల్లో ఒక అంశమే, కాదనలేం. కానీ కోట్లాది మందికి ప్రభుత్వమే ఉద్యోగాలు కల్పించాలంటే ఎలా? మాకైతే ఉద్యోగం అర్థించడం కంటే, మా కాళ్ల మీద మేము నిలబడి పదిమందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని ఉంది. మధ్య తరగతి వారికి మేలు చేసేలా తాజా బడ్జెట్ ఉంది’ అని దయాల్ సింగ్ కళాశాలకు చెందిన తుహానీ అరుణ్ అనే బీకామ్ విద్యార్థి చెప్పాడు. కోటా మాకొద్దు తరం మారుతోంది. దాంతో పాటు యువ ఓటర్ల స్వరం కూడా మారుతోంది. రిజర్వేషన్ల అంశంలో కూడా కాలేజీ విద్యార్థులు విభిన్నంగానే స్పందించారు. విద్య, ఉద్యోగ అవకాశాలు ప్రతిభ ఆధారంగా రావాలి తప్ప రిజర్వేషన్లతో కాదంటున్నారు. ‘నాకు జనరల్ కేటగిరీలో పోటీ పడాలని ఉంది. కులపరమైన రిజర్వేషన్లు మాకు అక్కర్లేదు. వాటిని రద్దు చేయాలి’ అనేది కాజల్ ప్రజాపతి అనే గ్రాడ్యుయేట్ అభిప్రాయం. విక్రాంత్ శర్మ అనే మరో యువ ఓటరు కులాలకు అతీతంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నవారికి రిజర్వేషన్లు ఇస్తే మంచిదన్నారు. తాజాగా అగ్రవర్ణాల్లో పేదలకు 10 శాతం కోటా ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయం ఎంతో మేలు చేస్తుందని వ్యాఖ్యానించారు. పార్టీల వ్యూహాలు ఎలా ఉన్నాయి? తొలి ఓటర్లను ఆకర్షించే అంశంలో ఈసారి కూడా బీజేపీయే ముందుంది. ఓటరు ప్రక్రియ నమోదుకు ముందు నుంచే ప్రధాని నరేంద్ర మోదీ తొలి ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకోవాలంటూ పదేపదే పిలుపునిచ్చారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక మోదీ ‘ప్రజాస్వామ్యానికి పండుగ వచ్చిందని, ముఖ్యంగా యువత ఓటు హక్కు వినియోగించుకోవా’లంటూ ట్వీట్ చేశారు. ఈ ఏడాది జనవరిలో ముంబైలో మోదీ యువశక్తి పేరిట ప్రత్యేకంగా ఒక ప్రచార విభాగం మొదలైంది. పరీక్షలకు ముందు విద్యార్థుల్ని స్వయంగా కలుసుకున్న మోదీ ఒత్తిడి తగ్గించుకునే మార్గాలపై పాఠాలు చెప్పి వారిని ఆకట్టుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కాస్త ఆలస్యంగా మేల్కొన్నా.. యువ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు కొన్ని చేస్తున్నారు. ‘ఆప్నీ బాత్ రాహుల్ కే సాత్’ అంటూ ఢిల్లీ రెస్టారెంట్లో కొందరు తొలి ఓటర్లను కలుసుకొని మాట్లాడారు. ఇండియన్ యూత్ కాంగ్రెస్ ‘యువ క్రాంతి యాత్ర’ ద్వారా తొలి ఓటర్లకు గాలం వేస్తోంది. యువ ఓటర్లను ఆకర్షించడానికి సామాజిక మాధ్యమాల్లోనూ రెండు పార్టీలు పోటాపోటీ ప్రచారం చేస్తున్నాయి. 2014లో తొలి ఓటర్ల ‘నమో’ జపం 2014 ఎన్నికల్లో యువతరం నమో మంత్రంతో ఊగిపోయింది. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోదీని ప్రకటించిన వెంటనే ఆయనను యువతరానికి ప్రతినిధిగానే చూశారు. అందుకే పోలింగ్ బూత్లకి తరలివచ్చి కమలం వైపే మొగ్గు చూపారు. ఎన్నికల తర్వాత సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్డీఎస్) నిర్వహించిన సర్వేలో మొదటి సారి ఓటుహక్కు వినియోగించుకున్న వారిలో (18 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు) 34 శాతం మంది బీజేపీకి ఓటు వేసినట్టు వెల్లడైంది. ఇక కాంగ్రెస్ ఆ ఎన్నికల్లో తొలి ఓటర్ల నుంచి 19 శాతం ఓట్లను మాత్రమే దక్కించుకుంది. -
కోటా కోసం మళ్లీ గుజ్జర్ల ఆందోళన
జైపూర్ : రాజస్ధాన్‌లో గుజ్జర్లు రిజర్వేషన్ కోరుతూ మళ్లీ ఆందోళన బాట పట్టారు. విద్యా, ఉద్యోగాల్లో ఐదు శాతం రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ శుక్రవారం సవాయి మధోపూర్ జిల్లాలో ఆందోళనకారులు రైల్వే ట్రాక్‌లపై కూర్చుని రైళ్ల రాకపోకలను అడ్డగించారు. ఐదు శాతం రిజర్వేషన్ కోసం తాము చాలా కాలంగా పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తాము తిరిగి ఆందోళన చేపట్టామని, తమ కోటాను ప్రభుత్వం ఎలాగైనా ఇచ్చి తీరాల్సిందేనని గుజ్జర్ల నేత కిరోరి సింగ్ భైంస్లా డిమాండ్ చేశారు. ప్రస్తుతం గుజ్జర్లు, రైకా-రెబరి, బంజారాలకు 50 శాతం కోటాలోనే అత్యంత వెనుకబడిన వర్గాల కింద ప్రత్యేకంగా ఒక శాతం రిజర్వేషన్ అమలవుతోంది. అయితే తమ కులాలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్ధల్లో ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ గుజ్జర్లు జనవరిలో రాజస్ధాన్ ప్రభుత్వానికి 20 రోజుల గడువిస్తూ అల్టిమేటం జారీ చేశారు. డెడ్‌లైన్ ముగియడంతో సవాయి మధోపూర్ జిల్లాలో గుజ్జర్లు మహాపంచాయత్ పేరిట భేటీ అయి ఆందోళన చేపట్టారు. -
కోటాపై విపక్షాల దుష్ప్రచారం: ప్రధాని
సాక్షి,చెన్నై : అగ్రవర్ణ పేదలకు జనరల్ కేటగిరీలో పది శాతం రిజర్వేషన్లు కల్పించడం అన్ని వర్గాల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందనేందుకు సంకేతమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అగ్రవర్ణ కోటాపై వివిధ రాజకీయ పార్టీలు చేస్తున్న దుష్ప్రచారం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తమిళనాడులోని తోపూర్‌లో ఆదివారం జరిగిన ర్యాలీలో ప్రధాని కోరారు. సమాజంలోని అన్ని వర్గాలకూ విద్య, ఉపాధి అవకాశాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడిఉందన్నారు. ఇప్పటికే రిజర్వేషన్ ప్రయోజనాలు పొందుతున్న దళితులు, గిరిజనులు, ఓబీసీలపై ఎలాంటి ప్రభావం లేకుండా అగ్రవర్ణ పేదలకు కోటా వర్తింపచేయాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. తమిళనాడులో కొన్ని రాజకీయ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనం కోసం పది శాతం కోటాపై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. కాగా అంతకుముందు కేరళలోని కొచ్చిలో బీపీసీఎల్‌లో ఇంటిగ్రేడెట్ రిఫైనరీ విస్తరణ కాంప్లెక్స్‌ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు.మరోవైపు తమిళనాడులోని మధురైలోనూ ఎయిమ్స్ ఆస్పత్రికి శంకుస్ధాపన చేశారు. -
కోటా కోసం 16,000 సీట్ల పెంపు
సాక్షి, న్యూఢిల్లీ : అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా కోటా అమలు కోసం ఢిల్లీ యూనివర్సిటీ కసరత్తు చేపట్టింది. ఈబీసీ కోటాను వర్తింపచేసేందుకు 2019-20 విద్యాసంవత్సరంలో వివిధ కోర్సుల్లో అదనంగా 16,000 సీట్లను పెంచాలని ఢిల్లీ యూనివర్సిటీ నిర్ణయించింది. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు మొత్తం సీట్లలో 25 శాతం పెరుగుదల ఉండాలని కేంద్ర మానవ వనురుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కాగా ఢిల్లీ యూనివర్సిటీలో ప్రస్తుతం గ్రాడ్యుయేట్ అడ్మిషన్లు 56,000 కాగా, పీజీ అడ్మిషన్ల కింద 9500 సీట్లు అందుబాటులో ఉన్నాయి. పది శాతం కోటాను ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించాలని మానవ వనరుల మంత్రిత్వ శాఖ నిర్ధేశించడంతో ఆయా విద్యాసంస్ధలు మౌలిక వసతులను మెరుగుపరచకుండానే సీట్ల సంఖ్యను పెంచాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఇక ఐఐటీ ఢిల్లీ, జేఎన్‌యూలు ఇప్పటికే తమ సీట్ల సంఖ్యను వరుసగా 590, 346 సీట్లకు పెంచాయి. ఈ విద్యా సంస్ధల్లో హాస్టల్ వసతి పరిమితంగా ఉండటంతో పెరిగే విద్యార్ధులకు వసతి కల్పించడంపై ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్ధల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే జనరల్ కేటగిరీలో అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్‌ను అమలు చేస్తామని హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖ గత వారం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
మరాఠా కోటా బిల్లుకు మహా అసెంబ్లీ ఆమోదం
సాక్షి, ముంబై : ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా రంగంలో మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్ కల్పించే మరాఠా కోటా బిల్లును గురువారం మహారాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కొద్దిసేపటికే బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. మరాఠాలకు రిజర్వేషన్ బిల్లును ఆమోదం కోసం ఎగువ సభకు పంపారు. మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందిన అనంతరం బిల్లు ఆమోదానికి మద్దతు తెలిపిన రాజకీయ పార్టీలకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ధన్యవాదాలు తెలిపారు. మరాఠా కోటా అంశానికి సంబంధించి బీసీ కమిషన్ సిఫార్సులపై తీసుకున్న చర్యలను వివరిస్తూ రెండు పేజీల నివేదికను సైతం రాష్ట్ర ప్రభుత్వం సభ ముందుంచింది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా మరాఠాలు కొద్దినెలలుగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇక ధంగర్ వర్గీయులకు రిజర్వేషన్ల కోటాపై సబ్ కమిటీని నియమించామని, కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపడతామని సీఎం ఫడ్నవీస్ పేర్కొన్నారు. -
రగులుతున్న మరాఠాల ఎద
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యా సంస్థల్లో తమకూ రిజర్వేషన్లు కల్పించాలంటూ ముంబై నగరానికి మూడున్నర లక్షల మందితో మహా ర్యాలీని మరాఠాలు నిర్వహించి ఏడాది గడిచింది. 2019, ఆగస్టు 9వ తేదీన మహారాష్ట్రలోని వివిధ జిల్లాల నుంచి ప్రారంభమైన 58 మౌన, అహింసా ర్యాలీలు ముంబై నగరంలో మిళితమై అది మెఘా ర్యాలీగా మారింది. నాడు ఒక్క రిజర్వేషన్ల అంశంపైనే కాకుండా రైతులకు పలు రాయితీలు కల్పించాలని, 2016లో 15 ఏళ్ల మరాఠా బాలికపై జరిగిన మూకుమ్మడి అత్యాచార ఘటనలో సత్వర న్యాయం జరగాలని నాడు మరాఠాలు డిమాండ్ చేశారు. అత్యాచారం కేసును విచారించిన ఫాస్ట్‌ట్రాక్ కోర్టు 2017, నవంబర్‌లో ముగ్గురు దోషులకు మరణ శిక్ష విధించింది. లక్షలాది మంది మరాఠాలు రోడ్డెక్కడానికి ప్రధాన కారణం ఈ రేప్ సంఘటన. ఈ సంఘటనలో దోషులు దళితులవడం వల్ల రిజర్వేషన్లతో వారు విర్రవీగుతున్నారన్న ఆక్రోశంతో మరాఠాలు కూడా రిజర్వేషన్ల కోసం పోరుబాట పట్టారు. అదే సంవత్సరం కేంద్ర ప్రభుత్వం వివిధ పంటలకు కనీస మద్దతు ధరను గణనీయంగా పెంచింది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుల రుణాల మాఫీకి చర్యలు చేపట్టింది. 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండరాదని సుప్రీం కోర్టు నిర్దేశించిన నేపథ్యంలో అప్పటికే రాష్ట్రంలో రిజర్వేషన్లు యాభై శాతం దాటడంలో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించలేమని రాష్ట్ర ప్రభుత్వం తేల్చింది. అయినప్పటికీ రిజర్వేషన్ల అంశం పరిష్కారానికి న్యాయపరంగా ఉన్న అన్ని మార్గాలను అన్వేషించి సత్వర చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దాంతో మరాఠాలు తమ పోరాటానికి విరామం కల్పించారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల అంశం ముంబై హైకోర్టుకు వెళ్లింది. సుప్రీం కోర్డు మార్గదర్శకాల మేరకు హైకోర్టు కూడా రిజర్వేషన్ల విషయమై ఏం చేయక పోవచ్చు. అయినప్పటికీ కోర్టు తీర్పు కోసం నిరీక్షిద్దామని, నవంబర్ నెల వరకు నిరీక్షించాల్సిందిగా మరాఠాలకు ఫడ్నవీస్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఎందుకోగానీ గత జూలై నెలలో మరాఠాలు రిజర్వేషన్లంటూ రెండో పర్యాయం రోడ్డుమీదకు వచ్చారు. గతంలోలాగా కాకుండా వారు ఈసారి విధ్వంసకాండకు పాల్పడ్డారు. ఇప్పుడు కూడా పాల్పడుతున్నారు. తాజాపోరులో భాగంగా 500 మంది మరాఠాలు గురువారం నాడు ముంబైలోని బంద్రా–కుర్లా కాంప్లెక్స్‌లోని సబర్బన్ కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయింపు ప్రారంభించారు. విషయం కోర్టులో ఉన్నప్పుడు మీరు ఆందోళన చేసి ఏం లాభం అంటూ మీడియా కొందరిని ప్రశ్నించగా, తామేమి 50 శాతం మించి రిజర్వేషన్లు ఇమ్మని డిమాండ్ చేయడం లేమని, 50 శాతానికి లోబడే రిజర్వేషన్లు ఇమ్మని కోరుతున్నామని వారు అన్నారు. కొన్ని వర్గాలకు రిజర్వేషన్లు తగ్గిస్తే తమకు రిజర్వేషన్లు కల్పించవచ్చని వారు సూచిస్తున్నారు. మీడియా మాట్లాడించిన వారిలో 57 దత్తాత్రేయ్ థామ్‌కర్ ఒకరు. తన ఇద్దరి కూతుళ్లు ఇంజనీరింగ్ చదవుతున్నారని, వారి చదవుల కోసం రెండేళ్ల క్రితం 9 లక్షల రూపాయలు అప్పుచేశానని చెప్పారు. వారి పెళ్లికి అయ్యే ఖర్చు గురించి కూడా ఆలోచించాల్సి ఉంటుందని అన్నారు. ఆ అప్పును ఎలా తీర్చాలో కూడా ప్రస్తుతానికి తనకు తెలియదని అన్నారు. చదువు పూర్తయినా ఉద్యోగం వస్తుందన్న గ్యారెంటీ లేదని అన్నారు. ఇదివరకు జౌళి మిల్లులో పనిచేసిన థామ్‌కర్ అది మూత పడడంతో రోజు కూలీగా మారారు. మరాఠాల సంప్రదాయం ప్రకారం మరాఠా మహిళలు భైఠాయింపునకు ముందు వరుసలో ప్రత్యేకంగా కూర్చున్నారు. వారిలో 45 ఏళ్ల ప్రేర్నా రాణె మీడియాతో మాట్లాడుతూ ‘నా పిల్లల చదువు పూర్తయింది. వచ్చేతరం పిల్లల రిజర్వేషన్ల కోసం పోరాటంలో పాల్గొంటున్నాను. మా సమాన హక్కుల కోసం మేం పోరాడుతున్నాం’ అని వ్యాఖ్యానించారు. ఈ రోజు కాకున్నా రేపైనా ప్రభుత్వం దిగొచ్చి తమకు న్యాయం చేస్తుందన్న నమ్మకం తమకుందని అక్కడ బైఠాయించిన మరాఠాలందరూ ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. చదవండి: మరాఠాలకు రిజర్వేషన్లు ఎందుకు ? -
ఆ ఐదు కులాలకు కోటా..
జైపూర్ : గుజ్జర్లతో పాటు ఐదు కులాలకు ఒక శాతం రిజర్వేషన్లను వర్తింపచేసేందుకు రాజస్తాన్ ప్రభుత్వం సోమవారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అత్యంత వెనుకబడిన వర్గాల (ఎంబీసీ) కేటగిరీ కింద ఈ కోటాను ప్రభుత్వం ఆమోదించింది. ఈ ఐదు కులాల వారు ఓబీసీ కేటగిరీ కింద 21 శాతం కోటాకు కూడా అర్హులని ప్రభుత్వం పేర్కొంది. ఈనెల 7న జైపూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. తమకు కోటా కల్పించకుంటే ప్రధాని పాల్గొనే కార్యక్రమంలో నిరసనలకు దిగుతామని గుజ్జర్లు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయంతో గుజ్జర్లు సహా గొదియా లొహర్, బంజారా, రైకా, గదారియా కులాలు లబ్ధి పొందనున్నాయి. ఆయా కులాలకు రిజర్వేషన్లకు సంబంధించి విద్యా సంస్థల్లో ప్రవేశానికి, ప్రభుత్వ ఉద్యోగాలు పొందేందుకు రెండు వేర్వేరు ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. -
ప్రమోషన్లలో కోటాకు సుప్రీం గ్రీన్‌సిగ్నల్
సాక్షి, న్యూఢిల్లీ : ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్ల అమలుకు చట్ట ప్రకారం ముందుకెళ్లవచ్చని సుప్రీం కోర్టు మంగళవారం కేంద్రాన్ని అనుమతించింది. వివిధ హైకోర్టులు, 2015లో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన యథాతథ ఉత్తర్వుల కారణంగా మొత్తం ప్రమోషన్ల ప్రక్రియ నిలిచిపోయిందని కేంద్రం నివేదించడంతో జస్టిస్ ఆదర్శ్‌కుమార్ గోయల్, జస్టిస్ అశోక్ భూషణ్‌లతో కూడిన సుప్రీం బెంచ్ కేంద్ర ప్రభుత్వానికి ప్రమోషన్ల ప్రకియకు అనుమతిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లపై ఢిల్లీ, బాంబే, పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులు వేర్వేరు తీర్పులు ఇచ్చాయని, వీటిపై సర్వోన్నత న్యాయస్థానం సైతం భిన్న ఉత్తర్వులు జారీ చేసిందని ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. ప్రమోషన్లలో కోటా విషయంలో పలు కేసులను కేంద్రం తరపున వాదనలు వినిపించిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ మణీందర్ సింగ్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశంలో ఎం నాగరాజ్ కేసు విషయంలో 2006లో సర్వోన్నత న్యాయస్ధానం ఇచ్చిన తీర్పును వర్తింపచేయవచ్చన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్ల విషయంలో క్రీమీలేయర్ వర్తింపచేయలేమని ఈ కేసులో కోర్టు స్పష్టం చేసిందన్నారు. -
ఇన్ సర్వీసు కోటా చిచ్చు
సాక్షి, హైదరాబాద్ : వైద్య విద్య పీజీ సీట్ల అడ్మిషన్లలో కొత్త విధానం వివాదాస్పదంగా మారింది. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేసేవారికి పీజీ అడ్మిషన్లలో ఉండే ప్రాధాన్యతను తగ్గించడంపై వైద్య సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలోని వైద్య విద్య పీజీ సీట్ల భర్తీలో కొత్త విధానాన్ని ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేసే రెగ్యులర్ వైద్యులకు కౌన్సెలింగ్‌లో ప్రాధాన్యత కల్పించారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేసే వారికి గతంలో ఉన్న ప్రాధాన్యతను రద్దు చేశారు. దీంతో వైద్య సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. కాళోజీ నారాయణరావు ఆరోగ్య, విజ్ఞాన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ కరుణాకర్‌రెడ్డి ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి మార్గదర్శకాలు రూపొందించారని ఆరోపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వ వైద్యుల కేంద్ర సంఘం ముఖ్యులు బుధవారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. సంఘం అధ్యక్షుడు పుట్ల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో.. పీజీ కౌన్సెలింగ్‌లో గతంలో ఉన్న 30% క్లినికల్, 50% నాన్ క్లినికల్ కోటాను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం వల్ల ఇన్ సర్వీసు కోటాలో పీజీ సీట్లు పొందాలనుకునే వైద్యులకు నష్టం కలుగుతుందన్నారు. ‘ప్రభుత్వం ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు వేస్తు న్న తరుణంలో వైద్యులు ఎంతో కష్టపడి పని చేస్తూ ప్రభుత్వం ప్రవే శపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ వైద్య సేవలు అందిస్తూ పీజీలో చేరాలనే వారికి ప్రభుత్వ నిర్ణయం ఇబ్బంది కలిగిస్తోంది. ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచన చేసి పీజీ ఇన్ సర్వీసు కోటాను మార్కులతో ముడిపెట్టకుండా గతంలో మాదిరిగా అమలు చేయాలి. సర్వీసు కోటాలో 30% క్లినికల్, 50% నాన్ క్లినికల్ వాటాగా అమలు చేయాలి’అని డిమాండ్ చేశారు. రేపటి నుంచి దరఖాస్తులు.. రాష్ట్రంలోని వైద్య విద్య పీజీ సీట్ల భర్తీ కోసం కాళోజీ నారాయణరావు ఆరోగ్య, విజ్ఞాన విశ్వవిద్యాలయం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. నీట్ ర్యాంకుల ఆధారంగా సీట్లు భర్తీ చేయనుంది. మార్చి 23 నుంచి 28 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్)తోపాటు రాష్ట్రంలో ని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కాలేజీల్లోని పీజీ సీట్లలో అడ్మిషన్ పొందాలనుకునే వారు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పీజీ సీట్ల భర్తీకి సంబంధించిన అర్హతలు, అభ్యర్థుల మెరిట్ జాబితా, కాలేజీల వారీగా సీట్ల వివరాలను యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపరచనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది.