ఏలూరు అభ్యర్థులు రెడీ
Published Wed, Mar 12 2014 2:10 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికలలో విజయ దుందుభి మోగించే దిశగా అభ్యర్థుల జాబితాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. గెలుపే లక్ష్యంగా శ్రేణులు పాటుపడాలని నేతలు పిలుపునిచ్చారు. అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తున్న ఆ పార్టీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు తోట చంద్రశేఖర్, పక్కన మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని, పార్టీ జిల్లా కన్వీనర్, ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, నాయకులు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట), న్యూస్‌లైన్ : ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, పార్టీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు తోట చంద్రశేఖర్, ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని తదితరులు మాట్లాడారు. తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ రాబోయే అన్ని ఎన్నికల్లో వైసీపీ 80 శాతం సీట్లు సాధిస్తుందని చెప్పారు. పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేసే నాటి నుంచి అన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒకటికి రెండు సార్లు నామినేషన్ పత్రాలను పరిశీలిం చి, అనుభవజ్ఞులకు చూపించి, న్యాయవాదుల సలహాలతో దాఖలు చేయాలని చెప్పారు.
బాలరాజు మాట్లాడుతూ ఏలూరులోని 50 డివిజన్లలో పార్టీ అభ్య ర్థులు విజయం సాధించి వైసీపీ సత్తా చాటుతారన్నారు. ఆళ్ల నాని మాట్లాడుతూ ఆయా డివిజన్లలో పార్టీ టికెట్ ఆశించిన నాయకులను అభ్యర్థులు కలిసి వారి సహకారం కోరాలని సూచించారు. ఏలూరు కార్పొరేషన్ మేయర్ పదవిని దక్కించుకుని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బహుమతిగా ఇవ్వడానికి ప్రతి ఒక్కరూ అంకితభావంతో కృషి చేయాలని కోరారు. పార్టీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు దొరబాబు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బొద్దాని శ్రీనివాస్, మహిళా నాయకురాలు పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, మోర్త రంగారావు, నగర శాఖ కన్వీనర్ గుడిదేశి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరంలోని 50 డివిజన్లలో వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేయనున్న 50మంది అభ్యర్థుల పేర్లను తోట చంద్రశేఖర్ ప్రకటించారు.
Advertisement
Advertisement