CM KCR Announced BRS MLA Quota MLC Elections Candidates List - Sakshi
Sakshi News home page

BRS MLC Candidates: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్‌

Published Tue, Mar 7 2023 4:41 PM | Last Updated on Tue, Mar 7 2023 5:04 PM

Cm Kcr Announced Mla Quota Mlc Candidates - Sakshi

దేశపతి శ్రీనివాస్, చల్లా వెంకట్రామి రెడ్డి, కుర్మయ్యగారి నవీన్ కుమార్

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర శాసన మండలికి ఎమ్మెల్యేల కోటా అభ్యర్థులుగా దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్ కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డిలను బీఆర్ఎస్ అధినేత, సిఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ నెల 9న అభ్యర్థులు నామినేషన్‌ వేయనున్నారు.

ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చూసుకోవాల్సిందిగా శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డిలను సీఎం కేసీఆర్ ఆదేశించారు. కాగా... రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు, గవర్నర్ ద్వారా నామినేట్ అయ్యే ఇద్దరి పేర్లను కేబినెట్ సమావేశం తర్వాత ప్రకటించనున్నారు.
చదవండి: బంగ్లాదేశీయులకు కూడా సర్టిఫికెట్లు ఇచ్చారేమో.. రాజాసింగ్‌ సంచలన ఆరోపణలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement