Rajasthan Government
-
రెడ్ డైరీలో రాజస్తాన్ ప్రభుత్వ అక్రమాలు
జైపూర్: రాజస్తాన్ ప్రభుత్వం అవినీతి, అక్రమాల రహస్యాలన్నీ రెడ్ డైరీలో ఉన్నాయని, దీనిపై సీఎం అశోక్ గెహ్లాట్ రాజీనామా చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా డిమాండ్ చేశారు. గంగాపూర్‌లో శనివారం జరిగిన ‘సహకార కిసాన్ సమ్మేళన్’ను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. ఆయన ప్రసంగం ప్రారంభించగానే కొందరు నినాదాలు ప్రారంభించారు. వారినుద్దేశించి మంత్రి మాట్లాడుతూ..‘నినాదాలు చేసేందుకు కొందరిని పంపించినంత మాత్రాన ఒరిగేదేమీ ఉండదని గెహ్లాట్‌కు చెప్పాలనుకుంటున్నా. ఆయనకు సిగ్గుంటే, రెడ్ డైరీ వ్యవహారంపై రాజీనామా చేసి, ఎన్నికలకు వెళ్లి ఉండేవారు’అని వ్యాఖ్యానించారు. 2020లో కాంగ్రెస్ నేత ధర్మేంద్ర రాథోడ్ ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు జరిపిన దాడుల్లో ‘రెడ్ డైరీ’దొరికింది. దాన్లో సీఎం గెహ్లాట్ ఆర్థిక లావాదేవీల వివరాలన్నీ ఉన్నట్లు మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన రాజేంద్ర గూధా చేసిన ఆరోపణలను అమిత్ షా తన ప్రసంగంలో ప్రస్తావించారు. -
Rajasthan: ఇక మృతదేహాలతో నిరసన కుదరదు
మనుషులు ఎలా బతికినా మరణానంతరం కాస్తయినా మర్యాద ఉండాలి. అంతిమ సంస్కారం గౌరవప్రదంగా సాగాలి. కానీ ఈ విషయంలోనూ కొన్నిచోట్ల పెడ ధోరణులు కనిపిస్తున్నాయి. తమ డిమాండ్ల సాధన కోసం మృతదేహాలతో కూర్చొని నిరసన ప్రదర్శనలకు దిగడం మనం చూస్తూనే ఉన్నాం. ఎంతోమంది విషయంలో ఈ అంతిమయాత్ర సవ్యంగా జరగడం లేదు. రాజస్తాన్‌లో మృతదేహాలతో ధర్నాలు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ రకమైన ట్రెండ్‌కు అడ్డుకట్ట వేయడానికి రాజస్తాన్‌లోని అశోక్ గెహ్లోత్ ప్రభుత్వం ఏకంగా ఒక చట్టాన్నే తీసుకొచి్చంది. ‘ది రాజస్థాన్ ఆనర్ ఆఫ్ డెడ్ బాడీ బిల్లు, 2023’కు గత వారమే అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. చట్టంలో ఉన్నదిదీ...! మరణానంతరం హక్కులుంటాయ్! ఎవరైనా వ్యక్తి మరణించిన తర్వాత కూడా వారికి హక్కులుంటాయి. వారి అంతిమ సంస్కారం గౌరవప్రదంగా వారి వారి మతాచారాలు, సంప్రదాయాలకనుగుణంగా నిర్వహించాలి. వ్యక్తి ప్రాణం పోయిన తర్వాత వీలైనంత త్వరగా వారి అంత్యక్రియలు పూర్తి చేయాలి. చనిపోయిన వారి కుమారులు, కూతుళ్లు దూర ప్రాంతం నుంచి రావల్సి ఉంటే తప్ప వెంటనే అంత్యక్రియలు ముగించాలి. ఒక వేళ కుటుంబ సభ్యులు అలా అంత్యక్రియలు పూర్తి చేయకపోతే ప్రభుత్వ అధికారులే ఆ బాధ్యత తీసుకుంటారు. మృతదేహాలతో నిరసన కుదరదు ఈ చట్ట ప్రకారం మృతదేహాలతో కుటుంబ సభ్యులు నిరసన ప్రదర్శనలు చేయకూడదు. ఏదైనా కారణంగా వాళ్లు అలా నిరసనలకు దిగితే చర్యలు తీసుకునే అధికారం జిల్లా యంత్రాంగానికి ఉంటుంది. వెంటనే ఆ మృత దేహాన్ని స్వా«దీనం చేసుకొని అధికారులు తామే అంతిమ సంస్కారం నిర్వహిస్తారు. అంతేకాదు బహిరంగ ప్రదేశాల్లో మృతదేహంతో నిరసనకు దిగినందుకుగాను ఆ కుటుంబసభ్యులకు ఏడాది వరకు జైలు శిక్ష లేదంటే జరిమానా, రెండూ కూడా విధించవచ్చు. ఎందుకీ చట్టం? రాజస్తాన్‌లో మృతదేహాలతో నిరసనలకు దిగడం సర్వసాధారణంగా మారిపోయింది. ప్రాణాలు కోల్పోయి వారం రోజులు గడిచినా దహన సంస్కారాలు నిర్వహించకుండా ఉద్యోగం కోసమో, డబ్బుల కోసమో ఆస్పత్రులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ధర్నాలకు దిగుతున్నారు. 2014–2018 మధ్య బీజేపీ హయాంలో ఇలాంటి ధర్నాలు 82 వరకు జరిగాయి. 30 వరకు కేసులు నమోదయ్యాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచి్చన తర్వాత 2019–2023 మధ్య కాలంలో మృతదేహాలతో ధర్నా కేసులు 306కి పెరిగాయి. అందుకే ఈ చట్టాన్ని తీసుకువచి్చనట్టుగా రాజస్తాన్ శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శాంతి ధారివాల్ చెప్పారు. మరోవైపు ప్రతిపక్ష బీజేపీ దీనిని వ్యతిరేకించింది. మృతదేహాలతో ధర్నాకు దిగారంటే వారిలో ఎంతటి ఆక్రోశం ఉందో అర్థం చేసుకోవాలే తప్ప వారి ఆగ్రహ ప్రదర్శనని అడ్డుకోవడం సరికాదని వ్యాఖ్యానించింది. రాజస్తాన్‌లో కాంగ్రెస్ సర్కార్‌కు ఇక ప్రజలే అంతిమ సంస్కారం నిర్వహిస్తారంటూ బీజేపీ నేతలు వ్యంగ్యా్రస్తాలు సంధిస్తున్నారు. అయితే ఈ తరహా ఒక చట్టాన్ని చేసిన తొలి రాష్ట్రంగా రాజస్తాన్ చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. ఆ మృతదేహాలు పదిలం ప్రమాదాలు, ఘర్షణలు ఇతర విపత్కర పరిస్థితుల్లో ఎవరైనా మరణించి వారి మృత దేహాన్ని ఎవరూ క్లెయిమ్ చేసుకోని పక్షంలో ఆస్పత్రులు, జిల్లా యంత్రాంగం ఆ మృతదేహం కుళ్లిపోకుండా, దెబ్బ తినకుండా సకల జాగ్రత్తలతో ఫ్రీజర్‌లో భద్రపరచాలి. పెనాల్టీ మృతదేహాల మర్యాదకి ఏ మాత్రం భంగం కలిగిందని భావించినా వివిధ రకాల నేరాలకు వివిధ రకాల శిక్షలూ ఉంటాయి. కుటుంబసభ్యులు మృతదేహాన్ని స్వా«దీనం చేసుకోవడానికి నిరాకరించడం, మృతదేహాలతో నిరసన ప్రదర్శనలకి దిగడం, అలాంటి ప్రదర్శనలకు అనుమతులివ్వడం వంటివి నేరాల కిందకే వస్తాయి. ఆ నేరాలకు ఆరు నెలలు, ఏడాది, రెండేళ్లు, అయిదేళ్లు ఇలా జైలు శిక్ష పడుతుంది డేటా బ్యాంకు ఈ బిల్లులో అన్నింటికంటే ముఖ్యమైన ది ఎవరూ గుర్తుపట్టని మృతదేహాల డేటా. ఎవరూ గుర్తు పట్టకుండా ఉన్న మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు జరిపించి జన్యుపరమైన వారి డేటాను ప్రభుత్వం భద్రపరచాలి. అలా గుర్తు పట్టని శవాలకు శాస్త్రోక్తంగా అంతిమ సంస్కారాలు నిర్వహించినప్పటికీ వారి అస్తికలు, జన్యుపరమైన వివరాలను ఒక డేటా బ్యాంకు ఏర్పాటు చేసి భద్రపరుస్తారు. జిల్లాల వారీగా డిజిటల్ డేటా బ్యాంకుల్ని ఏర్పాటు చేసి అందులో మృతి చెందిన వారి వివరాలు ఉంచుతారు. పోలీసు స్టేషన్లలో వచ్చే మిస్సింగ్ కేసులతో ఆ డేటాను పోల్చడం ద్వారా కనిపించకుండా వెళ్లిన వారు ఏమయ్యారో అన్నదానిపై ఒక క్లారిటీ వస్తుంది. ఇక ఈ డేటాను అధికారులెవరైనా బయటపెడితే మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘ఐదేళ్లూ అధికారంలో మేమే ఉంటాం’
జైపూర్: రాజస్తాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి కాలం ఉంటుందని రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వమే 5వ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతుందా అని బికనీర్‌లో మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. తమ ప్రభుత్వం ఐదేళ్లు పూర్తి చేసుకోకుండానే కూలదోసేందుకు బీజేపీ ఇప్పటికీ ప్రయత్నాలు కొనసాగిస్తోందని వ్యాఖ్యానించారు. అప్పటి కంటే కాంగ్రెస్ మరింత పటిష్టమైనందున, బీజేపీ యత్నాలు సఫలం కాబోవన్నారు. ఇదీ చదవండి: టైమ్ బ్యాడ్ అంటే ఇదేనేమో.. సీఎం గెహ్లాట్‌కు ఊహించని షాక్! -
ఎన్నికల కమిషన్ కళ్లు మూసుకుందా..!
లక్నో : రాజస్థాన్‌లోని ఆళ్వార్ జిల్లాలో ఏప్రిల్ 26న దళిత మహిళపై జరిగిన అత్యాచార ఘటనను అణచివేసేందుకు అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం యత్నిస్తోందని బీఎస్పీ చీఫ్ మాయావతి విమర్శలు గుప్పించారు. ఐదుగురు కీచకులు ఓ మహిళపై అకృత్యానికి పాల్పడితే ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా బాధిత కుంటుంబాన్ని బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ పబ్బం కోసం కాంగ్రెస్ నిందితులను వెనకేసుకొస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బాధితురాలికి న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదని, ఘటన వివరాలను సుమోటాగా స్వీకరించి సుప్రీం కోర్టు నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. (చదవండి : భర్త కళ్లెదుటే దారుణం..!) ఇక రాష్ట్రంలో ఓ పక్క ఎన్నికలు జరుగుతుండగా.. మరోపక్క పట్టపగలే మహిళలకు రక్షణ లేకుండా పోతోందని అన్నారు. ఎన్నికల కమిషన్‌కు ఇవేవీ కనిపించవా అని అన్నారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న రాజకీయ నాయకులపై చర్యలు ఎందుకు తీసుకోవడం ఈసీని ప్రశ్నించారు. మహిళల గౌరవానికి భంగం కలిగే విధంగా అసభ్యంగా మాట్లాడే పొలిటీషన్స్ వ్యాఖ్యల్ని సుమోటాగా స్వీకరించి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక అంబేద్కర్ పేరుతో పుట్టుకొచ్చిన కొన్ని సేవా సంస్థలు కాంగ్రెస్, బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నాయని, అలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలని బీఎస్పీ శ్రేణులకు ఆమె పిలుపునిచ్చారు. -
12ఏళ్లుగా ఆందోళన: వారి డిమాండ్ ఎందుకు నెరవేరలేదు?
సాక్షి, న్యూఢిల్లీ : విద్యా, ఉద్యోగ రంగాల్లో తమకూ ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ గత ఐదు రోజులుగా రాజస్థాన్‌లోని మలర్నా రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై గుజ్జర్లు ఆందోళన చేస్తున్నా రాష్ట్రంలోని అశోక్ గెహ్లాట్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు ? గుజ్జర్లకు తప్పకుండా ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించి తీరుతామంటూ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ ఎందుకు ముఖం చాటేస్తున్నారు? ఆర్థికంగా వెనకబడిన అగ్రవర్ణాల వారికి పది శాతం రిజర్వేషన్లు కల్పించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గుజ్జర్ల విషయంలో ఎందుకు పట్టించుకోవడం లేదు? 2006 నుంచి, అంటే పన్నెండేళ్లుగా గుజ్జర్లు ఆందోళన చేస్తున్నా వారి డిమాండ్ ఇప్పటి వరకు ఎందుకు నెరవేరలేదు? ఎస్టీల్లాగా తమకు విద్యా, ఉద్యోగ రంగాల్లో ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ 2006లో కరౌలి ప్రాంతంలోని రైలు పట్టాలపై పదవీ విరమణ చేసిన సైనికుడు కిరోరి సింగ్ భైన్సాలా నాయకత్వాన గుజ్జర్లు ఆందోళన చేశారు. అప్పుడు ఎలాంటి ఫలితం రాలేదు. వారు ఆ మరుసటి సంవత్సరం కూడా రైలు పట్టాలపై ఆందోళన చేయగా, పోలీసులు జరిపిన కాల్పుల్లో 26 మంది గుజ్జర్లు చనిపోయారు. అప్పుడు గుజ్జర్ల డిమాండ్‌ను పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ జస్రాజ్ చోప్రా ఆధ్వర్యాన ఓ కమిటీని వేసింది. ఇతర వెనకబడిన వర్గాల వారికి కేటాయించిన 21 శాతం రిజర్వేషన్ల కారణంగా గుజ్జర్లు లబ్ధి పొందుతున్నందున వారికి ప్రత్యేకంగా రిజర్వేషన్లు అవసరం లేదని తేల్చింది. ఎస్టీల కింద రిజర్వేషన్లు కల్పించడం కుదరకపోతే ప్రత్యేక వెనకబడిన తరగతుల కేటగిరీ కింద ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ భైన్సాలా మళ్లీ 2008 రైలు రోకో ఆందోళన చేపట్టారు. అప్పుడు కూడా అది హింసాత్మకంగా మారడంతో ఓ పోలీసు సహా 36 మంది మరణించారు. 2010లో ఇదే అశోక్ గెహ్లాట్, బైన్సాలాతో చర్చలు జరిపి గుజ్జర్లకు ఒక శాతం రిజర్వేషన్లు కల్పించారు. దాంతో రాష్ట్రంలో రిజర్వేషన్లు యాభై శాతానికి చేరుకోవడంతో అంతకుమించి ఆయన రిజర్వేషన్లు ఇవ్వలేకపోయారు. తమకు ఐదు శాతం రిజర్వేషన్లు కావాల్సిందేనంటూ గుజ్జర్లు 2015లో మరోసారి రైలు రోకో ఆందోళన చేపట్టారు. దాంతో అప్పటి వసుంధర రాజె నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం వారికి ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రత్యేక వెనకబడిన తరగతుల చట్టాన్ని తీసుకొచ్చింది. రిజర్వేషన్లు అప్పటికే యాభై శాతం ఉన్నాయన్న కారణంగా ఆ చట్టాన్ని రాజస్థాన్ హైకోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత వారిని మెప్పించేందుకు 2017లో వసుంధర రాజె ప్రభుత్వం ఇతర వెనకబడిన తరగతుల రిజర్వేషన్లను 21 శాతం నుంచి 26 శాతానికి పెంచుతూ చట్టం తెచ్చింది. దాన్నీ హైకోర్టు కొట్టివేసింది. మొన్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గుజ్జర్లకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని సచిన్ పైలట్ హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చారు. గుజ్జర్లతోపాటు మరికొన్ని సామాజిక వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పిస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోకపోవడంతో 20 రోజుల్లో రిజర్వేషన్ల ప్రక్రియను ప్రారంభించాలంటూ గెహ్లాట్ ప్రభుత్వానికి భైన్సాలా అల్టిమేటం జారీ చేశారు. 20 రోజుల గడువు కాలం పూర్తవడంతో ఐదు రోజుల క్రితం గుజ్జర్లు మళ్లీ ఆందోళన చేపట్టారు. ఇప్పటికే దేశంలో యాభై శాతం రిజర్వేషన్లు మించిపోయినప్పటికీ దేశంలో ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారికి పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం చట్టం తీసుకొచ్చినప్పుడు తమ డిమాండ్‌ను మాత్రం ఎందుకు నెరవేర్చలేదని ‘గుజ్జార్ అరక్షన్ సంఘర్ష్ సమితి’ ప్రధాన కార్యదర్శి షైలేంద్ర సింగ్ ప్రశ్నిస్తున్నారు. గుజ్జర్ల విషయంతో తామేమి చేయలేమని, కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని గెహ్లాట్ ప్రభుత్వం చెబుతోంది. కేంద్రం నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ విషయాన్ని తన మేనిఫెస్టోలో పేర్కొందని బీజేపీ ప్రశ్నిస్తోంది. అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి సిఫార్సు చేయాల్సిందిగా ప్రస్తుతం గెహ్లాట్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. -
ప్రధాని సభకు జనం కోసం రూ.7 కోట్లు!
జైపూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే ర్యాలీ కోసం రాజస్తాన్ ప్రభుత్వం రూ.7 కోట్లు ఖర్చు చేస్తోంది. వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులతో నిర్వహించే ఈ భారీ ర్యాలీ ఈ నెల 7న జైపూర్‌లో జరగనుంది. ప్రజల తరలింపునకు అయ్యే ఖర్చును వివిధ పథకాల నిధుల నుంచి మళ్లించినట్లు కూడా అధికారులు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన 12 సంక్షేమ పథకాల లబ్ధిదారులైన దాదాపు 2.5లక్షల మంది ఈ ర్యాలీకి తరలివస్తారని అంచనా వేస్తున్నారు. జైపూర్‌లోని అమృదోన్ కా బాగ్ స్టేడియంలో జరిగే సభకు 33 జిల్లాల నుంచి ప్రజలను తరలించేందుకు ప్రభుత్వం 5,579 బస్సులను కేటాయించింది. ఇందుకోసం ప్రభుత్వం రూ.7.2కోట్లు ఖర్చు పెడుతోందని సాధారణ పాలనా విభాగం తెలిపింది. -
ఆ ఐదు కులాలకు కోటా..
జైపూర్ : గుజ్జర్లతో పాటు ఐదు కులాలకు ఒక శాతం రిజర్వేషన్లను వర్తింపచేసేందుకు రాజస్తాన్ ప్రభుత్వం సోమవారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అత్యంత వెనుకబడిన వర్గాల (ఎంబీసీ) కేటగిరీ కింద ఈ కోటాను ప్రభుత్వం ఆమోదించింది. ఈ ఐదు కులాల వారు ఓబీసీ కేటగిరీ కింద 21 శాతం కోటాకు కూడా అర్హులని ప్రభుత్వం పేర్కొంది. ఈనెల 7న జైపూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. తమకు కోటా కల్పించకుంటే ప్రధాని పాల్గొనే కార్యక్రమంలో నిరసనలకు దిగుతామని గుజ్జర్లు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయంతో గుజ్జర్లు సహా గొదియా లొహర్, బంజారా, రైకా, గదారియా కులాలు లబ్ధి పొందనున్నాయి. ఆయా కులాలకు రిజర్వేషన్లకు సంబంధించి విద్యా సంస్థల్లో ప్రవేశానికి, ప్రభుత్వ ఉద్యోగాలు పొందేందుకు రెండు వేర్వేరు ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. -
బాలగంగాధర్ తిలక్.. ‘ఫాదర్ ఆఫ్ టెర్రరిజం’!
జైపూర్: గణపతి, ఛత్రపతి ఉత్సవాలతో భారత స్వాతంత్య్ర ఉద్యమానికి ఊపిరి పోసిన బాలగంగాధర్ తిలక్‌ను ‘ఉగ్రవాదానికి మూలపురుషుడు’గా పేర్కొనటం వివాదమైంది. రాజస్తాన్ ప్రభుత్వం హిందీలో ప్రచురించే పాఠ్యపుస్తకాలను మథురలోని ఓ సంస్థ ఇంగ్లిష్‌లోకి అనువదించి ప్రచురిస్తుంది. వీటిని ప్రైవేటు ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో బోధిస్తున్నారు. అయితే, 8వ తరగతి పాఠ్య పుస్తకం 22వ చాప్టర్లోని 18,19వ శతాబ్దాల్లో జాతీయోద్యమ ఘటనలు అనే పాఠ్యాంశంలో ‘తిలక్ జాతీయోద్యమానికి ఒక బాటను చూపారు. అందుకే ఆయన్ను ఫాదర్ ఆఫ్ టెర్రరిజం అంటారు’ అని ఉంది. -
రాజస్ధాన్ పోటీ పరీకల్లో భగవద్గీత ప్రశ్నలు
సాక్షి, జైపూర్ : రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ 2018 (ఆర్ఏఎస్) పరీక్షకు సంబంధించి జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీస్ పేపర్లో భగవద్గీత సారాంశానికి సంబంధించిన పాఠాలను సిలబస్ లో చేర్చారు. రాజస్ధాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఆర్పీఎస్సీ) నిర్వహించే ఈ పరీక్షలకు చెందిన జనరల్ స్టడీస్ చేసిన మార్పుల్లో భాగంగా ఈ అంశాలను సిలబస్‌లో చేర్చింది. నీతి శాస్త్ర పేరుతో గీత బోధనలను ప్రత్యేకంగా చేర్చారు. భగవద్గీతతో పాటు మహాత్మ గాంధీ జీవితానికి సంబంధించిన పాఠాలు, దేశ ప్రముఖులు, సాంఘిక సంస్కర్తలు, కార్యనిర్వాహక అధికారుల చరిత్రలనూ పాఠ్యాంశాలుగా చేర్చారు. నిర్వహణ, పాలనా విభాగాల్లో భగవద్గీత పాత్ర పేరిట సబ్-యూనిట్‌ను జోడిస్తూ ఆర్ఏఎస్ 2018 పరీక్ష సిలబస్‌ను సవరించారు. దీంతో కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన 18 అధ్యాయాల నుంచి పలు ప్రశ్నలు ఆర్ఏఎస్ 2018 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎదురవనున్నాయి. బీజేపీ ప్రభుత్వం విద్యా రంగాన్ని కాషాయీకరిస్తోందని విపక్షాలు భగ్గుమంటున్న నేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. -
లైంగిక దాడి చేస్తే ఇక ఉరే
సాక్షి, రాజస్థాన్ : రాజస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మైనర్లపై లైంగిక దాడికి పాల్పడితే మరణశిక్ష విధించేలా ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. ఇందుకు ఉద్దేశించిన బిల్లును శుక్రవారం ఆ రాష్ట్ర శాసన సభ ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం పన్నెండేళ్లు అంతకంటే తక్కువ వయసు గల బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన వారికి మరణ శిక్ష లేదా పద్నాలుగేళ్లకు తగ్గకుండా కఠిన కారాగార శిక్ష, లేదా 20 సంవత్సరాల యావజ్జీవ కఠిన కారాగార శిక్ష లేదా చనిపోయే వరకు జైల్లోనే ఉంచేందుకు అవకాశం కల్పించారు. రాజస్థాన్ హోంమంత్రి గులాబ్ చంద్ ఈ బిల్లును (క్రిమినల్ లా బిల్లు-2018) ప్రవేశపెట్టగా మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపారు. దేశంలో మధ్యప్రదేశ్ తర్వాత ఇలా ప్రత్యేకంగా చట్టం చేసింది తాజగా రాజస్థానే. మహిళలపై జరుగుతున్న నేరాల్లో రాజస్థాన్ నాలుగో స్థానంలో ఉంది. -
రాజస్థాన్ సర్కార్‌పై రాబర్ట్ వాద్రా ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ : బికనీర్ భూ ఒప్పందంపై సీబీఐ విచారణకు రంగం సిద్దమవుతున్న క్రమంలో రాబర్ట్ వాద్రా రాజస్థాన్ సర్కార్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. తనను టార్గెట్‌గా చేసుకుని రాజస్థాన్ ప్రభుత్వం వేధిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భూ కుంభకోణంలో తన ప్రమేయం ఉన్నట్టు ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించలేదని వాద్రా అన్నారు. ‘నన్ను ఎంతైనా వేధించండి...వెంటాడండి...ప్రాసిక్యూట్ చేసుకోండి..ఇలాంటి అసత్యాలు నిజాన్ని కప్పిపుచ్చలేవు’ అని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా ఫేస్బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. రాజస్థాన్ ప్రభుత్వం తనపై సాగిస్తున్న కుట్రపూరిత ప్రచారంలో ఇది ఓ భాగమేనని ఆయన అన్నారు. బికనీర్ భూముల ఒప్పందంలో వాద్రా పాత్రను నిగ్గుతేల్చేందుకు రాజస్ధాన్ ప్రభుత్వం సీబీఐ విచారణ చేపట్టాలని కేంద్రాన్ని కోరిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాదాన్యత సంతరించుకున్నాయి. -
సీబీఐకి రాబర్ట్ వాద్రా బికనీర్ స్కామ్
జైపూర్: రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాలో భూముల ఒప్పందానికి సంబంధించి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా నిందితుడైన బికనీర్ భూములు, మనీ ల్యాండరింగ్ కేసులను త్వరలో సీబీఐ విచారించనుంది. ఈ కేసులపై సీబీఐ విచారణ కోరుతూ రాజస్థాన్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరినట్టు రాజస్థాన్ హోంమంత్రి గులాబ్ చంద్ కటారియా తెలిపారు. ఈ కేసు ప్రాధాన్యత, సుదీర్ఘంగా విచారణ సాగుతున్న క్రమంలో తదుపరి సీబీఐచే విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి పేర్కొన్నారు. కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశామని చెప్పారు. రాజస్థాన్‌లోని బికనీర్‌లో రాబర్ట్ వాద్రాకు చెందిన కంపెనీలు 275 బిగాల భూమి అక్రమ క్రయవిక్రయాల్లో పాలుపంచుకున్నాయని ఆరోపణలున్నాయి. మహజన్ ఫైరింగ్ రేంజ్ కోసం సేకరించిన భూమికి పరిహారంగా ఈ స్థలాలను కేటాయించారని 2010 నుంచి వీటి క్రయవిక్రయాల్లో పలు అవకతవకలు చోటుచేసుకున్నాయని చెప్పారు. అధికారులు నకిలీ గుర్తింపులు, పేర్లతో భూములను ఇతరులకు రిజిస్టర చేశారనే అనుమానాలున్నందునే సీబీఐ విచారణ కోరామని తెలిపారు. -
సీవీ ఆనంద్‌కు ఇన్నోవేటివ్ లీడర్షిప్ అవార్డు
కేంద్ర మంత్రి చేతుల మీదుగా అందజేసిన రాజస్థాన్ ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్‌కు రాజస్థాన్ ప్రభుత్వం ‘ఇన్నోవేటివ్ లీడర్షిప్ అవార్డును ప్రకటించింది. జైపూర్‌లో రాజస్థాన్ ప్రభుత్వం మూడు రోజులపాటు నిర్వహిస్తున్న ‘ఈ – ఇండియా ఇన్నోవేటివ్ సమ్మిట్’లో శుక్రవారం కేంద్ర మంత్రి పీపీ చౌదరి చేతుల మీదుగా సీవీ ఆనంద్ ఈ అవార్డు అందుకున్నారు. గతంలో సైబరాబాద్ సీపీగా మూడు రోజుల్లో పాస్‌పోర్టు వెరిఫికేషన్ ప్రక్రియ ముగిసేలా, మద్యం తాగి వాహనాలు నడపటం, ట్రాఫిక్ ఉల్లంఘనలు వంటి కేసుల్లో ఈ – చలాన్లను ఆనంద్ ప్రవేశపెట్టారు. పోలీస్ స్టేషన్లలో సీసీ టీవీలు, వీడియో కాన్ఫరెన్స్ విధానం, 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో వాహనాలకు జీపీఎస్ ఉపయోగించి ఎన్నికల అక్రమాలను అరికట్టారు. దీనికి గాను రాష్ట్రపతి నుంచి అవార్డు కూడా అందుకున్నారు. దేశంలోనే ఎక్కువ మొత్తంలో రూ.23 కోట్ల నగదును సీజ్ చేశారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ కమాండ్ కంట్రోల్ సెంటర్, ఎన్ఫోర్స్మెంట్ విభాగాల ఏర్పాటు, గోదాముల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేసి సత్ఫలితాలు రాబట్టారు. ఈ వినూత్న పద్ధతులు జాతీయ స్థాయిలో పలువురి దృష్టిని ఆకర్శించాయి. దీంతో రాజస్థాన్ ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానంతో ఇన్నోవేటివ్ సమ్మిట్‌కు హాజరైన సీవీ ఆనంద్ అక్కడ కీలకోపన్యాసం చేశారు. తాను చేపట్టిన వినూత్న కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. -
మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో రూ.10 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టుల్లో రూ.10 వేల కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు మలేసియా ప్రభుత్వ రంగ సంస్థ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బోర్డు(సీఐడీబీ) సుముఖత వ్యక్తం చేసింది. జాతీయ రహదారులు, ప్రజా రవాణా, గృహ నిర్మాణం తదితర రంగాల్లో దీర్ఘకాలంలో ఈ పెట్టుబడులను పెట్టేందుకు ముందుకు వచ్చింది. 3 రోజులుగా సింగపూర్, మలేసియాలో పర్యటిస్తున్న రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు.. శుక్రవారం సీఐడీబీ సీఈవో అబ్దుల్ లతీఫ్ హిటామ్‌తో భేటీ అయ్యారు. తెలంగాణలో మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను కేటీఆర్ ఆయనకు వివరించారు. దేశీయంగా నిర్మాణ రంగంలో సేవలు, పెట్టుబడులతో పాటు.. ఎగుమతులను ప్రోత్సహించడం లక్ష్యంగా మలేసియా ప్రభుత్వం సీఐడీబీని ఏర్పాటు చేసిందని సీఈవో హిటామ్ వెల్లడించారు. ‘గోయింగ్ గ్లోబల్’ విధానంలో భాగంగా తమ వద్ద ఉన్న నిధులను సీఐడీబీ సోదర సంస్థ సీఐడీబీ హోల్డింగ్స్ ద్వారా విదేశీ ప్రాజెక్టులపై పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రూ.10 వేల కోట్ల పెట్టుబడులతో రహదారుల నిర్మాణానికి రాజస్తాన్ ప్రభుత్వంతో తమ సంస్థ ఇప్పటికే పరస్పర అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నట్లు హిటామ్ వెల్లడించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సీఐడీబీ సుముఖత వ్యక్తం చేయడాన్ని స్వాగతించిన కేటీఆర్.. సంస్థ కార్యకలాపాలకు సహకారం అం దిస్తామని ప్రకటించారు. మలేసియా పెట్టుబడులతో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు ఊతం లభిస్తుందని తెలిపారు. రూ.10 వేల కోట్ల పెట్టుబడులు ఏటా తిరిగి చెల్లించే విధానంలో.. స్విస్ చాలెంజ్ పద్ధతిలో ఉంటాయన్నారు. రాష్ట్రంలో చేపట్టాల్సిన ప్రాజెక్టులపై అధ్యయనం చేసేందుకు త్వరలో సీఐడీబీ బృందం రాష్ట్రంలో పర్యటిస్తుందని కేటీఆర్ చెప్పారు. వ్యాక్సిన్ల తయారీలో పెట్టుబడులు తెలంగాణలో వ్యాక్సిన్ల తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు మలేసియాకు చెందిన అతిపెద్ద ఫార్మా కంపెనీ ‘కెమికల్ కంపెనీ ఆఫ్ మలేసియా’ సంసిద్ధత వ్యక్తం చేసింది. సంస్థ ఎండీ ఆరిఫ్ అబ్దుల్ షతార్తో కేటీఆర్ భేటీ అయ్యారు. ఫార్మా కంపెనీలకు తెలంగాణ కేంద్రంగా ఉందని.. ఫార్మాకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కేటీఆర్ చెప్పారు. తమ సంస్థ ఇప్పటికే హైదరాబాద్‌లో పలు కంపెనీలతో వివిధ రంగాల్లో కలసి పనిచేస్తున్నట్లు ఆరిఫ్ వెల్లడించారు. అనంతరం వైద్య ఉపకరణాల తయారీ సంస్థ ఎల్కేఎల్ ఎండీ లిమ్ కోన్ లియాన్తోనూ కేటీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొల్పుతున్న మెడికల్ డివెజైస్ పార్కులో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పరిశీలించేందుకు ప్రతినిధి బృందాన్ని పంపిస్తామని లియాన్ హామీ ఇచ్చారు. ఏవియేషన్ రంగంలో శిక్షణ కార్యకలాపాల్లో కలసి రావాల్సిందిగా ఏసియా ఏరోటెక్నిక్ ప్రతినిధులను కేటీఆర్ కోరారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్.. కేటీఆర్ వెంట భేటీల్లో పాల్గొన్నారు. కేటీఆర్ శుక్రవారం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. ప్రధాని సలహాదారుతో సమావేశం ప్రభుత్వ పథకాల అమలును రోజూవారీగా పర్యవేక్షించేందుకు మలేసియా తరహాలో ‘పెమండు’(పెర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అండ్ డెలివరీ యూనిట్) ‘డ్యాష్ బోర్డు’ వ్యవస్థ ఏర్పాటును పరిశీలిస్తామని కేటీఆర్ వెల్లడించారు. జాతీయ పరివర్తన పథకం ‘పెమండు’ అధినేత, మలేసియా ప్రధాని సలహాదారు డాటో శ్రీ ఇద్రిస్ జాలాతో కేటీఆర్ భేటీ అయ్యారు. 2020 నాటికి మలేసియాను అధిక ఆదాయ దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పెమండును ఏర్పాటు చేసినట్లు ఇద్రిస్ చెప్పారు. ప్రభుత్వ శాఖల పనితీరును డ్యాష్‌బోర్డుల ద్వారా పెమండు పర్యవేక్షిస్తున్న విధానాన్ని కేటీఆర్ అభినందించారు. పెమండు తరహాలో రాష్ట్రంలోనూ.. మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు అవసరమని, తద్వారా స్వల్ప, దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడం సులభమవుతుందన్నారు. -
రాజస్థాన్ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం
శివమొగ్గ: ఉన్నత పాఠశాలల నూతన పాఠ్యంశాల్లో రాజస్థాన్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, స్వాతంత్య్రం పోరాటంలో పాల్గొన్న ఇతర కాంగ్రెస్ నాయకుల గురించి పాఠ్యాంశాల్లో భోధించడం విస్మరించిందని ఎన్ఎస్యూఐ కార్యకర్తలు ఆరోపించారు. బుధవారం నగరంలోని మహవీర సర్కిల్లో ఎన్ఎస్యూఐ కార్యకర్తలు రాజస్థాన్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. -
‘ఉపాధి’ వేతనాలపై రాష్ట్రాల ఆందోళన
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన గ్రామీ ణ ఉపాధి హామీ పథకం సవరించిన వేతనాలు రాష్ట్రాల ప్రభుత్వాలను సందిగ్ధంలో పడేశాయి. రాష్ట్రాలు నిర్ణయించిన కనీస వేతనాలతో పోలిస్తే కేంద్రం కొత్తగా ప్రకటించిన ఉపాధి వేతనాలు తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. ఉదాహరణకు.. రాజస్తాన్ ప్రభుత్వం నిర్ణయిం చిన కనీస వేతనాలు రూ.197. ఉపాధి హామీ పనుల వేతనాలు మాత్రం రూ.181. బిహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. దక్షిణాది ప్రాంతాల్లో గణనీయంగా పెరగ్గా.. తూర్పు రాష్ట్రాల్లో తగ్గాయి. ఏపీలో రూ.180 నుంచి రూ.194 కు పెరగ్గా, కర్ణాటకలో రూ.204 నుంచి రూ.224కు పెరిగాయి. -
చర్చలుండాలంటే చర్యలు తప్పవు
ఉగ్ర కేంద్రాలపై పాక్ చర్యలు తీసుకోవాలి ♦ దీని ద్వారానే పొరుగుదేశం చిత్తశుద్ధి తెలుస్తుంది ♦ ‘డూ ఇట్ యువర్సెల్ఫ్’పై అప్రమత్తత అవసరం ♦ ఉగ్రవాద వ్యతిరేక సదస్సులో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ జైపూర్: భారత్‌లో ఉగ్ర కార్యక్రమాలకు పాక్ గడ్డపైనే వ్యూహాలు రూపొందుతున్నాయనే దానికి స్పష్టమైన ఆధారాలున్నాయని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. ఈ ఉగ్ర కేంద్రాలపై పాక్ తీసుకునే చర్యలపైనే ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ ఆధారపడి ఉంటుందన్నారు. అటు దక్షిణాసియా ప్రాంతంలో శాంతి నెలకొనేందుకు కూడా పాక్ నిర్ణయమే కీలకంగా మారిందన్నారు. రాజస్తాన్ ప్రభుత్వం, ఇండియా ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఉగ్రవాద వ్యతిరేక సదస్సు ప్రారంభోత్సవంలో రాజ్‌నాథ్ మాట్లాడారు. ఉగ్రవాదాన్ని అంతమొందించటంలో పాక్ చిత్తశుద్ధిని చాటుకోవాలన్న రాజ్‌నాథ్.. దేశాల మధ్య చర్చల్లో టైజం ఓ అంశంగా ఉన్నన్ని రోజులు.. ఉగ్రవాదాన్ని ఎదిరించటం ఓ సవాల్‌గా మారుతుందన్నారు. యువతకు తుపాకులు ఇచ్చి పక్క దేశంలో విధ్వంసం సృష్టించమని చెప్పినన్ని రోజులు స్వయంగా తను ఎదుర్కొంటున్న ఉగ్ర సమస్యకు పాక్ పరిష్కారం వెతుక్కోలేదన్నారు. ప్రపంచంలో మంచి టైస్టులుండరనే విషయాన్ని పాక్ అర్థం చేసుకోవాలని సూచించారు. అల్‌కాయిదా, దాయిష్ సంస్థలు ఇంటర్నెట్ ద్వారా యువతను ప్రభావితం చేసి ఆన్లైన్లో బాంబుల తయారీపై శిక్షణనిచ్చి ‘డూ ఇట్ యువర్సెల్ఫ్’ నినాదంతో విధ్వంసాలకు కుట్రపన్నుతున్నారన్నారు. ఏ ఉగ్ర సంస్థతో సంబంధం లేకుండానే వ్యక్తిగతంగానే కొన్ని గుంటనక్కలు దాడులకు పాల్పడే వీలుందన్నారు. ఇలాంటి వాటిపై భారతదేశం అప్రమత్తంగా ఉండాలన్నారు. మళ్లీ మళ్లీ అదే తప్పు: జై శంకర్ కొన్ని దేశాలు ఉగ్రవాదానికి మద్దతు ఇస్తూ చాలా తప్పుచేస్తున్నాయని భారత విదేశాంగ కార్యదర్శి జై శంకర్ అన్నారు. బయట దేశాల్లో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదానికి మద్దతిస్తున్న దేశాలు.. తమ దేశంలో నెలకొన్న అశాంతిని గుర్తించటం లేదని పాక్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాద బాధితులమని పైకి చెబుతున్నప్పటికీ అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రవాదంపై పోరాటానికి కొన్ని దేశాలు సహకారం అందించడంలేదన్నారు. టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతున్న ఈ ఆధునిక యుగంలో ఉగ్రవాద దాడికి మూలాలు కనుక్కోవడం పెద్ద సమస్య కాదని ఆయన పేర్కొన్నారు. అలాగే, ఉగ్రవాదానికి సంబంధించి ఏ సమాజంలోనైనా ఎవరి ప్రయేయం ఉందో కనుక్కోవడం కూడా కష్టం కాబోదన్నారు. పఠాన్‌కోట్ ఘటన తర్వాత తన స్థాయిలోనూ, జాతీయ భద్రతా సలహాదారు స్థాయిలోనూ.. పాక్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయని జై శంకర్ తెలిపారు. తాము ఇచ్చిన సమాచారం ఆధారంగా వారి విచారణలో పురోగతి కనిపిస్తోందన్న ఆశాభావం వ్యక్తంచేశారు. ఉగ్రవాద కట్టడికి మొత్తం ప్రపంచాన్ని ఉత్తేజం చేయడం భారత దౌత్యపరమైన లక్ష్యాల్లో ఒకటని జై శంకర్ పేర్కొన్నారు. ఉగ్రవాద పోరులో భాగంగా రసాయన ఆయుధాలను నిషేధిస్తూ అంతర్జాతీయ ఒప్పందాల్లాంటివి చేసుకోవాల్సిన అవసరముందని చెప్పారు. దేశంలోని తూర్పు ప్రాంతాల్లో ఉగ్రవాదం నియంత్రణకు మయన్మార్‌తో చర్చలు జరిగాయని వారు కూడా సానుకూలంగా స్పం దించారని తెలిపారు. బంగ్లాదేశ్ సహకారం అందించేందుకు ముందుకు వచ్చిందన్నారు. -
ఆస్పత్రుల శుభ్రానికి గోమూత్రం
వృధాగా పోయే గోమూత్రంతో ఆస్పత్రులను శుభ్రం చేసేందుకు రాజస్థాన్ ప్రభుత్వాస్పత్రులు ముందుకొస్తున్నాయి. ఖరీదైన ఫినాయిల్‌ను పక్కన పడేసి గో మూత్రంతోనే ఆస్పత్రిలను శుభ్రం చేయిస్తామని సవాయి మాన్ సింగ్ ఆస్పత్రి ప్రకటించింది. ఈ ప్రయోగం విజయవంతమైతే దీన్ని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అమలు చేస్తామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేంద్ర రాథోర్ ప్రకటించారు. జలోర్ జిల్లాలోని పథ్మేడ గ్రామంలో ఏర్పాటు చేసిన గోమూత్రం రిపైనరీ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి రిఫైనరీని ఏర్పాటు చేయడం ప్రపంచంలో ఇదే మొదటిసారి. ఫినాయిల్ స్థానంలో గో మూత్రానికి వేపాకును కలిపి ఉపయోగించడం మంచిదని, దానివల్ల ఆవు పట్ల మనకున్న ఆరాధ్య భావన మరింత ఇనుమడిస్తుందని కేంద్రమంత్రి, జంతు కారుణ్య కార్యకర్త మేనకా గాంధీ వ్యాఖ్యానించారు. వాస్తవానికి శుచి, శుభ్రతల కోసం గో మూత్రాన్ని ఉపయోగించాలనే ఆలోచన ఆమెదే. గత మార్చి నెలలోనే ఆమె ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చారు. పథ్మేడ గ్రామంలో రూ. 4 కోట్లతో గోమూత్రం రిఫైనరీ ప్లాంటును గోపాల్ గోవర్ధన్ గోశాల అనే సంస్థ ఏర్పాటుచేసింది. ఆవు పాలు, మూత్రాన్ని ఉపయోగించి తయారుచేసే ఉత్పత్తులను ఇక తాము విరివిగా మార్కెటింగ్ చేస్తామని రిఫైనరీ ప్లాంట్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైద్య శ్యామ్సింగ్ రాజ్‌పురోహిత్ తెలిపారు. రోజుకు 7 వేల లీటర్ల గోమూత్రాన్ని శుద్ధిచేసే సామర్థ్యం తమ రిఫైనరీకి ఉందని, వాటిలో సగభాగాన్ని శుభ్రత ఉత్పత్తుల కోసం, మిగతా సగ భాగాన్ని ఔషధాల కోసం ఉపయోగిస్తామని ఆయన చెప్పారు. మధుమేహం, హృద్రోగుల ఔషధాల్లో గో మూత్రాన్ని ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని ఆయన తెలిపారు.