రాజస్తాన్ సీఎం వసుంధరా రాజె సింధియా (ఫైల్‌ఫోటో)
జైపూర్ : గుజ్జర్లతో పాటు ఐదు కులాలకు ఒక శాతం రిజర్వేషన్లను వర్తింపచేసేందుకు రాజస్తాన్ ప్రభుత్వం సోమవారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అత్యంత వెనుకబడిన వర్గాల (ఎంబీసీ) కేటగిరీ కింద ఈ కోటాను ప్రభుత్వం ఆమోదించింది. ఈ ఐదు కులాల వారు ఓబీసీ కేటగిరీ కింద 21 శాతం కోటాకు కూడా అర్హులని ప్రభుత్వం పేర్కొంది. ఈనెల 7న జైపూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. తమకు కోటా కల్పించకుంటే ప్రధాని పాల్గొనే కార్యక్రమంలో నిరసనలకు దిగుతామని గుజ్జర్లు హెచ్చరించిన సంగతి తెలిసిందే.
ప్రభుత్వ నిర్ణయంతో గుజ్జర్లు సహా గొదియా లొహర్, బంజారా, రైకా, గదారియా కులాలు లబ్ధి పొందనున్నాయి. ఆయా కులాలకు రిజర్వేషన్లకు సంబంధించి విద్యా సంస్థల్లో ప్రవేశానికి, ప్రభుత్వ ఉద్యోగాలు పొందేందుకు రెండు వేర్వేరు ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment