List candidates
-
జేఎంఎం అభ్యర్థుల జాబితాలు విడుదల
రాంచీ: జార్ఖండ్ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) బుధవారం 35 మంది పార్టీ అభ్యర్థుల పేర్లతో రెండు జాబితాలను విడుదలచేసింది. జేఎంఎం చీఫ్, రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సొంత నియోజకవర్గమైన సహీబ్‌గంజ్ జిల్లాలోని బర్హేట్(ఎస్టీ) నుంచి, ఆయన భార్య కల్పన గాండేయ్ నియోజకవర్గం నుంచి పోటీచేయనున్నారు. కల్పన గతంలో గాండేయ్ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిపై భారీ మెజారిటీ గెలవడం తెల్సిందే. హేమంత్ సోదరుడు బసంత్ ఈసారి దుమ్కా నుంచి, అసెంబ్లీ స్పీకర్ రవీంద్రనాథ్ మహతో నాలా నుంచి, మంత్రి మిథిలేశ్ ఠాకూర్ గర్వా నుంచి పోటీచేస్తున్నారు. మూడుసార్లు బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచి ఇటీవల జేఎంఎంలో చేరిన కేదర్ హజారా ఈసారి జమూనా(ఎస్సీ) నుంచి పోటీచేస్తున్నారు. రాజ్యసభ సభ్యురాలు మహువా మాఝీ రాంచీ నుంచి పోటీచేయనున్నారు. జార్ఖండ్‌లో విపక్షాల ‘ఇండియా’ కూటమి భాగస్వామ్యులైన జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్ష పార్టీల మధ్య ఇప్పటికే సీట్ల సర్దుబాటు జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం కాంగ్రెస్, జేఎంఎం 70 చోట్ల పోటీచేస్తాయి. 11 చోట్ల ఆర్జేడీ, వామపక్ష పార్టీలు పోటీచేస్తాయి. ఆర్జేడీ మంగళవారం ఆరుగురి పేర్లను ప్రకటించింది. విపక్ష బీజేపీ 68 స్థానాల్లో బరిలో దిగనుంది. మిత్రపక్షాలైన ఏజేఎస్‌యూ 10, జేడీ(యూ) రెండు, ఎల్జేపీ(రాంవిలాస్) ఒక స్థానంలో బరిలోకి దిగనున్నాయి. రాష్ట్రంలో నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 23న ఫలితాలను వెల్లడిస్తారు. -
YSRCP బిగ్ టార్గెట్ ఇదే
-
ఇదంతా సీఎం జగన్ వల్లే సాధ్యం గెలిచి బహుమతిగా ఇస్తాం ..!
-
అభ్యర్థుల జాబితా రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే ఘట్టం: సీఎం జగన్
-
YSRCP జాబితాలో సోషల్ ఇంజనీరింగ్
-
లిస్టులో నా పేరు చూడగానే.. మార్గాని ఫస్ట్ రియాక్షన్
-
సీటు రాని అభ్యర్థులకు సీఎం జగన్ హామీ
-
పశ్చిమగోదావరి YSRCP MLA అభ్యర్థుల జాబితా
-
లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ కోఆర్డినేటర్లు వీరే
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ కోఆర్డినేటర్లను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నియమించారు. ఈ సమన్వయకర్తల జాబితాను ఆదివారం ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ. వేణుగోపాల్ ఓ ప్రకటనలో విడుదల చేశారు. ఆదిలాబాద్ (ఎస్టీ)– సీతక్క, పెద్దపల్లి (ఎస్సీ) –డి.శ్రీధర్‌బాబు, కరీంనగర్– పొ న్నం ప్రభాకర్, నిజామాబాద్– టి.జీవన్‌రెడ్డి, జహీరాబాద్– టి.సుదర్శనరెడ్డి, మెదక్– దామోదర రాజనరసింహ, మల్కాజిగిరి– తుమ్మల నాగేశ్వరరావు, సికింద్రాబాద్– మల్లు భట్టి విక్రమార్క, హైదరాబాద్– మల్లు భట్టి విక్రమార్క, మహబూబ్‌నగర్– రేవంత్‌రెడ్డి, చేవెళ్ల–రేవంత్‌రెడ్డి, నాగర్‌కర్నూలు (ఎస్సీ)– జూపల్లి కృష్ణారావు, నల్లగొండ– ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి, భువనగిరి– కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వరంగల్ (ఎస్సీ)– కొండా సురేఖ, మహబూబా బాద్ (ఎస్టీ)– పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఖమ్మం– పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. -
ఎస్ఐ అభ్యర్థుల ఎంపిక జాబితా విడుదల
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎస్ఐ పోస్టులకు ఎంపికైనవారి జాబితాను రాష్ట్ర పోలీసు నియామక మండలి శుక్రవారం ప్రకటించింది. అత్యంత పారదర్శకంగా అభ్యర్థుల ప్రతిభ, రిజర్వేషన్ల ప్రకారం సివిల్, ఏపీఎస్పీ విభాగాల్లో మొత్తం 411 ఎస్ఐ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది. 315 సివిల్ ఎస్ఐ (పురుషులు, మహిళలు), 96 ఏపీఎస్పీ ఎస్ఐ (పురుషులు) పోస్టులకు రాత పరీక్షల ఫలితాల అనంతరం నాలుగు జోన్ల వారీగా మెరిట్ జాబితాను ప్రకటించింది. సివిల్ ఎస్ఐ పోస్టులకు ఏకంగా 102 మంది మహిళలు ఎంపికవ్వడం విశేషం. మొత్తం సివిల్ ఎస్ఐ పోస్టులకు సంబంధించి విశాఖపట్నం జోన్లో 50, ఏలూరులో 105, గుంటూరులో 55, కర్నూలులో 105 మందిని ఎంపిక చేశారు. టాపర్లు వీరే.. సివిల్ ఎస్ఐ పురుషుల విభాగంలో గోనబోయిన విజయభాస్కరరావు (రి.నం. 5033539) 400 మార్కులకు గాను 284 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచారు. ఈయన ఏలూరు జోన్‌కు ఎంపికయ్యారు. మహిళల్లో లోగిసా కృష్ణవేణి (రి.నం.5052468) 273 మార్కులతో మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. ఏపీఎస్పీ విభాగంలో రానెల్లి కోటారావు (రి.నం.5036787) 300 మార్కులకు గాను 190.5 మార్కులతో ప్రథమ స్థానం సాధించారు. త్వరలో పోలీసు నియామక మండలి ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలతోపాటు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేపట్టనుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఎంపికైన అభ్యర్థులకు అనంతపురంలోని ఏపీ పోలీసు అకాడమీలో శిక్షణ ఇవ్వనుంది. సంక్రాంతి తర్వాత శిక్షణ ఉండొచ్చని పోలీసు నియామక మండలి తెలిపింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను https://slprb.ap.gov.in/ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ప్రతిభ, రోస్టర్ ప్రకారం.. రాష్ట్రంలో 411 ఎస్ఐ పోస్టుల భర్తీకి పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ ఇవ్వగా 1,73,047 దరఖాస్తులు వచ్చాయి. 1,40,453 మంది పురుషులు, 32,594 మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. ఫిబ్రవరి 19న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో 1,51,288 మంది పరీక్ష రాస్తే 57,923 మంది (38.28 శాతం) ఉత్తీర్ణులయ్యారు. వీరికి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించగా 31,193 మంది తుది రాత (మెయిన్స్) పరీక్షకు ఎంపికయ్యారు. అక్టోబర్ 14, 15 తేదీల్లో తుది పరీక్ష జరగ్గా ఈ నెల 6న ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో 18,637 మంది అర్హత సాధించారు. వీరిలో ప్రతిభావంతుల జాబితాను రూపొందించి రోస్టర్ ప్రకారం మెరిట్లో నిలిచిన 411 మంది అభ్యర్థులను పోలీసు నియామక మండలి ఎస్ఐ పోస్టులకు ఎంపిక చేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌తో పాటు ప్రత్యేక కోటా రిజర్వేషన్ల ప్రకారం అభ్యర్థుల తుది ఎంపికలు చేపట్టింది. పోలీస్ ఎగ్జిక్యూటివ్ (పీఈ)కు 2 శాతం, ఎన్సీసీకి 3 శాతం, మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ (ఎంఎస్పీ)కు 2 శాతం, పోలీసు సిబ్బంది పిల్లలు (సీపీపీ)కు 2 శాతం, సీడీఐకి 2 శాతం, పోలీసు మినిస్టీరియల్ (పీఎం)కు 1 శాతం రిజర్వేషన్ కల్పించింది. -
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసన మండలికి ఎమ్మెల్యేల కోటా అభ్యర్థులుగా దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్ కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డిలను బీఆర్ఎస్ అధినేత, సిఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ నెల 9న అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చూసుకోవాల్సిందిగా శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డిలను సీఎం కేసీఆర్ ఆదేశించారు. కాగా... రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు, గవర్నర్ ద్వారా నామినేట్ అయ్యే ఇద్దరి పేర్లను కేబినెట్ సమావేశం తర్వాత ప్రకటించనున్నారు. చదవండి: బంగ్లాదేశీయులకు కూడా సర్టిఫికెట్లు ఇచ్చారేమో.. రాజాసింగ్ సంచలన ఆరోపణలు -
ప్రసవాలు సరే.. మరణాల మాటేమిటి?
నిజామాబాద్‌అర్బన్: సర్కారు చర్యల వల్ల ప్రభుత్వ ఆస్పత్రులకు కొత్త కళ వచ్చింది. కేసీఆర్ కిట్ కారణంగా సర్కారు దవాఖానాల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. అయితే, ప్రసవాల సంఖ్యతో పాటే మాతృ, శిశు మరణాలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సరైన సౌకర్యాలు కరువవడం, అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనే వ్యవస్థ లేకపోవడం మూలంగా మరణాల సంఖ్య పెరుగుతోంది!. జిల్లా వ్యాప్తంగా దవాఖానాల్లో ఈ ఏడాది సంభవించిన మరణాలు భయపెట్టిస్తున్నాయి. ఆర్నెళ్ల వ్యవధిలో 101 మంది నవజాత శిశువులు పురిట్లోనే కన్నుమూయడం, ఆరుగురు బాలింతలు ప్రసవ సమయంలో మృత్యువాత పడడం ఆందోళన కలిగిస్తోంది. వసతులు కరువు.. జిల్లా వ్యాప్తంగా 33 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రితో పాటు ఒక ఏరియా ఆస్పత్రి, నాలుగు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లతో పాటు మరో 92 వరకు ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రోజుకు సుమారు 40 నుంచి 50 వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. ఇక, ఆర్మూర్, బోధన్, డిచ్‌పల్లితో పాటు మోర్తాడ్, వర్ని, నవీపేట ఆస్పత్రులలో మరో 50 వరకు ప్రసవాలు నమోదవుతున్నాయి. అయితే, అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు బాలింతలు, శిశువులకు సరైన వైద్యసౌకర్యలు అందడం లేదు. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోనే వెంటిలేటర్ సదుపాయం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనే వ్యవస్థ లేకపోవడంతో బాలింతలు, శిశువులు మృత్యువాతపడుతున్నారు. అందుబాటులో లేని అత్యవసర చికిత్స కేసీఆర్ కిట్ ప్రభావంతో ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవాల సంఖ్య పెరిగింది. అయితే, అందుకు తగినట్లుగా వసతులు లేకపోవడం కారణంగా మరణాల సంఖ్య పెరుగుతోంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చిన గర్భిణులు, బాలింతలు, శిశువులకు సరైన వైద్యచికిత్సలు అందడం లేదు. ప్రసవ సమయంలో గర్భిణులకు రక్తం తక్కువగా ఉండడం, ఫిట్స్ రావడం, శిశువు ఉమ్మ నీరు మింగడం, తక్కువ బరువుతో పుట్టడం తదితర కారణాలతో పాటు ఇతర సమస్యలు తలెత్తుంటాయి. అయితే, ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు, సరైన వైద్య చికిత్స అందించే సదుపాయం ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో లేదు. ఫలితంగా మాతృ, శిశు మరణాల సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లలేక, హైదరాబాద్‌కు తీసుకెళ్లలేక పేద, మధ్యతరగతి తల్లులకు కడుపుకోత మిగులుతోంది. ఇటీవల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కడుపులోనే శిశువు మృతి చెందినడంతో ఆగ్రహించిన బంధువులు ఆస్పత్రిపై దాడిచేశారు. అలాగే, నవీపేట మండలానికి చెందిన ఓ బాలింత ప్రసవానంతరం మృతి చెందింది. ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఫలితంగా కేవలం ఆరు నెలల వ్యవధిలోనే 101 మంది శిశువులు, ఆరుగురు బాలింతలు ప్రసవ సమయంలోనే మృత్యువాత పడ్డారు. సమన్వయ లోపమే కారణమా..? మాతృ శిశు మరణాలను తగ్గించేందుకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, వైద్యారోగ్య శాఖ సమన్వయంతో పని చేయాల్సి ఉంది. అయితే, అంతటా సమన్వయ లోపం కనిపిస్తోంది. తమ గ్రామ పరిధిలో గర్భిణుల వివరాలను ఏఎన్ఎంలు రిజిస్టర్ చేసుకుంటారు. అనంతరం వారికి అంగన్వాడీలలో గుడ్లు, పౌష్టికాహారం అందిస్తుంటారు. గర్భిణుల్లో రక్తహీనత లేకుండా మాత్రలు అందించడం, ప్రతి నెలా బరువును పరిశీలించడం వంటివి చేయాలి. రెండు శాఖలు సమన్వయంతో గర్భిణులకు పౌష్టికాహారం అందించాల్సి ఉంటుంది. అలాగే గర్భిణికి తగు సలహాలు, సూచనలు అందించాలి. అయితే, చాలా చోట్ల క్షేత్ర స్థాయిలో శిశు, సంక్షేమ శాఖ, వైద్యారోగ్య శాఖ సిబ్బంది మధ్య సమన్వయం కుదరడం లేదు. దీంతో ప్రసవ సమయంలో గర్భిణులు, శిశువులకు ప్రమాదకరమైన పరిస్థితులు తలెత్తుతున్నాయి. మరికొందరు బాలింతలు వైద్యసిబ్బంది సలహాలు, సూచనలు పట్టించుకోక పోవడం, పురాతన పద్ధతులు పాటించడం కూడా మరణాల పెరుగుదలకు కారణమవుతున్నాయి. మెరుగైన వైద్యం అందిస్తున్నాం.. జిల్లా వ్యాప్తంగా మాతృ, శిశు మరణాల నివారణకు అనేక చర్యలు తీసుకుంటున్నాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవగాహన కల్పిస్తున్నాం. గతంలో కంటే ప్రస్తుతం వీటి మరణాల సంఖ్య తగ్గింది. ప్రమాదక పరిస్థితుల వల్ల అప్పుడప్పుడు మరణాలు సంభవిస్తున్నాయి. వీటిని పూర్తి స్థాయిలో నివారించేందుకు కృషి చేస్తున్నాం. – డా.సుదర్శనం, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి -
పాయె.. గీ లిస్టు కూడా పాయె!
మల్లేసన్నా గీసారీ పాయె.. అన్న పేరు లిస్ట్‌ల రాలె.. ‘ఎర్రిముకం ఏస్కొని ఎంకటేసం సెబ్తే నాకర్థం కాలె.. ‘ఈ లిస్టేంది.. పేరేంది? ’ఈడు గింతె! ఏదీ సక్కగ సెప్పి సావడు. అంతా గజిబిజి అనుకుని ‘అరె ఏందిర పొద్దున్నే గీ కొత్త లొల్లి.. ఎవరి పేరు రాలె.. ఏలిస్టుల రాలె’ అడిగిన. ఆడు పైనుంచి కిందాంక చూసి.. గింత మాత్రం తెల్వదా? అన్నట్లు చూసిండు. ‘గిదేందన్న ఊరంత ఎలచ్చన్ల ముచ్చట్లు.. కబుర్ల బాతాకానీ నడుస్తుంటే.. ఏం తెల్వనట్లు అడుగుతున్నవ్.. మన అంజన్న ఉన్నడు గద.. పాపం ఆ అన్నకె అన్యాయం చేసిండ్రు. ఈ లిస్టుల గారెంటీ పేరొస్తదని నిన్న అందరితో చెప్పుకునిండు. పది కేజీల స్వీట్లు పంచిండు. లిస్టు వచ్చింది గానీ అన్న పేరే రాలె’ అని రవంత బాదగ సెప్పిండు.. పాపం గీ ఎంకటేసమే గింత దిగాలు ముకమేస్కొని సెబ్తుంటే.. ఇంక ఆ అంజన్న గతేందో? మీరెన్నయిన సెప్పుండ్రి.. గిట్ల టెన్షన్‌తో ఎదురు చూసుడు...అరె రాలెదె! అంటూ ఏడ్సుడు కన్న బేకార్ పని ఇంకోట్లేదు. మా సిన్నప్పుడు గింతె. పరీక్షలు రాసినంక అట్టలు.. బుక్కులు ఇసిరేసి ఎగిరేటోల్లం. గానీ రిజల్ట్ అంటే సాలు.. కాల్లు సేతులు వనకబట్టేవి. నోటీసు బోర్డుకంటించిన పేపర్ల.. పాసయినోల్ల పేర్లు ఏసేటోల్లు. గప్పుడు సూడాలె మా అవస్థ. పేరుంటదో లేదో అని గాబరా గాబరా అయ్యేటోల్లం. ఆ టైంల.. థూ ఎందిర బై ఈ బతుకు! గింత టెన్సన్ అవసరమా అనిపించేది. పెద్దోలం అవుతున్న కొద్ది ఈ వెతుకులాట పెరిగిందే గానీ తగ్గలె. నౌకరీ సెలెక్టు లిస్టుల పేరుందో లేదో.. ప్రమోషన్ల లిస్టులో పేరుందో లేదో.. రైలు రిజర్వేషన్ లిస్ట్‌ల పేరుందో లేదో.. గిట్ల చూస్కొంటే మనకు లిస్టులూ ఎక్కువే.. పరేషాన్లు ఎక్కువే! గిప్పట్కీ ఆ టెన్సన్ సైతాన్‌లా పట్టుకునే ఉంది. ఈ ముచ్చటెందుగ్గానీ.. ఇప్పుడు ఎలచ్చన్లు గద. టికెట్ల కోసం గుంపుల్ల దూరి అంగీ గుండీలూడేల యుద్ధం చేస్తున్న పోరాటగాల్ల కస్టాలు ఇంతింత గాదులె. లిస్టులు ఇడుస్తుండ్రు అంటె సాలు గుండెదడ సురువయితది అంటుండ్రు. మొదట్లో మూతికి నెయ్యంటించి.. టికెట్ నీకే బిడ్డా అని పార్టీ పెద్దోల్లు అనగానె.. గీల్లు బాండు బాజాలేస్కొని గల్లీల తిరుగుతుండ్రు. గిప్పుడేమో లెక్కల్ ఉల్టాపల్టా అవుతున్నయ్. మొన్న టికెట్ గారంటీ అని ఎగిరినోడు.. ఇయ్యాల గప్చిప్ అయిపోయిండు. కొంతమంది ఇంకా గదే ఆశతో ఎదురు చూస్తుండ్రు! గిప్పుడూ పార్టీలో కొందరు పెద్దోలు.. అరె నువ్ పరేషాన్ కావొద్దు.. రేపు ఇంకో లిస్ట్ వస్తది.. గందులో నీ పేరు పక్కా పో! అంటుంటే పాపం గీ ఆశావహులు అల్లాడిపోతుండ్రు! టీఆరెస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఎల్లిన ఓ సారు గులాబీ పార్టీని ఏకి పారేసి.. అదిస్తానం దగ్గర మంచి మార్కులు కొట్టేసిండు.. బేఫికర్‌గ టికెట్టు పట్టేసిండంట! ఇంక సనత్‌నగర్ లో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తనని సీనియర్ సారు అంటె.. గట్ల గాదుగానీ ఈసారి మాకు గావాలె అంటూ తెలుగు తమ్ముల్లు లొల్లి మీద లొల్లి చేస్తుండ్రంట! ఈల్ల కతలు సరె.. పాపం కాంగ్రెస్‌ల ఓ పేద్ద సారు.. మొన్న మొన్నటి దాంక గీడ పార్టీని తనే ముందుండి నడిపినాయన.. గిప్పుడు టికెట్ వస్తదో రాదో అనుకుంటూ డిల్లీలో చక్కర్లు కొడ్తుండంటే ఇసయం ఎంత కస్టంగ మారింద్ర బై అనిపిస్తది. గాయన గిప్పట్కీ నాకేం పికర్లే టికెట్ వచ్చేది గారంటీ అంటుండు గానీ.. గింత పెద్ద మనిసి కతే గిట్లయితె ఎట్ల అంటూ చాలా మంది లోపల్లోపలె గొనుక్కొంటుండ్రు. ఏ పార్టీల చూసుకున్న గిదే దుకానం. పొద్దున్నే లేసుడు.. పేరు కోసం చూసుడు! ఇంక ఈ మంట ఎప్పుడు ఆరేదెట్లా.. కాండేట్లు జనాల్లోకి పోయేదెట్లా? ఓ..పెద్ద సార్లూ... కనీసం ఓట్లేసే రోజుకైనా మీ లిస్టు తేల్తదా.. తేలదా? –రామదుర్గం మధుసూదనరావు -
కమలదళం–2
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: భారతీయ జనతా పార్టీ రెండో విడత అభ్యర్థులను శుక్రవారం ప్రకటించింది. ఇందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి నలుగురి పేర్లను ఖరారు చేసింది. పోటాపోటీగా కొనసాగిన నిర్మల్ నియోజకవర్గ అభ్యర్థిగా డాక్టర్ సువర్ణరెడ్డి, ఖానాపూర్‌కు సట్ల అశోక్, సిర్పూర్‌కు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్, ఆసిఫాబాద్‌కు ఆజ్మీరా ఆత్మారాం నాయక్‌లను ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. ముందుగా రాష్ట్ర ఎన్నికల కమిటీ ఖరారు చేసిన అభ్యర్థుల జాబితాను ఢిల్లీకి పంపించారు. అక్కడ బీజేపీ పార్లమెంటరీ కమిటీ ఆమోదం తెలుపడంతో వారి పేర్లు ఖరారైనట్లు ప్రకటించారు. ఇప్పటికే ఆదిలాబాద్, బోథ్, ముథోల్, బెల్లంపల్లి స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది నియోజకవర్గాలకు గానూ ఎనిమిది మంది అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ మంచిర్యాల, చెన్నూరు సీట్లను మాత్రం పెండింగ్‌లో పెట్టింది. ఇక్కడ నెలకొన్న పోటీ పరిస్థితుల కారణంగానే ఈ రెండింటిలో పేర్లను ప్రకటించలేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నిర్మల్‌లో ‘సువర్ణా’వకాశం.. రెండునెలల కిందటే పార్టీలో చేరిన స్త్రీవైద్య నిపుణురాలు సువర్ణరెడ్డిని నిర్మల్ అభ్యర్థిగా ప్రకటించారు. ఇక్కడ రెండేళ్లుగా పార్టీలో ఉంటూ టికెట్ ఆశించిన మరో వైద్యుడు కాలగిరి మల్లికార్జున్‌రెడ్డి చివరి వరకూ పోటీనిచ్చారు. ముందుగా పార్టీ నుంచి వీరిద్దరికీ స్పష్టమైన హామీ రాకపోవడంతో ఇద్ద రూ గోడరాతలు, ప్రచారం చేపట్టారు. పార్టీ లోని నాయకులు సైతం ఇద్దరి వైపు చీలిపోయి ప్రచారంలో పాల్గొన్నారు. అభ్యర్థిత్వం కోసం ఎవరికివారు రాష్ట్ర నేతలతో పాటు ఢిల్లీ స్థాయిలో మం తనాలు జరిపినట్లు సమాచారం. చివరకు అధిష్టానం సువర్ణరెడ్డి అభ్యర్థిత్వానికే మొగ్గు చూపింది. రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం, ప్రజల్లో స్త్రీవైద్య నిపుణురాలిగా పేరు ఉండడం, మహిళ కావడం ఆమెకు కలిసి వచ్చింది. పార్టీలో చేరక ముందు చేపట్టిన సేవా కార్యక్రమాలు, పాదయాత్ర సైతం ఆమె వైపు మొగ్గు చూపడానికి కారణమైనట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు మల్లికార్జున్‌రెడ్డి మద్దతుదారులు శుక్రవారం హైదరాబాద్ వెళ్లారు. పార్టీ నాయకులను కలిసి వచ్చారు. చివరి వరకు తనకు టికెట్ వస్తుందన్న నమ్మకంతో ఉన్నానని, ఇలా నిర్ణయం రావడంపై తమ కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. తదుపరి కార్యాచరణపై శుక్రవారం సాయంత్రం నిర్మల్‌లో తన అనుచరులతో భేటీ కానున్నట్లు తెలిపారు. అందరి నిర్ణయం మేరకు ముందుకు సాగుతానని స్పష్టంచేశారు. పార్టీ జిల్లా నేతలు మాత్రం అందరినీ కలుపుకుని వెళ్తామని, ఈసారి నిర్మల్‌లో గెలుస్తామని చెబుతున్నారు. ఆదివాసీ నేతకు అభ్యర్థిత్వం.. ఉమ్మడి జిల్లాలోని ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో ఒక్కటైన ఖానాపూర్‌లో బీజేపీ ఆదివాసీ నాయక్‌పోడ్ వర్గానికి చెందిన సట్ల అశోక్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. ఉట్నూర్ మండలం లక్సెట్టిపేట గ్రామానికి చెందిన అశోక్ 2007లో ఎంపీటీసీగా, 2014లో సర్పంచ్‌గా పనిచేశారు. ఇటీవలే ఆయన బీజేపీలో చేరారు. గతంలో ఆర్ఎస్ఎస్ అనుబంధ వనవాసీ కల్యాణ్ పరిషత్‌లో పనిచేసి ఉండడం, యుక్త వయసులోనే రాజకీయ నేపథ్యం, ఆదివాసీ కావడంతో ఇక్కడ ఆయనకు అవకాశం దక్కింది. చివరి వరకు ఇక్కడ సీనియర్ నాయకుడు పెందూర్ ప్రభాకర్ పేరు వినిపించి నా పార్టీ సట్ల అశోక్ వైపు మొగ్గు చూపింది. సిర్పూర్లో డాక్టర్ శ్రీనివాస్.. సిర్పూర్ నియోజకవర్గ అభ్యర్థిగా డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్‌ను పార్టీ ఖరారు చేసింది. కాగజ్‌నగర్‌లో ఆసుపత్రి ద్వారా వైద్యసేవలను అందిస్తూ.. పలు సామాజిక కార్యక్రమాలను చేపడుతున్నారు. లయన్స్‌క్లబ్ అధ్యక్షుడిగానూ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరయ్యారు. అనంతరం బీజేపీలో చేరి పార్టీ కార్యక్రమాలను చురుకుగా చేపట్టారు. ఇక్కడ శ్రీనివాస్‌కు పార్టీపరంగా పోటీ లేకపోవడంతో ఆయన అభ్యర్థిత్వం సులువుగా ఖరారైనట్లు చెబుతున్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో ఈసారి బీజేపీ జెండా ఎగురవేస్తామని పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. ఆసిఫాబాద్‌లో ఆత్మారాం నాయక్.. ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గమైన ఆసిఫాబాద్‌లో ఇటీవల పార్టీలో చేరిన అజ్మీరా ఆత్మారాం నాయక్‌కు బీజేపీ అవకాశమివ్వడం ఆసక్తిగా మారింది. రెబ్బెన మండలం గోలేటి గ్రామపంచాయతీ పరిధిలోని కైరిగూడకు చెందిన ఆత్మారాం నాయక్ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఇటీవలే టీఆర్ఎస్లో నుంచి ఆయన బీజేపీలో చేరారు. నెల వ్యవధిలోపే ఆయనకు బీజేపీ టికెట్ ఖరారు చేసింది. ఇదే లంబాడా సామాజిక వర్గానికి చెందిన సిర్పూర్(టి) జెడ్పీటీసీ సభ్యుడు అజ్మీరా రాంనాయక్ గత ఏడాది క్రితమే టీఆర్ఎస్ను వదిలి బీజేపీలో చేరారు. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆసిఫాబాద్ అభ్యర్థిగా తనకే అవకాశం ఉంటుందన్న ధీమాతో కొనసాగారు. పార్టీ అధిష్టానం మాత్రం ఆత్మారాం నాయక్ వైపు మొగ్గుచూపడం ఆసక్తికరంగా మారింది. పెండింగ్‌లో మంచిర్యాల, చెన్నూరు ఉమ్మడి జిల్లాలోనే ముఖ్య నియోజకవర్గంగా పేరున్న మంచిర్యాలతో పాటు పక్కనే ఉన్న చెన్నూరు స్థానాలకు బీజేపీ రెండో విడతలోనూ అభ్యర్థులను ఖరారు చేయలేదు. ప్రధానంగా మంచిర్యాల నియోజకవర్గంలో అభ్యర్థిని ప్రకటించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ సీనియర్ నాయకుడు ముల్కల్ల మల్లారెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. ఇటీవల పార్టీలో చేరిన ఎన్ఆర్ఐ వెరబెల్లి రఘునాథరావు ఆయనకు పోటీగా మారారు. వీరిద్దరి మధ్య టికెట్ కోసం పోటాపోటీ మంతనాలు సాగుతున్నాయి. మల్లారెడ్డి, రఘునాథరావు వర్గాలు ఎవరికి వారు తమవంతు ప్రయత్నాలను ముమ్మరంగా చేస్తున్నారు. పోటీ తీవ్రంగా ఉండడంతో ఈ స్థానాన్ని ఖరారు చేయలేదు. అలాగే చెన్నూరు నియోజకవర్గంలోనూ రాం వేణు, అందుగుల శ్రీనివాస్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఇక్కడ కూడా ఎవరికి వారు తమవంతుగా పార్టీ అధినాయకులతో మంతనాలు జరుపుతున్నారు. ఇప్పటికే ఎవరికి వారు తమదైన శైలిలో ప్రచారం చేసుకుంటున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో టికెట్ కేటాయింపుల తర్వాత అసమ్మతి తలెత్తేందుకు అవకాశాలు ఉండడంతో పార్టీ ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. -
నేడో రేపో కాంగ్రెస్ జాబితా
అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను నేడో రేపో విడుదల చేసేందుకు కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోంది. ఉమ్మడి జిల్లాలో 11 అసెంబ్లీ స్థానాలకు గాను తొలి జాబితాలో ఐదు లేదా ఆరుగురు అభ్యర్థుల పేర్లుండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మహా కూటమిలోని భాగస్వామ్య పార్టీల నడుమ పోటీ చేయాల్సిన సీట్ల సంఖ్యపై ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలిసింది. ప్రస్తుతానికి నాలుగు అసెంబ్లీ స్థానాలపై మహా కూటమి పార్టీల నడుమ పీటముడి పడినట్లు సమాచారం. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ముందస్తు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది. గురు లేదా శుక్రవారం పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఏఐసీసీ ప్రకటించే అవకాశం ఉంది. మహా కూటమి భాగస్వామ్య పార్టీలు కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నడుమ పోటీ చేయాల్సిన స్థానాల సంఖ్యపై స్పష్టమైన అవగాహన కుదిరినట్లు తెలిసింది. ఏయే స్థానాల్లో ఏయే పార్టీలు తమ అభ్యర్థులను నిలపాలనే అంశంపై ఇంకా మంతనాలు కొనసాగుతున్నాయి. అభ్యర్థుల ఎంపికలో సామాజిక వర్గాల లెక్కలు కూడా అత్యంత కీలకంగా మారాయి. ఉమ్మడి మెదక్‌జిల్లా పరిధిలో 11 అసెంబ్లీ స్థానాలకు గాను, మహా కూటమి భాగస్వామ్య పార్టీల నడుమ నాలుగు అసెంబ్లీ స్థానాలపై పీటముడి పడింది. పటాన్చెరు అసెంబ్లీ స్థానాన్ని తమకు కేటాయించాల్సిందిగా టీడీపీ గట్టిగా పట్టుపడుతోంది. దుబ్బాక లేదా మెదక్ అసెంబ్లీ స్థానాన్ని కేటాయించాల్సిందిగా తెలంగాణ జన సమితి మహాకూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్‌పై ఒత్తిడి తెస్తోంది. మరోవైపు హుస్నాబాద్ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునేది లేదని సీపీఐ తెగేసి చెప్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ తొలి విడత జాబితాలో ఈ నాలుగు అసెంబ్లీ స్థానాలకు చోటు దక్కే అవకాశం లేదు. మరోవైపు టికెట్ల కోసం పార్టీలో అంతర్గత పోటీ నెలకొన్న సిద్దిపేట, నారాయణఖేడ్ అభ్యర్థుల పేర్లు కాంగ్రెస్ తొలి విడత జాబితాలో ఉండకపోవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఐదు లేదా ఆరు స్థానాల్లోనే.. సీట్ల సర్దుబాటులో కూటమి భాగస్వామ్య పక్షాలు గట్టిగా పట్టుబట్టని ఐదు అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల పేర్లు తొలి జాబితాలో కచ్చితంగా ఉండనున్నాయి. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ (అందోలు) జె.గీతారెడ్డి (జహీరాబాద్), సునీత లక్ష్మారెడ్డి (నర్సాపూర్), తూర్పు జయప్రకాశ్‌రెడ్డి (సంగారెడ్డి) ఒంటేరు ప్రతాప్‌రెడ్డి (గజ్వేల్) అభ్యర్థిత్వంపై ఏకాభిప్రాయం వ్యక్తం కావడంతో తొలి జాబితాలో వీరికి చోటు దక్కనుంది. హుస్నాబాద్ అసెంబ్లీ స్థానాన్ని కూటమి భాగస్వామ్య పక్షం సీపీఐ బలంగా కోరుతున్నా, కాంగ్రెస్ మాత్రం అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి అభ్యర్థిత్వంవైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. తాము బలంగా ఉన్న హుస్నాబాద్ స్థానాన్ని కేటాయించలేమంటూ సీపీఐకి తెగేసి చెప్పినట్లు సమాచారం. ఇటీవలే టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన మా జీ కౌన్సిలర్ దరపల్లి చంద్రంకు సిద్దిపేట టికెట్ దాదాపు ఖాయమైనా, తొలి జాబితాలో ఆయనకు చోటు దక్కే సూచనలు కనిపించడం లేదు. సామాజికవర్గాల లెక్కలే కీలకం మహా కూటమిలో పీటముడి ఏర్పడిన దుబ్బాక, మెదక్, పటాన్చెరు స్థానాలు ఏ పార్టీ ఖాతాలోకి వెళ్తాయనే అంశంపై ఆధారపడి, నారాయణఖేడ్, సిద్దిపేట నుంచి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లపై స్పష్టత రానుంది. కూటమి భాగస్వామ్య పక్షాల్లో సామాజికవర్గాల లెక్కలు కూడా సీట్ల సర్దుబాటుకు ప్రధాన అవరోధంగా మారాయి. పటాన్చెరు స్థానాన్ని కాంగ్రెస్ లేదా టీడీపీ బీసీ అభ్యర్థికి కేటాయించే పక్షంలో నారాయణఖేడ్‌లో రెడ్డి సామాజికవర్గం అభ్యర్థికి టికెట్ కేటాయింపు అవకాశాలు మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. దుబ్బాకలో టీజేఎస్ బీసీ అభ్యర్థికి టికెట్ ఇచ్చే పక్షంలో మెదక్‌లో కాంగ్రెస్ నుంచి రెడ్డి సామాజికవర్గం అభ్యర్థి అవకాశాలు మెరగవుతాయనే లెక్కలతో ఆయా పార్టీల ఔత్సాహిక నేతల్లో గందరగోళం నెలకొంది. ఎక్కే మెట్టు.. దిగే మెట్టు ఉమ్మడి మెదక్ జిల్లాలో అభ్యర్థుల ఎంపికపై ఏకాభిప్రాయం ఉన్న ఐదుగురు నియోజకవర్గాలు మినహా మిగతా స్థానాలకు సంబంధించి టికెట్ ఆశిస్తున్న నేతలు హైదరాబాద్‌లో మకాం వేశారు. తమ అసెంబ్లీ సీటును కాంగ్రెస్‌కు కేటాయించే స్థానాల్లో టికెట్ ఇవ్వాలంటూ ఔత్సాహికులు గాంధీభవన్ చుట్టూ తిరుగుతున్నారు. పటాన్చెరు స్థానం టీడీపీకి కేటాయించే పక్షంలో తమకే అవకాశం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్, జెడ్పీటీసీ సభ్యుడు శ్రీకాంత్ గౌడ్ ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో ప్రయత్నాలు సాగిస్తున్నారు. సిద్దిపేట, దుబ్బాక, మెదక్, సంగారెడ్డికి చెందిన టీజేఎస్ నేతలు మాత్రం తమ సెగ్మెంటును పొత్తులో భాగంగా కోరడంతో పాటు, తమకే పోటీ అవకాశం ఇవ్వాలంటూ కోదండరాం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. -
వలస నేతలకు పెద్దపీట
సాక్షి, బెంగళూరు:చాలా రోజుల నిరీక్షణ అనంతరం జేడీఎస్ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. వచ్చే నెల 12వ తేదీ జరిగే ఎన్నికల్లో పోటీ చేయబోయే తమ అభ్యర్థుల పేర్లను శుక్రవారం సాయంత్రం నగరంలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో వెల్లడించింది. మొత్తం 56 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను పార్టీ అధిష్టానం సిద్ధం చేసి విడుదల చేసింది. ఈ జాబితాలో బీజేపీ, కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన వారికి పెద్దపీట వేశారు. కాంగ్రెస్, బీజేపీలో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలకు జేడీఎస్ గాలం వేసి పోటీలో దింపేందుకు సిద్ధం చేసింది. టికెట్ పొందిన వారిలో ప్రకాశ్ ఖండ్రె∙(భాల్కి), నటుడు శశికుమార్ (హొసదుర్గ), హేమచంద్రసాగర్ (చిక్కపేటె), పి.రమేశ్ (సీవీ రామన్‌నగర్), మంగళదేవి బిరాదార్ (ముద్దేబిహాళ్), రామచంద్ర(రాజరాజేశ్వరినగర) ఉన్నారు. గత ఫిబ్రవరిలో 126 మంది అభ్యర్థులతో జేడీఎస్ తన తొలిజాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్, బీజేపీ నుంచి టికెట్ దక్కక వలస వచ్చే వారి కోసం ఇంతకాలం ఆలస్యం చేసింది. జేడీఎస్ గత (2013) ఎన్నికల్లో కూడా ఇదే వ్యూహం అనుసరించింది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీల ఓట్లు రాబట్టేందుకు మాయవతి నేతృత్వంలోని బీఎస్పీతో పొత్తుపెట్టుకుంది. గతవారంలో ముస్లిం ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ఏఐఎంఐఎం మద్దతు కోరింది. జేడీఎస్ ఇంకా 42 స్థానాలకు అభ్యర్థులను కేటాయించాల్సి ఉంది. బీజేపీ మూడో జాబితా విడుదల సాక్షి, బెంగళూరు: నామినేషన్లు ప్రారంభమైనప్పటికీ భారతీయ జనతా పార్టీ తన మూడో జాబితాను విడుదల చేయకుండా ఆలస్యం చేస్తూ వచ్చింది. ఈనేపథ్యంలో శుక్రవారం సాయంత్రం మొత్తం 59 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను పార్టీ కార్యాలయంలో విడుదల చేసింది. సిద్ధరామయ్య పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి గోపాల్‌రావును తమ అభ్యర్థిగా ప్రకటించింది. అంతేకాకుండా కోలార్ కేజీఎఫ్ స్థానంలో మార్పు చేసి ఎస్.అశ్వినికి కేటాయించింది. గాలి జనార్ధన్‌రెడ్డి సోదరుడు కరుణాకర్‌రెడ్డికి కూడా హరప్పనహళ్లి టికెట్ కేటాయించింది. గాంధీనగర నియోజకవర్గ స్థానాన్ని బీజేపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు సప్తగిరి గౌడకు టికెట్ కేటాయించింది. మండ్య నుంచి కాంగ్రెస్ నేత అంబరీష్‌కు పోటీగా బసవేగౌడను బరిలో దింపనుంది. కాగా బీజేపీ ఇంకా 11 స్థానాలకు అభ్యర్థులను కేటాయించాల్సి ఉంది. అందులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు విజయేంద్ర పోటీ చేస్తారని ప్రచారంలో ఉన్న వరుణ నియోజకవర్గానికి ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. -
కాంగ్రెస్‌లో అలజడి
అధికార కాంగ్రెస్ భగ్గుమంది. టికెట్లు దక్కకపోవడంతో ఎక్కడికక్కడ అసంతృప్తులు ఆగ్రహావేశాలు వ్యక్తంచేయడంతో అలజడి రేగింది. కార్యాలయాల్లోకి చొరబడి విధ్వంసం సృష్టించేవరకూ వెళ్లింది. బెంగళూరులో కేపీసీసీ కార్యాలయం కూడా నిరసనలతో హోరెత్తింది. అసంతృప్తులు సహజమేనని సీఎం సిద్ధరామయ్య అన్నారు. సాక్షి, బెంగళూరు:ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు ఎంతో కసరత్తు చేసి ఆదివారం రాత్రి విడుదల చేసిన 218 మంది అభ్యర్థుల జాబితా అగ్గి రాజేసింది. జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో అగ్రహోదగ్రులైన నాయకులు ఆందోళనలకు దిగడంతో పలు చోట్ల ఉద్రిక్తత నెలకొంది. ధర్నాలు, నిరసనలతో పాటు పార్టీ కార్యాలయాల్లో విధ్వంసానికీ వెనుకాడలేదు. హైకమాండ్ నుంచి టికెట్ రాకపోతే రెబల్స్‌గా బరిలో దిగుతామంటూ హెచ్చరించారు. 11 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొండిచేయి చూపారు. దీంతో వారితో పాటు ఇతర ఔత్సాహికులు ఆందోళనకు దిగారు. భగ్గుమన్న ఆగ్రహం ♦ బ్యాడిగె ఎమ్మెల్యే బసవరాజు నీలన్నకు టికెట్ రాకపోవడంపై ఆయన మద్దతుదారులు ఆవేదనతో కన్నీటి పర్యంతమయ్యారు. ♦ తిపటూరు ఎమ్మెల్యే షడక్షరీ అనుచరుడు ఒకరు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ♦ నెలమంగళ మాజీ ఎమ్మెల్యే అంజనమూర్తి మద్దతుదారులతోకలిసి నీలంబగల్ జాతీయ రహదారిపై కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ♦ బాగల్‌కోటలో ఆర్బీ తిమ్మాపుర అనుచరులు టైర్లను కాల్చి నిరసన తెలిపారు. ♦ హానగల్ ఎమ్మెలే మనోహర్ తహసీల్దార్ కూడా ఆందోళనకు దిగారు. ♦ చిక్కమగళూరు టికెట్ ఆశించిన గాయత్రి శాంతిగౌడ అనుచరులతో కలిసి నిరసన తెలిపారు. టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ♦ జగళూరు టికెట్ ఆశించి భంగపడ్డ హెచ్‌బీ రాజేష్ కాంగ్రెస్ పెద్దలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దావణగెరెలోని మంత్రి ఎస్ఎస్ మల్లికార్జున నివాసం వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. ♦ బాగేపల్లి టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే ఎం.మెహతాకు కూడా మళ్లీ నిరాశే ఎదురైంది. ఆయన తన అనుచరులతో కలిసి ఆందోళన చేశారు. ♦ బెంగళూరులోని కేపీసీసీ కార్యాలయం ఎదుట రాజాజీనగర, మహాలక్ష్మి లేఅవుట్ నియోజకవర్గాలకు చెందిన గిరీష్, మంజులానాయుడు ఆందోళనకు దిగారు. అదేవిధంగా దావణగెరె, బాగల్‌కోట ప్రాంతాల్లో కూడా అక్కడి కాంగ్రెస్ నాయకులు టికెట్ రాలేదని నిరసన తెలిపారు. టికెట్లు రాని11 మంది సిట్టింగ్‌లు వీరే బాదామి – చిమ్మనకట్టె; తిపటూరు – షడక్షరీ; కరికెరె – హెచ్‌జీ శ్రీనివాస్; మాయకొండ – శ్రీనివాసమూర్తి నాయక్; బ్యాడిగె – బసవరాజు నీలన్న శివన్నవర్; హానగల్ – మనోహర్ తహసీల్దార్; విజయపుర – ముకుల్ భగవంత్; జగలూరు – రాజేష్; సిరిగుప్ప – బీఎం నాగరాజు; కొల్లెగళ – జయన్న; కల్బుర్గి గ్రామీణ – బి.రామకృష్ణ రెబల్‌గా పోటీ చేస్తాం సీఎం సిద్ధరామయ్యతో కలిసి చర్చించాం. టికెట్ ఇస్తారనే ఆశ ఉంది. నియోజకవర్గం నుంచి బయటికి వచ్చే ప్రసక్తే లేదు. ఒకవేళ టికెట్ రాకపోతే కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులుగా బరిలో దిగుతానని శిరిగుప్ప ఎమ్మెల్యే నాగరాజు, బాదామి ఎమ్మెల్యే చిమ్మనకట్టె తెలిపారు. ఎమ్మెల్యేలు బసవరాజు నీలన్న, శివన్నవర్, షడక్షరీ, శివమూర్తి తదితరులు కూడా తిరుగుబాటలో ఉన్నారు. -
ఏలూరు అభ్యర్థులు రెడీ
ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికలలో విజయ దుందుభి మోగించే దిశగా అభ్యర్థుల జాబితాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. గెలుపే లక్ష్యంగా శ్రేణులు పాటుపడాలని నేతలు పిలుపునిచ్చారు. అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తున్న ఆ పార్టీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు తోట చంద్రశేఖర్, పక్కన మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని, పార్టీ జిల్లా కన్వీనర్, ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, నాయకులు. ఏలూరు (ఆర్‌ఆర్‌పేట), న్యూస్‌లైన్ : ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, పార్టీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు తోట చంద్రశేఖర్, ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని తదితరులు మాట్లాడారు. తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ రాబోయే అన్ని ఎన్నికల్లో వైసీపీ 80 శాతం సీట్లు సాధిస్తుందని చెప్పారు. పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేసే నాటి నుంచి అన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒకటికి రెండు సార్లు నామినేషన్ పత్రాలను పరిశీలిం చి, అనుభవజ్ఞులకు చూపించి, న్యాయవాదుల సలహాలతో దాఖలు చేయాలని చెప్పారు. బాలరాజు మాట్లాడుతూ ఏలూరులోని 50 డివిజన్లలో పార్టీ అభ్య ర్థులు విజయం సాధించి వైసీపీ సత్తా చాటుతారన్నారు. ఆళ్ల నాని మాట్లాడుతూ ఆయా డివిజన్లలో పార్టీ టికెట్ ఆశించిన నాయకులను అభ్యర్థులు కలిసి వారి సహకారం కోరాలని సూచించారు. ఏలూరు కార్పొరేషన్ మేయర్ పదవిని దక్కించుకుని వైఎస్ జగన్మోహన్రెడ్డికి బహుమతిగా ఇవ్వడానికి ప్రతి ఒక్కరూ అంకితభావంతో కృషి చేయాలని కోరారు. పార్టీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు దొరబాబు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బొద్దాని శ్రీనివాస్, మహిళా నాయకురాలు పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, మోర్త రంగారావు, నగర శాఖ కన్వీనర్ గుడిదేశి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరంలోని 50 డివిజన్లలో వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేయనున్న 50మంది అభ్యర్థుల పేర్లను తోట చంద్రశేఖర్ ప్రకటించారు.